Thursday, 29 October 2015

నమ్మం కానీ, ఇవే సిసలైన నిజాలు

1. ప్రభుత్వ ఆఫీస్ లలోనే కాదు ప్రైవేటు ఆఫీస్ లలో కూడా ఉద్యోగస్తుడు ప్రశాంతంగా నిద్ర పోయిన రోజే మనకు నిజమయిన స్వాతంత్రం వచ్చినట్టు

2. వర్షాకాలం వర్షాలను .. ఎండాకాలం ఎండలను .. చలి కాలం లో చలి ని ఎలా ఆప లేమో ..... పోయే కాలం వచ్చినా అలానే ఆపలేము

3. ఎప్పుడు మగవాడు పగల బడి నవ్వుతాడో .... పక్కన ఆడి పెళ్ళాం లేదని అర్ధం

4. అడిగిన వెంటనే అప్పు దొరికిన రోజు.. ఇచ్చిన అప్పు తిరిగి అడగని వారు పెరిగిన రోజే.. దేశం అభివృద్ధి పధంలో నడిచినట్టు.

5. వ్యక్త పరచని ప్రేమ అనేది పేకాట లాంటిది లైఫ్ జోకరు పడింది అని సంతోషించే లోపే పక్కవాడికి డీల్ షో పడిపోతుంది

6. మనిషి ఆశ అనే పెనం మీద దోసలేస్తూ ఉంటాడు ఒక్క దోస మాడిందని ...పిండి పాడేసుకుంటాడ లేక పెనం పగల గోడతాడ ? రెండు చెయ్యడు పెనం బాగా తుడిఛి మళ్లీ వేస్తాడు. అపజయాలు మాడిన దోస లాంటివి.

7.  అతిగా ఆవేశ పడిన అమ్మాయి ... అల్లుళ్ళని ఆడి పోసుకున్న మామ బాగుపడ్డట్టు చరిత్రలో లేదు
....
8.  ప్రియురాలు పువ్వులాంటిది కొట్టినా పెద్ద దెబ్బ తగలదు ....... పెళ్ళాం పెంకు లాంటిది కొడితే బొక్క పడిపొద్దీ.
....
9.  ప్రేమ అనేది బీరకాయ తొక్కలాంటిది ... తెలిసిన వాడు దానితో పచ్చడి చేసుకుంటాడు తెలియని వాడు బయట పడేస్తాడు ... టోటల్ గా చెప్పొచ్చేది ఏందయ్యా అంటే ప్రేమలో పడితే పచ్చడి అయిపోయినట్టే
.....
10. పరుల సొమ్ము ఫినాయిల్ లాంటిది చూడటానికి తెల్లగా ఉన్నా..  తాగితే మాత్రం పైకి పోవడం గ్యారంటీ.
....
11. బుర్ర లేనోడితొ వాదించటం అంటే ....ప్రెష్ గా తడిసి వచ్చిన బురద పందితో బాక్సింగ్ లాంటిది తెగించి దిగితే గెలుస్తావ్, మనకెందుకొచ్చిన బురదలే అనుకుంటే ఓడిపొతావ్
.....
12. అబద్దానికి అయుషు తక్కువ ... బట్టలు తక్కువ వేసే హీరోయిన్ మీద పుకారులెక్కువ

13. పాలల్లో నీళ్ళు కలపక పొతే పాల వాడికి ఎంత నష్టమో ... దేశంలో వెదవలు లేక పొతే దేశానికి అంతే నష్టం
....
14. ఒక సిగరెట్ మరో రెండు సిగరెట్ లని వెలిగించక పోతే అది ఎంత ఖరీదైన సిగరెట్టూ అయిన గొప్ప సిగరెట్ అవ్వలేదు .... ఒక యెదవ మరో ఇద్దరు యెదవలని తయారు చేయక పొతే వాడు ఎంత పెద్ద యెదవ అయినా .. గొప్ప యెదవ కాలేడు ...
.....
15. కాలం గేలం వేస్తే సముద్రం లోని ఫిష్ కూడా స్టార్ హోటల్ లో డిష్ అవుతుంది

16. ఏడుపులు పలు రకాలు ....
మనం బాగు పడటం లేదు అని ఏడ్చేవాళ్ళు
ఎప్పుడు బాగుపడతాం అని ఏడ్చేవాళ్ళు
పక్కనొడు బాగు పడితే ఏడ్చే వాళ్ళు
పక్కనొడు ఎక్కడ బాగుపడతాడో అని ఏడ్చేవాళ్ళు

మొదటి ఇద్దరిది ఆశ మిగతా ఇద్దరిది అత్యాశ ... మనిషికి ఆశ ఉండాలి గాని అత్యాశ ఉండకూడదు ....
......

17. భరించేవాడిని భర్త మరియు పీడించే దాన్ని పెళ్ళాం అంటారు

No comments:

Post a Comment