Wednesday, 4 November 2015

Children and child ness

వరదలు వచ్చినప్పుడు చీమల్ని చేపలు తింటాయి. అదే వరదలు తగ్గు ముఖం పట్టినప్పుడు, ఆ చేపల్నే చీమలు తింటాయి. దేనికైనా కాలం కలసి రావాలి. అందరికీ అవకాశం కల్పిస్తాడు దేవుడు. అందుకోసం వెయిట్‌ చెయ్యాలన్నారు. అలాగే నాటకం చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం. అదే సినిమా చూడాల్సి వస్తే వెనుక వరుసలో కూర్చుంటాం. ముందు వెనుకలన్నవి సాపేక్షం. సబ్బును తయారు చెయ్యాలంటే ఆయిల్‌ కావాలి! అదే చేతికి అంటిన ఆయిల్‌ను పోగొట్టుకోవాలంటే...సబ్బు కావాలి. చిత్రంగా లేదు? జీవితమూ ఇంతే అన్నారు. సమస్య వచ్చి పడింది. జీవితం అయిపోయింది అనుకోకూడదు. దానిని ఓ మలుపుగా భావించాలి. ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆనందిస్తారట! ఒకరు పిచ్చివాళ్ళు. మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలైపోవాలన్నారు.

No comments:

Post a Comment