Friday, 29 July 2016

All new series on Rajnikanth

Rajnikanth was shot today... Tomorrow is the bullet`s funeral!
---------------------------------
Rajnikanth killed a terrorist in Pakistan 'via Bluetooth'!
--------------------------------
Rajnikanth can draw a straight line with a compass
---------------------------------
Rajnikanth`s pulse is measured in Richter scale!
--------------------------------
The new Rupee symbol is actually Rajnikanth`s signature!!!
--------------------------------
Rajnikanth has a statue of Madame Tussauds at his house!!
--------------------------------
Rajnikanth is the secret of Boost`s
energy;
and Complan is a Rajnikanth boy!
-------------------------------
Rajnikanth participated in 100m race, obviously he came first, but
Einstein died watching that, since Light came second!!
--------------------------------
Intel's new ad: "Rajnikanth Inside"
-------------------------
When Alexander Graham Bell first used his telephone, he realized that he already had two missed calls from Rajinikanth.
----------------------------------
Why does needle of magnetic compass always point towards North??? . . Because, RAJINIKANTH lives in the South and no one has guts to point at him!!!
----------------------------------
The apple which fell on Newton was actually thrown by Rajinikanth!
----------------------------------
An email was sent from Pune to Mumbai, Rajinikanth stopped it in Lonawala!
----------------------------------
Rajinikanth can whistle in 5 different languages!
----------------------------------
Only Rajinikanth knows why Mona Lisa is smiling.
----------------------------------
Rajinikanth is the person in the world who can make his girlfriend admit her mistake!
----------------------------------
Rajinikanth went to the world cooking championship...of course Rajini won. But
guess what did he make in final??? Lal mirchi ki meethi kheer
----------------------------------
This 1 is Baap
🎾🎾Wimbledon special🎾🎾

Roger Federer: I know everything about tennis. Ask me anything and I will answer

Rajnikanth: Kanna.. How many holes are there in the net?

ఎక్కడిది ఈ కబాలి.?

కబాలి అనేది తమిళపదం. కపాలి అనే పదం నుంచి వచ్చింది. తమిళ భాషలో ప లేదు కనుక బ అని ఉపయోగించారు. కపాలి అంటే శివుడు. చెన్నైలోని మైలాపూర్ లో కపాలేశ్వర స్వామి దేవస్థానం కూడా ఉంది. ఇక్కడ పరమశివుడి కోసం ఉమా దేవి నెమలి రూపంలో తపస్సు చేసిన కారణంగా ఈ ఊరికి మైలాపూర్ అని పేరు వచ్చింది. ఈ స్థలపురాణం ఇదే దేవాలయంలో స్థల వృక్షమైన పున్నాగ చెట్టు కింద చిన్న కోవెలలో చెక్కబడి ఉంది. మయిల్ అంటే నమలి అని తమిళంలో అర్దం. ఈ క్షేత్రానికి పురాణ ప్రాశస్త్యం ఉంది. ఇది పురాతన దేవాలయం, 7 వ శతాబ్దంలో పల్లవులు నిర్మించారట. ఇక్కడ శివుడిని కపాలీశ్వరుడని, అమ్మవారిని కర్పగాంబళ్ అని పిలుస్తారు. ఇక్కడ నర్తనవినాయకుడు కొలువై ఉన్నాడు. నాయనార్లలో ముఖ్యులైన 7 వ శతాబ్దానికి చెందిన అప్పర్, జ్ఞానసంబంధర్‌లు ఈ ఆలయంలో వెలిసిన శివుడిని ఉద్దేశ్యించి కీర్తించారు. అలాగే ఇక్కడ శివుడిని బ్రహ్మదేవుడు పూజించాడని, ఆయనే లింగప్రతిష్ట చేశాడని, ఈ క్షేత్రానికి శుక్రపురి, వేదపురి అనే పేర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

సుందరమైన ఈ ఆలయం సందురతీరంలో ఉంది. సా.శ.1566 లో మైలాపూర్ పోర్చుగీస్ వారి చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఆలయాన్ని కూల్చివేశారు. ఆ తర్వాత మళ్ళీ, ఇప్పుడున్న ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు. ఆ తర్వాత ఈ ఆలయాన్ని మిషనరీలు వివాదాస్పదం చేశాయి. ఈ ఆలయం మీద కొన్ని కుట్రలు చేసి, రాజకీయ మద్ధతుతో, అసత్యాలనే సత్యాలుగా ప్రచారం చేసి, తమిళనాడులో ద్రవిడ క్రైస్తవాన్ని ప్రోత్సహించి, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయాన్ని రాజీవ్ మల్హోత్రా గారు, తాను రాసిన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు (Breaking India) అనే పుస్తకంలో వివరించారు.

ఆధ్యాత్మికమార్గంలో ఉన్న వ్యక్తి, సంస్కారవంతుడు, భక్తుడు కూడా. తెలుగునేల మీద చాగంటి కోటేశ్వర రావు గారు చేసిన ప్రవచనం వలన ఎంతోమందికి అరుణాచలం గురించి తెలిసింది. ఇప్పుడు తెలుగు ప్రాంతం నుంచి అరుణాచలం వెళుతున్న వారిలో సగం మంది చాగంటి వారి ప్రవచనం వినడం వల్లనే వెళ్తున్నారని అక్కడి ప్రజలు చెప్పారు. అలాగే తమిళ నాట రజనీకాంత్ వల్లనే చాలామంది అరుణాచలం మొదలైన శైవ క్షేత్రాలకు వెళుతున్నారట. మంచి పేరున్న నటుడైన రజనీకాంత్ తన సినిమా పేర్లకు అరుణాచలం, లింగ, బాబా మొదలైన పేర్లను కావాలనే ఎంచుకుని, ఆయా క్షేత్రాల, గురువుల పట్ల ప్రజల్లో అవగాహన తీసుకువచ్చారని ఈ మధ్యే అక్కడున్నవారి ద్వారా తెలిసింది. ఇదిగో ఇప్పుడిలా మళ్ళీ కబాలి పేరుతో కపాలీశ్వర స్వామి గురించి తమిళ ప్రజలకు చాటి చెప్తున్నారు. ఉన్నతమైన స్థానంలో ఉండి ప్రజలను మంచి మార్గంలో నడిపించడం చాలా గొప్ప కదా.

గమనిక - నేనేమీ రజనీకాంత్ ఫ్యాన్‌ను కాదు. ఆ మాటకు వస్తే నేను సినిమాలు చూసి చాలా సంవత్సరాలయ్యింది. టివి చూసేది కూడా చాలా తక్కువ. ఏదో ఒక క్షేత్రం గురించి చెప్పుకోవచ్చు, నాలుగు మంచిమాటలు పంచుకోవచ్చని చేస్తున్న ప్రయత్నమే ఇది.

హర హర మహాదేవ
జై కపాలీశ్వరా

HAPPY PARENTS DAY

A cute Little girl and her Father were crossing a bridge.
The Father was kind of scared.. so he asked his little daughter,
“Sweetheart, please hold my hand. So that you don’t fall into the river.”
The cute Little girl said,
“No, Dad. You hold my hand.”
Father surpraised.
“What’s the difference?” Asked the puzzled Father. “There’s a big difference, Dad” replied the little girl.
“If I hold your hand and something happens to me, chances are there that I may let your hand go.
But if you hold my hand, I know for sure that no matter what happens, you will never let my hand go.”!!

THAT IS PARENTS!

Pablo Neruda

Pablo Neruda,
Spanish poet
Nobel Prize for Literature in 1971
His Poem:

"You start dying slowly"

You start dying slowly ;
if you do not travel,
if you do not read,
If you do not listen to the sounds of life,
If you do not appreciate yourself.
You start dying slowly:

When you kill your self-esteem,
When you do not let others help you.
You start dying slowly ;

If you become a slave of your habits,
Walking everyday on the same paths…
If you do not change your routine,
If you do not wear different colours
Or you do not speak to those you don’t know.
You start dying slowly:

If you avoid to feel passion
And their turbulent emotions;
Those which make your eyes glisten
And your heart beat fast.
You start dying slowly:

If you do not risk what is safe for the uncertain,
If you do not go after a dream,
If you do not allow yourself,
At least once in your lifetime,
To run away.....
You start dying Slowly !!!

Love your life Love yourself...

⁠⁠⁠PASSWORD PROBLEMS

WINDOWS:   Please enter your new password.

USER: cabbage
 

WINDOWS:   Sorry, the password must be more than 8 characters.
 
USER:   boiled cabbage
 
 

WINDOWS:   Sorry, the password must contain 1 numerical character.
   
USER: 1 boiled cabbage
 


WINDOWS:   Sorry, the password cannot have blank spaces.
 
USER:  50bloodyboiledcabbages
 
 

WINDOWS:   Sorry, the password must contain at least one uppercase character.
 
USER: 50BLOODYboiledcabbages



WINDOWS:   Sorry, the password cannot use more than one uppercase character consecutively.

USER:   50BloodyBoiledCabbagesYouStupidIdiotGiveMeAccessNow!



WINDOWS:   Sorry, the password cannot contain punctuation.
 
USER :  IWillHuntYouDown50BloodyBoiledCabbagesYouStupidIdiotGiveMeAccessNow
 
 
WINDOWS:   Sorry, that password is already in use.

SUPERB Definitions

Wonderfully described definitions.......

CIGARETTE:
A pinch of tobacco
rolled in paper
with fire at one end
and a fool at the other!

MARRIAGE:
It's an agreement
wherein
a man loses his bachelor degree
and a woman gains her master

LECTURE:
An art of transmitting Information
from the notes of the lecturer
to the notes of students
without passing through the minds
of either

CONFERENCE:
The confusion of one man
multiplied by the
number present

COMPROMISE:
The art of dividing
a cake in such a way that
everybody believes
he got the biggest piece

TEARS:
The hydraulic force by which
masculine will power is
defeated by feminine water-power!

DICTIONARY:
A place where divorce comes
before marriage

CONFERENCE ROOM:
A place where everybody talks,
nobody listens
and everybody disagrees later on

CLASSIC:
A book
which people praise,
but never read

SMILE:
A curve
that can set
a lot of things straight!

OFFICE:
A place
where you can relax
after your strenuous
home life

ETC:
A sign
to make others believe
that you know
more than
you actually do

COMMITTEE:
Individuals
who can do
nothing individually
and sit to decide
that nothing can be done
together

EXPERIENCE:
The name
men give
to their
Mistakes

ATOM BOMB:
An invention
to bring an end
to all
inventions

DIPLOMAT:
A person
who tells you
to go to hell
in such a way
that you actually look forward
to the trip

OPPORTUNIST:
A person
who starts taking bath
if he
accidentally falls
into a river

MISER:
A person
who lives poor
so that
he can die RICH!

FATHER:
A banker
provided by
nature

CRIMINAL:
A guy
no different
from the other,
unless he gets caught

BOSS:
Someone
who is early
when you are late
and late
when you are early

POLITICIAN:
One who
shakes your hand
before elections
and your Confidence
Later

DOCTOR:
A person
who kills
your ills
by pills,
and kills you
by his bills!

ఎవడి గోల వాడిదే

ఒకబ్బాయి ఎఫ్.ఎం రేడియోకి ఫోన్ చేశాడు.

హలో... ఎఫ్.ఎం రేడియోనా

ఆ.... చెప్పండి... ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?


నేను ట్రాఫిక్‌లో ఉండి మాట్లాడుతున్నాను

నాకు రోడ్డు మీద ఒక పర్స్ దొరికింది

 అందులో రూ.15,000 రూపాయలు, క్రెడిట్ కార్డ్, 'సికింద్రాబాద్‌'
లో ఉండే మిస్టర్
'రాజు' ఐడీ కార్డు ఉన్నాయి

వావ్... నువ్వెంత నిజాయితీ పరుడివి..! అయితే నువ్విప్పుడు ఆ పర్స్ 'రాజు' గారికి ఇవ్వాలనుకుంటున్నావన్న మాట!

తొక్కేం కాదు... రాజు గారి కోసం ఒక విషాదమైన పాట వినిపించాల్సిందిగా కోరుకుంటున్నాను


పుష్కర యాత్రికులకు "పుష్కర" సూచనలు.

కృష్ణా పుష్కరాలు రాబోతున్నాయి.  ఈ సందర్భంగా భక్తులు కొన్ని సూచనలు పాటించండి.

1. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నాడు ప్రజాకవి వేమన.  కాబట్టి అలాంటి పుణ్యపురుషులు అయిన గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులకు తొలిరోజు పుష్కర స్నాన పుణ్యాన్ని వదిలెయ్యండి.  ఆ రోజు ఇళ్లలోనే టీవీ చూస్తూ కూర్చోండి.  బయటకు వెళ్లొద్దు.

2. తొలిరోజు "సినిమా షూటింగులు" ఉంటాయి.  అనవసరం గా ఎవరి కాళ్ళ కిందనో పడి చీమల్లా చితికి పోవద్దు.

3 . మహాబలేశ్వర్లో మునిగినా, మహబూబ్ నగర్లో మునిగినా, నాగార్జున సాగర్ లో మునిగినా, విజయవాడ లో మునిగినా, మీకు వచ్చే పుణ్యం తాలూకు తూకం లో ఏమాత్రం తేడా రాదు.

4. నదిలో మునగడం ముఖ్యం కాదు. మళ్ళీ పైకి తేలడం ముఖ్యం.

5. మీ తోటి భక్తులకు రకరకాల చర్మ రోగాలు ఉండవచ్చు.  వాటిని పట్టించుకోవద్దు.  చర్మవ్యాధుల స్పెషలిస్టులు నాలుగు రాళ్లను సంపాదించుకునే అవకాశం ఇవ్వండి.

6. ముఖ్యం గా టీవీలలో ప్రవచనకారులు చెప్పే మాటలు నమ్మవద్దు.  అసలు అలాంటివి ఈ పన్నెండు రోజులూ వినొద్దు.  వారి ప్రవచనాల వల్లనే మీరు పోయారని పేపర్ వాళ్ళు రాస్తే మీ కుటుంబానికి నష్ట పరిహారం రాకపోవచ్చు.

7. నదిలో ఎన్ని మునకలు వేసాం అన్నది ముఖ్యం కాదు.  ఒకటి వేసినా, వంద వేసినా ఒకటే ఫలితం.

8. కృష్ణా నది వేల సంవత్సరాలనుంచి ఉన్నది.  యుగాంతం వరకూ ఉంటుంది.  పుష్కరుడు అనే వాడు పన్నెండు  రోజులూ ఆ నదిలోనే ఉంటాడు.  కనుక చివరి రోజైనా స్నానం చెయ్యొచ్చు.

9. తొలి రోజు తొలి మునక వెయ్యాలని ఆత్ర పడవద్దు.  అలా చేస్తే అదే మీకు చివరి మునక అయ్యే ప్రమాదం ఉంది.

10. మరీ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏమటంటే...పుణ్యం కన్నా ప్రాణం ముఖ్యం. స్నానం వల్ల వచ్చే పుణ్యం ఎదో  మీ ఒక్కరికే చెందుతుంది.  కానీ మీ ప్రాణం మీ కుటుంబానికి చాలా అవసరం.

11.  మనం జూ పార్క్ కు వెళ్ళినప్పుడు  పులులు, సింహాలు ఉన్నచోటికి వెళ్లి వాటితో ఆడుకోడానికి సాహసించము.  అలాగే వీ ఐ పీ లు ఉన్న చోటికి వెళ్లి స్నానాలు చెయ్యాలని పిచ్చి సాహసం చెయ్యవద్దు.

12. మీ వూరికి దగ్గరలో కృష్ణా నది ఉంటె, అక్కడే చేసెయ్యండి.  దూరప్రాంతాలకు వెళ్లి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు.

 పై పన్నెండు సూచనలను శ్రద్ధగా పాటించి క్షేమంగా తిరిగి రండి.

Tuesday, 26 July 2016

లీటరు మంచినీళ్లు రూ.36 వేలు!

క్రికెట్‌ మ్యాచ్‌ల సమయంలో విరాట్‌ కోహ్లీ ఏ హోటల్లో బస చేసినా అతడికోసం తప్పకుండా ‘ఎవియాన్‌’మంచినీళ్ల బాటిళ్లను తెప్పించాల్సిందేనట. మామూలుగా అయితే ఈ విషయాన్ని అంత ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. కానీ ఈ బ్రాండ్‌ నీళ్ల ఖరీదు లీటరు రూ.600కు పైనే. అంటే మంచినీళ్లకే రోజుకి కొన్ని వేలవుతాయన్నమాట. అయ్యబాబోయ్‌ అంత రేటా అనకండి. ఎందుకంటే దీనికన్నా ఎన్నో రెట్లు ఖరీదైన మంచినీళ్ల బ్రాండ్లు కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే ఖరీదైన ఆ నీటి కథలేంటో చూద్దామా...

కోనా నిగరి... 750మి.లీ రూ.27వేలు

ప్రపంచంలోనే ఖరీదైన నీళ్లు ఇవే. వీటిని తాగితే ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు, బరువు తగ్గి, చర్మం నిగారింపును సంతరించుకుంటుందనీ ఒత్తిడి దూరమవుతుందనేది కొందరి నమ్మకం. ఇంతకీ అంత ప్రత్యేకత ఆ నీటికెలా వచ్చిందంటారా... హవాయి దగ్గర్లోని పసిఫిక్‌ సముద్ర తీరంలో రెండువేల అడుగుల లోతు నుంచి తీసుకొచ్చే నీరిది. ప్రత్యేక పద్ధతుల్లో ఆ నీటిలోని ఉప్పదనాన్ని పోగొట్టి బాటిళ్లలో నింపుతారు. సముద్రం కింద వేల అడుగుల లోతునుంచి వస్తాయి కాబట్టి, స్వచ్ఛంగా ఉండడంతో పాటు వీటిలో ఖనిజ లవణాలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయట. కోనా నిగరి నీటికి జపాన్‌లో ఎంత డిమాండ్‌ ఉందంటే రోజుకి 80వేలకు పైగా బాటిళ్లు అక్కడకు దిగుమతి అవుతున్నాయి.


బ్లింగ్‌ హెచ్‌ టూవో... రూ.2,680


సెలెబ్రిటీల చేతిలో ఉండే మంచినీళ్ల బాటిల్‌ కూడా ఆకర్షణీయంగా ఉండాల్సిందే. ఎలాగూ ఖరీదైన నీళ్లను కొనేది వారే. ఈ సూత్రంతోనే తమ నీళ్ల బాటిల్‌ ధరను మరింతగా పెంచింది ‘బ్లింగ్‌ హెచ్‌టూవో’ కంపెనీ. టెనెస్సీ దగ్గరున్న నీటి బుగ్గల నుంచి సేకరించిన జలంతో నింపే ఈ బాటిళ్లను స్వరోవ్‌స్కీ రాళ్లతో తీర్చిదిద్దుతారు. దాంతో బాటిల్‌ తయారీకి అయ్యే ఖర్చు కూడా అదనమన్నమాట.

వీన్‌... 750మి.లీ రూ.1500

వీన్‌ నీటిని నోట్లో పోసుకున్న ప్రతిసారీ నాలుకకు ఏదో సుతిమెత్తని అనుభూతి కలుగుతుందట. కాలుష్యం లేకుండా పచ్చదనం, స్వచ్ఛమైన వాతావరణం ఉన్న వివిధ ప్రాంతాల్లోని నీటి బుగ్గల నుంచి జలాన్ని సేకరించి బాటిళ్లలో నింపుతోంది ఫిన్లాండ్‌కి చెందిన వీన్‌ కంపెనీ. అలా లాప్‌లాండ్‌ నుంచీ ప్రపంచంలోనే ప్రకృతి సంపద ఎక్కువున్న దేశంగా గుర్తింపు పొందిన భూటాన్‌లోని హిమాలయ ప్రాంతం నుంచీ నీటిని సేకరించి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

10థౌజండ్‌ బీసీ... 750మి.లీ రూ.950


కెనడాలోని వాంకోవర్‌ నగరానికి 200 మైళ్ల దూరంలో ఉన్న ఆ పర్వత ప్రాంతంలో ఎవరూ ఉండరు. జంతువులు కూడా కనిపించవు. అక్కడ ఆరువేల అడుగుల లోతుతో వాలుగా ఉండే హిమనీనదాలను కరిగించి బాటిళ్లలో నింపుతోంది 10థౌజండ్‌ కంపెనీ. ఈ చోటుకి ఎవరూ వెళ్లలేరు, జంతువులు కూడా ఉండవు కాబట్టి, అక్కడి నీరు కలుషితం అయ్యే అవకాశం ఉండదు. పైగా హిమనీనదాల నుంచి వచ్చే నీరు కాబట్టి, వీటిని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందనీ చర్మం మీద ముడుతల్లాంటివి రావనీ చెబుతోంది సంబంధిత కంపెనీ.


ఆక్వా డెకో... 750మి.లీ రూ.800


పద్దెనిమిది వేల సంవత్సరాల కిందట ఘనీభవించిన హిమనీనదాల నుంచి సేకరించిన నీరిది. కెనడాకు చెందిన ‘ఆక్వా డెకో’ ఉత్తమ నాన్‌ కార్బొనేటెడ్‌ స్ప్రింగ్‌ వాటర్‌గా 2007లో బంగరు పతకాన్ని కూడా సాధించింది.

ఎవియాన్‌... లీటరు రూ.600కు పైనే


1789లో ఫ్రాన్స్‌కి చెందిన మార్కిస్‌ అనే వ్యక్తి రోజూ వాకింగ్‌కి వెళ్తూ స్థానికంగా ఎవియాన్‌ లెస్‌ బెయిన్స్‌ దగ్గరున్న నీటి బుగ్గ దగ్గర నీరు తాగేవాడట. ఆ నీరు తాగడం మొదలుపెట్టాక అతడికున్న కిడ్నీ, లివర్‌ సమస్యలు నయమయ్యాయట. అదికాస్తా ప్రచారం కావడంతో ఆ నీటిని అమ్మడం వ్యాపారంగా మారింది. అదే తర్వాతి కాలంలో ఎవియాన్‌ బ్రాండ్‌గా విస్తరించింది. చాలామంది ప్రముఖులు ఈ నీటిని ప్రత్యేకంగా తెప్పించుకుని తాగుతారు. మనదేశంలోనూ ఆన్‌లైన్‌ ద్వారా ఈ బాటిళ్లను అమ్ముతున్నారు.

లాక్వెన్‌ ఆర్టెస్‌ వాటర్‌ 750మి.లీ రూ.400

దక్షిణ అమెరికాలోని ఆండెస్‌ పర్వతాల దగ్గర ఎలాంటి కాలుష్యమూ లేని మారుమూల ప్రాంతంలో 1500 అడుగుల లోతుకు తవ్వి తీసిన నీరే లాక్వెన్‌ మినరల్‌ వాటర్‌. ‘బాటిల్లో నింపే వరకూ గాలి కూడా తాకనంత స్వచ్ఛంగా ఉంటాయి ఈ నీళ్లు’ అంటూ ప్రచారం చేస్తున్నారు ఈ కంపెనీ నిర్వాహకులు.ఇంతకూ ఆశ్చర్యంలోంచి తేరుకున్నారా... లేదా..?  

Monday, 25 July 2016

దేవుడు(శివుడు) ఏం చేసినా మన మంచికే చేస్తాడు

దేవుడు
vs
వీధులు ఊడ్చేవాడు

  వీధులు ఊడ్చేవాడికి పని చేసి చేసి విసుగొచ్చింది.
దేవుడితో మొరపెట్టుకున్నాడు.
 "రోజూ హాయిగా పూజలందుకుంటూ ఉంటావు.
 నా బతుకు చూడు.
ఎంత కష్టమో.
 ఒక్క రోజు... ఒక్కటంటే ఒక్క రోజు నా పనిని నువ్వు చెయ్యి. నీ పనిని నేను చేస్తా,"
అని సవాలు విసిరాడు.
 దేవుడు వినీ వినీ సరేనన్నాడు.
"అయితే ఒక్క షరతు. నువ్వు ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు.
నోరు మెదపకూడదు."
 అన్నాడు దేవుడు.
"సరే" అన్నాడు మనోడు.
 తెల్లారికి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు.
 కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు.
"దేవా ... నా కొత్త బిజినెస్ మొదలుపెడుతున్నాను. ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు"
అంటూ ముందుకు వంగి దణ్ణం పెట్టాడు.
ముందు జేబులోని పర్సు కింద పడిపోయింది.
అతను చూడకుండా వెళ్లిపోయాడు.
 మనోడు "ఒరేయ్... పర్సు వదిలేశావు చూసుకోరా..." అందామనుకున్నాడు.
 కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకుని మౌనంగా ఉండిపోయాడు.
 ఇంకాస్సేపటికి ఓ పేదవాడు వచ్చాడు.
 "దేవా... నా దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది. అదినీకు సమర్పించుకుంటున్నాను. దయచూడు తండ్రీ"
అంటూ మోకరిల్లాడు.
 కళ్లు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది.
 "ఇలా దయ చూపించావా తండ్రీ"
అని ఆ పర్సును తీసుకుని వెళ్లిపోయాడు.
"ఒరేయ్ దొంగా.... "
అని అరుద్దామనుకున్నాడు మనోడు.
కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు.
ఆ తరువాత ఒక నావికుడు వచ్చాడు.
 "దేవా రేపు సముద్ర ప్రయాణం ఉంది. నన్ను చల్లగా కాపాడు స్వామీ"
అన్నాడు.
అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు.
"నా తరువాత వచ్చింది ఇతడే. కాబట్టి ఇతడే నా పర్సును దొంగిలించి ఉంటాడు. పట్టుకొండి" అన్నాడు.
 పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
 ఈ అన్యాయాన్ని చూసి మనోడు ఉండబట్టలేకపోయాడు.
 "ఆగండ్రా... ఇతను నిర్దోషి. అసలు దొంగ ఇంకొకడు. వాడు పర్సును తీసుకెళ్లాడు."
అని అరిచేశాడు.
దేవుడే చెబుతుంటే ఇంకా సాక్ష్యాలెందుకని నావికుడిని వదిలేసి, పేదోడిని పట్టుకుని వెళ్లిపోయారు పోలీసులు.
 సాయంత్రానికి వీధులు ఉడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు.
దేవుడు వీధులు ఉడ్చే డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చేశాడు.
"దేవా... ఇవాళ్ల ఎంత మంచి పని చేశానో తెలుసా...
నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాను.
 ఒక దోషిని అరెస్టు చేయించాను."
అన్నాడు మనోడు.
దేవుడు "ఎంతపని చేశావోయ్. నిన్ను అసలు స్పందించొద్దన్నానా... ఎందుకలా చేశావు."
అన్నాడు నిష్ఠూరంగా.
 "అదేమిటి? నువ్వు నన్ను మెచ్చుకుంటావనుకున్నాను."
 అన్నాడు వీధులు ఊడ్చేవాడు బాధగా....
 "ధనవంతుడు మహాపాపాత్ముడు.
వాడు అందరినీ దోచుకుంటాడు.
వాడి డబ్బు కొంత పేదోడికి అందితే వాడికి కొంచమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను.
పేదోడికి కష్టాలు తీరేవి.
వాడు కొన్నాళ్లైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవారు. ఇక నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు.
దారిలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు.
వీడు అరెస్టై జైల్లో ఉంటే బతికిపోయేవాడు.
 ఇప్పుడు చూడు... పేదోడు జైల్లో ఉన్నాడు. ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు. నావికుడు చావబోతున్నాడు. ఎంత పని చేశావు నువ్వు...
 అన్నాడు దేవుడు.

 దేవుడి ప్రణాళిక ఏమిటో ఎవరికీ తెలియదు.
కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు.
తప్పులా కనిపించేంది నిజానికి ఒప్పై ఉండచ్చు.
ఆయన ఆలోచనల లోతు, అవగాహన ఎత్తు అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.

Saturday, 23 July 2016

కొంచెం భరోసా - కొండంత ధైర్యం

🏊ఓ వ్యాపారవేత్త వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు.

చాలా అప్పుల పాలయ్యాడు.

అందులో నుంచి బయటపడటానికి ఎలాంటి మార్గమూ కన్పించలేదు.

అతనికి అప్పులు ఇచ్చిన వాళ్లు బాకీ తీర్చమని వేధించడం మొదలుపెట్టారు.

అతనికి వస్తువులు సరఫరా చేసిన వాళ్లు డబ్బులు చెల్లించమని రోజూ ఫోన్లు చేయడం మొదలుపెట్టారు.

🚶ఇలాంటి పరిస్థితుల్లో అతను ఓ రోజు ఉదయం ఇందిరా పార్క్‌కి వచ్చి తల పట్టుకు కూర్చున్నాడు.

తన వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు.

👼🏼అప్పుడే అతని దగ్గరకు ఓ వ్యక్తి వచ్చాడు.

అతని వయసు 70 సంవత్సరాలు ఉండవచ్చు.

వ్యాపారవేత్త ఏదో బాధలో వున్నట్టు అతను గమనించాడు.
'చాలా బాధలో వున్నట్టున్నావు?’ అని ప్రశ్నించాడు.

😩వ్యాపారవేత్త తన పరిస్థితిని వివరించాడు.

‘నీకు నేను సహాయం చెయ్యగలను’ చెప్పాడు ఆ వ్యక్తి.

✍వ్యాపారవేత్త పేరు అడిగి తెలుసుకొని పది లక్షలకి చెక్ రాసి అతనికిచ్చి ఇట్లా అన్నాడు.

ఈ డబ్బు అవసరమైతే వాడుకో.

సరిగ్గా సంవత్సరం తరువాత ఇక్కడే కలుద్దాం.

అప్పుడు ఆ డబ్బు నాకు తిరిగి ఇచ్చేద్దువు అని అన్నాడు.

🏃వ్యాపారవేత్త ఆలోచించేలోపే అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

😴వ్యాపారవేత్త ఆశ్చర్యపోయాడు.

దేవుడే అతడిని పంపించాడని అనుకున్నాడు.

ఆ వ్యక్తి సంతకాన్ని చూస్తే అతని పేరు సుబ్బరామిరెడ్డి అని ఉంది.

💰ఈ డబ్బుతో నా బాధలు తొలగిపోతాయని ఆ వ్యాపారవేత్త అనుకున్నాడు.

కానీ ఆ చెక్కును అప్పుడే వాడుకోదల్చుకోలేదు.

🗄తన బీరువాలో భద్రపరిచి తన వ్యాపారాన్ని తిరిగి సమర్థవంతంగా కొనసాగించడం మొదలుపెట్టాడు.

💪ఆ చెక్కు అతనికి కొండంత బలం ఇచ్చింది.

అంతగా అవసరమైతే చెక్కును వాడుదామని అనుకున్నాడు.

✊చాలా ఆశావహంగా తన వ్యాపారాన్ని కొనసాగించాడు.

తన బాకీదారులని, డిస్ట్రిబ్యూటర్లకి డబ్బు చెల్లిస్తానన్న నమ్మకం కలిగించాడు.

కొన్ని నెలలు గడిచాయి.

అతని వ్యాపారం అభివృద్ధి చెందింది.

అప్పుల బాధ నుంచి అతను బయటపడ్డాడు.

మళ్లీ గొప్ప వ్యాపారవేత్తగా రాణిస్తున్నాడు.

⌚సరిగ్గా సంవత్సరం తరువాత అతను మళ్లీ ఇందిరాపార్క్‌కి వచ్చి ఆ చెక్కు ఇచ్చిన వ్యక్తి కలిసిన ప్రదేశానికి వచ్చాడు.

ఆ వ్యక్తి అక్కడ కన్పించాడు.

ఆ చెక్కుని అతని చేతిలో పెట్టి తాను ఎలా వ్యాపారంలో అభివృద్ధి చెందానో అతనికి చెప్పడం మొదలుపెట్టాడు.

🙌సరిగ్గా అప్పుడే ఓ నర్సు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని గట్టిగా పట్టుకుంది.

'హమ్మయ్యా! ఇతన్ని పట్టుకున్నాను’ అరిచింది ఆ నర్సు.

😓‘ఇతను నిన్ను విసిగిస్తున్నాడా! ఎప్పుడూ ఇంటి నుంచి పారిపోయి వస్తుంటాడు.

ఇతనికి మతిస్థిమితం లేదు.

ఇతని బాగోగులు నేను చూస్తుంటాను.

ఎప్పుడూ ఈ పార్క్‌కే వస్తూ ఉంటాడు.

రెండు సంవత్సరాలుగా ఇదే పని.

ఎవరినీ ఏమీ అనడు’ అని చెప్పి అతన్ని తీసుకొని నర్స్ వెళ్లిపోయింది.

🤗వ్యాపారవేత్త ఆశ్చర్యానికి లోనయినాడు.

కొయ్యబారిపోయాడు.

సంవత్సరంపాటు తన దగ్గర పది లక్షల రూపాయలు ఉన్నాయన్న ధైర్యంతో అప్పుల వాళ్లని,
కస్టమర్లని,
తనకు వస్తువులు సరఫరా చేసిన వ్యక్తులని సమర్థవంతంగా ఎదుర్కొన్నాను.

వాళ్లందరిని ఒప్పించగలిగాను.

కష్టాల నుంచి బయట పడగలిగాను అని.

🤓కొద్దిసేపటికే అతనికి అర్థమైంది.

💵తనను సమర్థవంతంగా ముందుకు నడిపించింది డబ్బు కాదు.

🎯తనలో ఏర్పడ్డ ఆత్మవిశ్వాసం.
సాధించాలన్న కాంక్ష !!!👊

శరీరం - ఆత్మ

ఓ శిష్యుడు గురువును అడిగిన ప్పశ్న:
నాశనమయ్యే ఈ శరీరంలో నాశం లేని ఆత్మ ఎలా ఉంటుంది?

🕉 దానికి గురువుగారు అన్నారు,
పాలు ఉపయేగపడేవే, కాని ఒక్క రోజుకు మించితే పాడైపోతాయి.
పాలలో మజ్జిగ చుక్క వేస్తే పెరుగు అవుతుంది. పెరుగు  మరొక రోజు వరకు ఉపయోగపడుతుంది.
కాని పెరుగు మరొక రోజుకి పాడైపోతుంది.
పెరుగును మదిస్తే వెన్న అవుతుంది.
వెన్న మరొక రోజు వరకే ఉంటుంది.
తరువాత అదికూడా పాడైపోతుంది.
ఆ వెన్నను మరిగిస్తే నెయ్య అవుతుంది.
ఈ నెయ్య ఎన్నటికి పాడవ్వదు.
ఒక్కరోజులో పాడైపోయే పాలలో, ఎన్నటికి పాడవ్వని నెయ్యి దాగివుంది.
అలాగే అశాశ్వతమైన ఈ శరీరమునందు శాశ్వతమైన ఆత్మ ఉంటుంది.

మానవ శరీరము పాలు
సంకీర్తన మజ్జిగ
*సేవ వెన్న
సాధన నెయ్యి.
మానవ శరీరాన్ని సాధన చేసి కరిగిస్తే
ఆత్మ  పవిత్రత పొందుతుంది

నాసా వర్సెస్ ఇస్రో

చాలా కాలం క్రితం భారతదేశం సొంతంగా తయారు చేసుకున్న ఉపగ్రహం ప్రయోగించమని అమెరికాను కోరింది ఇస్రో. అవతలకి పొమ్మంది నాసా. కాలం గిర్రున తిరిగింది. బళ్లూ.. ఓడలే కాదు.. అంతరిక్ష నౌకలు కూడా తిరగబడతాయి! మా ఉపగ్రహాలను మీ రాకెట్ నుంచి ప్రయోగించండి అని కోరింది అమెరికా. భారతీయులు మంచోళ్లు కదా! “అప్పుడు మేం అడిగితే ఏమన్నారో గుర్తుందా?” అని బిల్డిప్ ఇవ్వకుండా బిజినెస్ మాత్రమే మాట్లాడుకున్నారు.



క్రికెట్ వాల్డ్ కప్.. అది కూడా ఇండియా పాక్ మ్యాచ్ గెలిచిందనుకోండి.. దేశం ఎలా ఉంటుంది? ఈ విజయం దాని తాతలాంటిది. 20 ఉపగ్రహాలు ఒకేసారి ప్రయోగించడం అంటే.. 20 వాల్డ్ కప్పులు ఒకేసారి నెగ్గిన సంబరం. అందుకే శ్రీహరి కోట పదం వినిపించినప్పుడల్లా విలేకర్లకు శ్రీశ్రీ గుర్తుకొస్తాడు.. ‘నిప్పులు కక్కుతూ నింగికెగిసిన’ అంటూ దేశభక్తిని చాటుకుంటారు. భారతదేశంలో ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ, జనాల చేత, మీడియా చేత ఎప్పుడూ తిట్లు తినకుండా, దేవుడిలా కీర్తించబడే వాళ్లు ఇస్రో ఉద్యోగులు, శాస్త్రవేత్తలు మాత్రమే అంటే అతిశయోక్తి కాదు.



ఛా.. అంత గొప్పా?

అవును గొప్పే.. 20 ఉపగ్రహాలను వేర్వేరు రూట్లలో పెట్టడం అంటే మాటలు కాదు. 2013లో అమెరికా 29 ఉపగ్రహాలు, 2014లో రష్యా 37 ఉపగ్రహాలను ఒకేసారి పంపగా, ఆ తరువాతి ప్లేసులో ఇప్పుడు భారత్ చేరింది. ఈ మొత్తం ప్రయోగానికి 350 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయింది. దానివల్ల వచ్చే లాభంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇదే ప్రయోగం ఏ ఫారిన్‌ వాళ్లో చేస్తే కనీసం పది రెట్లు ఎక్కువ ఖర్చయ్యేది. అమెరికా, రష్యా, చైనాల బడ్జెట్‌లో అంతరిక్ష పరిశోధనల వాటా చాలా ఎక్కువ. భారత బడ్జెట్‌లో అంతరిక్ష పరిశోధనల వాటా వన్ పర్సెంట్ కూడా దాటదు. కానీ మన పరిశోధనలు ఆ మూడు దేశాలకూ చుక్కలు చూపిస్తున్నాయి. ఇక చంద్రయానం, మంగళయానం సంగతి చెప్పక్కర్లేదు.



ఇస్రో చరిత్ర-సంచలనాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. రాకెట్‌ గాల్లోకి ఎగిరిన ప్రతి సారీ ఇస్రో ఖాతాలో రికార్డులు పడుతూనే ఉన్నాయి. పిఎస్ఎల్‌వి సి-34 తనతో పాటూ 3 భారత ఉపగ్రహాలను, అమెరికా, కెనడా, జర్మనీ, ఇండోనేషియాలకు చెందిన 17 ఉపగ్రహాలను వినీలాకాశంలోకి మోసుకెళ్లింది. ప్రపంచానికి పెద్ద దిక్కులా మారిపోయిన గూగుల్ తల్లికి సంబంధించిన స్కైశాట్ కూడా ఇందులో ఉంది.



తాజా పిఎస్ఎల్‌వి సి-34 తీసుకెళ్లిన ఉపగ్రహాల్లో ముఖ్యమైనది, పెద్దది కార్టోశాట్ – 2సి. ఇది దేశ సైనిక శక్తికి, ప్రకృతి విపత్తులకు కూడా ఉపయోగ పడుతుంది. ఇప్పటి వరకూ అమెరికా, చైనా, ఇజ్రాయల్ దగ్గర మాత్రమే ఉన్న ఈ తరహా ఉపగ్రహాన్ని సొంతంగా తయారు చేసింది ఇస్రో.



ఎవడికి ఉపయోగం?

కొన్ని శాటిలైట్లను ఒక రాకెట్ ద్వారా ఆకాశంలోకి పంపి అవి భూమి చుట్టూ తిరిగేలా సెట్ చేయడమే రాకెట్ ప్రయోగం. ఇప్పుడు మనం టెక్నాలజీని తెగ వాడేస్తున్నాం. కానీ ఆ టెక్నాలజీ మొత్తం ఆధారపడింది ఈ శాటిలైట్లపైనే.. రేడియోలు, సెల్‌ఫోన్‌లు, ఇంటర్నెట్.. ఇవన్నీ పనిచేసేవి శాటిలైట్ల వల్లే. అంతరిక్షం నుంచి వచ్చే ఫోటోలు, గూగుల్ మ్యాపుల, ప్రకృతి విపత్తుల గురించి, వాతావరణ మార్పుల గురించ సమాచారం, నీటి వనరులు, భూమిలో ఖనిజాలు.. ఆఖరికి సముద్రంలో చేపలు ఎక్కువగా ఎక్కడున్నాయో అనే విషయం మత్స్యాకారులకు చెప్పే వ్యవస్థ కూడా ఈ ఉపగ్రహాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ లాభాలే వీటివల్ల. అంతుంది కాబట్టే ఇస్రో ప్రయోగాల సమయంలో దేశమంతా శ్రీహరికోటవైపు చూసేది.



చాలా మంది వేగానికి చిహ్నంగా రాకెట్‌ని చెబుతారు. ఎడ్లబండ్లు పోయి జెట్ విమానాలు వచ్చాయి అంటూంటాం. కానీ అదే ఎడ్లబండ్లపై రాకెట్లను మోసుకెళ్లింది ఇస్రో. నిజానికి ఎడ్లబండి-రాకెట్.. ఈ రెండూ భారతదేశ అభివృద్దికి రెండు చక్రాలు, రెండు కళ్ళు. మన పేదరికం పోవడానికి వ్యవసాయం కావాలి. పరిశ్రమలు పెరగాలి. ఆ వ్యవసాయం-పరిశ్రమలు బాగుపడాలంటే టెక్నాలజీ ఉండాలి. ఆ టెక్నాలజీ ఇచ్చేదే ఇస్రో. అందుకే ఇస్రోకి జేజేలు కొట్టినా, అక్కడి సైంటిస్టులకు పొర్లు దండాలు పెట్టినా తక్కువే!



అమెరికా, రష్యా, ఇజ్రాయల్, చైనా.. ఈ నాలుగు దేశాలూ ఇచ్చే జీతాలతో పోలిస్తే మన దేశం, మన శాస్త్రవేత్తలకు ఇస్తున్న జీతాలు-ప్రమోషన్లు వెంట్రుక ముక్కతో సమానం. కానీ వాళ్లు ఎప్పుడూ జీతం గురించి ఆలోచించలేదు. మన జీవితాల గురించి ఆలోచించారు. మనకు ఇస్రో ఎలానో, అమెరికాకి నాసా అలా. ఆ నాసాలో ఎక్కువ మంది భారతీయులే అని గొప్పగా చెప్పుకుంటాం. కానీ నాసాలో ఛాన్స్ వచ్చినా వెళ్లకుండా ఇస్రోలోనే ఉండిపోయారు చూడండి.. వాళ్ళదే నిజమైన త్యాగం!

పేరు మార్చుకోవాలనుందా...?

చిన్నప్పుడు స్కూల్ మాస్టారి కారణంగా పేరులో తప్పు దొర్లిందా...? పెద్దలు పెట్టిన పేరు బోర్ కొట్టేసిందా...? ప్రస్తుతమున్న పేరు కలసి రావడం లేదనుకుంటున్నారా...? కారణమేదైతేనేమి పేరు మార్చుకోవడం సులభమే.

📄📄తమ పేరు మార్చుకోవడం కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు రెండు పాస్ పోర్ట్ సైజు కలర్ ఫొటోలు, గెజిటెడ్ అధికారి జారీ చేసిన పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలు రెండు కాపీలు అవసరం. ప్రస్తుత పేరు, కొత్త పేరు, పేరు ఎందుకు మార్చదలుచుకున్నదీ నిర్ధిష్ట కారణాన్ని పేర్కొంటూ ఓ అఫిడవిట్ ను దరఖాస్తుకు జతచేయాలి. రూ.10 లేదా రూ.20ల నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ పై అఫిడవిట్ చెల్లుబాటు అవుతుంది. దీన్ని నోటరీతో అటెస్టేషన్ చేయించాలి.

🚓🚓పోలీసుల ధ్రువీకరణ

ఒకటి నుంచి పదో తరగతి వరకు అన్ని విద్యార్హతల ధ్రువీకరణ పత్రాల నకలు కాపీలను గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించాలి. నిరక్షరాస్యుడు అయితే అతడి పేరు, వయసు తదితర వివరాలను తెలియజేసే రేషన్ కార్డు, వోటర్ ఐడీ, విద్యుత్తు బిల్లు, వాటర్ బిల్లు వీటిలో ఏదైనా ఒక దాని కాపీని కూడా గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించి సమర్పించాల్సి ఉంటుంది. గత ఐదేళ్ల కాలంలో పోలీసుల రికార్డులకు ఎక్కలేదంటూ వారు నివసించే ప్రాంత పోలీసు స్టేషన్ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాలి. పేరు కలసి రావడం లేదనుకుంటే జ్యోతిషుల నుంచి సర్టిఫికెట్ తీసుకుని సమర్పించాలి. వీటిని జిల్లా కలెక్టర్ పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్నట్టు భావిస్తే పేరు మారుస్తూ ఆదేశాలు వెలువరిస్తారు.

📖📖గెజిట్ లోనూ ప్రచురించాలి

తర్వాత పేరు మార్పునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ (ప్రభుత్వ సమాచార పత్రిక)లో ప్రకటన జారీ కోసం ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ కమిషనర్ కు దరఖాస్తు చేసుకుని నిర్ణీత ఫీజు చెల్లించాలి. పేరు మారుస్తూ కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల కాపీని అందించాలి. ఒకవేళ తమ స్వరాష్ట్రంలో గెజిట్ అందుబాటులో లేకపోతే భారత ప్రభుత్వ గెజిట్ లో ప్రకటన జారీకి దరఖాస్తు చేసుకోవాలి.

కనీసం రెండు ప్రముఖ స్థానిక దినపత్రికల్లో సైతం పేరు మార్పునకు సంబంధించిన ప్రకటనలు ఇవ్వడం మంచిది. ఈ ప్రకటనకు సంబంధించి ఆధారాలు కూడా దగ్గర ఉంచుకోవడం నయం. ఎందుకంటే దినపత్రికల్లో పేరు మార్పునకు సంబంధించిన ప్రకటన చూసిన వారు తమకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. పేరు మార్పు విషయమై సాధారణంగా ఎలాంటి అభ్యంతరాలు ఎదురుకావు. మైనర్ పేరు మార్చాలనుకుంటే వారి తరఫున తల్లిదండ్రులు లేదా సంరక్షకులు దరఖాస్తు చేసుకోవాలి. మిగతా విధానం అంతా పెద్దల పేరు మార్పు మాదిరిగానే ఉంటుంది.

ఎన్ఆర్ఐ లకు

ఒకవేళ పేరు మార్చుకునే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయితే కలెక్టర్ ద్వారా ఉత్తర్వులు పొందాల్సిన పనిలేదు. నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపరు (రూ.5)పై సహచర ఉద్యోగులు ఇద్దరితో సాక్షి సంతకాలు చేయించి దాన్ని ప్రభుత్వ గెజిట్ లో ప్రచురణ కోసం గాను దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఓ ప్రముఖ ప్రాంతీయ దిన పత్రికలోనూ సంబంధిత పత్రాన్ని ప్రచురించాలి. ఒకవేళ ఎన్ఆర్ఐలు తమ పేరు మార్చుకోవాలని భావిస్తే వారు తమ దరఖాస్తును భారతీయ ఎంబసీ లేదా హైకమిషన్ అటెస్టేషన్ తో హోంశాఖకు పంపాలి. పేరు మార్పునకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడం తెలియదని భావిస్తే న్యాయవాది సాయం పొందవచ్చు.

మారిన తర్వాత...

ఒక్కసారి పేరు మారిస్తే పని అయిపోయినట్టు కాదు. తర్వాత ఆ సమాచారాన్ని అవసరమైన వారికి తెలియజేయడం తప్పనిసరి. ఉదాహరణకు ఉద్యోగులు అయితే ఆ విషయాన్ని తన కార్యాలయంలో ఉన్నతాధికారికి తెలియజేయాలి. సర్వీసు రిజిస్టర్ లో నూతన పేరును నమోదు చేయించుకోవాలి. పేరు మారింది కనుక సమీపంలోని పోస్టాఫీసు లేదా పోస్ట్ మ్యాన్ కు కూడా సమాచారం అందించాలి. అలాగే రవాణా శాఖ (డ్రైవింగ్ లైసెన్స్, వాహనాలు కలిగి ఉంటే), పన్ను అధికారులకు కూడా తెలియపరచాలి. పాస్ట్ పోర్టు కార్యాలయానికి వెళ్లి పేరు మార్పించుకోవాలి.

వివాహం అనంతరం మహిళ ఇంటి పేరు భర్త ఇంటి పేరుగా స్థిరపడడం మన దేశంలో సాధారణం. తన మెట్టినింటి వారి పేరును తన ఇంటి పేరుగా సర్టిఫికెట్లలో మార్చుకోవాలని మహిళలు భావిస్తే వివాహ నమోదు పత్రం లేదా భర్తతో కలసి సంయుక్తంగా అఫిడవిట్ ను సమర్పించాల్సి ఉంటుంది.

ఇలా అయితే కుదరదు

అప్పులు చేసి పేరు మార్చుకుని పరారవుదామనుకుంటే కుదరదు. నేరపూరిత ఆలోచనల్లో భాగంగా పేరు మార్పునకు అవకాశం లేదు. ప్రముఖుల పేర్లను పెట్టేసుకుని గందరగోళానికి గురి చేయాలనుకుంటే వీల్లేదు. సంఖ్యలు, విరామ చిహ్నాలతో గందరగోళంగా పేరు పెట్టుకుంటానంటే అవకాశం లేదు.

కాస్త కళ్లు తెరవండి

అనుదినం అలసి సొలసి ఇంటికి తిరిగొస్తాను ... ఇప్పటికీ అర్ధం కాదు...
పనిచేయటానికి బ్రతుకుతున్నానా? లేక బ్రతకటానికి పని చేస్తున్నానా??

బాల్యం లో అందర్నీ మరీ మరీ అడగబడ్డ ప్రశ్న ...
పెరిగి పెద్దయాక ఎమౌదామని? ఆఁ... సమాధానం ఇప్పుడు దొరికింది ...
మళ్ళీ బాల్యం కావాలని... మళ్ళీ పిల్లాడిగా మారిపోవాలని.... ...............

ఓ జీవితామా! అలసిపోయాను నీ నౌకరీ తో – ఇక లేక్కా పద్దు తేల్చడమే మంచిది....

మిత్రుల నుంచి దూరం వెళ్ళాక నిజం తెలిసింది...
వాళ్ళు పోకిరీ వెధవలే ... డౌటే లేదు... ఐతే ... వెలుగు చూపింది వాళ్ళే మరి..........

జేబు నిండుగా ఉన్నపుడు ... ఈ దునియా ఏమిటో తెలిపింది వాళ్ళే...
జేబు ఖాళీ అయినపుడు ... తన వాళ్లెవరో తెలిపిందీ వాళ్ళే...
డబ్బు సంపాదించేటపుడు తెలిసింది...
విలాసాలన్నీ అమ్మా నాన్నల డబ్బుతోనే సమకూడేవని...
మనం సంపాదించిందంతా అవసరాలకే సరిపోతుందని...............

నవ్వాలని అనిపించకపోయినా ... నవ్వాల్సిన పరిస్థితి...
ఎవ్వరైనా అడిగారనుకోండి --- ఎలా వున్నవని ...
ఓహ్ .. బ్రహ్మాండంగా వున్నా... అని అనక తప్పదు ...
ఫ్రెండ్స్...ఇది జీవిత నాటకం... ఇక్కడ అందరూ నటులే... నటించక తప్పదు....
నిప్పు రాజేయాల్సిన పనే లేదు ... ఇక్కడ మనిషి మనిషిని చూస్తే భగ్గుమంటాడు...
సైంటిస్టులు పరిశోధనలెన్నో చేస్తున్నార్ట.... బాహ్య లోకం లో జీవం ఉందా లేదా అని....
మరి... లైఫ్ లో సంతోషం ఉందా లేదా అని మనిషి వెతకడమే లేదు !!!

అసలు నిద్రకు చావుకు తేడా ఏమిటి?
ఎవరో మహానుభావుడు ఎంత అందంగా శెలవిచ్చారు!!!
నిద్ర, సగం మృత్యువట! మరి మృత్యువు, ఆఖరి నిద్రట!!!
జీవితమన్నది తనంత తానుగా నడచి పోతుంది…. గడచి పోతుంది.....
పాడెలు మాత్రమే వేరొకళ్ళ సాయంతో పైకి లేస్తాయి...   .................

తెల్లారి పోతున్నది...  సాయం వేళా జరిగి పోతున్నది...
మన జీవన యాత్ర అలాగే గడచి పోతున్నది....
ఒకడు రోదించి ఆనందిస్తాడు ... మరొకడు నవ్వుతూ బాధను దిగమింగుతాడు ...
వీధి లీల విచిత్రమైంది...
బ్రతికున్న మనిషి నీటిలో మునక వేస్తాడు... చచ్చి శవమైతే పైకి తేలి కనిపిస్తాడు...
ఎంటో!! జీవితం కండక్టర్ లా తయారయింది...
ప్రయాణం ఐతే ప్రతి దినం చెయ్యాలి... చేరే గమ్యం మాత్రం లేనే లేదు.............

ప్రతి ప్రశ్నకు సమాధానం కోసం నేను వెదుకుతూనే వున్నా ...
నా గదికి చేరాకే అసలు జవాబు దొరికింది నాకు....
గది పై కప్పు అంటోంది - ఉన్నత ఆశయాలు కలిగి ఉండాలని...
గది లోని పంఖా - చల్లగా ఉండాలంటోంది.... BE COOL!!!
గడియారం చెబుతోంది - ప్రతి నిముషం విలువైందని ...
అద్దం అంటోంది – ఏదైనా చెయ్యాలనుకుంటే నిన్ను నువ్వు ఆత్మావలోకనం చేస్కోమని....
కిటికీ అంటోంది – బయటి ప్రపంచాన్ని వీక్షించి తెలుసుకొమ్మని...
క్యాలండర్  చెబుతోంది – BE UPTODATE అని ...
తలుపు తట్టి మరీ చెబుతోంది – ఏదైనా సాధించాలంటే శక్తి నంతా కూడదీసుకోవాలని ...
ఈ గీతలేంటో బహు విచిత్రంగా ఉంటాయి ... నిజం....
నుదుటి మీద గీస్తే.... నీ జీవన గమ్యాన్ని చిత్రీస్తాయి...
నేల మీద రాస్తే (సరి) హద్దులే అవుతాయి ...
దేహం పై గీకితే రక్తన్నే ఓడుస్తాయి...
బాంధవ్యాల మీద గీస్తే అడ్డు గోడలైపోతాయి ...................

ఒక రూపాయి ఒక లక్షకు సమానమౌతుందా .......
కానీ, అదే ఒక రూపాయిని లక్ష నుండి విడదీస్తే , అది లక్ష ఎప్పటికీ కాదు...
అందుకే... మీకున్న లక్షలాది మిత్రుల్లో ... ఆ రూపాయినే నేను ......
జర భద్రంగా చూసుకోండి మరి............
మిగతా అంతా కపటం, ప్రలోభం ...  ... వంచన, మోసం ............

భవిష్యత్తు ఆధార్

ఆధార్ అట్ట(కార్డ్) వలన ఫ్యూచర్ లో మన పరిస్థితి..!!!

2020 సంవత్సరం లో జరగబోయే సంఘటన..

పిజ్జా హట్ కి ఫోన్ సంభాషణ..

ఆపరేటర్ : " హలో... పిజ్జా హట్..."

కస్టమర్ : " ఒక ఆర్డర్ తీసుకోండి ప్లీజ్..? "

ఆపరేటర్ : " మొదట మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి సార్"

కస్టమర్ : " ఒక నిమిషం... నా ఆధార్ నెంబర్ 889861356102049998-45-54610.."

ఆపరేటేర్ : " సో.., మీరు మిష్టర్ Velpuri Vivekanand   .. నెంబర్ 17, గాంధీ రోడ్, శ్రీనగర్ కాలనీ తెనాలి  నుండి మాట్లాడుతున్నారు. మీ ఇంటి ఫోన్ నెంబర్ 408423666, ఆఫీస్ నెంబర్ 76452302, మొబైల్ నెంబర్ 0142662566. ఇప్పుడు మీరు మీ మొబైల్ నుండి మాకు కాల్ చేశారు..."

కస్టమర్ : " వావ్.. ఇన్ని నెంబర్లు ఎలా సార్ తెలుసుకున్నారు..? "

ఆపరేటర్ : " మేము మెయిన్ సిస్టమ్ తో కనెక్ట్ అయ్యున్నాం సార్...."

కస్టమర్ : " గుడ్.. నాకు ఒక రాయల్ పిజ్జా ఆర్డర్ తీసుకుంటారా..? "

ఆపరేటర్ : " సార్ .. నాకు తెలిసినంత వరకు అది వద్దనే చెప్తాను సార్.."

కస్టమర్ : " వ్వాట్..? ఎందుకని..? "

ఆపరేటర్ : " మీ మెడికల్ రిపోర్ట్స్ ని బట్టి మీకు హై బిపీ ఉంది... అంతే కాకుండా మీ కొలెస్ట్రాల్ లెవల్ కూడా ఎక్కువగా ఉంది.."

కస్టమర్ : " వ్వాట్..? అప్పుడు నేను ఏమి తినాలి..? "

ఆపరేటర్ : " మా దగ్గర ఉండే Low fat హెగ్గియన్ మీ పిజ్జా ట్రై చేసి చూడండి సార్.. అది బాగా నచ్చుతుంది.."

కస్టమర్ : " నాకు నచ్చుతుంది అని మీకు ఎలా తెలుసు.."

ఆపరేటర్ : " పోయిన వారం మీరు నేషనల్ లైబ్రరీ నుండి పాపులర్ హెగ్గియన్ వంటలు అనే పుస్తకం తీసుకున్నారు సార్.."

కస్టమర్ : " మై గాడ్.. చాలు సామీ చాలు.. మీరు చెప్పిన పిజ్జానే మూడు పిజ్జా ఫ్యామిలీ సైజ్ లో ఇవ్వండి.."

ఆపరేటర్ : " ఖచ్చితంగా సార్... పది మంది ఉన్న మీ కుటుంబానికి అది ఖచ్చితంగా సరిపోతుంది. బిల్ అమౌంటు 2350 రూపాయలు సార్.."

కస్టమర్ : " నా కార్డ్ లో నేను pay చేయచ్చా..? "

ఆపరేటర్ : " లేదు సార్.. మీరు క్యాష్ రూపంలోనే చెల్లించాలి. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ మీరు క్రాస్ చేసి ఉన్నారు. అదీకాకుండా జనవరిలో మీరు 1,50,648 రూపాయలు క్రెడిట్ కార్డ్ బాకీ పెట్టి ఉన్నారు. ... దానిలో మీరు కట్టకుండా ఉన్న హౌసింగ్ లోన్ నేను చేర్చలేదు. "

కస్టమర్ : " సరి. అలా అయితే మీ పిజ్జాబాయ్ వచ్చే లోపు పక్కన ఉన్న ఏటియమ్ కి వెళ్ళి క్యాష్ తీసుకొస్తాను.."

ఆపరేటర్ : " అది కూడా కుదరదు సార్.  మా రికార్డుల ప్రకారం మీ ఏటియమ్ ఓవర్ డ్రాఫ్ట్ లెవల్ మీరు దాటేశారు సార్.."

కస్టమర్ : " నేను ఎలాగైనా క్యాష్ రెడీ చేస్తాను. మీరు పిజ్జా పంపండి. ఎంత టైమ్వపడుతుంది..? "

ఆపరేటర్ : " 45 నిమిషాలు పడుతుంది సార్.. అంతసేపు మీరు వెయిట్ చేయలేకపోతే మీ బైక్ లో వచ్చి మీరే తీసుకెళ్ళచ్చు సార్.."

కస్టమర్ : " వ్వాట్..? "

ఆపరేటర్ : " మా సిస్టం లో ఉన్నదాని ప్రకారం మీ దగ్గర ఒక బైక్ ఉంది. దాని నెంబరు 1122.."
(కస్టమర్ తన మనసులో : ఈ యదవ నా బైక్ నెంబర్ కూడా తెలుసుకుని ఉన్నాడే!!)
" వేరే ఏదైనా కావాలా సార్..? "

కస్టమర్ : " ఇంకేమీ వద్దు సామీ.. మీరు ప్రకటన లో చెప్పిన విధంగా ఆ మూడు ఫ్రీ కోక్ బాటిల్స్ కలిపి పంపండి చాలు... "

ఆపరేటర్ : " నార్మల్ గా ఇస్తాం సార్. అయితే మీ మెడికల్ రిపోర్ట్ ప్రకారం మీ ఆరోగ్యాన్ని దృష్ఠిలో ఉంచుకుని మీకు ఆ ఫ్రీ ని ఇవ్వలేం సార్.."

కస్టమర్ : *%&$%%### You $##$%%@!))) (ఇక్కడ రాయలేని బూతులు)

ఆపరేటర్ : " సార్ .. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి సార్.. ఇలానే ఒక పోలీస్ దగ్గర బూతులు తిట్టినందుకు 2017 మార్చిలో మీకు రెండు నెలల జైలు శిక్ష మరియు అయిదువేల రూపాయల జరిమానా విధించింది మర్చిపోయినట్లున్నారు. "

కస్టమర్ : 😱 😱
( కళ్ళు తిరిగి కింద పడిపోయాడు)

సుందరి పతి భక్తి

సుందరి భగవంతుడికోసం కఠోరమైన తపస్సు చేసింది.
ఎప్పుడూ మగవాళ్లే చేస్తారు...

అలాంటిది ఒక స్త్రీ తనకోసం తపస్సు చేయడం చూసి అబ్బురపడి...

భగవంతుడు వెంటనే ప్రత్యక్షమై...

"ఓ స్త్రీ... నేను నీ భక్తికి మెచ్చాను. నీకు ఒకటి కాదు 3 వరాలు ఇస్తాను. అంతే కాదు. నీకు ఏ వరమిస్తే... అది నీ భర్తకు 10 రెట్లు ఎక్కువయ్యే వరం కూడా ఇస్తాను అన్నాడు.

అందుకు...ఆమె సంతోషించి, "స్వామి... నాకు ఎవ్వరికీ లేనంత అందాన్నివ్వు" అనడిగింది.

దేవుడు, "తధాస్తూ... మరి నీ భర్తకు కూడా ఈ అందం పదిరెట్లు ఎక్కువవుతుంది" అని చెప్పి వరమిచ్చాడు.

సరేనంది ఆమె. ఆ తరువాత రెండో వరం కోరింది. " 100 కోట్ల ధనాన్నివ్వు స్వామీ " అంది.

దేవుడు మళ్ళీ సరేనన్నాడు. కాని, ఇచ్చేముందు "నీ భర్తకు ఈ ధనం 10 రెట్లు ఎక్కువవుతుంది. ఒక్కసారి ఆలోచించుకో... బాగా డబ్బు వచ్చాక.... నిన్ను పట్టించుకోడేమో" అన్నాడు.

"అదేం లేదు స్వామీ మీరు ఇవ్వండి" అందామె. దేవుడు మళ్ళీ తధాస్తు అన్నాడు. ఇంక మూడో కోరిక కోరమన్నాడు.

అందుకామె నెమ్మదిగా చెప్పింది... "స్వామీ.... ఈ రాత్రికి.. నాకు Mild Heart stroke (తేలికపాటి గుండెనొప్పి)ని ఇవ్వండి..." అంది.

దేవుడు.......కెవ్వుమన్నాడు.....

Life is Same!!!

20 years back - School bag.
Today                - Office bag.

20 years back - Lekhak Note book.
Today               - HP Note book.

20 years back - Hero Ranger.
Today               - Hero Honda.

20 years back - Half pants.
Today               - Full pants.

20 years back - Playing with plastic car running on battery & remote.
Today               - Playing with metal car running on petrol and gear.

20 years back - Scared of Teachers and exams.
Today               - Scared of Bosses and targets.

20 years back - Wanting to be class topper.
              Today  - Wanting to be 'Employee of the month'.

20 years back - Quarterly exams.
Today               - Quarterly results.

20 years back - Annual School Magazine.
Today              - Company Annual Report.

20 years back - Annual exams.
Today              - Annual appraisals.

20 years back - Pocket money.
Today               - Salary.


20 years back - Running after grades and prize cups.
Today               - Running after incentives and promotions.

20 years back - Craving for the latest toy in the market.
Today               - Craving for the latest gadget in the market

20 years back - Eager to watch the latest cartoon show.
Today              - Eager to watch the latest blockbuster.
20 years back - Crush on class mate.
Today              - Crush on colleague.

20 years back - Fruity.
Today              - Brandy.

So essentially nothing has changed except your Age....!!

జీవితం చేజారనీకు

( ఆపిల్ కంపెనీ సృష్టికర్త , ప్రపంచ మేధావుల్లో ఒకరైన స్టీవ్ జాబ్స్
ఆసుపత్రిలో , తన ఆఖరి రోజుల్లో డైరీలో రాసుకున్న మాటలు )
వ్యాపార జగత్తులో శిఖరాన్ని చేరాను నేను. విజయానికి ప్రతీకగా నిలిచాను.
పని తప్ప నాకు వేరే ఆనందం తెలీదు. సంపాదనకే అంకితమైపోయాను.
ఇప్పుడు ఈ మరణశయ్య మీద రోజులు లెక్కపెట్టుకుంటున్న నేను
ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే , ఇన్నాళ్ళూ నేను గర్వపడిన పేరూ డబ్బూ ఎందుకూ కొరగానివని నాకు అనిపిస్తోంది .
ఈ నిశిరాత్రిలో ........ నా ప్రాణాలు నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యుదేవత ఊపిరి చప్పుడు వినిపిస్తోంది.
నాకిప్పుడనిపిస్తోంది........... జీవితంలో సరిపడా డబ్బు సంపాదించాక ,
మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయి.
కళలూ , అనుబంధాలూ , చిన్నపాటి కలలూ , కోరికలూ , సేవ ..........
ఇలా డబ్బుకి అవతల చాలా ప్రపంచం ఉంది .
కానీ డబ్బు వెనుక పెట్టే పరుగు మనిషిని మరమనిషిలా మార్చేస్తుంది .
అందుకు నేనే ఉదాహరణ .
ఇతరుల మనసుల్లోని ప్రేమను గుర్తించాలనే దేవుడు మనకు జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. కానీ డబ్బుకు మాత్రమే విలువనిచ్చే కాల్పనిక జగత్తును మనం సృష్టించుకున్నాం.
నేను సంపాదించిన డబ్బు ఈ క్షణం నాకు తోడుగా లేదు .
నా ఈ ఆఖరి ప్రయాణంలో అది నా వెంట రాదు .
నేను నాతో తీసుకువెళ్ళగలిగేది ప్రేమానుభూతులూ,
అందమైన జ్ఞాపకాలు మాత్రమే .
ఈ ప్రేమపూర్వక అనుభూతులే ఎప్పుడూ మనతో ఉంటాయి.
మనల్ని ఉన్నతస్థాయికి చేరుస్తాయి .
నిజం , అంతా మన హృదయంలోనే , మన చేతుల్లోనే ఉంది .
ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా?........
నువ్వు రోగంతో బాధపడుతూ పడుకున్న మంచం.
నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ ను నియమించుకోగలవు .
నీ కోసం సంపాదించిపెట్టగలిగే ఉద్యోగులను నియమించుకోగలవు.
కానీ , నీ జబ్బునూ , నీ బాధనూ అనుభవించే వ్యక్తిని మాత్రం
ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు ఏర్పాటు చేసుకోలేవు .
నువ్వు దేన్ని కోల్పోయినా తిరిగి పొందవచ్చుగానీ
చేజారిన జీవితాన్ని మాత్రం తిరిగి పొందలేవు .
జీవితంలో ఈరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా –
కథ ముగిసే రోజు , తెరపడే రోజు ఒకటి వస్తుంది .
అప్పుడు – ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి వెళ్ళదు .
అందుకే ..........., కాస్త ముందే కళ్ళు తెరువు .
డబ్బును కాదు , నీ కుటుంబాన్ని ప్రేమించు . నీ స్నేహితులను ప్రేమించు . ఆనందంగా జీవించు . అందరినీ ఆనందంగా జీవించు

Story of bottle..

Newly born.. Feeding bottle..

To school.. water bottle..

To college.. coke bottle..

Youth.. beer bottle..

Love failure.. whiskey bottle..

Excess whiskey, liver failure.. saline bottle..

Operation.. blood bottle..

Finally.. Ganga Jal bottle

From birth to death bottle is our faithful companion

కొన్ని విషయాలు వినండి

1.కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీపరులు కావడం ప్రతి ఒక్కరికీ సాధ్యమే.

2.సుత్తితో ఒక్క దెబ్బ వెయ్యగానే బండరాయి ముక్కలవదు. దెబ్బ వెనుక దెబ్బ వెయ్యాలి. ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్థించదు.ఎడతెగని ప్రయత్నం కావాలి.

3.ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడాన్కిఅయినా సిద్దపడతాడు. అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులుచేయడానికైనా సందేహించడు మనిషి.

4.మనం మన ఆలోచనలకు బందీలం. ఆలోచనలను మార్చుకోనిదే దేన్ని మార్చలేం.

5.గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు.కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మ విశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు.కానీ విజయపథలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది.

6.బలవంతుడికీ బలహీముడికీ మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షకపాత్ర వహించడమంటే.. తటస్థంగా ఉన్నట్లు కాదు.బలవంతుడి పక్షం వహించినట్లు.

7.అతి నిద్ర, బద్దకం, భయం, కోపం, నిరాశావాదం- ఈ ఐదు అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానిచ్చినా జీవితంలో పైకి రావడం, సుఖపడడం జరగదు.

8.అహంకారమ ప్రతి ఒక్కరినుంచీ – అఖరికి భగవంతుడి నుంచి కూడా దూరం చేస్తుంది.

9.ఉపాయాన్నిఅలోచించేటప్పుడే రాగల అపాయాన్ని కూడా అంచనా వేయాలి.

10.నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చకలిగినా రేపటి దాని పర్యవసానాన్ని మాత్రం తప్పించుకోలేవు.
11.మంచివారు దూరం కావడం, చెడ్డవారు దగ్గర కావడమే దుంఖామికి నిదర్శనం.

12.బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు.

13.కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలవు. కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేవు.

14.పక్షులకు కొంత ధాన్యం, ఫశువులకి కొంత గ్రాసం, మవిషికి కొంత సాయం….ఇదే జీవితం.

15.ఉత్తమ గుణాల వల్ల మవిషి ఉన్నతుడవుతాడు కాలీ ఉన్నత పదవి వల్ల కాదు… శిఖరం మీద కూర్చొన్నంత మాత్రాన కాకి గరుడ పక్షి కాతేదు.

16.తలపై మోసే భారాన్ని ఇతరులు కొంత పంచుకుంటే భాధ తగ్గుతుంది. కానీ ఆకలి భాధనూ, అజ్ఞాన భాధనూ ఎవరికి వారే తగ్గించుకోవాలి.

17.మంచివారు దూరంకావడం, చెద్దవారు దగ్గరకావడమే దంఖానికు నిదర్శనం.

18.మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు.

19.కేవలం దబ్బుంటే సరిపోదు.మంచి వ్యక్తిత్వం ఉంటనే సమాజం గౌరవిస్తుంది.

20.ఎవరి వయస్సుకు తగ్గంటు వారి ఆలోచనలు, ప్రవర్తన ఉంటనే ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది. 

వివాహ బంధం

భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి, వాళ్ళ భార్య భోజనం వడ్డిస్తూ వుంది. భర్త ఆమె చేయి పట్టుకుని, నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు. ఆమె కూర్చుని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది. ఆమె కళ్ళలో బాధని భర్త గమనించాడు. అతను ఆమె తో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు. కానీ ఆమె కి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు..ఎలాగయినా ఆమె కి ఆ విషయం చెప్పాలి.. చివరికి ఇలా చెప్పాడు...
.
భర్త - నాకు విడాకులు కావాలి అని ప్రశాంతంగా తన తో అసలు విషయం చెప్పాడు.
.
భార్య - (ఆ మాటలకి బదులుగా ఆమె ) ఎందుకు అని మాములుగా అడిగింది?
.
భర్త - ఆమె ప్రశ్నను పట్టించుకోకుండా సమాధానం ఏం ఇవ్వలేదు..
.
భార్య - (ఆమెకి కోపం వచ్చింది.) ఆమె ఒక వస్తువును దూరంగా విసిరేసి, మీరు ఒక మనిషేనా అని భర్త మీద గట్టిగా అరిచింది..
.
ఆ రాత్రి, వాళ్లిద్దరూ మాట్లాడుకోలేదు. ఆమె బాగా ఏడ్చింది. భర్త ఎందుకు విడాకులు అడుగుతున్నాడో అసలు ఏమి జరిగిందో తను తెలుసుకోవాలి అనుకుంది. భర్త ని గట్టిగా అడిగింది..భర్త ఆమెకి సమాధానం ఇలా చెప్పాడు.
.
భర్త - నేను జాను అనే అమ్మాయిని ప్రేమించాను. నాకు నీపైన ప్రేమ లేదు..
.
భార్య - ఆ మాటలు విన్న తాను చాలా బాధపడింది.. ఒక నిమిషం ఏం అవుతుందో తనకేం అర్థం కాలేదు..
.
భర్త - గిల్టీ ఫీలింగ్ తో నాకు నువ్వు విడాకులు ఇవ్వడానికి నువ్వు వొప్పుకునేందుకు , నువ్వు ఉండడానికి సొంత ఇల్లు , కారు అండ్ నా సంస్థ లో 30% వాటా ఇస్తా అని అగ్రిమెంట్ పేపర్లు తనకి ఇచ్చాడు..
.
భార్య - చాలా కోపం తో ఆ పేపర్లు ని చింపేసింది.. ప్రేమ ని ఎప్పటికి కొనలేరు అని గట్టిగా ఏడిచేసింది..
.
భర్త గా తన లైఫ్ లో ఒక తెలియని వ్యక్తి లా ఆమె జీవితంలో పది సంవత్సరాలు వున్నాడు. అతని భార్య సమయం వృధా చేసానని బాధ పడుతున్నాడు. అతను తన భార్య ని అర్థం చేస్కునే ప్రయత్నం ఎప్పుడు చెయ్యలేదు.కానీ అతను జాను ని మాత్రమే ప్రేమిస్తున్నాడు.. ఏడుస్తున్న తన భార్య ని చూస్తే అతనికి జాలి వేసింది. ఆ విడాకులు రావడానికి కొన్ని వారాలు పడుతుంది..
.
మరుసటి రోజు, అతను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అతని భార్య టేబుల్ వద్ద ఏదో రాస్తు కనిపించింది. అతను భోజనం చేయలేదు కానీ అతనికి వెంటనే నిద్ర పట్టేసింది. ఏందుకుంటే ఆ రోజంతా అతని లవర్ జానూ తో కలిసి రోజంతా తిరగటం వల్ల, బాగా అలసిపోయి త్వరగా నిద్రపోయాడు. అతను నిద్ర లేచేసరికి తన భార్య అక్కడే టేబుల్ దగ్గర ఇంకా రాస్తూ కనిపించింది. అతను తన భార్య ని పట్టించుకోకుండా, పక్కకి తిరిగి మళ్ళీ నిద్రపోయాడు.
.
ఉదయం, ఆమె విడాకులకు సంబధించి కొన్ని షరతులు చెప్పింది. ఆమె అతని నుండి ఏమి కోరుకోవటంలేదు, కానీ విడాకులు ముందు ఒక నెల రోజుల పాటు అతను తన తో వుండాలని చెప్పింది. ఆ నెలలో మనం సాధ్యమైనంత వరకు సాధారణమైన జీవితాన్ని గడపాలి అని అంది.
.
ఆమె కారణాలు చాలా సాధారణం గా ఉన్నాయి. వాళ్ళ కొడుకుకు ఒక నెల రోజుల్లో పరీక్షలు వున్నాయి. వాళ్ళ విడాకుల వల్ల తన చదువుకు ఇబ్బంది కలగకూడదని ఆమె అలా కోరుకుంటుంది. అందుకే తను, వాళ్ళ భర్త ని నెల రోజులు గడువు అడిగింది.
.
నాకు అంగీకరమే అని వాళ్ళ భర్త ఆమె తో చెప్పాడు. కానీ ఆమె అతన్ని మరొకటి అడిగింది. ఆమె అతనికి గుర్తు చేస్తూ ఇలా అడిగింది, మీరు మన పెళ్లి రోజున నన్ను మన పెళ్లి గదిలోకి ఏలా తీసుకువెళ్ళారు గుర్తుందా అని అడిగింది. ఆమె ఈ నెల రోజుల వ్యవధిలో ప్రతి రోజు ఉదయం ఆమె ని ఎత్తుకుని వాళ్ళ బెడ్ రూమ్ నుండి హల్ వరకు తీసుకువెళ్లాలని కోరింది. అప్పుడు అతడు ఆమె కి మతిపోయిందా అని అనుకున్నాడు. వాళ్ళు కలిసివుండే చివరి రోజులలో, తాను అతన్ని అడిగిన చివరి కోరిక కదా అని తన భార్య చెప్పిన దానికి ఒప్పుకున్నాడు.
.
అతను ఆమెతో విడాకులు, అతని భార్య చెప్పిన షరతులు గురించి అతని లవర్ జానూ కి చెప్పాడు. ఆమె బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వు కి అర్ధంలేనట్లుగా అతను భావించాడు. నీ భార్య, నీకు విడాకులు ఇవ్వటం ఇష్టం లేక ఇలా ఏవో నాటకాలాడుతుంది అని జాను అతని తో అంది..
.
విడాకుల ఒప్పందం దగ్గర నుంచి అతనికి , అతని భార్యకు ఏలాంటి శారీరక సంబంధం లేదు.
.
మొదటి రోజున తాను తన భార్యను ఎత్త్తుకున్నప్పుడు, అది వాళ్ళిద్దరి మధ్య మోటుతనంగా అనిపించింది. "హేయ్..! నాన్న, అమ్మను ఎత్తుకున్నాడు అని వాళ్ళ అబ్బాయి సంతోషంతో అరుస్తూ చప్పట్లుకొట్టాడు". ఆ అబ్బాయి మాటలు అతనికి కు బాధను కలిగించాయి. అలా ఎత్తుకుని తీసుకువెళ్తున్నప్పుడు ఆమె కళ్ళు మూసుకొని నెమ్మదిగా తన తో ఇలా చెప్పింది. "మన విడాకుల గురించి నేను మన అబ్బాయికి చెప్పలేదు. అతనికి కొంత బాధ కలిగినా, నవ్వాడు.. అతను ఆఫీస్ కి వెళ్తున్నదని ఆమె తలుపు దగ్గరకి వచ్చింది... ఆమె ఆఫీస్ బస్సు కోసం ఎదురుచూస్తుంది. తాను ఆఫీసుకు ఒక్కడే , ఒంటరిగా కారులో వెళ్ళిపోయాడు. .
.
రెండవ రోజు న , వాళ్ళిద్దరికీ మరింత తేలికగా అనిపించింది..ఆమె తల తన గుండె ని తాకుతుంది..ఆమె దగ్గర సువాసన తనకి తెలుస్తుంది.. తాను కొంత కాలంగా తన భార్య ని గమనించలేదు అని అనుకున్నాడు. ఆమె వయసు పైబడుతుందని అతను గ్రహించాడు. ఆమె ముఖం మీద ముడుతలు కనిపిస్తున్నాయి, ఆమె జుట్టు ఎగురుతుంది. మన వివాహం మూల్యం చెల్లిస్తున్నాను అని అనుకుంటున్నారా అని భర్త ని భార్య అడిగింది. అలా అడగగానే ఒక నిమిషం పాటు ఆలోచిస్తు తాను ఆశ్చర్యపోయాడు..
.
నాలుగో రోజు, తాను ఆమెను ఎత్తుకున్నప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య దగ్గరితనం, అన్యోన్యత అతనికి కనిపించింది. ఈ అంమ్మాయ్ తోనేనా నేను పది సంవత్సరాల జీవించిదని అతనికి అనిపించింది.
.
ఐదవ మరియు ఆరవ రోజున, వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్నందని తాను తెలుసుకున్నాడు. తాను ఈ విషయం గురించి జాను కి చెప్పలేదు. ఇలా నెల రోజులు తన భార్యను తీసుకుని వెళ్ళటం సులభంగా మారిపోయింది. బహుశా రోజు ఇలా చేయటం వల్ల తనకు తానే బలంగా, దృఢంగా అనిపించాడు.
.
ఒక ఉదయం తాను ఏ డ్రెస్ వేసుకోవాలో వెతుకుతుంది. తాను కొన్ని డ్రెస్ లు ట్రై చేసింది కానీ ఒక్క డ్రెస్ కూడా తనకి బాగోలేదు. వేసిన ప్రతి డ్రెస్ కూడా తనకి లూస్ గానే ఉంది.. అప్పుడు అతనికి అర్థం అయ్యింది తను చాలా సన్నగా అయ్యింది అని.. అందుకనే అతను తనని తేలికగా మోయగలిగాను అని.. ఆ విషయం అతనికి బలం గా తగిలింది.. ఆమె గుండెల్లో ఎంత బాధ అనుభవిస్తుందో అప్పుడు అతనికి అర్థం అయ్యింది.. అతనికి తెలియకుండానే అతని చేయి ఆమె తల ని తాకింది... ఆ సమయం లోనే వాళ్ళ అబ్బాయ్ వచ్చాడు..
.
ఆ సందర్భాన్ని చూసిన ఆ అబ్బాయి వాళ్ళ నాన్న తో ఇలా అన్నాడు.."నాన్న అమ్మని బయటికి తీసుకెళ్లే సమయం ఇప్పుడు వచ్చింది.." అని అన్నాడు.. ఇలా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని అలా చూసుకోవడం ఆ అబ్బాయిజీవితంలో విలువైన, అపురూపమైన సంఘటన..
.
అతని భార్య, వాళ్ళ అబ్బాయిని ఆమె దగ్గరకు రమ్మని సైగ చేసింది, వాడు వాళ్ళ అమ్మ దగ్గరకి వచ్చాడు.. వాళ్ళ అమ్మ ఆ అబ్బాయ్ ని గట్టిగా హత్తుకుంది.వాళ్
ళ నాన్న ముఖం పక్కకి తిప్పుకున్నాడు ఎందుకంటే ఆ చివరి నిమిషంలో తన మనసు తాను మార్చుకుంటాడేమో అని భయపడ్డాడు.
.
రోజులానే అతను ఆమె ని ఎత్తుకుని బెడ్ రూం నుండి హల్ కి వెళ్తుండగా ఆమె తన చేతులను అతని మెడ చుట్టూ ప్రేమ గా, సహజం గా వేసింది.. అతను ఆమె ని గట్టిగా పట్టుకున్నాడు అచ్ఛం వాళ్ళ పెళ్లి రోజులాగా, కానీ ఆమె చాలా తేలికగా వుండటం వలన అతనికి చాలా బాధ గా అనిపించిది.
.
చివరి రోజున, అతను ఆమెను తన చేతులతో ఎత్తుకున్నప్పుడు అతను ఒక్కో అడుగు వేయటానికి తనకి చాలా భారంగా అనిపించింది. వాళ్ళ అబ్బాయి స్కూలుకి వెళ్ళిపోయాడు. అతను వాళ్ళ భార్యను మరింత గట్టిగా పట్టుకుని తనతో ఇలా చెప్పాడు, "మన జీవితంలో సాన్నిహిత్యం, అన్యోన్యత లోపించాయి" అని చెప్పాడు..
.
తర్వాత అతను ఆఫీసుకు వెళ్ళిపోయాడు. కారు నుండి వేగం గా దిగి, డోర్ కూడా వేయకుండా ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. అతనికి భయం వేసింది ఎందుకంటే ఆలస్యం అయ్యేకొద్దీ తన మైండ్ మళ్ళీ చేంజ్ అయిపొతుందెమో అని.
.
అతను జాను వుండే క్యాబిన్ కి వెళ్ళాడు.. సారి చెప్పి , అతను తన భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదని చెప్పాడు. ఆమె(జాను) అతని వైపు ఆశ్చర్యంగా చూసి, తన నుదిటిపై చేయి వేసింది. నువ్వు బాగానే వున్నావ్ కదా? అని అడిగింది. అతను తన నుదిటి మీద వున్న ఆమె చేతిని తీసి, సారీ జాను నేను నా భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదు. మా వివాహా జీవితం నాకు విసుగుగా అనిపించేది ఎందుకంటే నాకు,తనకి ప్రేమ విలువ, గొప్పతనం తెలియలేదు. మేము ఎప్పుడు ప్రేమ గా మాట్లాడనుకోలేదు అందుకే మాకు ఎలా కలిసి జీవించాలో అర్థం కాలేదు..ఎప్పుడయితే నేను తనని అలా ఎత్తుకుని తీసుకెళ్లడం మొదలుపెట్టానో అప్పుడే నాకు అర్థం అయ్యింది తను చనిపోయే దాకా నేను తనని అలానే చూసుకుంటానని అచ్ఛం మా పెళ్లిరోజు లానే....
.
జాను హఠాత్తుగా లేచి, అతనిని ఒక చెంప దెబ్బ కొట్టింది. ఏడుస్తు తన ని బయటకి పంపి తలుపు వేసింది. ఇంక అతను ఇంటికి వెళ్తూ దారి లో పూల దుకాణం వద్ద, తన భార్య కోసం ప్లవర్ బొకే ఆర్డర్ ఇచ్చాడు.
.
కార్డ్ మీద ఏమి రాయాలి అని ఆ సేల్స్ గర్ల్ అతన్ని అడిగింది .
.
అప్పుడు అతను నవ్వుతూ "మరణం మనల్ని దూరం చేసేవరకు... నేను నిన్ను మోయాలి అని అనుకుంటున్నాను ." అని రాయమని చెప్పాడు..
.
ఆ సాయంత్రం అతను ఇంటికి త్వరగా వెళ్ళాడు. తన చేతిలో ఒక ఫ్లవర్ బొకే, తన ముఖం మీద చిరునవ్వుతో అతను మెట్లు ఏక్కి పైకి వెళ్ళాడు .తన భార్యను మంచం మీద చూసాడు.
.
.
.
.
.
.
.
.
అప్పటికే ఆమె చనిపోయింది.
.
ఒక్కసారి అతని కి ఏం అర్థం కాలేదు.. తనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్..
.
తన భార్య కొన్ని నెలలగా క్యాన్సర్ తో పోరాడుతుంది. తాను జాను తో బిజీగా వుండటం వల్ల ఈ విషయం తను గమనించలేకపోయాడు. ఆమె చనిపోతుందని ముందుగానే ఆమెకి తెలుసు. ఆమె వాళ్ళ సంసార మరియు విడాకుల విషయాలు సంగతి వీలైనంతవరకు వాళ్ళ కొడుకుకు దూరంగా వుంచి, తనని సేవ్ చేసింది. కనీసం వాళ్ళ కొడుకు దృష్టిలో అతను ఒక ప్రేమించే భర్తగా వుండాలి అనుకుంది.
.
మీ జీవితాలలో జరిగే చిన్న విషయాలు నిజంగా మీ బంధానికి అర్ధం తెలుపుతాయి. భవనం, కారు, ఆస్తి, బ్యాంకు లో డబ్బు ఇవేమి బంధానికి సంబధించినవి కావు. ఇవి ఆనందం కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే కానీ నిజమైన ఆనందం ఇవ్వవు.
.
మీ జీవిత భాగస్వామితో వీలునైంతవరకు సమయం కేటాయిస్తూ, ఒకరికొకరు ఆనందం కలిగించేలా చిన్న పనులు చేస్తూ వుంటే ఇద్దరి మధ్య స్నేహం, సాన్నిహిత్యం పెరుగుతాయి. అప్పుడు నిజమైన, సంతోషకరమైన వివాహం బంధం నిలబడుతుంది.
.
మనం ఏం చేసినా , ఎంత ప్రేమ గా చూసుకున్న అని వాళ్ళు వున్నప్పుడే చూసుకోవాలి.. వాళ్ళు వెళ్ళిపోయాక మనం ప్రేమ చూసుకుందాం అన్న వాళ్ళు మనతో వుండరు..
.
చాలా మంది కేవలం అపార్ధాల వల్ల విడిపోతున్నారు, ఇది చదివి కొంతమందైనా తాము చేసే తప్పును తెలుసుకుని, తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతారని కోరుకుంటున్నాను.

దేవుడా...!

ఒక మనిషి  తనకు కలిగిన బాధను, పడుతున్న కష్టాలను, ఎదురైన సమస్యలను భరించలేక.., నది దగ్గరకు వెళ్ళి దేవుడి కోసం తపస్సు చేయడం మెదలుపెట్టాడు.
దేవుడు ప్రత్యక్షమై వరం కొరుకోమన్నాడు..
అలాగే స్వామీ అని,

ఇంతవరకు ఏ మానవుడు అనుభవించలేని కష్టాలను అనుభవిస్తున్నాను,,అందుకే
  '' ఈ ప్రపంచంలో నాకు ఎలాంటి బాధలు, కష్టాలు లేని జీవితం కావలని కోరుకున్నాడు ''..,

అందుకు ఆ దేవుడు లేదు నాయన మనిషై పుట్టిన తరువాత అవి అనుభవించక తప్పదు అన్నాడు..

అందుకు ఆ మానవుడు, అయితే ఈ ప్రపంచంలోనే అందరికంటే తక్కువ బాధలు, కష్టాలు, సమస్యలు నాకివ్వండి  అని అడిగాడు...
అప్పుడు
ఆ దేవుడు మనషుల కష్టాలను అన్నిటిని మూటల రూపంలో ఒక గదిలో ఉంచి,  ఆ మనవుడిని వెళ్లి ఆ గదిలో నీకు నచ్చిన మూటను తెచ్చుకోమన్నాడు., సరే అని అన్నిటిని వేతికి అతి తేలికైన ఒక మూటను భుజానవేసుకొని సంతోషంతో బయటకు వచ్చి దేవుడుకి నమస్కరించాడు...
తధాస్తూ అని దేవుడు మాయమైపోయాడు...

ఆ మూటను తెరచి చూసి దిగ్భ్రాంతికి లోనైయ్యాడు., లోపల చూస్తే అన్నీ అతని బాధలే, అవే సమస్యలే... అప్పుడే అతనికి తర్కం బోధపడింది.. ఈ భూమిమీద పుట్టిన ప్రతి మనిషికి సమస్యలుంటాయి వాటిని ఎదుర్కొని పోరాడడమే జీవితం అని..
నీటిలో పడిన దూది, ఒత్తిడితొ నిండిన గుండె రెండు బరువు గానే ఉంటాయని..

ఊహల ఎడారిలో ఆశల ఎండమావులను చూస్తుా దాహం తీర్చుకోవలని ఇంకెంత కాలం ఇలా కాలాన్ని కరగదిస్తావు... నువ్వు ఊహల్లో ఎంత దూరం వెళ్ళిన వాస్తవ ప్రపంచంలోకి తిరిగి రావల్సిందే..

వేడిగా ఉన్నాడని సూర్యున్ని, చల్లగా ఉన్నాడని చంద్రుడిని నిందిస్తామా? మౌనంగా ఉన్నా ప్రకృతితోనే అడ్జస్ట్ అయి బ్రతుకుతున్నాము..మాటలు నేర్చిన మనుషులతో అడ్జస్ట్ అయి బ్రతకలేమా..? నీ సమస్య సాటి మనుషులతోన అయితే మాట్లాడి తేల్చుకో...

నీ సమస్యలతో నువ్వు పొరాడాల్సివొస్తే,
నీ యుద్ధం నీదే ఎవరి సాయం కోసం ఎదురు చూడకు.. రణమో మరణమో తెగించి అడుగు ముందుకు వెయ్యి..
ఏం ఆలోచిస్తూన్నావ్..  భయపడకు.,
అండబలం, అర్ధబలం లేకుంటెనేమి కండబలం, గుండెబలానికి నీ బుద్ధి బలం చేర్చి ఈ అనంతమైన ఆకశంలో సూర్యుడిలా వెలిగిపో...

నీ ప్రయాణంలో అడుగడుగునా సమస్యలుంటాయి, మలుపు మలుపులో నిన్ను కృంగదీసే కష్టాలుంటాయి..

12 గంటలు నిర్విరామంగా వెలిగే సూర్యున్ని పడమరలో ఉన్న అసుర సంధ్య మింగేస్తుంది, రగుల్తున్న ఆ సూర్యుడు చల్లరిపోడు సగరాలను ఈదుకుంటూ తెల్లవారేసరికి చీకటిని చీల్చుకుంటూ తూర్పున మళ్ళీ ఉదయిస్తాడు..

అలాగే కష్టాలనేవి నిన్నుముంచేసినప్పడు వాటికి భయపడిపోకు సమస్యలను ఎదుర్కొంటూ సాగిపో నీ పూర్వపు వైభవం నీకు రాకపోతుందా.?
నీ సమస్యలను చీల్చుకొని మళ్ళీ సూర్యుడిలా ఉదయిస్తావు...
కావాల్సిందల్లా దాన్ని నువ్వు నమ్మడమే...

ఈ ప్రపంచమంతా ఏకమై తలకిందులుగా తపస్సు చేసిన సరే ఉదయించే సూర్యున్ని ఆపలేరు.. నిన్ను ఆపలేరు. . !!

Samsung Success Story

1- In 1938 , Lee Byung-Chull launched Samsung in South Korea as a grocery shop.

2- In 1940, due to tight competition in the grocery segment, Samsung abandoned grocery for producing and selling of noddles.

3- In 1950, Samsung abandoned production of noddles for producing of sugar.

4- In 1954, Samsung left sugar and started a woolen mill in Korea.

5- In 1956, Samsung abandoned woolen mill and started selling Insurance and securities.

6- In 1960, Samsung left selling of insurance and securities for production of television - the black and white television. Not color television.

7- In 1980, Samsung switched to telecoms, producing telephone switch boards.

8- In 1987, Lee the founder and owner of Samsung died. The company now broke into four independent companies- department stores, chemicals & logistics, paper/telecom and electronics.

9- Same year, Samsung decided to focus on international investing, investing in plants & semi conductor facilities around the world.

10- In 1990, Samsung delved into real estate abandoning international investing in semi conductors. Samsung built the worlds tallest buildings: Petronas Towers Malaysia, Taipei 101 in Taiwan

11- In 1993, there was heavy recession and Asian markets went belly up, Lee's son who had succeeded him as the CEO of Samsung began downsizing, selling subsidiaries and merged the rest.

12- With the merging of the electronics, engineering and chemicals division, Samsung became the worlds largest producer of memory chips.

13- In 1995, Samsung switched to liquid-crystal displays and over the next 10 years became the worlds largest manufacturer of flat screen television.

14- In 2010, with liquid crystal displays becoming competitive, Samsung launches a 10 year growth strategy, with smart phones being a key focus.

15- In 2016, Samsung is worlds largest mobile and smart phone maker, outselling iPhone two to one.

Samsung sales today is over $250 billion and produces a fifth of South Korea's total exports.

Don't be afraid of change. If you don't change, you become insignificant. Don't be afraid of delving into new waters. Don't get stuck doing same thing over and over again, it's boring. The life is in the risk. The life is in the new!!!!   If your idea isn't working or you are stagnant, don't stick to the Glorious' past, take the risk and move on. It's far better than being stagnant.



 Sovereign wealth fund investments in India at all time high

Their holdings in equity and debt are at the highest level since records are available. Sovereign wealth funds (SWFs) held Rs.2.18 trillion in equities andRs.330.16 billion worth of Indian debt in May. Sovereign funds’ equity holdings are 10.88% of overall FPI equity holdings, and debt holdings are 9.71% of overall FPI debt holdings. They account for 10.71% of overall FPI assets under custody. All three figures are the highest.

వృక్షో రక్షిత రక్షితః

🕉ఓ గుడి కడితే హిందువులే వెళతారు....👣

☪ఓ మసీదు కడితే మహ్మదీయులే వెళతారు...👣

✝ఓ చర్చి కడితే క్రైస్తవులే వెళతారు...👣

అదే ...,🍀🌱🌱🌿🌿
ఓ మొక్క నాటితే

🌳🌲🌳🌲అది చెట్టయితే....

👨‍👨‍👧‍👦దాని నీడకు కుల, మత, జాతి బేధాలు లేకుండా సకల జీవజాతులతో పాటు మనషులందరం వెళతాము.....

☘కనుక ప్రార్థనాలయాలతో పాటు

☘ ప్రాణవాయువునిచ్చే....
☘కాలుష్యాన్నినివారించే ..
☘భూతాపాన్ని తగ్గించే ...
☘గ్లోబల్ వార్మింగ్ తగ్గించే ..
☘చల్లని వాతావరణాన్నిచ్చే
☘వర్షాలు కురిపించే ......
☘భూగర్భ జలాల్ని పెంచే ..
☘భూ సారాన్ని పెంచే .....
☘ఔషధాలనిచ్చే ........
☘నేల కోతను అరికట్టే .....
☘ఆహారాన్నందించే .....
☘స్వాంతననిచ్చే .......
☘సుగంధ ద్రవ్యాలనిచ్చే ..
☘కలప నిచ్చే .........
☘ఓజోన్ ను రక్షించే ..
☘జీవ వైవిధ్యాన్ని కాపాడే .
☘సకల జీవులకు ప్రాణాధారమై
☘ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షణ నిచ్చే
☘కరువు కటకాల నుండి రక్షించే
☘సంపదలను సమకూర్చే ..
☘ మానసిక, శారీరక, సామాజిక ఆరోగ్యాన్నిచ్చే .


🌍 మన ప్రాణాధారమైన చెట్లను కనీసం ఒక్కటైనా నాటుదాం,

వాటిని సంరక్షిస్తూ,పుడమి తల్లి ఒడిలో  మనల్ని , మన భావి తరాలను,సకల జీవ రాశులను మనం సంరక్షించుకుందాం ....

🌱🌎🌞🌝🐆🐣🐺🐝🐜🦀🐍🦂🐠🐓🐕

             🌳వృక్షో రక్షిత రక్షితః🌳

      🙏🏾 సర్వే జనో సుఖినోభవంతు🙏🏾

ఏకాదశి విశిష్టత

🍀మన భరత భూమి పుణ్య భూమి. భక్తికి, భక్తి తత్వానికి పుట్టినిల్లు. అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగవదారాధన చేసి, దైవానుగ్రహాన్ని పొందేందుకు, మన పూర్వులు నియమించిన కొన్ని పర్వ దినాలలో, ఏకాదశి వొకటి. తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి అని జరుపుకోవడం మన ఆచారంగా వ్యవహరింపబడుతోంది.

🍀ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు.

🍀ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశి (ఆషాఢ శుద్ధ ఏకాదశి)నే "శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి" అని కూడా అంటారు. ఈ రోజునుంచీ శ్రీ మహ విష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. గనుక దీన్ని "శయన ఏకాదశి" అంటారు.

🍀ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేసేవారు.

🍀తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యక నే "ఏకాదశి" అంటారు.ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు- మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు

🍀నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఐతే, మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతే గాక చాతుర్మాస్య వ్రతంకూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి.

🍀ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.

🍀ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని మన పురాణాలు చెబుతున్నాయి.

🍀ఏకాదశి అంటే పదకొండు అని అర్థము. ఐతే, ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించబడింది. త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో వివరించబడిన సంగతి విదితమే.

🍀అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొనబడింది.

🍀ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు.

🍀తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలప్పిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు.

It's awesome attitude

A Little boy went to a telephone booth which   was at the cash counter of a store and dialed a number. The store-owner observed and listened to the conversation:

Boy: “Madam, can you give me the job of cutting your lawn?”

Woman: (at the other end of the phone line) “I already have someone to cut my lawn.”

Boy: “Madam, I will cut your lawn for half the price than the person who cuts your lawn now.”

Woman: “I’m very satisfied with the person who is presently cutting the lawn.”

Boy: (with more perseverance) “Madam, I’ll even sweep the floor and the stairs of your house for free.”

Woman: “No, thank you.”

With a smile on his face, the little boy put the receiver down. The store-owner, who was listening to all this, walked over to the boy.

Store-owner: “Son….I like your attitude; I like that positive spirit and would like to offer you a job.”

Boy: “No thanks.”

Store-owner: “But you were really pleading for one.”

Boy: “No Sir, I was just checking my performance at the job I already have. I am the one who is working for that lady I was talking
 to!”

This is called "Self-Appraisal”

Give your best and the world comes to you!
Don't relax or show lazyness.. Whole world is watching you!!
A famous quote said by Lord Krishna in Bhagvat Gita :

"If u don't fight for what u want,
don't cry for what u lost..."

"Nothing depends on luck, everything depends on work because,
even luck has to work."

గురు బ్రహ్మలు

బడిగంట మ్రోగగానే
తమ గళం విప్పి విద్యా బోధ ప్రారంభిస్తారు
విద్యార్ధులకు శిక్షణతో పాటు
క్రమశిక్షణ నేర్పడానికి
తమ శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తారు !

అల్లరిపిల్లల పట్ల కఠినంగా ఉన్నా
బుద్ధిమంతుల పట్ల మెతకవైఖరితో ఉన్నా
పాఠాలు చెప్పేటప్పుడు మాత్రం
ఎటువంటి వివక్షతా చూపని సహృదయులు !

మొదటి బెంచీ పిల్లల దగ్గర నుండి
చివరి బెంచీ పిల్లల వరకు
తమ కంఠ స్వరాన్ని సాగదీస్తూ
పాఠాలు చేరవేస్తారు !

అరుస్తూ పాఠాలు చెప్పడమంటే
తమ శక్తిని జ్ఞానంగా చేసి
విద్యార్ధుల బుర్రల్లో విజ్ఞానం నింపడమే !

నల్లబల్లపై సుద్దముక్కతో రాస్తున్నప్పుడు
ధూళికణాలు కాలుష్యమై
ముక్కుకి,నోటికీ అడ్డంపడి
దగ్గు జబ్బుని వారికి దగ్గర చేస్తుంది !

డస్టర్ తో నల్లబల్లను తుడుస్తున్నప్పుడు
శరీరం మొత్తం ధూళి వస్త్రం అవుతుంది !

విషయ పరిజ్ఞానం నూరిపోయడానికి
తరగతి గదినే భూగోళం చేస్తారు
విజ్ఞానం వికసింప జేయడానికి
తరగతి గదినే ప్రయోగశాల చేస్తారు
గురువులకు విద్యార్ధులే సర్వస్వమై
తరగతి గదే విశ్వ మౌతుంది !

విద్యాభ్యాసం పూర్తిచేసుకొని
విద్యార్ధులు బడిని వదిలి వెళ్లిపోతున్నప్పుడు
ఆత్మబంధం విడిపోతున్నట్లు బాధపడతారు !

పూర్వ విద్యార్ధులు ప్రయోజకులై ఎదురైనప్పుడు
గురువులు సగర్వంగా తలపైకెత్తి
ఆనందంతో ఎవరెస్టు శిఖరాలౌతుంటారు !

ఆటలాడి, పాటలు పాడి
పాఠాలు చెప్పి, ప్రబోధాలు చేసే గురువులు
చతుర్ముఖ బ్రహ్మ స్వరూపాలు !

అంతరాలు లేని
తరాలను తయారుచేసే గురువులు
అంతర్ముఖంగా అమ్మ స్వరూపాలు !

తల్లిదండ్రులకు పిల్లలు ఒక్కరో,ఇద్దరో
విద్యార్ధులందరూ గురుబ్రహ్మలకు పిల్లలే !

LUNCH WITH GOD

A little boy wanted to meet God! He packed his suitcase with two sets of his dress and some packets of cakes! He started his journey, he walked a long distance and found a park! He was feeling tired, so, he decided to sit in the park and take some refreshment! He opened a packet of cake to eat!

He noticed an old woman sitting nearby, sad with hunger, so he offered her a piece of cake!

She gratefully accepted it with a wide look and smiled at him! Her smile was so pretty that the boy longed to see it again! After sometime he offered her another piece of cake! Again, she accepted it and smiled at him! The boy was delighted!

They sat there all afternoon eating and smiling, but never said a word! While it grew dark, the boy was frightened and he got up to leave but before he had gone more than a few steps, he ran back and gave the woman a hug and she kissed him with her prettiest smile!

Back home, when the boy knocked the door, his mother was surprised by the look of joy on his face!

She asked him, "What did you do today that makes you look so happy?"

He replied, "I had lunch with God!"

Before his mother could respond, he added, "You know what? She's got the most beautiful smile I've ever seen in my life!"

Meanwhile, the old woman, also radiant with joy, returned to her home! Her son was stunned by the look of peace on her face and asked, "Mom, what did you do today that made you so happy?"

She replied, "I ate cakes in the park with God!"

Before her son responded, she added, "You know, he's much younger than I expected!"

Too often we underestimate the power of;
a touch,
a smile,
a kind word,
a listening ear,
an honest compliment,
or
the smallest act of caring,
all of which have the potential to turn a life around!

Remember, nobody knows how God will look like! People come into our lives for a reason, for a season or for a lifetime!

‘కబాలి’ లో భారతీయుల గురించి రజనీకాంత్ ఎలాంటి సెటైర్ వేశాడో తెలుసా

‘కబాలి’ సినిమాలో రజనీకాంత్ చెప్పిన పీతల కథ అద్భుతంగా ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా.. మెజార్టీ భారతీయులు మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోంది  ఆ కథ. రజనీకాంత్ ‘కబాలి’ లో చెప్పిన కథ ఏంటంటే.. ఓ తొట్టెలో బోలిడన్నీ పీతలు ఉంటాయి.. అయితే, అందులోంచి ఎలాగైనా బయటపడి తన ప్రాణాలు నిలుపుకోవాలని ఆ పీతలన్నీ ప్రయత్నిస్తుంటాయి. ఈ ప్రయత్నంలోనే ఓ పీత క్రమంగా పైకి  వెళ్లాలని ప్రయత్నిస్తూ ఆ తొట్టె ఎత్తులో సగానికి పైకి చేరుకుంటుంది. ఇది చూడలేక.. మరో పీత  పైనున్న పీతను క్రిందకు లాగేస్తుంది. ఇలా, ఒక పీత పైకి వెళ్దామనుకుంటే.. మరో పీత దాన్ని కిందకు లాగేస్తుండటంతో.. ఆఖరికి ఒక్క పీత కూడా తొట్టె నుంచి బయటపడలేకపోతుంది. ఈ రకంగా, ఓ భారతీయుడు  పైకెదుగుతుంటే.. మరో భారతీయుడు తట్టుకోలేడు’ అని రజనీకాంత్‌ సినిమాలోని ఓ సందర్భంలో చెబుతాడు.

రజనీకాంత్‌ చెప్పిన ఈ మాటలు నూటికి నూరు శాతం నిజమని చెప్పలేం కానీ.. 75 శాతం పైగా నిజం!  పూర్వపు రోజుల్లో మన దేశపు రాజుల మధ్య ఏమాత్రం ఐకమత్యం ఉండేది కాదు. ఈ ఐకమత్యం లేకపోవడాన్ని ఆసరాగా చేసుకునే.. మొదట్లో మహమ్మదీయ రాజులు..ఆ తర్వాత బ్రిటీష్ వారు భారతదేశాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నారు. అప్పట్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవంటే.. ఒక స్వదేశపు రాజును దెబ్బతీయడానికి మరో స్వదేశపు రాజు విదేశీ రాజులతో కుమ్మక్కయ్యేవాడు. ఔరంగజేబు, మహ్మద్ గజిని ఇలా ఇంకొందరు.. మన రాజులలో ఐకమత్యం లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. ఈ కారణంగానే, కొన్ని దశాద్దాల పాటు.. వలస పాలకుల చేతిలో మన దేశ  ప్రజలు నరకయాతన అనుభవించారు. ఈ ఐకమత్యం లోపంచిన కారణంగానే, మొదట్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన మహ్మమదీయ రాజులకి.. ఆ తర్వాత బ్రిటీష్ వాళ్లకి మనం మన మాన, ధన ప్రాణాల్ని సమర్పించుకోవాల్సి వచ్చింది.. అప్పట్లో పరిస్థితులు అలా ఉంటే.. ఇప్పటి పరిస్థితులు కూడా పెద్దగా ఏం మారలేదు.

దీనికి ఉదాహరణగా.. మన యూనివర్సిటీలో జరుగుతున్న రీసెర్చి  కార్యక్రమాలను చెప్పుకోవచ్చు! మన దేశపు యూనివర్సిటీల్లో రీసెర్చి స్కాలర్స్ జరుపుతున్న పరిశోధనల  కోసం ప్రతీ ఏటా కొన్ని వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చుపెడుతున్నప్పటికీ.. ఇప్పటి దాకా మనం ఆశించినంత అవుట్‌ఫుట్‌ ను మన పీహెచ్‌డీ స్టూడెంట్స్ అందించలేదు. అలాగని, మన విద్యార్థుల్లో కొత్త ఆవిష్కరణలు చేసే సత్తా లేక కాదు. మనం ఆశించినంత  ప్రతిఫలాన్ని మన విద్యార్థులు అందించకపోవడానికి కారణం.. మన వ్యవస్థలో ఉన్న లోపాలే ! మన యూనివర్సిటీలో ఓ రీసెర్చి విద్యార్థికి ఓ కొత్త ఐడియా లేక ఓ వినూత్నమైన పరిశోధన చేద్దామన్న ఆలోచన వస్తే.. సాధారణంగా పైస్థాయిల్లో ఉండే ప్రొఫెసర్లు వెంటనే ప్రోత్సహించారు.  సదరు విద్యార్థి కి వచ్చిన అద్భుతమైన  ఐడియా ను  లేదా రీసెర్చ్ పాయింట్ ను మొగ్గలోనే తుంచేందుకు వివిధ డిపార్ట్‌మెంట్లలో ఉండే ప్రొఫెసర్లు  ప్రయత్నిస్తుంటారు. తన విద్యార్థి తనకన్నా పైకెదగకూడదనే విపరీత లక్షణమే దీనికి కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.  ఒక వేళ, సదరు విద్యార్థి రీసెర్చి కి ఒప్పుకున్నా ఆ తర్వాత అతడికి అనేక ఆటంకాలు కల్పిస్తుంటారు. ఇక, మన దేశపు యూనివర్సిటీ లో మరో రకం ప్రొఫసర్లు ఉంటారు. వీరు తమ రీసెర్చి విద్యార్థులని ప్రతిభ కారణంగానే ప్రోత్సహించడం కన్నా.. సదరు విద్యార్థి తనకి ఎంత వినయ, విధేయతలు ప్రదర్శిస్తున్నాడునే విషయాన్నే పరిగణలోకి తీసుకుంటారు. తాను చెప్పిన ప్రతీ అడ్డమైన పనిని ‘జీ హుజూర్’ అని చేసుకుంటూ పోతూ..  తాను చెప్పిన ప్రతీ మాటను  శిరసావహిస్తున్నాడా అనే విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ వ్యవస్థ లోపాల కారణంగానే, ప్రస్తుత యువత తన భవిష్యత్‌ రీసెర్చి కార్యక్రమాలకు విదేశి యూనివర్సిటీల వైపు చూస్తున్నారు.

కేవలం రీసెర్చి వ్యవస్థే కాదు.. మన దేశపు వ్యాపార రంగం కూడా ఇలాగే ఉంది. ఓ వ్యక్తి వ్యాపారంలో పైకెదుగుతుంటే.. అతడి ఎదుగుదలను చూడలేక.. అతడిని దెబ్బతీయడానికి ప్రయత్నించి.. సక్సెస్ అయిన వ్యాపార దిగ్గజాలు మన దేశంలో చాలా మందే ఉన్నారు. అంతేకానీ, పై కెదుగుతున్న వ్యక్తితో పోటీపడి.. అతడి కంటే ఎక్కువగా కష్టపడి.. రాణించాలన్న తపన మన దిగ్గజ వ్యాపారుల్లో అతి కొద్దమందికి మాత్రమే ఉంది.  ఇక క్రీడల్లో.. ముఖ్యంగా క్రికెట్‌లో ఈ పరిస్థితి ఇంకా  దారుణంగా  ఉంది! గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న చిన్న టౌన్‌లలో అపారమైన ప్రతిభావంతులు ఉన్నప్పటికీ వారికి అవకాశాలు దక్కడం మన దేశంలో చాలా కష్టం! కారణం..   సెలక్షన్‌ ప్రక్రియలో.. ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ.. ప్రతిభావంతులని క్రిందకు లాగేసి..  వాళ్లని నిరుత్సాహపరిచి.. కేవలం ‘తమ’ వాళ్లని మాత్రమే సెలెక్ట్ అయ్యేడట్టు మన దేశంలో లాబీయింగ్ జరుగుతోంది.

వైద్యం పవిత్రమూ కాదు, వైద్యుడు దేవుడూ కాదు

"వైద్యం చాలా పవిత్రమైనది" "వైద్యుడు నారాయణుడితో సమానం" ఇవి వారసత్వంగా కొన సాగుతున్న భావాలు. కాలం మారుతుంది. జనం మారు తున్నారు. వారి ఆలోచనా విధానం మారుతుంది. గతంలో మాదిరి వైద్యం చేయా లంటే ఏ ఆకునో, కాయనో నూరి మందుగా ఇస్తే కుదరదు. ఇస్తే జనం ఒప్పుకోరు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంత  పెరిగినా కొన్ని జబ్బులకు వైద్యం లేదు. కొన్ని జబ్బులు బతికినంత కాలం ఉంటాయి. ఇంకొన్ని జబ్బులు తగ్గటానికి నెలలు,సంవత్సరాలు పట్టొచ్చు. మరికొన్ని జబ్బులు వాటి జ్ఞాపకాలను, అవశేషాలను వదిలి పోతాయి. ఇవి ఆయా జబ్బుల స్వభావం. ఆపరేషను చేయాల్సిన కేసుల్లో సర్జరీ మొదలైనప్పటినుంచి రోగి కోలుకొనేవరకూ కేవలం డాక్టరు సమర్థత ఒక్కటే చాలదు. రోగం తీవ్రత, రోగి శరీరం తట్టు కొనే తీరు,మందుల ప్రభావం, వైద్య వసతులు, రోగి చెల్లింపు సామర్థ్యం మొదలైనవన్నీ వాటి వాటి స్థాయిలో కలిసి రావాలి. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటుంది. కాని రోగి అవగాహన, అర్థం చేసుకొనే తీరును బట్టి వారి ఆశింపు మరో రకంగా ఉంటుంది.

ఏది ఎలా ఉన్నా, జనానికి ఆధునిక వైద్యం కావాలి. వైద్యంలో నాణ్యత ఉండాలి. రోగి ఆసుపత్రిలో అడుగు పెట్టే సమయానికి అన్నీ అమరి నట్టు ఉండాలి. బాధతో ఉన్నప్పుడు వైద్యం ఆలస్యం కాకూడదు. త్వరగా జబ్బు తగ్గి పోవాలి. ఇవి సగటు రోగి ఆశింపు.

రోగి ఆశించి నట్టు వైద్య సేవలు అందించాలంటే డాక్టరు పూర్తిగా సమర్థుడై ఉండాలి. వైద్యాన్ని బాగా నేర్చు కోవాలి, కొత్త కొత్త పోకడల్ని నిరంతరం తెలుసు కుంటూ ఉండాలి. అందుకు వృత్తిపరమైన‘కాన్ఫెరన్స్’లకు పోతూ ఉండాలి. ఎడిషను మారినపుడల్లా కొత్త పుస్తకాలు మారుస్తూ ఉండాలి. జర్నళ్ళకు చందా కడు తూనే ఉండాలి. అన్నింటికి మించి నిరంతరం చదువు తూనే వుండాలి. రోగం చేయటంలో ఏమైనా తేడా వచ్చి వినియోగదారుల ఫారంలో కేసు పడవచ్చు. "ఇన్ని కష్టాలు పడే మాకు కష్టానికి తగ్గట్టు డబ్బులు ఫీజు రూపంలో రావద్దూ?"ఇది రోగి ఆశింపుపై సగటు డాక్టరు కామెంటు.

మరోవైపు డాక్టరుకి సామజిక బాధ్యత ఉండాలని సమాజం ఖచ్చితంగా ఆశిస్తుంది. ఇంజనీర్లకు,టీచర్లకూ, లాయర్లకూ, చార్టెడు అకౌంటెంట్లకూ ఇలా ఒకరనేం? ఎవరికీ సామాజిక బాధ్యతని జనం గుర్తు చేయరు. ఐ.ఐ.టీలలో, ఐ.ఐ.ఎంలలో ప్రజల డబ్బుతో చదివిన వారిని "సమాజం పట్ల మీ బాధ్యత ఏమిటని ఎవరూ అడగరు. వారు సమాజం డబ్బుతో చదవరా?కేవలం డాక్టరు మాత్రమే జనం డబ్బుతో చదువు తారా? డాక్టర్లు మాత్రమే జనాల సేవల తరించాలా?"వైద్యం మీద, వైద్యుల మీద చర్చ వచ్చిన ప్రతిసారీ డాక్టర్లు ముందుకు తెచ్చే ప్రశ్నలు ఇవి.

ఇక్కడ కొన్ని వాస్తవాలు కుడా గమనించాలి. వైద్యుడిని దేవుడిగా నెత్తిన పెట్టు కునే ఈ జనమే వైద్యంలో ఎక్కడైనా తేడా వచ్చిందంటే ఊరకనే ఉండరు. అదే "దేవుడి"ని తిడతారు. కొన్నిసార్లు కొడతారు. ఆసుపత్రుల మీద దాడి చేస్తారు. మంచి సిటిజను అయితే జరిగిన నష్టానికి డబ్బులు కట్టించమని కోర్టుకు తిప్పు తాడు.

వైద్యులకూ, రోగులకు మధ్య ఈ విధమైన వైవిధ్యాలు రావటానికి కారణం ఏమిటంటే ‘డాక్టరు - పేషంటు’మధ్య సంబంధాలను వాస్తవ దృష్టితో అర్థం చేసుకోలేక పోవటమే. జనం మారి, వైద్యం మారి, వైద్య పద్ధతులు మారి, వైద్యానికి సంబంధించి మిగతా అన్ని అంశాలు మారినా వైద్యుల్ని చూడటంలో జనం ఆలోచనలు మాత్రం సంప్రదాయ పద్ధతుల్లో అలాగే ఉన్నాయి. అందుకే జనం ఆశింపుకూ, వైద్యుల ప్రవర్తనకూ మధ్య అంత అంతరం.

సమాజంలో ఆర్థిక, సామజిక, సాంస్కృతిక అంశాలలో మార్పులు అనివార్యం. వాటితోపాటే మానవ సంబంధాలు మారుతూ ఉంటాయి. పూటకుళ్ళ ఇళ్ళు రెస్టారెంట్లు అయినట్లు, సత్రాలు స్టార్ హోటళ్ళు అయినట్టు వైద్యమూ దాని  తీరుతెన్నులు మారాయిన్న అంశాన్ని పరిగణ లోకి తీసు కోవటం లేదు. వైద్యాన్ని డబ్బులు తీసుకొని చేసే "సేవ"గా గుర్తించకుండా,పవిత్రమైనదిగా, డాక్టరును వైద్య నిపుణుడిగా కాకుండా దేవుడిగా, దయమయుడిగా, శాంత ముర్తిలా,రోగ పీడిత దరిద్ర నారాయణులను ఆడు కోవటానికి పుట్టిన అవతార మూర్తులుగా భావించి నేటి కాలానికి తగ్గట్టు నైతికతను ఆశిస్తే ఎలా కుదురుతుంది?

జనం మారి, వైద్యం మారి, వైద్య పద్ధతులు మారి,వైద్యానికి సంబంచిన అన్నీ మారినా వైద్యుల్ని చూడటంలో మాత్రం జనం ఆలోచన లను పాత పద్ధతుల్లోనే ఉన్నాయి. అంటే జనంలో  ఉండే ద్వంద ప్రమాణ ఆలోచనల వల్ల వైద్యులకు, జనానికి మధ్య దూరం పెరుగు తుంది.

మారే కాలంతో పాటు డాక్టర్లూ మారు తారు. చేసే వైద్యమూ మారుతుంది. దానికి తగ్గ ఖర్చూ పెరుగు తుంది. మార్పులన్నీ సమాజంలో వచ్చే మొత్తంలో భాగం గానే ఉంటాయి. వీటిని దృష్టిలో ఉంచు కొని "డాక్టరు - పేషంటు" సంబంధాన్ని చూస్తే వారి మధ్య సంబంధాలు సజావు గానే ఉంటాయి. లేదంటే పరస్పరం అనుమానం తోనే కలిసి నడవాలి.

మిగతా వారిని వదిలేసి డాక్టర్ల నుండి మాత్రమే సామాజిక బాధ్యతను ఆశించటంలో మరో కనబడని కోణం కూడా ఉంది. అదేమిటంటే రోగం వ్యక్తిని ప్రత్యక్షంగా బాధకు గురి చేస్తుంది. దాన్నుండి విముక్తి పొందాలంటే డాక్టరుతో ప్రత్యక్ష సంబంధం, వారి సేవలు అవసరం. అలాగే దానికి నేరుగా తనే ప్రత్యక్ష "చెల్లింపు" కూడా చెయ్యాలి. ఆ చెల్లింపు మనసులో "అయిష్టమైన చెల్లింపు" ఎలానో చూద్దాం.

రోగం రావటం ఎవరికీ ఇష్టం ఉండదు. అయినా రాకుండా ఉండవు. వచ్చాక వైద్యం చేయించు కోక తప్పదు. ఇష్టం ఉన్నా, లేక పోయినా డాక్టరు దగ్గరికో,ఆసుపత్రికో పోయి వైద్యం చేయించు కోవాలి. అంటే జబ్బున పడ్డప్పుడు "రోగి- డాక్టరు" సంబంధం అనివార్యమూ, అవసరమూ. యిది ఇలా ఉంచుదాం.

మనిషి అవసరాలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటి రకం మనకు కావలసినవి, మనం ఇష్టపడేవి,మనకు ఆనందాన్ని ఇచేవి. వీటి కోసం వెంపర్లాడతాం. ఖరీదు అయిన టీవీ కొనటం, ఆరు రెట్లు ఎక్కువ పెట్టి నచ్చిన హీరో సినిమా టికెట్టును బ్లాకులో కొనటం,దప్పిక వేసినప్పుడు కోకకోల తాగటం, ఎంత డబ్బు పెట్టి అయిన మందు కొట్టటం ఇలా చాల పనులు ఎవరికి వారికి ఇష్టంగా ఉంటాయి కాబట్టి ఎంత డబ్బు పెట్టవనే దానితో పనిలేదు. ఇష్టమైన అవసరాలు కాబట్టి ఎంతైనా పెట్టవచ్చు. దీనికి బాధ పడేది ఏమి ఉండదు.

రెండో రకం అవసరాలు మనకు ఇష్టం లేనివి. ఇష్టం లేక పోయినా అవసరం కాబట్టి వాటి కోసం ఖర్చు పెట్టాలి. లంచాలు, కోర్టు కేసులు, ఆసుపత్రి ఖర్చులు మొదలయినవి ఈ కోవ లోకి వస్తాయి. ఇవి వచ్చాయి కాబట్టి అవసరాలు అయ్యాయి కాని నిజానికి మనం కోరు కోలేదు. కాబట్టి వీటికోసం ఖర్చు చేయటం సంతోషంగా ఉండదు.

అయితే వీటిల్లో లోతు పాతులు మనకు తెలియదు కాబట్టి నిపుణుల సహాయం కావాలి. వారి సేవలకు "ఫీజు" చెల్లించాలి. కాని దాని మీద పెట్టే ఖర్చు బూడిదలో పోస్తున్నంత "ఫీలింగు"

పది వేల రూపాయలు ఆలోచించ  కుండా‘మందు’కు ఖర్చు పెట్టే వ్యక్తి దాన్ని మానటానికి వైద్యం చేసిన డాక్టరు బిల్లు ఐదు వేలు కట్ట డానికి మనసు ఒప్పదు. దీనికి ఇంత అవుద్దా! అని ధర్మ సందేహం. డాక్టరు ఎక్కువ లాగు తున్నాడని లో లోన మథనం. డాక్టర్లు ఊరికే సంపాదిస్తున్నారని నింద. డాక్టర్లకు మానవత్వం లేదని కామెంట్లు.

తీవ్రంగా గాయ పడ్డప్పుడు వైద్యం చేయించు కోకపోతే ప్రాణం పోతుందనే భయం. తక్షణ ఆపద్బాంధవుడు డాక్టరు "ఎక్కడా? త్వరగా రాడే?" ఆ పరిస్థితిలో, ఆ సమయంలో రోగి ఆక్రందన అలా ఉంటుంది. డాక్టరు వచ్చాడు. వైద్యం జరుగుతూ ఉంది. ఫరవా లేదు. ఇపుడు బాగుంది. ‘బిల్లు ఎంత అవుతుందో’? రోగి అనుమానం. రోగం తగ్గింది. బిల్లు చేతికి వచ్చింది. అది ఎంతైనా ఉండనీ! ‘‘అమ్మ బాబోయ్ ఇంతా? ఈ డాక్టర్లకు కరుణ లేదు. దారుణంగా దోచేసు కుంటున్నారు’’, ‘‘ఏం పెద్ద ఊడ బొడిచారనీ’’ ఇవి జబ్బు నయం అయ్యాక, సగటు రోగి ఆలోచనలు. దీనికి కారణం ఇష్టం లేని ‘అవసరం’ కోసం చెల్లించాల్సి రావటమే. అందుకే రోగికి డాక్టరు ప్రాణం పోయేటపుడు దేవుడుగానూ, రోగం తగ్గేటప్పుడు స్నేహితుడిగా, బిల్లు కట్టించు కొనేటప్పుడు యముడిలా కనిపిస్తాడని ఒక ఆధునిక నానుడి పుట్టుకు వచ్చింది.

చేయించుకున్న వైద్యానికి బిల్లు కట్టాల్సి వచ్చినపుడు రోగి మనసులో "అవసరం - అయిష్టత" పునాదిగా ఆలోచిస్తారు. మారిన సామాజిక నేపథ్యంలో వైద్యం చేసే డాక్టరు సేవ "సేవ - ప్రతిఫలం" అనే ఆలోచనల పునాదిగా ఫీజును ఆశిస్తాడు. ఈ రెండింటి మధ్య పొంతన ఎంత చెడిపోతే "డాక్టరు - రోగి" మధ్య సంబంధం కూడా అంతగా దెబ్బ తింటుంది.

రోగి - డాక్టరు మధ్య సంబంధాలను వ్యాపార సంబంధాలుగా పరిగణించి "వినియోగదారుల చట్టం" పరిధిలోకి తెచ్చాక కూడా "సేవ - దయ" అనే పాత పునాదులపై నుండి వైద్యాన్ని చూడటం సరి కాదు. "సేవకు తగ్గ చెల్లింపు" రోగికి ఉండాలి. అలాగే‘‘చెల్లించినదానికి నాణ్యమైన సేవ’’ను డాక్టర్లు అలవరచు కోవాలి. అంటే రోగి మంచి వినియోగదారుడై ఉండాలి. డాక్టరు నాణ్యత అందించగల ‘సర్వీసు ప్రొవైడరు’ అయి ఉండాలి.

సేవకు తగ్గట్టు చెల్లించని మనస్తత్వం రోగికి ఉన్నపుడు ఏదో ఒక రూపంలో దాన్ని రాబట్టుకొనే విధంగా వైద్యులు ఉంటారు. వైద్యం అనే రైలు నడవాలంటే దానికి "రోగి - వైద్యుడు" రెండు పట్టాల్లాంటి వారు. ఒక పట్టా అదుపు తప్పి, రెండో దాన్ని అదుపు తప్ప కుండా బాగుండమని ఆశించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో వినియోగదారుడు వైద్యులపట్ల తమ దృక్పథం మార్చు కోవాలి.

వైద్య వృత్తి పవిత్రమినదేమీ కాదు. కట్టిన డబ్బుకు అందించే సేవ మాత్రమే

డాక్టరు గోప్ప వాడేమి కాదు. అన్నీ పనుల్లో నిపుణులు ఉన్నట్టే డాక్టర్లు వైద్యంలో నిపుణులు.

డాక్టర్లందరూ మేథావులు కాదు. అందరిలో ఉన్నట్టే డాక్టర్లలో కూడా మేథావులు ఉంటారు

డాక్టర్లు కేవలం "మంచి"గా ఉంటారని ఆశించటం పొరపాటు.

సమాజంలో ఎంత మంచి ఉంటుందో అంత కంటే ఎక్కువను ఎలా ఆశించటం?

డాక్టరు చదువును దృష్టిలో ఉంచు కొని వైద్యంలో నాణ్యతని ఆశించాలి.

ప్రతి డాక్టరుకు అన్నీ  విషయాలు తెలిసి ఉండవు. తెలిసి ఉంటాయని ఎప్పుడు ఆశించ వద్దు

ఒకే డిగ్రీ చదివిన నిపుణుల మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది

సమాజంలో ఉండే అన్నీ రుగ్మతలు వైద్య వ్యవస్థ లోనూ, వైద్యు ల్లోనూ ఉంటాయని అర్థం చేసు కోవాలి.

ప్రభుత్వ డాక్టర్లు ఉచితంగా సేవ చేయరు. మన తరపున ప్రభుత్వం చెల్లిస్తుంది.