చాలా కాలం క్రితం భారతదేశం సొంతంగా తయారు చేసుకున్న ఉపగ్రహం ప్రయోగించమని అమెరికాను కోరింది ఇస్రో. అవతలకి పొమ్మంది నాసా. కాలం గిర్రున తిరిగింది. బళ్లూ.. ఓడలే కాదు.. అంతరిక్ష నౌకలు కూడా తిరగబడతాయి! మా ఉపగ్రహాలను మీ రాకెట్ నుంచి ప్రయోగించండి అని కోరింది అమెరికా. భారతీయులు మంచోళ్లు కదా! “అప్పుడు మేం అడిగితే ఏమన్నారో గుర్తుందా?” అని బిల్డిప్ ఇవ్వకుండా బిజినెస్ మాత్రమే మాట్లాడుకున్నారు.
క్రికెట్ వాల్డ్ కప్.. అది కూడా ఇండియా పాక్ మ్యాచ్ గెలిచిందనుకోండి.. దేశం ఎలా ఉంటుంది? ఈ విజయం దాని తాతలాంటిది. 20 ఉపగ్రహాలు ఒకేసారి ప్రయోగించడం అంటే.. 20 వాల్డ్ కప్పులు ఒకేసారి నెగ్గిన సంబరం. అందుకే శ్రీహరి కోట పదం వినిపించినప్పుడల్లా విలేకర్లకు శ్రీశ్రీ గుర్తుకొస్తాడు.. ‘నిప్పులు కక్కుతూ నింగికెగిసిన’ అంటూ దేశభక్తిని చాటుకుంటారు. భారతదేశంలో ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ, జనాల చేత, మీడియా చేత ఎప్పుడూ తిట్లు తినకుండా, దేవుడిలా కీర్తించబడే వాళ్లు ఇస్రో ఉద్యోగులు, శాస్త్రవేత్తలు మాత్రమే అంటే అతిశయోక్తి కాదు.
ఛా.. అంత గొప్పా?
అవును గొప్పే.. 20 ఉపగ్రహాలను వేర్వేరు రూట్లలో పెట్టడం అంటే మాటలు కాదు. 2013లో అమెరికా 29 ఉపగ్రహాలు, 2014లో రష్యా 37 ఉపగ్రహాలను ఒకేసారి పంపగా, ఆ తరువాతి ప్లేసులో ఇప్పుడు భారత్ చేరింది. ఈ మొత్తం ప్రయోగానికి 350 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయింది. దానివల్ల వచ్చే లాభంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇదే ప్రయోగం ఏ ఫారిన్ వాళ్లో చేస్తే కనీసం పది రెట్లు ఎక్కువ ఖర్చయ్యేది. అమెరికా, రష్యా, చైనాల బడ్జెట్‌లో అంతరిక్ష పరిశోధనల వాటా చాలా ఎక్కువ. భారత బడ్జెట్‌లో అంతరిక్ష పరిశోధనల వాటా వన్ పర్సెంట్ కూడా దాటదు. కానీ మన పరిశోధనలు ఆ మూడు దేశాలకూ చుక్కలు చూపిస్తున్నాయి. ఇక చంద్రయానం, మంగళయానం సంగతి చెప్పక్కర్లేదు.
ఇస్రో చరిత్ర-సంచలనాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. రాకెట్ గాల్లోకి ఎగిరిన ప్రతి సారీ ఇస్రో ఖాతాలో రికార్డులు పడుతూనే ఉన్నాయి. పిఎస్ఎల్‌వి సి-34 తనతో పాటూ 3 భారత ఉపగ్రహాలను, అమెరికా, కెనడా, జర్మనీ, ఇండోనేషియాలకు చెందిన 17 ఉపగ్రహాలను వినీలాకాశంలోకి మోసుకెళ్లింది. ప్రపంచానికి పెద్ద దిక్కులా మారిపోయిన గూగుల్ తల్లికి సంబంధించిన స్కైశాట్ కూడా ఇందులో ఉంది.
తాజా పిఎస్ఎల్‌వి సి-34 తీసుకెళ్లిన ఉపగ్రహాల్లో ముఖ్యమైనది, పెద్దది కార్టోశాట్ – 2సి. ఇది దేశ సైనిక శక్తికి, ప్రకృతి విపత్తులకు కూడా ఉపయోగ పడుతుంది. ఇప్పటి వరకూ అమెరికా, చైనా, ఇజ్రాయల్ దగ్గర మాత్రమే ఉన్న ఈ తరహా ఉపగ్రహాన్ని సొంతంగా తయారు చేసింది ఇస్రో.
ఎవడికి ఉపయోగం?
కొన్ని శాటిలైట్లను ఒక రాకెట్ ద్వారా ఆకాశంలోకి పంపి అవి భూమి చుట్టూ తిరిగేలా సెట్ చేయడమే రాకెట్ ప్రయోగం. ఇప్పుడు మనం టెక్నాలజీని తెగ వాడేస్తున్నాం. కానీ ఆ టెక్నాలజీ మొత్తం ఆధారపడింది ఈ శాటిలైట్లపైనే.. రేడియోలు, సెల్‌ఫోన్‌లు, ఇంటర్నెట్.. ఇవన్నీ పనిచేసేవి శాటిలైట్ల వల్లే. అంతరిక్షం నుంచి వచ్చే ఫోటోలు, గూగుల్ మ్యాపుల, ప్రకృతి విపత్తుల గురించి, వాతావరణ మార్పుల గురించ సమాచారం, నీటి వనరులు, భూమిలో ఖనిజాలు.. ఆఖరికి సముద్రంలో చేపలు ఎక్కువగా ఎక్కడున్నాయో అనే విషయం మత్స్యాకారులకు చెప్పే వ్యవస్థ కూడా ఈ ఉపగ్రహాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ లాభాలే వీటివల్ల. అంతుంది కాబట్టే ఇస్రో ప్రయోగాల సమయంలో దేశమంతా శ్రీహరికోటవైపు చూసేది.
చాలా మంది వేగానికి చిహ్నంగా రాకెట్‌ని చెబుతారు. ఎడ్లబండ్లు పోయి జెట్ విమానాలు వచ్చాయి అంటూంటాం. కానీ అదే ఎడ్లబండ్లపై రాకెట్లను మోసుకెళ్లింది ఇస్రో. నిజానికి ఎడ్లబండి-రాకెట్.. ఈ రెండూ భారతదేశ అభివృద్దికి రెండు చక్రాలు, రెండు కళ్ళు. మన పేదరికం పోవడానికి వ్యవసాయం కావాలి. పరిశ్రమలు పెరగాలి. ఆ వ్యవసాయం-పరిశ్రమలు బాగుపడాలంటే టెక్నాలజీ ఉండాలి. ఆ టెక్నాలజీ ఇచ్చేదే ఇస్రో. అందుకే ఇస్రోకి జేజేలు కొట్టినా, అక్కడి సైంటిస్టులకు పొర్లు దండాలు పెట్టినా తక్కువే!
అమెరికా, రష్యా, ఇజ్రాయల్, చైనా.. ఈ నాలుగు దేశాలూ ఇచ్చే జీతాలతో పోలిస్తే మన దేశం, మన శాస్త్రవేత్తలకు ఇస్తున్న జీతాలు-ప్రమోషన్లు వెంట్రుక ముక్కతో సమానం. కానీ వాళ్లు ఎప్పుడూ జీతం గురించి ఆలోచించలేదు. మన జీవితాల గురించి ఆలోచించారు. మనకు ఇస్రో ఎలానో, అమెరికాకి నాసా అలా. ఆ నాసాలో ఎక్కువ మంది భారతీయులే అని గొప్పగా చెప్పుకుంటాం. కానీ నాసాలో ఛాన్స్ వచ్చినా వెళ్లకుండా ఇస్రోలోనే ఉండిపోయారు చూడండి.. వాళ్ళదే నిజమైన త్యాగం!

No comments:
Post a Comment