25 ఏండ్లు కని పెంచిన తల్లిదండ్రులకు నెలకు ఒకసారైన ఫోన్లు చేసి అమ్మ నాన్న ఎలా ఉన్నారు ఆరోగ్యం ఎలా ఉంది టైంకు తింటున్నారా అని కూడా అడగరు....
అదే భార్య అమ్మగారింటికి వెలితే మాత్రం రోజుకి రెండుసార్లు అయిన ఫోన్లు చేస్తారు ఎలా ఉన్నావ్ ఏమ్ తిన్నావ్ అని ,పిల్లలు ఎలా ఉన్నారు అని అడుగుతారు,
అదే ప్రేమలో పడిన అబ్బాయి అయితే 5 నిమిఫాలకు ఒక మెసేజ్ ఏమ్ తిన్నావ్ రా బంగారం అని,
అమ్మ వారం రోజులుగా దగ్గుతున్న పట్టించుకోరు,
అదే అమ్మాయి చిన్న జలుబు అని చెబితే చాలు
ఎంతనైట్ అయిన పరవాలేదు డబ్బులేకపొయిన పరవాలేదు అప్పుచేసిమరి టాబ్లెట్స్ తీసుకెల్తారు
నిన్నలేక మెన్న పరిచయమైన అమ్మాయి కోసం భార్యలకోసం తనకలాడె వారు ....
నవమాసాలు మోసికనిపెంచిన తల్లిగుర్తుకురాదా..
రేయిపగలు కష్టపడి ఎంతోబాధ్యతగా పెంచిన తండ్రి గుర్తుకురాడా , ఆడవారుకూడా ఆలోచించండి భర్తకావాలి వారి సంపాదన కావాలి వారికి ప్రాణం పోసిన ఇంత స్తాయికి తీసుకొచ్చిన అత్త మామలు ఒద్దా...
చాలా మంది మగవారు అమ్మను నాన్నను చూస్తె భార్య కోప్పడుతుందని అమ్మ నాన్నలను చూసుకోనివారుకూడా ఉన్నారు మీ ప్రాణాలు అమ్మ నాన్న పెట్టిన బిక్షే అని ఆలోచించండి...
ధయచేసి ఆలోచించండి ఫ్రెండ్స్ అమ్మ నాన్నలను బాగా చూసుకోండి ఫోన్లు చేయండి ,మిమ్మల్ని ఆస్తులిమ్మని వారు అడగడం లేదు మీనుంచి వచ్చె ఫోన్ కాల్ మీనుంచి వచ్చె తీయనైన మాటలు అమ్మ నాన్న అని ప్రేమగా వచ్చె మాటలె వారికి కోట్లు ఆస్తి దయచేసి ఆలోచించండి.
No comments:
Post a Comment