Monday, 20 June 2016

ఆరోగ్యమే మహాయోగం

యోగా
యోగా ( సంస్కృతం : योगः) అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. ఇది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. మోక్షసాధనలో భాగమైన ధ్యానం అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి అధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది. దీనిని సాధన చేసే వాళ్ళను యోగులు అంటారు.
వీరు సాధారణ సంఘ జీవితానికి దూరంగా మునులు సన్యాసులవలె అడవులలో ఆశ్రమ జీవితం గడుపుతూ సాధన శిక్షణ లాంటివి నిర్వహిస్తుంటారు. ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుంది. హఠయోగములో భాగమైన శారీరకమైన ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహధారుడ్యాన్ని, ముఖ వర్చస్సుని ఇనుమడింప చేస్తుంది.
 బుద్ధమతం, జైనమతం, సిక్కుమతం మొదలైన ధార్మిక మతాలలోనూ, ఇతర ఆధ్యాత్మిక సాధనలలోను దీని ప్రాధాన్యత కనిపిస్తుంది.

💥 ప్రస్తావన
హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగమైన యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన ఆద్యుడు పతంజలి .

 క్రీస్తు పూర్వము 100వ శకము 500వ శకము మధ్య కాలములో ఈ రచన జరిగినట్లు పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఉపనిషత్తులు, భగవద్గీతలో యోగా ప్రస్తావన ఉంది. పతంజలి వీటిని పతంజలి యోగసూత్రాలు గా క్రోడీకరించాడు. సూత్రము అంటే దారము. దారములో మణులను చేర్చినట్లు యోగశాస్త్రాన్ని పతంజలి ఒకచోట చేర్చాడు. హఠయోగ ప్రదీపిక, శివ సంహిత దానిలో ప్రధాన భాగాలు. అంతర్భాగాలైన కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగము, భక్తియోగము మొదలైనవి హిందూతత్వంలో భాగాలు. వ్యాసముని విరచితమైన భగద్గీతలో యోగాసనాలు పదినెనిమిది భాగాలుగా విభజించి చెప్పబడినవి.

💥 యోగము అంటే ఏమిటి?
"యుజ్" అనగా "కలయిక" అనే సంస్కృత ధాతువు నుండి "యోగ" లేదా "యోగము" అనే పదం ఉత్పన్నమైంది. "యుజ్యతేఏతదితి యోగః", "యుజ్యతే అనేన ఇతి యోగః" వంటి నిర్వచనాల ద్వారా చెప్పబడిన భావము - యోగమనగా ఇంద్రియములను వశపరచుకొని, చిత్తమును ఈశ్వరుబియందు లయం చేయుట. మానవిని మానసిక శక్తులన్నింటిని ఏకమొనర్చి సామాన్య స్థితిని చేకూర్చి భగవన్మయమొనరించుట. ఇలా ఏకాగ్రత సాధించడం వలన జీవావధులను భగ్నం చేసి, పరమార్ధ తత్వమునకు త్రోవచేసుకొని పోవచ్చును. అలా ఆత్మ తనలో నిగూఢంగా ఉన్న నిజ శక్తిని సాధిస్తుంది. ఇలా ఆంతరంగికమైన శిక్షణకు భిన్న మార్గాలున్నాయి. వాటిని వివిధయోగ విధానాలుగా సూత్రకారులు విభజించారు
.
"యోగము" అంటే సాధన అనీ, అదృష్టమనీ కూడా అర్థాలున్నాయి. భగవద్గీతలో అధ్యాయాలకు యోగములని పేర్లు.
భారతీయ తత్వ శాస్త్రంలోని ఆరు దర్శనాలలో "యోగ" లేదా "యోగ దర్శనము" ఒకటి. ఈ యోగ దర్శనానికి ప్రామాణికంగా చెప్పబడే పతంజలి యోగసూత్రాల ప్రకారం "యోగం అంటే చిత్త వృత్తి నిరోధం".
 స్థిరంగా ఉండి సుఖాన్నిచ్చేది ఆసనం. అభ్యాస వైరాగ్యాల వలన చిత్త వృత్తులను నిరోధించడం సాధ్యమవుతుంది. ఇలా సాధించే ప్రక్రియను "పతంజలి అష్టాంగ యోగం' అంటారు. దీనినే రాజయోగం అంటారు (పతంజలి మాత్రం "రాజయోగం" అనే పదాన్ని వాడలేదు).

💥 యోగంలో విధాలు

🕉 పతంజలి యోగసూత్రాలు

పతంజలి యోగసూత్రాలు నాలుగు అధ్యాయాల సంకలనము. సమాధి పద, సాధన పద, విభూతి పద, కైవల్య పద అనే నాలుగు అధ్యాయాలు. ఇవి మానసిక శుద్ధికి కావలసిన యోగాలు. శరీర ధారుఢ్యానికి, ఆరోగ్య సంరక్షణకి, రోగనిరోధకానికి సహాయపడే శారీరక ఆసనాలను అష్టాంగయోగము వివరిస్తుంది.
1. సమాధిపద ఏకాగ్రతతో చిత్తవృత్తులను నిరోధించి పరమానంద స్థితిని సాధించడము దీనిలో వివరించబడింది.
2. సాధనపద కర్మయోగాన్ని, రాజయోగాన్నిసాధన చెయ్యడము ఎలాగో దీనిలో వివరించబడినది. ఎనిమిది అవయవాలను స్వాధీనపరచుకోవడం ఎలా అని రాజయోగములో వివరించబడింది.
3. విభూతియోగము జాగరూకత, యోగ సాధనలో నిపుణత సాధించడమెలాగో దీనిలో వివరించబడినది.
4. కైవల్యపద మోక్షసాధన ఎలా పొందాలో దీనిలో వివరించబడింది. ఇది యోగశాస్త్రము యొక్క ఆఖరి గమ్యము.
అష్టాంగపదయోగము
1. యమ
అహింస హింసను విడనాడటము.
సత్యము సత్యము మాత్రమే పలకటము.
అస్తేయ దొంగ బుద్ది లేకుండా ఉండటము
బ్రహ్మచర్యము స్త్రీ సాంగత్యానికి దూరముగా ఉండటము.
అపరిగ్రహ వేటినీ స్వీకరించకుండా ఉండటము.
2. నియమ
శౌచ శుభ్రము.
సంతోష ఆనందంగా ఉండటము.
తపస్య తపస్సు.
స్వధ్యాయన అంతర్దృష్ఠి.
ఈశ్వరప్రాణిదాన ఈశ్వర శరణాగతి.
3. ఆసన
4. ప్రాణాయామ
5. ప్రత్యాహార
6. ధారణ
7. ధ్యానము
8. సమాధి
ఇవి అష్టాంగపదయోగములోని భాగములు.

💥 సంప్రదాయంలో యోగా

ఈశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు పద్మాసనంలో ధ్యానయోగంలో ఉన్నట్లు పురాణాలలో వర్ణించబడి ఉంది. లక్ష్మీదేవి ఎప్పుడు పద్మాసినియే, మహా విష్ణువు నిద్రను యోగనిద్రగా వర్ణించబడినది. తాపసులు తమ తపసును పద్మాసనంలో అనేకంగా చేసినట్లు పురాణ వర్ణన. ఇంకా లెక్కకు మిక్కిలి ఉదాహరణలు హిందూ సంప్రదాయంలో చోటు చేసుకున్నాయి. బుద్ధ సంప్రదాయంలో, జైన సంప్రదాయంలోను, సన్యాస శిక్షణలోను యోగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సింధు నాగరికత కుడ్య చిత్రాల ఆధారంగా యోగా వారి నాగరికతలో భాగంగా విశ్వసిస్తున్నారు. 11 వ శతాబ్డము న ఘూరఖ్స్ నాద్ శిశ్యుడగు స్వామి స్వాత్వారామ ముని హఠ్ యొగము అను యొగ శాస్త్ర గ్రంధమును వ్రాసి యున్నారు. ఇందు ఆసనములను , ప్రాణాయామ పద్దతులను, బంధములను, ముద్ద్రలను మరియు క్రియలను సవిస్తారముగ వ్రాసి యున్నారు. అనేక వేల ఆసనములలొ 84 ఆసనములను ముఖ్యములుగ చెప్పబడెనవి. ముఖ్యముగ ధ్యానమునకు కావలసిన సుఖాసనము,సిద్దాసనము, అర్ధ పద్మాసనము , పద్మాసనములు ముఖ్యమని చెప్ప బడినది. ఇదె విధముగ పాతంజలి యొగ శాస్త్రమున - స్థిరసుఖ మాసనమ్- అని ఆసనము నకు నిర్వచనము కలదు. ప్రాణాయామ సాధనలొ - సూర్య భేదన , ఉజ్జాయి , శీతలి , సీత్కారి , భస్త్రిక , భ్రామరి ,ప్లావని ,మూర్చ - ఇతి అష్ట కుంభకాని ( 8 ప్రాణాయమములు) చెప్ప బడెను. జాలంధర భంధము , మూల భంధము , ఉడ్యాన భంధము - ఈ మూడు బంధములు ముఖ్యమని చెప్పబడెను. ముద్రలలో మహాముద్ర , మహాబంధ ,మహాభేధ - ముఖ్య మగు ముద్రలుగ చెప్ప బడెను. శరీరమునకు బహిర్ అంతర్ శుచి చాల అవసరముగ ఈ హథయొగమున ప్రథాన అంశముగ చెప్పబడినది.-ధవుతి , నేతి , వస్తి , నొలి , త్రటకం , తధా కఫాల భాతి ఏతాని షట్ కర్మాణి - అని వివరణగలదు.

No comments:

Post a Comment