Wednesday, 27 April 2016

చరిత్రను మార్చిన ధన్యులు

ఈనాడు ఈ ప్రపంచం ..
ఇలా ఉంది..

"ఎవరైనా పుట్టేటప్పుడు సామాన్యులుగానే పుడతారు."
 కానీ ఎదిగే కొద్దీ..
జీవితం ఒక్కొక్క మలుపూ తిరిగే కొద్దీ..
కొంతమంది సామాన్యులు అసామాన్యు లవుతారు...
 మహోన్నత శిఖరాలను అధిరోహిస్తారు.
కానీ చాలామంది సామాన్యులుగానే మిగిలి పోతుంటారు....

 సాదాసీదాగా బతికేస్తుంటారు. ఎందుకని????
ప్రతి మనిషీ...
తన జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించేది
"జననం "అన్న
సిగల్‌ పాయింట్‌ దగ్గరే!
 చేరుకునే గమ్యమూ,
"మరణం "అనే డెడ్‌ఎండ్‌ వరకే! ఇందులో తేడా ఏమీ లేదు.
 ఉన్న వ్యత్యాసమల్లా ప్రయాణం లోనే! 🚶🏼🚶🏼🚶🏼🚶🏼
మజిలీలు దాటి వెళ్లడంలోనే....! ఎంచుకునే మార్గంలోనే...! 'అవరోధాలు' అధిగమించడంలోనే! సవాళ్లను ఎదిరించ డంలోనే...!
నా వల్ల ఏమవుతుంది?,
మేం చాలా పేదరికంలో మగ్గిపోతున్నాం,
 నాకు పెద్దగా చదువు లేదు,
 మేం పుట్టెడు కష్టాలతో ఉన్న సామాన్యులం.
మేమేం సాధించగలం?
అనుకుంటే నిజంగానే ఏమీ సాధించలేం. 😒😒😒
అసలు ఈ కష్టాలకు కారణాలేమిటో అన్వేషించాలి.... వాటికి పరిష్కారం ఆలోచించాలి...

 అవకాశాలు వాటంతటవే రావు. వాటిని సృష్టించుకోవాలి.
ఈ విశాల ప్రపంచంలో కష్టాలు మనకే ఉన్నాయా?
ఆ మాటకొస్తే సగానికి పైగా ప్రపంచం నేడు కష్టాల్లోనే ఉంది... ప్రపంచంలోని మహామహులంతా ఈ కష్టాల సుడిగుండంలో చిక్కినవారే...🤔🤔🤔

కమ్యూనిస్టుల... ప్రవక్త...
" కారల్‌మార్క్స్‌  "జీవితం పేదరికానికి ప్రతీక.
"తన కూతురు చనిపోతే దహన సంస్కారాలకు డబ్బుల్లేక ఒక రోజంతా ఆ శవాన్ని ప్రక్క గదిలో ఉంచాడు."...
 పస్తులున్నాడు. ఒక పూటైనా కాల్చుకోవడానికి రొట్టె లేనపుడు కూడా ముప్పూటలా నా పేగులు నన్ను కాల్చుకుతిన్నాయని చెప్పాడు.
అయితేనేం .....
ప్రపంచానికి ....
మానవాళి విముక్తి
సిద్ధాంతాన్ని అందించిన మహోన్నతుడిగా చరిత్రలో నిలిచాడు. .....

"నెల్సన్‌ మండేలా"....
సుమారు 27 ఏళ్ళ పాటు కాళ్లు కూడా పూర్తిగా చాచి పడుకోలేని చిన్న గదిలో జైలు జీవితాన్ని గడిపాడు.
అతనికి తోటి మానవుల సాంగత్యం కూడా లేదు.
పగటికి, రాత్రికి తేడా తెలిపే సూర్యరశ్మి.... కూడా ఆ గదిలోకి రాదు.
అలాంటి కఠినమైన జైలు జీవితం కూడా .....
ఆయన స్వాతంత్య్ర కాంక్షను అణచివేయలేకపోయింది.
ఆ చీకటి చెర నుండే ఆయన "దక్షిణాఫ్రికా" ..
స్వాతంత్య్రానికి ఊపిరులూదాడు.
 నల్లని సూరీడయ్యాడు.....🤔🤔

గ్రీకు తత్వవేత్త
" సోక్రటీస్‌ "...
గర్భ దారిద్య్రాన్ని అనుభవించాడు.
తన తాత్విక సిద్ధాంతాలతో ఎంత కీర్తి సంపాదించాడో....
 అంతకు మించి తన నమ్మకాల కోసం మృత్యువునే స్వీకరించి నిలబడిన మహనీయుడుగా ప్రపంచానికి స్ఫూర్తినిచ్చాడు.....

 "థామస్‌ అల్వా ఎడిసన్‌"... పుట్టినపుడు తల చాలా లావుగా, శరీరం చాలా పీలగా ఉంది.
ఆయన బతికి బట్టకడతాడని కూడా ఎవరూ అనుకోలేదు.... ఆయనకు చెవుడు కూడా.....
12 ఏళ్ళ వయస్సులో ...
రైల్లో వార్తా పత్రికలు అమ్మేవాడు. అలాంటి వాడు
"ఎలక్ట్రికల్‌ బల్బు,"
 "ఫోనోగ్రాఫ్‌ "
కనుగొన్న గొప్ప శాస్త్రవేత్తగా.... లోకానికి వెలుగై ధ్వనిస్తున్నాడు...

 కెంటుకీలోని ఓ చిన్న చెక్కగదిలో నివసించే నిరుపేద చెప్పులు కుట్టే కుటుంబంలో జన్మించాడు "అబ్రహాం లింకన్ "...
అమెరికాకు అధ్యక్షుడయ్యాడు....
 అంతర్యుద్ధంలో పోరాడి నల్లవాళ్లకు స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుడిగా నిలిచాడు...

ఇలా చెప్పుకుంటూ పోతే... "గెలీలియో, ఐన్‌స్టీన్‌, చార్లెస్‌ డార్విన్‌, న్యూటన్‌, కోపర్నికస్‌, చార్లీ చాప్లిన్‌, మార్టిన్‌ లూథర్‌కింగ్‌, మావో "...
లాంటి మహా మహులెందరో చరిత్రలో మనకు కనిపిస్తారు....

 వారంతా మనలాంటి
సామా న్యులే!
అష్ట కష్టాలు పడ్డవారే.
వారి కష్టాలు సామాన్యమైనవి కావు. ....
మరి వాటికి తలొగ్గి ఉంటే చరిత్రలో వారికి ఈ స్థానం ఉండేది కాదు....

" అవరోధాలు, అనారోగ్యాలు, కష్టాలు, నష్టాలు, సమస్యలు, సంక్షోభాలు ".....
ఇలా జీవితంలో ఎన్నైనా ఉండవచ్చు.....
వాటిని ఎదిరించి నిలబడటమే ఉత్తమ మనిషి లక్షణం.... "ఎదిరించిన వాడికే గెలిచే అవకాశాలుంటాయి."...
 ఈ సత్యాన్ని తెలుసుకున్నారు కనుకనే వారంతా విజేతలయ్యారు...
"వారెప్పుడూ ఓటమిని శాశ్వతమని భావించలేదు.
గెలుపు అనేది ఓ నిరంతర ప్రక్రియ అని కనుగొన్నారు".
స్పష్టమైన లక్ష్యంతో ....
ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ... ఉన్నత శిఖరాలకెదిగారు....

 జీవితంలో అద్భుత విజయాలను సొంతం చేసుకున్న అనేకమంది మహనీయుల ప్రధాన పెట్టుబడి...

" ఆత్మవిశ్వాసం మాత్రమే"...

కళ్లు తెరిస్తేనే చీకటిలోనైనా అంతో ఇంతో చూడగలం.🤔🤔

 కానీ కళ్లు మూసుకుంటే వెలుతురులో కూడా చూడలేం....

" సహనంతో సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ముందుకు సాగితే ఎవరికైనా విజయం ఖాయం."...👍🏾👍🏾👍🏾

 చరిత్రలో చిరస్థాయిగా నిలిచినవారంతా చేసిందదే!
 మనం చేయాల్సిందీ అదే!...
             --------*****-------👏🏾👏🏾

No comments:

Post a Comment