ఏయే ఆహార పదార్థాలను రోజులో ఏ సమయంలో తినాలో తెలుసుకోండి.
బరువు తగ్గాలనుకుంటున్న వారు, చక్కని ఆరోగ్యం కోరుకునే వారు వ్యాయామంతోపాటు ఆహారం విషయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకోవడం సహజం. అయితే వ్యాయామం సంగతి ఎలా ఉన్నా ప్రధానంగా మనం తినే ఆహారం పట్ల మాత్రం నూటికి నూరు శాతం కచ్చితంగా జాగ్రత్త వహించాల్సిందే. సరైన పోషకాలను అందించే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో, ఏ సమయంలో తినాల్సిన ఆహారాన్ని అదే సమయంలో తీసుకోవడం కూడా అంతే అవసరం. లేదంటే పోషకాహారం తీసుకున్నా తగిన ఫలితం ఉండదు. దీనికి తోడు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది.
పెరుగు :-
పెరుగును పగటి పూట మాత్రమే తీసుకోవాలి. రాత్రి పూట తినకూడదు. అలా తింటే శరీరంలో మ్యూకస్ ఎక్కువగా వృద్ధి చెందుతుంది. ఇది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి పెరుగును పగటి పూటే తినాలి. దీని వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది.
అన్నం :-
రాత్రి పూట అన్నం అస్సలు తినకూడదు. దీని వల్ల శరీరంలో అదనపు కొవ్వు చేరుతుంది. మధ్యాహ్న భోజనంగా అన్నం తినాలి. దీని వల్ల శరీరంలో ఉన్న కార్బొహైడ్రేట్లన్నీ ఎక్కువగా వినియోగమయ్యేందుకు అవకాశం ఉంటుంది.
పాలు :-
పాలను రాత్రి పూట తీసుకుంటే మంచిది. దీని వల్ల చక్కగా నిద్ర పడుతుంది. ఉదయాన్నే పాలను తాగితే జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఉదయం పూట పాలను తీసుకోకూడదు. అయితే వ్యాయామం, శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు ఉదయం పూట పాలను తాగవచ్చు.
యాపిల్స్ :-
యాపిల్ పండ్లను ఉదయాన తినాలి. దీని వల్ల మలబద్దకం సమస్య తొలగిపోతుంది. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అంతేకాదు శరీరంలో ఉన్న విష పదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. రాత్రి పూట యాపిల్స్‌ను తినడం మంచిది కాదు. ఒక వేళ తింటే జీర్ణాశయంలో యాసిడ్స్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి, జీర్ణప్రక్రియకు ఆటంకం కలుగుతుంది.
వాల్‌నట్స్ :-
వాల్‌నట్స్‌ను సాయంత్రం తినాలి. వీటిలోని ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు మనకు సంపూర్ణంగా అందాలంటే సాయంత్రం పూట వాల్‌నట్స్‌ను తింటే సరిపోతుంది. అదే ఉదయం, రాత్రి పూట అయితే వీటిని తినకూడదు. ఎందుకంటే ఆయా సమయాల్లో వీటిని తింటే శరీరానికి సరైన పోషకాలు లభించవు.
పప్పు ధాన్యాలు :-
శనగపప్పు, పల్లీలు, కంది పప్పు, చిక్కుడు తదితర గింజ, పప్పు జాతికి చెందిన ధాన్యాలను మధ్యాహ్నం పూట తీసుకోవాలి. దీని వల్ల మన శరీరానికి కావల్సిన ఫైబర్ (పీచు పదార్థం) అధిక మొత్తంలో అందుతుంది. దీంతో జీర్ణ ప్రక్రియ కూడా మెరుగు పడుతుంది. అంతేకాదు కొలెస్టరాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి. ఉదయం, రాత్రి వేళ్లలో పప్పుల్ని తింటే మనకు కావల్సిన పోషకాలు సరిగా అందవు. దీనికి తోడు ఆకలి పెరుగుతుంది. దీని వల్ల ఇంకా ఎక్కువ ఆహారం తినేందుకు అవకాశం ఉంటుంది.
అరటి పండ్లు :-
అరటిపండ్లను మధ్యాహ్నం తినాలి. ఇది జీర్ణప్రక్రియను మెరుగు పరుస్తుంది. అంతేకాదు జీర్ణాశయ సంబంధ సమస్యలైన అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. రాత్రి పూట అరటి పండ్లను తింటే మ్యూకస్ పొర పెరుగుతుంది. దీని వల్ల జలుబు వంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఉదయాన పరగడుపున కూడా అరటి పండ్లను తినకూడదు. ఎందుకంటే ఇవి కడుపును ఇబ్బంది పెడతాయి.
మాంసం :-
మాంసాన్ని కూడా మధ్యాహ్నమే తినాలి. ఎందుకంటే మాంసం జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి దీన్ని మధ్యాహ్నం తినడమే మంచిది. దీని వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్లు కూడా సరిగ్గా అందుతాయి. రాత్రి పూట మాంసం తినడం మానేయాలి. ఎందుకంటే జీర్ణ వ్యవస్థపై అధికంగా భారం పడుతుంది.

No comments:
Post a Comment