ఒక మనిషి తనకు కలిగిన బాధను, పడుతున్న కష్టాలను, ఎదురైన సమస్యలను భరించలేక.., నది దగ్గరకు వెళ్ళి దేవుడి కోసం తపస్సు చేయడం మెదలుపెట్టాడు.
దేవుడు ప్రత్యక్షమై వరం కొరుకోమన్నాడు..
అలాగే స్వామీ అని,
ఇంతవరకు ఏ మానవుడు అనుభవించలేని కష్టాలను అనుభవిస్తున్నాను,,అందుకే
'' ఈ ప్రపంచంలో నాకు ఎలాంటి బాధలు, కష్టాలు లేని జీవితం కావలని కోరుకున్నాడు ''..,
అందుకు ఆ దేవుడు లేదు నాయన మనిషై పుట్టిన తరువాత అవి అనుభవించక తప్పదు అన్నాడు..
అందుకు ఆ మానవుడు, అయితే ఈ ప్రపంచంలోనే అందరికంటే తక్కువ బాధలు, కష్టాలు, సమస్యలు నాకివ్వండి అని అడిగాడు...
అప్పుడు
ఆ దేవుడు మనషుల కష్టాలను అన్నిటిని మూటల రూపంలో ఒక గదిలో ఉంచి, ఆ మనవుడిని వెళ్లి ఆ గదిలో నీకు నచ్చిన మూటను తెచ్చుకోమన్నాడు., సరే అని అన్నిటిని వేతికి అతి తేలికైన ఒక మూటను భుజానవేసుకొని సంతోషంతో బయటకు వచ్చి దేవుడుకి నమస్కరించాడు...
తధాస్తూ అని దేవుడు మాయమైపోయాడు...
ఆ మూటను తెరచి చూసి దిగ్భ్రాంతికి లోనైయ్యాడు., లోపల చూస్తే అన్నీ అతని బాధలే, అవే సమస్యలే... అప్పుడే అతనికి తర్కం బోధపడింది.. ఈ భూమిమీద పుట్టిన ప్రతి మనిషికి సమస్యలుంటాయి వాటిని ఎదుర్కొని పోరాడడమే జీవితం అని..
నీటిలో పడిన దూది, ఒత్తిడితొ నిండిన గుండె రెండు బరువు గానే ఉంటాయని..
ఊహల ఎడారిలో ఆశల ఎండమావులను చూస్తుా దాహం తీర్చుకోవలని ఇంకెంత కాలం ఇలా కాలాన్ని కరగదిస్తావు... నువ్వు ఊహల్లో ఎంత దూరం వెళ్ళిన వాస్తవ ప్రపంచంలోకి తిరిగి రావల్సిందే..
వేడిగా ఉన్నాడని సూర్యున్ని, చల్లగా ఉన్నాడని చంద్రుడిని నిందిస్తామా? మౌనంగా ఉన్నా ప్రకృతితోనే అడ్జస్ట్ అయి బ్రతుకుతున్నాము..మాటలు నేర్చిన మనుషులతో అడ్జస్ట్ అయి బ్రతకలేమా..? నీ సమస్య సాటి మనుషులతోన అయితే మాట్లాడి తేల్చుకో...
నీ సమస్యలతో నువ్వు పొరాడాల్సివొస్తే,
నీ యుద్ధం నీదే ఎవరి సాయం కోసం ఎదురు చూడకు.. రణమో మరణమో తెగించి అడుగు ముందుకు వెయ్యి..
ఏం ఆలోచిస్తూన్నావ్.. భయపడకు.,
అండబలం, అర్ధబలం లేకుంటెనేమి కండబలం, గుండెబలానికి నీ బుద్ధి బలం చేర్చి ఈ అనంతమైన ఆకశంలో సూర్యుడిలా వెలిగిపో...
నీ ప్రయాణంలో అడుగడుగునా సమస్యలుంటాయి, మలుపు మలుపులో నిన్ను కృంగదీసే కష్టాలుంటాయి..
12 గంటలు నిర్విరామంగా వెలిగే సూర్యున్ని పడమరలో ఉన్న అసుర సంధ్య మింగేస్తుంది, రగుల్తున్న ఆ సూర్యుడు చల్లరిపోడు సగరాలను ఈదుకుంటూ తెల్లవారేసరికి చీకటిని చీల్చుకుంటూ తూర్పున మళ్ళీ ఉదయిస్తాడు..
అలాగే కష్టాలనేవి నిన్నుముంచేసినప్పడు వాటికి భయపడిపోకు సమస్యలను ఎదుర్కొంటూ సాగిపో నీ పూర్వపు వైభవం నీకు రాకపోతుందా.?
నీ సమస్యలను చీల్చుకొని మళ్ళీ సూర్యుడిలా ఉదయిస్తావు...
కావాల్సిందల్లా దాన్ని నువ్వు నమ్మడమే...
ఈ ప్రపంచమంతా ఏకమై తలకిందులుగా తపస్సు చేసిన సరే ఉదయించే సూర్యున్ని ఆపలేరు.. నిన్ను ఆపలేరు. . !!

No comments:
Post a Comment