Saturday, 31 October 2015

‘ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతమ్

1. మానవుడు ఏదైనా పని ప్రారంభిస్తాడు. తనకు సంబంధించినది కానివ్వండి, కుటుంబానికి సంబంధించినది కానివ్వండి, సమాజానికి సంబంధించినది కానివ్వండి! ప్రారంభించేటపుడు ఏ సమస్యలు ఉండవు. కాని ప్రారంభించిన కొన్ని రోజులకే నూటొక్క సమస్యలు ప్రారంభమవుతాయి. కువిర్శలు ప్రారంభమౌతాయి. ఎన్నెన్నో అడ్డంకులు కలిగి నిరాశ కల్గుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మబలంతో అకుంటిత దీక్షతో ‘ధృతి’ చెడకుండా ముందుకి సాగిపోవాలి. ‘ఇది ధర్మం’.

2. మనిషి ఏ విషయంలోనైనా, ఏ పనిలోనైనా ఓర్పు కలిగి వుండాలి. క్షమాగుణంతో ఉండాలి. ప్రతిదానినీ ప్రతివారినీ, ప్రతి విషయాన్నీ, క్షమాశక్తితో ఎదుర్కోనాలి. కోపగించుకోకూడదు. ఓర్పుగుణం వున్నవారిని ఏ శక్తులూ ఏమీ చేయలేవు. ‘ఇది ధర్మం’.

3. మనం ఒక పని చేసేటపుడు మన మనస్సు సంపూర్ణంగా ఆ విషయంలోనే లగ్నం కావాలి. ఒక పనిచేస్తూ మరొక దానిని గురించి ఆలోచించకూడదు. ఏ విషయంలోనైనా ముఖ్యం. చదువుతున్నా, వింటున్నా, పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, మనస్సును పరిపరిమార్గాలకు పోనివ్వకుండా వుండాలి ‘ఇది ధర్మం’.

4. తనకు తెలియని విషయాలను తాను తెలిసికొనక, పెద్దలు, పూర్వులు, చెప్పినదానిని అంగీకరించక, స్వతంత్ర నిర్ణయం తీసికోనలేక, నిస్తేజంగా నిర్వికారంగా, నిరాశగా, నిర్లిప్తతగా, నియమరాహితుడుగా, ఉండకూడదు. ‘ఇది ధర్మం’.

5. మనిషి ఎల్లపుడూ మనస్సునూ, శరీరాన్నీ, మాటనూ ఆలోచననూ, సంసారన్నీ, ఇంటినీ, పరిసరాన్నీ, ధరించే వస్త్రాలనూ పరిశుభ్రంగా శుచిగా వుంచుకోవాలి. మనసు పరిశుభ్రంగా వుండాలి. మాత్రమే పరిశుభ్రంగా ఉండాలి. మనిషి పరిశుభ్రంగా ఉండాలి. ‘ఇది ధర్మం’.

6. చదువువున్నా, సంపదలున్నా, కీర్తివున్నా, బలంవున్నా ఇంద్రియ నిగ్రహం లేనివానికి ఏదో ఒకరోజు పతనం తప్పదు. కాబట్టి మనస్సును దాని ఇష్టానికి దాని వదలివేయకుండా మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. ‘మనస్సును గెలిచినవాడు దేవేంద్రుడైనా గెలుస్తాడు’ మనస్సును తమ చెప్పుచేతల్లో ఎవరుంచుకొంటారో వారిని భూతప్రేతాలుగాని, దెయ్యాలు గాని, యక్షకిన్నర కిమ్పురుశులుగాని, గ్రహాలు గాని, రోగాలు గాని, కష్టసుఖాలుగానీ, మరణంగానీ, వశంలో వుంటాయి. కాబట్టి మనస్సును, మాటను, దృష్టిని, శరీరాన్నీ, చేతలనూ అదుపుచేయాలి ‘ఇది ధర్మం’.

7. ప్రతి విషయానికీ సంకోచపడటం, సిగ్గుపడటం, అనుమానపడటం, తనను తాను తక్కువగా భావించటం కూడదు ‘ఇది ధర్మం’.

8. మనిషి సత్యవ్రతం కలిగిఉండాలి. అకారణంగా, అనవసరంగా, ఒకరి మెప్పుకోసం, ఒకరిని మెప్పించటంకోసం, తన పనిని సాధించుకోవటం కోసం, తాను ఏ విధంగానైనా ప్రయోజనం పొందటంకోసం. తనవారిని తృప్తిపెట్టట్టంకోసం అబద్దాలు చెప్పకూడదు. అబద్ధం కలిగిస్తుంది. అబద్ధం అల్పసుఖాన్ని మాత్రమే కల్గిస్తుంది. అబద్ధం మరోకనాటికి అవమానం పాలు చేస్తుంది. అబద్ధం మనిషి విలువను మట్టిచేస్తుంది. మన శక్తినీ, మనకీర్తినీ, మన గోప్పదనాన్నీ పాతాళానికి త్రోక్కివేస్తుంది. కాబట్టి సాధ్యమైనంతవరకూ సత్యధర్మాన్ని వదలకూడదు. ‘ఇది ధర్మం’.

9. మానవునికి ఆహరం ఎంత ముఖ్యమో, వివేకం కూడ అంతే ముఖ్యం. వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి. శాస్త్రాలు, పురాణాలు ఇతిహాసాలు విన్నంత మాత్రాననే వివేకం సిద్ధించదు. విన్న విషయాలను స్వానుభవానికి మళ్ళించుకోవాలంటే మనిషికి విద్య కావాలి. ‘విద్యావిహీనః పశుః’ అని ఆర్యవాణి. మనిషిగా పుట్టి మట్టిబొమ్మగా జీవిత గడపకూడదు. ఎంతటి పెడతానం పెనవేసుకొనివున్నా, స్థితిగతులు ఎంతటి బాధాకరమై వున్నా,భిక్షమెత్తి అయినా చదువుకోవాలి అని ఋషివాక్యం. విద్య ప్రతి వ్యక్తికీ నిర్బంధంగా ఉండాలి. ‘ఇది ధర్మం’.

10. పగ, హింస, కోపం, ప్రతీకార మనస్తత్వం ఇవన్నీ మనిషిని  పతనావస్థకు నేడతాయి. పగ, ప్రతీకారాలు మనిషిని అశాంతికి గురిచేసి అనారోగ్యాన్ని కల్గిస్తాయి. తన అభివృద్ధికి తానే ఆటంకంగా నిలవాల్సివస్తుంది. తనను కన్నవారికీ, తాను జన్మనిచ్చిన వారికీ, తనను నమ్మి బ్రతికేవారికీ అన్యాయం కల్గుతుంది

Fruits and Health

ఇవి మీకు తెలుసా ?��

��అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

��కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.

��నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

��గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.

��అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.

��జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.

��బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.

��సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.

��మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.

��దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.

��ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.

��అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.

��కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.

��మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.

��ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.

��బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.

��క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

��మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.

��ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.

��అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.
��పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.

��సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.

��దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.

��ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.

����చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

��కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.

��క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.

��యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.

��వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.

��పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.

☕ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.

��ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.

��ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.

��జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

��ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.

��నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.

��మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.

��మునగ కాయలు ఆకలిని పెంచుతాయి

Friday, 30 October 2015

Sardar vallabh bhai patel

బ్రిటిష్ వారు దేశానికి స్వాతంత్ర్యం ఇస్తూ పాకిస్తాన్ చిచ్చు పెట్టారు.. అంతే కాదు 552 సంస్థానాలకు భారత్ లేదా పాకిస్తాన్లో చేరే స్వేచ్ఛ ఇచ్చారు.. భారత దేశం అఖండంగా ఉండొద్దని, కుక్కలు చింపిన విస్తరిలా ఉండాలని వారు కుట్ర పన్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో స్వతంత్ర భారత ప్రథమ హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు సర్ధార్ వల్లభాయ్ పటేల్..
పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ భవిష్యత్తుకు ఏర్పడే ముప్పును అంఛనా వేశారు పటేల్.. వెంటనే సంస్థానాలన్నింటినీ భారత దేశంలో విలీనం అయ్యేందుకు ఒప్పించారు.. తాము భారత దేశంలో చేరకుండా స్వతంత్రంగా ఉంటామని చెబుతూనే పాకిస్తాన్ వత్తాసుతో కుట్రలు పన్నుకున్న హైదరాబాద్, జునాగఢ్ సంస్థానాలపై దండోపాయం ప్రయోగించి దారికి తెచ్చారు పటేల్.. అయితే జమ్మూ కాశ్మీర్ విషయంలో ప్రధాని నెహ్రూ స్వయంగా జోక్యం చేసుకోవడంతో ఆ సమస్య ఇప్పటికీ రావణ కాష్టంలా రగులుతూనే ఉంది..
సర్ధార్ వల్లభాయ్ పటేల్ ముందు చూపు, దృఢ వైఖరి వల్లే భారత దేశాన్ని మనం ఈ రోజున నిండుగా చూడగలుగుతున్నాం.. అందుకే పటేల్ ఉక్కు మనిషిగా దేశ ప్రజల మన్ననలు అందుకుంటూ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచారు..
నిజానికి స్వతంత్ర్య భారత దేశానికి సర్ధార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం వహించాలని దేశ ప్రజలు కోరుకున్నారు.. కాంగ్రెస్ పార్టీలో నాయకులు, కార్యకర్తలంతా పటేల్ ప్రధాని కావాలని భావించారు.. కానీ గాంధీజీ నెహ్రూ వైపు మొగ్గు చూపారు.. పటేల్ కేవలం 40 నెలలు హోంమంత్రిగా ఉన్నా అద్భుతాలు చూపించారు.. ఆయనే కనక ప్రధాని అయ్యుంటే చరిత్ర గతి మరోలా ఉండేది.. కాశ్మీర్ సమస్యకు అప్పుడే శాశ్వత పరిష్కారం దొరికి ఉండేది.. పాకిస్తాన్తో సుధీర్ఘ శతృత్వం కొనసాగేది కాదు.. పాకిస్తాన్, చైనా యుద్ధాలు వచ్చి ఉండేవే కాదు.. భారత్ ఏనాడో శక్తి వంతమైన దేశంగా రూపొంది ఉండేదని భావించడంలో అనుమానమే లేదు..
నేడు (అక్టోబర్ 31) సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతి ఐక్యతా దినోత్సవం పాటిస్తున్నాం.. దేశ సమగ్రత, ఐక్యత, భద్రత కోసం చిత్తశుద్దితో పని చేస్తూ, పటేల్ ఆశయాల సాధన కోసం మనం ప్రతినబూనాల్సిన తరుణమిది..

SARDHAR PATEL                                  వల్ల భాయ్ పటేల్ గారు  జవేరిభాయ్, లాడ్ బాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించాడు.ఇతను ప్రముఖ స్వాతంత్ర యోధుడిగానే కాకుండా స్వాతంత్రానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సపలుడైన ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోధ్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించాడు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు. భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించాడు. రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించాడు. స్వాతంత్రానంతరం జవహార్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్రమంత్రిమండలిలో హోంశాఖ మంత్రి గానూ, ఉప ప్రధానమంత్రి గానూ బాధ్యతలను నిర్వహించాడు. దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడు. నెహ్రూ మంత్రిమండలిలో ఉన్ననూ అనేక విషయాలలో నెహ్రూతో విభేధించాడు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడైనాడు. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్ననూ అనేక దేశ సమస్యలను తనదైన పద్దతితో పరిష్కరించి 1950 డిసెంబరు 15న మరణించాడు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదాన్ని ఇచ్చి గౌరవించింది.

బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబం
1875 అక్టోబర్ 31న గుజరాత్‌లోని నాడియాడ్ లో జవేరీ భాయి, లాడ్‌లా పటేల్‌లకు నాల్గవ సంతానంగా వల్లభభాయి పటేల్ జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం స్థానికంగా జరిగిననూ ఉన్నత న్యాయశాస్త్ర చదువులకై ఇంగ్లాండు వెళ్ళి బారిష్టర్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగివచ్చి అహ్మదాబాదులో న్యాయవాద వృత్తిని చేపట్టాడు.

తన భార్య అయిన ఝవెర్బాను పుట్టింటి నుండి తీసుకొచ్చి గోద్రాలో కాపురం పెట్టాడు. 1904లో ఆయనకు ఒక కుమార్తె - మణిబెన్, 1906లో దహ్యాభాయ్ అను కుమారుడు జన్మించారు. 1909లో ఆయన భార్య కాన్సర్ వ్యాధితో మరణించింది. వల్లభాయ్ కోర్టులో ఒక కేసు గురించి వాదిస్తున్నపుడు ఆమె మరణించిన వార్తను అందించినపుడు ఆ పేపరును చూసి తన జేబులో పెట్టుకొని, తిరిగి కేసు వాదించి గెలిచాడు. ఆ తర్వాతే ఆ వార్తను ఇతరులకు తెలియచేసాడు. ఆమె మరణానంతరం తిరిగి వివాహం చేసుకోరాదని నిశ్చయించుకున్నాడు. తన కుటుంబసభ్యుల సహకారంతో పిల్లలను పెద్దవాళ్ళను చేసాడు.

36 ఏళ్ళ వయసులో ఇంగ్లాండుకు వెళ్ళి అక్కడ లండన్‌లో ఒక లా కాలేజీలో చేరాడు. 36 నెలల కోర్సును 30 నెలలో పూర్తిచేసాడు, అదీ క్లాసులో ప్రథమ స్థానంలో. తర్వాత అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చి అనతికాలంలోనే గొప్ప లాయరుగా విశేష కీర్తిని ధనాన్ని ఆర్జించాడు. ఆయన ఎప్పుడూ తెల్ల దొరలా సూటు బూటు వేసుకొని దర్జాగా తిరిగేవాడు.

జాతీయ నేతగా
బారిష్టరు పట్టా పుచ్చుకొని ఇంగ్లాండు నుంచి తిరిగి వచ్చిన వల్లబ్ భాయి పటేల్ దేశంలో జర్గుతున్న భారత జాతీయోద్యమం ప్రభావానికి లోనైనాడు. తన వృత్తిని నిర్వహిస్తూనే గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1928 లో బార్డోలీ లో బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టి విజయవంతంగా నడిపించి, దేశ ప్రజల దృష్టిని   ఆకర్షించాడు. అప్పుడే అతనికి సర్దార్ అనే పేరు వచ్చింది.

గాంధీ మొదలుపెట్టిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని దాదాపు 300,000 మంది సభ్యులతో కలసి దాదాపు 15 లక్షల రూపాయల విరాళాలు సేకరించారు. విదేశీ వస్తు దహనంలో భాగంగా తనవద్దనున్న తెల్లదొరలు వేసుకొనే బట్టలను అగ్నికి ఆహుతి చేసారు. తన కుమార్తె మణి, కొడుకు దాహ్యాతో కలసి జీవితాంతం ఖాదీ బట్టలు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గుజరాత్‌లో మద్యపానం, అస్పృశ్యత, కులవిచక్షణలకు వ్యతిరేకంగా పని చేసారు.

1931 కరాచి భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. ఉప్పు సత్యాగ్రహం, 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం మొదలగు ఉద్యమాలలో కూడ ప్రముఖ పాత్ర వహించాడు.

వల్లభాయి పటేల్ జాతీయ స్మారకమందిరంలో ప్రధాన హాలు.
రాజ్యాంగ సభ సభ్యుడిగా
భారత రాజ్యాంగ రచనకై ఏర్పడిన భారత రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడిగా వల్లబ్ భాయి పటేల్ మంచి సహకారాన్ని అందించాడు. అంబేద్కర్ ను డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించుటలో ముఖ్య పాత్ర పోషించాడు. భారత రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్ గా పనిచేశాడు. భారత పార్లమెంటు లో రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్ లకు నామినేట్ చేయు అధికారానికి కూడ అతనే ప్రతిపాదించాడు.

కేంద్ర మంత్రిగా
దేశ స్వాతంత్రం కోసం విశేషకృషి సల్పిన వల్లబ్ భాయి పటేల్ కు సహజంగానే స్వాతంత్ర్యానంతరం ముఖ్యమైన పదవులు లభించాయి. జవహర్ లాల్ నెహ్రూ మంత్రిమండలిలో హోంమంత్రిగాను మరియు ఉప ప్రధాన మంత్రిగాను 1947 నుంచి 1950 డిసెంబరు 15న మరణించేవరకు పదవులు నిర్వహించారు.

నెహ్రూతో విబేధాలు
భారత జాతీయోద్యమం సమయంలోనే వల్లబ్ భాయి పటేల్ నెహ్రూతో విబేధించాడు. ముఖ్యంగా 1936 భారతీయ జాతీయ కాంగ్రెస్ సదస్సులో నెహ్రూ ప్రవచించిన సోషలిజంను వల్లబ్ భాయి పటేల్ వ్యతిరేకించాడు. స్వాతంత్ర్యానంతరం కూడ స్వదేశీ సంస్థానాల విలీనంలో నెహ్రూ శాంతి కాముకను కాదని బలవంతంగా బలప్రయోగం, సైనిక చర్యలు చేపట్టి విజయం సాధించాడు. కాశ్మీర్ అంశాన్ని ఐక్య రాజ్య సమితికి నివేదించడంలో నెహ్రూతో విబేధించాడు. పాకిస్తాన్ కు చెల్లించవలసిన రూ.55 కోట్లు ఇవ్వరాదని కూడ వల్లబ్ భాయి పటేల్ నెహ్రూతో వాదించాడు. తొలి రాష్ట్రపతి ఎన్నికలలో కూడ చక్రవర్తి రాజగోపాలచారి వైపు నెహ్రూ మొగ్గు చూపగా, వల్లబ్ భాయి పటేల్ రాజేంద్ర ప్రసాద్ ను ప్రతిపాదించి సఫలీకృతుడైనాడు. అలాగే 1950 కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ అభ్యర్థి కృపలానీని కాదని పురుషోత్తమ దాస్ టాండన్ ను గెలిపించాడు.

మరణం
1950 డిసెంబరు 15 న వల్లబ్ భాయి పటేల్ కన్నుమూశాడు. ముంబాయి లో పెద్ద ఎత్తున ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వేలాదిగా ప్రజలు, స్వాతంత్ర్య సమర యోధులు, దేశ విదేశీ రాజకీయ నాయకులు, నివాళులర్పించారు. అతను ప్రస్తుతం మన మధ్య లేకున్ననూ అతని ఘనకార్యాలు, చేపట్టిన చర్యలు ఏ నాటికీ మరవలేము.

ఎన్నో విమర్శలకు ఎదుర్కొని తన పంతాన్ని నెగ్గించుకున్నాడు. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కొని, భారతదేశాన్ని, దాని పటాన్ని ఒకింత పరిపూర్ణం చేయడంలో తన వంతు సహకారం అందించి సకారాత్మక దృష్టితోనే పనిచేశాడనే విశ్వాసం దేశప్రజలలో కలిగేలా గట్టి కృషి సల్పాడు.

బిరుదులు
1991లో భారత ప్రభుత్వం వల్లబ్ భాయి పటేల్ సేవలను గుర్తించి భారత రత్న బిరుదును మరణానంతరం ప్రకటించించింది.

Amma nanna

25 ఏండ్లు కని పెంచిన తల్లిదండ్రులకు నెలకు ఒకసారైన ఫోన్లు చేసి అమ్మ నాన్న ఎలా ఉన్నారు ఆరోగ్యం ఎలా ఉంది టైంకు తింటున్నారా అని కూడా అడగరు....
అదే భార్య అమ్మగారింటికి వెలితే మాత్రం రోజుకి రెండుసార్లు అయిన ఫోన్లు చేస్తారు ఎలా ఉన్నావ్ ఏమ్ తిన్నావ్ అని ,పిల్లలు ఎలా ఉన్నారు అని అడుగుతారు,
అదే ప్రేమలో పడిన అబ్బాయి అయితే 5 నిమిఫాలకు ఒక మెసేజ్ ఏమ్ తిన్నావ్ రా బంగారం అని,
అమ్మ వారం రోజులుగా దగ్గుతున్న పట్టించుకోరు,
అదే అమ్మాయి చిన్న జలుబు అని చెబితే చాలు
ఎంతనైట్ అయిన పరవాలేదు డబ్బులేకపొయిన పరవాలేదు అప్పుచేసిమరి టాబ్లెట్స్ తీసుకెల్తారు
నిన్నలేక మెన్న పరిచయమైన అమ్మాయి కోసం భార్యలకోసం తనకలాడె వారు ....
నవమాసాలు మోసికనిపెంచిన తల్లిగుర్తుకురాదా..
రేయిపగలు కష్టపడి ఎంతోబాధ్యతగా పెంచిన తండ్రి గుర్తుకురాడా , ఆడవారుకూడా ఆలోచించండి భర్తకావాలి వారి సంపాదన కావాలి వారికి ప్రాణం పోసిన ఇంత స్తాయికి తీసుకొచ్చిన అత్త మామలు ఒద్దా...
చాలా మంది మగవారు అమ్మను నాన్నను చూస్తె భార్య కోప్పడుతుందని అమ్మ నాన్నలను చూసుకోనివారుకూడా ఉన్నారు మీ ప్రాణాలు అమ్మ నాన్న పెట్టిన బిక్షే అని ఆలోచించండి...

ధయచేసి ఆలోచించండి ఫ్రెండ్స్ అమ్మ నాన్నలను బాగా చూసుకోండి ఫోన్లు చేయండి ,మిమ్మల్ని ఆస్తులిమ్మని వారు అడగడం లేదు మీనుంచి వచ్చె ఫోన్ కాల్ మీనుంచి వచ్చె తీయనైన మాటలు అమ్మ నాన్న అని ప్రేమగా వచ్చె మాటలె వారికి కోట్లు ఆస్తి దయచేసి ఆలోచించండి.

Thursday, 29 October 2015

Interview by a reporter

ఒక పత్రికా విలేఖరి ఒక రైతును ఇంటర్ వ్యూ చేస్తున్నాడు.
విలేఖరి: ' మీరు మీ మేకకు ఏం పెడతారు?'
రైతు: ' నల్లమేకకా, తెల్లమేకకా?'
వి: ' నల్లమేకకు.'
రై: ' గడ్డి.'
వి: ' మరి తెల్లమేకకు?'
రై: ' గడ్డి.'
వి: ' మీరు మీ మేకలను ఎక్కడ కట్టేస్తారు?'
రై: నల్లమేకనా, తెల్లమేకనా?'
వి: నల్లమేకను.
రై: బయటి వసారాలో.
వి: మరి తెల్లమేకను?
రై: దాన్ని కూడా బయటి వసారాలో.
వి: వీటికి స్నానం ఎలా చేయిస్తారు?
రై: నల్లమేకకా, తెల్లమేకకా?
వి: నల్లమేకకు.
రై: నీటితో.
వి: మరి తెల్లమేకకు?
రై: దానికి కూడా నీటితో.
వి: నీకసలు బుధ్ధి వుందా? రెండిటికీ ఒకేలా చేస్తున్నప్పుడు అస్తమానూ నల్లమేకకా, తెల్లమేకకా అని ఎందుకడుగుతున్నావు?
రై: ఎందుకంటే నల్లమేక నాది.
వి: మరి తెల్లమేక?
రై: అదికూడా నాదే.
విలేఖరి తల గోడకేసి కొట్టుకున్నాడు.
రైతు నవ్వుతూ అన్నాడు, ' ఇప్పుడర్థమైందా,
మీరు టి.వి.లో ఒకే వార్త తిప్పి తిప్పి గంటలు గంటలు చూపిస్తూంటే
మా ప్రేక్షకులకి ఎలా వుంటుందో?

Only for men

ఈరోజు గొప్ప సూక్తి
*****************
(కేవలం మగవారికి మాత్రమే )
"రాత్రి తొందరగా ఇంటికెళితే,
భోజనం వేడిగా ఉంటుంది,
భార్య చల్లగా (ప్రశాంతం గా) ఉంటుంది...
కాకుండా
రాత్రి లేటుగ వెళితే
భోజనం చల్లగా ఉంటుంది,
భార్య వేడిగా ఉంటుంది...
*********************

Think about this


వంకలు పెట్టె మనం -- విజయం సాధించినవారు వారు
వారి నుండి స్ఫూర్తి పొందుదాం
.
1.నాకు ఉచిత విద్య లభించడం లేదండీ --
................................. హెన్రీ ఫోర్డ్ కి కూడా లభించ లేదు

2. జీవితం లో చాలా సార్లు ఓడిపోయానండి -
.........................- అబ్రహం లింకన్ చాలా అపజయాలను చూశాడు

3. నేను చాలా పేద కుటుంబానికి చెందిన వాడిని ---
........................- అబ్దుల్ కలాం కూడా బీద కుటుంబం నుండే వచ్చాడు

4. నేను చిన్నప్పటినుండి అనారోగ్య వంతుడిని --
........................... నటి మర్లీ మాట్లిన్ చిన్నప్పటి నుండి అవకరం తోనే ఉంద
ి
5. జీవితం అంతా సైకిల్ మీదే గడిచిపోతోంది --
......................... నిర్మా సబ్బు కర్సన్ భాయి పటేల్ సైకిల్ మీద తిరిగి అమ్మాడు .

6. ఒక ప్రమాదం జరిగి నాధైర్యాన్ని కోల్పోయాను ---
........................ నాట్య మయూరి సుధా చంద్రన్ కృత్రిమ కాలు తో డాన్సు చేస్తుంది

7. చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు . నన్ను చూసే వారే లేరు .
....................... ఎ ఆర్ రెహమాన్ తండ్రి కూడా చిన్నప్పుడే పోయారు

8. కుటుంబ భారం అంతా నా మీదే ఉంది . అందుకే ఎదగ లేక పోయాను .
............. లతా మంగేష్కర్ కూడా చిన్నప్పుడే కుటుంబ భారం మోసింది

9. నేను చాలా పోట్టివాడిని
....................... సచిన్ టెండూల్కర్ కూడా పోట్టివాడే

10. నేను మంద బుద్ది వాడిని
................ థామస్ ఆల్వా ఎడిసన్ కూడా చిన్నప్పుడు మంద బుద్దివాడే

11. నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను . దానితో ఏమి చెయ్యగలను ?
.................. ధీరూ భాయి అంబానీ కూడా చిన్న ఉద్యోగం తోనే మొదలు పెట్టాడు

12. నా కంపెనీ దివాలా తీసింది . నన్నెవరు నమ్ముతారు ?
.................... పెప్సీ కోలా కూడా రెండు సార్లు దివాలా తీసింి

13. నేను ఒకసారి నెర్వస్ బ్రేక్ డౌన్ కి గురి అయ్యాను .ఇప్పుదు ఏమి చెయ్యగలను ?
............... వాల్ట్ డిస్నీ మూడు సార్లు నెర్వస్ బ్రేక్ డౌన్ కి గురి అయ్యారు

14. నా వయసు ఐపోయింది . ఇప్పుడు ఏమి చెయ్యగలను
............... కెంటకీ ఫ్రైడ్ చికెన్ హర్లాండ్ శాండ ర్స్ 60 వ ఏట కె ఎఫ్ సి మొదలు పెట్టాడు
మనం ఉన్న చోటునుండి ఉన్నతి కి వెళ్ళాలి అనే కోరిక ప్రబలంగా ఉంటె మనం వెళ్ళగలం
పూర్తిగా చదివిన వారికి ధన్యవాదాలు .

ఈలాంటి మాటలకూ  గతి తప్పుతున్న మన బ్రతుకులను మళ్ళి గాడి లొ పెట్టె శక్తి ఉంది.
కనుక అందరికి పంచండి .....ఒక్కరు స్పూర్తి ని పొందిన ఈ రోజు కు మనం ఒక మంచి పని చేసినట్లే !