Wednesday, 27 April 2016

చరిత్రను మార్చిన ధన్యులు

ఈనాడు ఈ ప్రపంచం ..
ఇలా ఉంది..

"ఎవరైనా పుట్టేటప్పుడు సామాన్యులుగానే పుడతారు."
 కానీ ఎదిగే కొద్దీ..
జీవితం ఒక్కొక్క మలుపూ తిరిగే కొద్దీ..
కొంతమంది సామాన్యులు అసామాన్యు లవుతారు...
 మహోన్నత శిఖరాలను అధిరోహిస్తారు.
కానీ చాలామంది సామాన్యులుగానే మిగిలి పోతుంటారు....

 సాదాసీదాగా బతికేస్తుంటారు. ఎందుకని????
ప్రతి మనిషీ...
తన జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించేది
"జననం "అన్న
సిగల్‌ పాయింట్‌ దగ్గరే!
 చేరుకునే గమ్యమూ,
"మరణం "అనే డెడ్‌ఎండ్‌ వరకే! ఇందులో తేడా ఏమీ లేదు.
 ఉన్న వ్యత్యాసమల్లా ప్రయాణం లోనే! 🚶🏼🚶🏼🚶🏼🚶🏼
మజిలీలు దాటి వెళ్లడంలోనే....! ఎంచుకునే మార్గంలోనే...! 'అవరోధాలు' అధిగమించడంలోనే! సవాళ్లను ఎదిరించ డంలోనే...!
నా వల్ల ఏమవుతుంది?,
మేం చాలా పేదరికంలో మగ్గిపోతున్నాం,
 నాకు పెద్దగా చదువు లేదు,
 మేం పుట్టెడు కష్టాలతో ఉన్న సామాన్యులం.
మేమేం సాధించగలం?
అనుకుంటే నిజంగానే ఏమీ సాధించలేం. 😒😒😒
అసలు ఈ కష్టాలకు కారణాలేమిటో అన్వేషించాలి.... వాటికి పరిష్కారం ఆలోచించాలి...

 అవకాశాలు వాటంతటవే రావు. వాటిని సృష్టించుకోవాలి.
ఈ విశాల ప్రపంచంలో కష్టాలు మనకే ఉన్నాయా?
ఆ మాటకొస్తే సగానికి పైగా ప్రపంచం నేడు కష్టాల్లోనే ఉంది... ప్రపంచంలోని మహామహులంతా ఈ కష్టాల సుడిగుండంలో చిక్కినవారే...🤔🤔🤔

కమ్యూనిస్టుల... ప్రవక్త...
" కారల్‌మార్క్స్‌  "జీవితం పేదరికానికి ప్రతీక.
"తన కూతురు చనిపోతే దహన సంస్కారాలకు డబ్బుల్లేక ఒక రోజంతా ఆ శవాన్ని ప్రక్క గదిలో ఉంచాడు."...
 పస్తులున్నాడు. ఒక పూటైనా కాల్చుకోవడానికి రొట్టె లేనపుడు కూడా ముప్పూటలా నా పేగులు నన్ను కాల్చుకుతిన్నాయని చెప్పాడు.
అయితేనేం .....
ప్రపంచానికి ....
మానవాళి విముక్తి
సిద్ధాంతాన్ని అందించిన మహోన్నతుడిగా చరిత్రలో నిలిచాడు. .....

"నెల్సన్‌ మండేలా"....
సుమారు 27 ఏళ్ళ పాటు కాళ్లు కూడా పూర్తిగా చాచి పడుకోలేని చిన్న గదిలో జైలు జీవితాన్ని గడిపాడు.
అతనికి తోటి మానవుల సాంగత్యం కూడా లేదు.
పగటికి, రాత్రికి తేడా తెలిపే సూర్యరశ్మి.... కూడా ఆ గదిలోకి రాదు.
అలాంటి కఠినమైన జైలు జీవితం కూడా .....
ఆయన స్వాతంత్య్ర కాంక్షను అణచివేయలేకపోయింది.
ఆ చీకటి చెర నుండే ఆయన "దక్షిణాఫ్రికా" ..
స్వాతంత్య్రానికి ఊపిరులూదాడు.
 నల్లని సూరీడయ్యాడు.....🤔🤔

గ్రీకు తత్వవేత్త
" సోక్రటీస్‌ "...
గర్భ దారిద్య్రాన్ని అనుభవించాడు.
తన తాత్విక సిద్ధాంతాలతో ఎంత కీర్తి సంపాదించాడో....
 అంతకు మించి తన నమ్మకాల కోసం మృత్యువునే స్వీకరించి నిలబడిన మహనీయుడుగా ప్రపంచానికి స్ఫూర్తినిచ్చాడు.....

 "థామస్‌ అల్వా ఎడిసన్‌"... పుట్టినపుడు తల చాలా లావుగా, శరీరం చాలా పీలగా ఉంది.
ఆయన బతికి బట్టకడతాడని కూడా ఎవరూ అనుకోలేదు.... ఆయనకు చెవుడు కూడా.....
12 ఏళ్ళ వయస్సులో ...
రైల్లో వార్తా పత్రికలు అమ్మేవాడు. అలాంటి వాడు
"ఎలక్ట్రికల్‌ బల్బు,"
 "ఫోనోగ్రాఫ్‌ "
కనుగొన్న గొప్ప శాస్త్రవేత్తగా.... లోకానికి వెలుగై ధ్వనిస్తున్నాడు...

 కెంటుకీలోని ఓ చిన్న చెక్కగదిలో నివసించే నిరుపేద చెప్పులు కుట్టే కుటుంబంలో జన్మించాడు "అబ్రహాం లింకన్ "...
అమెరికాకు అధ్యక్షుడయ్యాడు....
 అంతర్యుద్ధంలో పోరాడి నల్లవాళ్లకు స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుడిగా నిలిచాడు...

ఇలా చెప్పుకుంటూ పోతే... "గెలీలియో, ఐన్‌స్టీన్‌, చార్లెస్‌ డార్విన్‌, న్యూటన్‌, కోపర్నికస్‌, చార్లీ చాప్లిన్‌, మార్టిన్‌ లూథర్‌కింగ్‌, మావో "...
లాంటి మహా మహులెందరో చరిత్రలో మనకు కనిపిస్తారు....

 వారంతా మనలాంటి
సామా న్యులే!
అష్ట కష్టాలు పడ్డవారే.
వారి కష్టాలు సామాన్యమైనవి కావు. ....
మరి వాటికి తలొగ్గి ఉంటే చరిత్రలో వారికి ఈ స్థానం ఉండేది కాదు....

" అవరోధాలు, అనారోగ్యాలు, కష్టాలు, నష్టాలు, సమస్యలు, సంక్షోభాలు ".....
ఇలా జీవితంలో ఎన్నైనా ఉండవచ్చు.....
వాటిని ఎదిరించి నిలబడటమే ఉత్తమ మనిషి లక్షణం.... "ఎదిరించిన వాడికే గెలిచే అవకాశాలుంటాయి."...
 ఈ సత్యాన్ని తెలుసుకున్నారు కనుకనే వారంతా విజేతలయ్యారు...
"వారెప్పుడూ ఓటమిని శాశ్వతమని భావించలేదు.
గెలుపు అనేది ఓ నిరంతర ప్రక్రియ అని కనుగొన్నారు".
స్పష్టమైన లక్ష్యంతో ....
ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ... ఉన్నత శిఖరాలకెదిగారు....

 జీవితంలో అద్భుత విజయాలను సొంతం చేసుకున్న అనేకమంది మహనీయుల ప్రధాన పెట్టుబడి...

" ఆత్మవిశ్వాసం మాత్రమే"...

కళ్లు తెరిస్తేనే చీకటిలోనైనా అంతో ఇంతో చూడగలం.🤔🤔

 కానీ కళ్లు మూసుకుంటే వెలుతురులో కూడా చూడలేం....

" సహనంతో సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ముందుకు సాగితే ఎవరికైనా విజయం ఖాయం."...👍🏾👍🏾👍🏾

 చరిత్రలో చిరస్థాయిగా నిలిచినవారంతా చేసిందదే!
 మనం చేయాల్సిందీ అదే!...
             --------*****-------👏🏾👏🏾

ఎవరు చేసే పని వారే చేయాలి - దేవుడు చెప్పిన పాఠం


ఆ పరమాత్ముడి తో ఒక సన్నకారు రైతు ఒకసారి బలంగా దెబ్బలాట వేసుకొన్నాడు.

"నీకు పైరు గురించి ఏం తెలుసు? నీకిష్టమైనప్పుడు వానను కురిపిస్తావు. ఆ కాలంలో గాలి వీచేలా చేస్తున్నావు. నీతో పెద్ద గొడవగా ఉంది. మాట్లాడకుండా ఆ పనులన్నీ ఒక రైతుకి  అప్పగించారాదూ!” అన్నాడు.

 భగవంతుడు వెంటనే "అలాగా! అయితే ఈనాటి నుంచి గాలి, వాన, ఎండ అన్నీ నీ అజమాయిషిలోనే  ఉంటాయి”  అంటూ వరమిచ్చి చక్కాపోయాడు.
 ఆ రైతు ఆనందానికి అవధుల్లేవు.

ఋతువులు మారాయి. "వానా! కురవాలి" అన్నాడు  రైతు.
కురిసింది. ఆగమనగానే ఆగింది.

తడినేలను దున్నాడు. కావాల్సిన వేగంతో  గాలిని విసరమన్నాడు. విసిరింది.
విత్తుజల్లాడు. గాలి, వాన, ఎండ అన్నీ ఆ రైతు మాట ప్రకారమే జరిగాయి.
పైరు పచ్చగా ఏపుగా పెరిగింది. ఆ పొలం చూడటానికి ఎంతో రమ్యంగా ఉంది.
కోతల కాలం వచ్చింది.

రైతు ఒక కంకి కోశాడు. గింజ నులిమి చూ శాడు. అదిరిపడ్డాడు.  లోపల ధాన్యం  లేదు. ఉత్తి ఊక, మరొకటి, మరొకటి అంటూ అన్నీ కోసి చూశాడు. ఎందులోనూ ధాన్యం లేదు. అంతా ఉత్తి ఊకమాత్రమే ఉంది.

"హారి దేవుడా!" అంటూ కోపంగా ఎలిగెత్తి పిలిచాడు. "వాన,ఎండ,గాలి అన్ని తగిన మోతాదుల్లోనే వాడాను. కాలానుగుణంగా, ఋతువులకి తగట్టుగా. అయితే పైరు పాడైపోయిందే! ఏం? ఎందుకు?"

భగవంతుడు నవ్వాడు. "నా ఆధీనంలో గాలి బలంగా వీచేది. అప్పుడు అమ్మను కౌగిలించుకొనే పిల్లల్లా నారు వేళ్ళు భూమిలోకి లోతుగా జోచ్చుకొని గట్టిగా  పట్టుకొనేవి. వాన తక్కువైనా నీటికోసం వేళ్లను నాలుగు పక్కలకు పాకించేది. పోరాటం అంటూ ఉంటేనే చెట్లు తమను కాపాడుకోవడం కోసం బలంగా పెరుగుతాయి.

 అన్ని వసతులు నువ్వే కల్పించేసరికి పైరు సోమరిదయ్యింది. నవనవలాడుతూ పెరిగిందే తప్ప ఆరోగ్యవంతమైన ధాన్యాన్ని అందించాలని దానికి తెలీదు.
"నాకు నీ గాలి, వాన,ఎండ వద్దు. నువ్వే ఉంచుకో". అంటూ రైతు దేవుడిచ్చిన వాటిని తిరిగిచ్చేశాడు.

జీవితం లో అన్నీ చక్కగా అమరిపోతే, అంతకన్నా విసుగు, శూన్యం వేరే ఉండదు. కష్టాలు మిమ్మల్ని అదిమేసటప్పుడే మీలో చాకచక్యం మరింత పెరుగుతుంది. సావాళ్ళే మనిషికి పరిపూర్ణతను ఇస్తాయి. 

పితృ దేవో భవ

ఒకరోజు ఒక అమ్మాయి తన తండ్రి దగ్గరకి వచ్చింది,
" నాన్నా..! నేను ఈ కష్టాలు పడలేను. నాకు జీవితం అంటేనే విసుగేస్తోంది.
నాకే ఇన్ని కష్టాలు రావాలా..? " అంటూ తన బాధలను చెప్పుకుంటూ
వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.

తండ్రి మౌనంగా విన్నాడు. ఏమీ మాట్లాడలేదు.
చిన్నగా నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచాడు.

గ్యాస్ పొయ్యి మీదున్న - మూడు బర్నర్ల మీద మూడు గిన్నెలు పెట్టాడు.
వాటిల్లో నీళ్ళు పోసి ఒకదానిలో బంగాళా దుంపలు ( ఆలుగడ్డలు),
మరొకదానిలో కోడిగుడ్లు, ఇంకో గిన్నెలో కాఫీగింజలు వేశాడు.

తండ్రి తనతో అలా నిర్లక్ష్యముగా ఉండి,
ఏమీ మాట్లాడకుండా చేస్తున్న పని మీద కోపం వస్తున్నా -
అలాగే చూడసాగింది ఆ అమ్మాయి.

అలా 20 నిముషాలు మరిగించాక - స్టవ్ ని కట్టేసి, ఆ గిన్నెలను దింపి,
వాటిని కూతురు ముందు పెట్టి ఏమి జరిగిందో పరిశీలింఛి చెప్పమన్నాడు.

నాన్న ' అలా ఎందుకు చేసాడా పని..' అని అయోమయముగా ఉన్న ఆ కూతురు వాటిని పరిశీలించాక అంది,

" ఏముందీ..! దుంపలు మెత్తబడ్డాయి. కోడిగుడ్డు గట్టిపడింది.
కాఫీ డికాషన్ వచ్చింది........
అయినా ఇదంతా నన్ను ఎందుకు అడుగుతున్నావు నాన్నా?.. " అంది.

అప్పుడు ఆ తండ్రి చిన్నగా నవ్వి,

" ఆ మూడింటికీ ఒకే రకమైన ప్రతికూలత ఎదురయ్యింది. అంటే ఒకేలా ఒకే రకమైన గిన్నెల్లో, అదే గ్యాస్ వేడినీ, వేడి నీటినీ చవిచూశాయి.

కానీ, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్పందించాయి అని గమనించావా?
మామూలుగా గట్టిగా ఉండే దుంపలు ఇప్పుడు మెత్తబడ్డాయి.
చితికిపోయే గుడ్డు గట్టిపడింది.
గట్టిగా ఉండే కాఫీ గింజలు మెత్తపడి, వాటిలోని రసాన్ని ఊరించి,
నీటిరంగునే మార్చింది.. అవునా..!!

ఇప్పుడు చెప్పు..

వీటిల్లో - నీవు ఎలా ఉండాలి అనుకుంటున్నావు?

మెత్తబడిపోతావా..? ( ఇప్పుడు నీవున్న స్థితి అదే.. )

గట్టిపడిపోతావా..?

పరిస్థితులను మారుస్తావా...?

ఇక్కడ నీదే ఎంపిక,
దానిమీదే ఇందాక నీవడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది.." అన్నాడు.

ఆ అమ్మాయి మొఖంలో ఏదో తెలీని వెలుగు. కన్నీళ్లు ఆగిపోయాయి. బాధలేదు.

దాని బదులుగా ఆ కళ్ళల్లో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది..

" నాన్నా! యూ ఆర్ మై రియల్ హీరో.. మెంటార్.. ఎవర్ అండ్ ఫరెవర్.." కృతజ్ఞతాభావంతో అంది.

Tuesday, 26 April 2016

జీవితసత్యాలు :-


1. జీవితంలో ఎప్పుడైనా
ఎవరి నైనా పనికి రాని వారిగా
పరిగణించవద్దు ఎందుకంటే
చెడిపోయిన గడియారం
కూడ రోజుకు రెండు సార్లు
సరైన సమయం
సూచిస్తుంది.

2. ఎప్పుడూ ఇతరుల తప్పులను
అన్వేషించే వ్యక్తి అందమైన
పుష్పాల పరిమళాలను
వదలి పుండు మీద వాలే
ఈగ లాంటి వాడు.

3. పేదరికం ధరిచేరినప్పుడు
ఆప్తమిత్రులు కూడ
దూరమైతారు అదే
ధనవంతులైనప్పుడు
తెలియని వారు కూడ
మిత్రులవుతారు.

4. ఒక్క సారి నవ్వుతూ చూడు
ప్రపంచంలో ఉండే అందాలన్ని
నీ సొంతమవ్వుతాయి కానీ
తడిసిన కనురెప్పలతో
చూసే అద్దంకూడ మసక
బారి పోతుంది.

5. తొందరగా దొరికేది ఏదైనా
ఎక్కువకాలం మన్నికరాదు
ఎక్కువకాలం మన్నిక
వచ్చేది అంతతొందరగా
దొరకదు.

6. జీవితంలో వచ్చే చెడు రోజులు
కూడా మన మంచి కొరకే
అనుకోవాలి అప్పుడే
తెలుస్తుంది నిజమైన
స్నేహితులు ఎవరైనది.

7. మనిషికి రోగాలు కుందేలు లాగా
వస్తాయి తాబేలు లాగా
వెళ్లుతాయి కానీ డబ్బులు
తాబేలు లాగ వస్తాయి
కుందేలు లాగా
వెళ్లుతాయి.

8. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని
వెతకటం అలవాటు
చేసుకోవాలి ఎందుకంటే
పెద్ద పెద్ద మాటలు
జీవితంలో చాలా
అరుదుగా చోటు
చేసుకుంటాయి.

9. ఈశ్వరుని ప్రార్ధించినప్పుడు
నాకు ఏమి ఇవ్వలేదని
బాధపడకు ఎందుకంటే
నీకు అక్కడ ఇవ్వక
పోయినా నీకు నచ్చిన
చోట నీకు ఈశ్వరుడు
నచ్చినవిధంగా ఇస్తాడు.

10. నిత్యము ఎదురయ్యే
అపజయాలను చూసి
నిరాశ చెందకు కానీ
ఒక్కోసారి తాళంచెవి
గుచ్చంలో ఉండే ఆఖరి
తాళంచెవి కూడ తాళం
తెరుస్తుందని
గమనించు.

11. ఈ సమాజంలో నేను ఒక్కడిని
ఎంచేయగలననీ ప్రతి మనిషి
నిరాశ చెందుతుంటాడు
కానీ ఒక్క సారి తలపైకెత్తి
చూడు ప్రపంచానికి
వెలుగునిచ్చే సూర్యుడు
కూడ ఒక్కడేనని.

12. బంధవులు ఎంత చెడ్డ వారైనా
సరే వదులుకోవద్దు
ఎందుకంటే మురికి నీరు
దప్పిక తీర్చలేక పోయిన
కనీసం అగ్గి మంటలు
ఆర్పటానికి పనికి
వస్తాయి.

13. నమ్మక ద్రోహి స్నేహితునికన్నా
దురాశపరుడు సన్నిహితుడు
మిన్న మట్టితో చేసిన
మనుషులు కాగితాలకు
అమ్ముడు పోతారు

14. మనిషి గా మాట్లాడుట
రాక పోయినా కనీసం
పశువుల మౌనంగా
ఉండటమే ఉత్తమం.

15. మనకు మాటలు రాక ముందు
మనముఎంచెప్పబోతున్నామో
అమ్మకు అర్థమయ్యేది కాని
మనము మాటలు అన్ని
నేర్చిన తరువాత ఇప్పుడు
మాటమాటకు ప్రతిసారి
అమ్మా నీకు అర్థం
కాదులే అంటాం.

16. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు
దూరమైనారని బాధపడకు
ఎందుకంటే నీవు ఒక్కనివే
జయించగలవని వారు
నమ్మినందుకు నీవు
సంతోషించు.

17. సిగ్గు మర్యాద లేని
ధనవంతుడు ఎల్లయ్య కన్నా
మంచి మానవత్వం ఉన్న
పేదరికం సుబ్బయ్య మిన్న.

18. జీవితంలో హెచ్చుతగ్గులు
రావటంకూడ మనమంచి
కోసమే అనుకోవాలి
ఎందుకంటే ECG లొ
వచ్చే సరళరేఖా కూడ
మృత్యువును
సూచిస్తుంది.

19. ఈ రోజుల్లో సంబంధాలు
రొట్టె తొ సమానమైనవి
ఎందుకంటే కొద్దిగా మంట
ఎక్కవైందొలెదో రొట్టె
మాడిమసి కావటం
ఖాయం.

20. జీవితంలో మంచి వారి కోసం
అన్వేషించ వద్దు ముందు
నీవు మంచిగా మారు
బహుశా నిన్ను కలిసిన
వ్యక్తికి మంచి మనిషి
అన్వేషణ పూర్తి
కావచ్చు నేమో.

ప్రముఖ వ్యక్తులు నినాదాలు

జాతీయ వ్యక్తులు:
నినాదం వ్యక్తి
» గోబ్యాక్ టు వేదాస్ (వేదాలకు మరలండి) - స్వామి దయానంద సరస్వతి
» నాకు రక్తాన్ని ఇవ్వండి - మీకు నేను స్వాతంత్య్రం ఇస్తాను - సుభాష్ చంద్రబోస్
» ఢిల్లీ చలో - సుభాష్ చంద్రబోస్
» జైహింద్ - సుభాష్ చంద్రబోస్
» జై జవాన్, జై కిసాన్ - లాల్‌ బహదూర్ శాస్త్రి
» సత్యం, అహింస నాకు దేవుళ్లు - మహాత్మా గాంధీ
» డూ ఆర్ డై (చేయండి లేదా చావండి) - మహాత్మా గాంధీ
» బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్య పతన దినం - మహాత్మా గాంధీ
» బెంగాల్ విభజన తరువాత దేశంలో అసలైన చైతన్యం మొదలైంది - మహాత్మా గాంధీ
» సంస్కారం లేని చదువు వాసనలేని పువ్వులాంటిది - మహాత్మా గాంధీ
» ది వేదాస్ కంటైన్ ఆల్ ది ట్రూత్ - స్వామి దయానంద సరస్వతి
» భారతదేశం, భారతీయుల కొరకే - స్వామి దయానంద సరస్వతి
» ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి - లాలా లజపతిరాయ్
» కాంగ్రెస్ ఉద్యమం ప్రజల చేత ప్రభావితమైంది కాదు, ప్రజలు ప్రణాళిక చేసిందీ కాదు - లాలా లజపతిరాయ్
» ముందుకు సాగండి - మేడం బికాజికామా
సర్ధార్ వల్లభాయ్ పటేల్
» నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి - సర్దార్ వల్లభాయ్ పటేల్
» రోజ్‌గార్ బడావో - మన్మోహన్‌సింగ్
» జై విజ్ఞాన్ - అటల్‌బిహారి వాజ్‌పేయి
» భారతదేశానికి హిందువులు, ముస్లింలు రెండు కళ్లులాంటివారు - సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్
» రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణ వాయువులాంటిది - అరబిందో ఘోష్
» ప్రజలే ప్రభువులు - లోక్‌సత్తా
» ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు - జవహర్‌లాల్ నెహ్రూ
జవహర్‌లాల్ నెహ్రూ
» ప్రతి కంటి నుంచి కారే కన్నీటిని తుడవడమే నా అంతిమ లక్ష్యం - జవహర్‌లాల్ నెహ్రూ
» చెడును సహిస్తే అది మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది - జవహర్ లాల్ నెహ్రూ
» ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం - శ్రీశ్రీ
శ్రీశ్రీ
» భారతదేశం నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క పాఠం ఏమిటంటే ఎలా చావాలో, దాన్ని బోధించవలసిన ఏకైక పద్ధతి చావడం ద్వారానే - ఎం.కె. ధింగ్రా
» ఇంక్విలాబ్ జిందాబాద్ (విప్లవం వర్ధిల్లాలి) - భగత్‌సింగ్
» స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని సాధించి తీరుతాను - బాలగంగాధర తిలక్
» దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయన్ను దేవునిగా అంగీకరించను - బాలగంగాధర తిలక్
» పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివాళ్లు మాత్రమే స్వాతంత్య్రం గురించి ఆలోచిస్తారు, మాట్లాడతారు - గోపాలకృష్ణ గోఖలే
» ఆధునిక విద్య, విజ్ఞానాల్ని ఆర్జించకుండా మన జాతి పురోగమించటం సాధ్యం కాదు - రాజారామ్మోహన్‌రాయ్
» కళ కళ కోసం కాదు ప్రజల కోసం - బళ్ళారి రాఘవ
» గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయిజం ఎప్పుడూ జీవించే ఉంటుంది - భోగరాజు పట్టాభి సీతారామయ్య
» దేశ్ బచావో, దేశ్ బనావో - పి.వి.నరసింహారావు
» వడగాల్పులు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం - గుర్రం జాషువా
గుర్రం జాషువా
» ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా అనుమానమేమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం - వి.డి.సావర్కర్
» నా తెలంగాణ కోటి రతనాల వీణ - దాశరథి కృష్ణమాచార్యులు
దాశరథి కృష్ణమాచార్యులు
» బోదెను చేధిస్తే ఎండిన కొమ్మలు వాటంతటవే పడిపోతాయి - బాజీరావు I
» చిన్న లక్ష్యాలు నిర్దేశించుకోవడం నేరం, గొప్ప కలలు కనండి, వాటి సాకారానికై కృషిచేయండి - ఎ.పి.జె. అబ్దుల్ కలాం
ఎ.పి.జె. అబ్దుల్ కలాం
» పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్ర పోనివ్వండి - మోతీలాల్ నెహ్రూ
» నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడతాను - ఇందిరాగాంధీ
ఇందిరా గాంధీ
» అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో - కందుకూరి వీరేశలింగం పంతులు
» బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి, బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు - మౌలానా అబుల్ కలాం ఆజాద్
» ప్రత్యేక రక్షణలు కోరుతున్న ముస్లింలు ఎంత మూర్ఖులో వాటిని ఇస్తున్న హిందువులు అంతకంటే పెద్ద మూర్ఖులు - మౌలానా అబుల్ కలాం ఆజాద్
» బికారీ హఠావో - రాజీవ్ గాంధీ
» వాణి నా రాణి - పిల్లలమర్రి పినవీరభద్రుడు
» బ్రిటిషర్ల ఫించను పొందుతున్న రాజుల, నవాబుల జాబితాలో బతకటం కంటే సైనికుడిగా మరణించటమే మేలు - టిప్పుసుల్తాన్
» సూర్యుడు కనపడలేదని కన్నీరు పెడుతూ ఉంటే చివరకు నక్షత్రాలు కూడా కనపడకుండా పోతాయి - రవీంద్రనాథ్ ఠాగూర్
రవీంద్రనాథ్ ఠాగూర్
» స్వాతంత్య్రం అనేది ఓ కనిపించని మహా అదృష్టం, అది లేనప్పుడు గాని దాని విలువ తెలియదు - రవీంద్రనాధ్ ఠాగూర్
» అందరిలోనూ సామాన్యున్ని అయినా చిరంజీవుణ్ణి - సి.నారాయణరెడ్డి
» కులం పునాదులపై ఒక జాతిని గాని ఒక నీతిని గాని నిర్మించలేము - బి.ఆర్. అంబేడ్కర్
బి.ఆర్.అంబేడ్కర్
» మహారాష్ట్రులనంతా ఒకచోట చేర్చు. మతం మరలా జీవించేటట్లు చూడు. మనల్ని చూచి మన పూర్వులు స్వర్గం నుంచి నవ్వుతున్నారు - గురు రామదాస్
» మానవులందరూ నా బిడ్డలవంటివారు - అశోకుడు
అంతర్జాతీయం వ్యక్తులు:
నినాదం వ్యక్తి
» స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది - హిట్లర్
» స్త్రీలకు ప్రసవం ఎలాంటిదో దేశానికి స్వాతంత్య్రం అలాంటిది - ముస్సోలిని
» వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం, ధాన్యం కోసం యుద్ధం - ముస్సోలిని
» ప్రజలు విన్నట్లు స్వర్గం వింటుంది. ప్రజలు చూస్తున్నట్లు స్వర్గం చూస్తుంది - కన్ఫ్యూషియస్
» నేను వచ్చాను, నేను చూశాను, నేను జయించాను - జూలియస్ సీజర్
» నాలెడ్జ్ ఈజ్ వపర్ - జె.ఎల్.మిల్
» భూమిపై పుట్టే ప్రతి వ్యక్తి ఆర్థికంగా నరకాన్ని సృష్టించినవాడవుతాడు - మాల్థస్
» ది రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బిట్టర్ బట్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్ - అరిస్టాటిల్
»ఎక్కడైతే ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుందో అక్కడ ఆరోగ్యవంతమైన జ్ఞానం ఉంటుంది - అరిస్టాటిల్
» నేనే రాజ్యాన్ని - లూయి XIV
» నా తర్వాత ప్రళయం వస్తుంది - లూయి XV
» స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్లతో బంధించబడ్డాడు - రూసో
» బ్యూటీ ఈస్ ట్రూత్ అండ్ ట్రూత్ ఈస్ బ్యూటీ - జాన్‌కీట్స్
» నేను భారతదేశానికి యాత్రికునిగా రాలేదు గాంధీ పుట్టిన దేశానికి నా నివాళ్లు అర్పించడానికి వచ్చాను - మార్టిన్ లూథర్ కింగ్
» బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తిమంతమైంది - అబ్రహం లింకన్
అబ్రహం లింకన్
» నీకు బానిసగా ఉండటానికి ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండటానికి కూడా ఇష్టపడకూడదు - అబ్రహం లింకన్
» ఇవ్వడానికి నా దగ్గర ఏమీలేదు. రక్తం, శ్రమ, కన్నీళ్లు తప్ప - విన్‌స్టన్ చర్చిల్
» లిపి పుట్టుకే నాగరికతల ఆవిర్భావానికి చిహ్నం - గార్డెన్ చైల్డ్
» శరీరానికి వ్యాయామం ఎలాంటిదో మనసుకు చదువు అలాంటిది - రాబర్ట్ స్టీల్
» మతం మత్తుమందు వంటిది - కారల్‌మార్క్స్
» పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప - కారల్ మార్క్స్
» చరిత్ర అంటే వర్గ పోరాటాల రికార్డే తప్ప మరేమీ కాదు - కారల్‌మార్క్స్
» ప్రపంచ కార్మికులారా ఏకంకండి - కారల్ మార్క్స్
» అలవాటు అనే పదాన్ని అరికట్టకపోతే అది అవసరంగా మారుతుంది - సెయింట్ అగస్టీన్
» జన్మతః బ్రిటిష్‌వారు పాలకులు, హిందూ దేశస్థులు పాలింపబడేవారు మాత్రమే - కారన్‌వాలిస్
» నూరు పువ్వులు వికసించనీ, వెయ్యి ఆలోచనలు సంఘర్షించనీ - మావో సేటుంగ్
» నేనే విప్లవాన్ని, నేనే విప్లవ శిశువుని - నెపోలియన్
» అసాధ్యం మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం - నెపోలియన్
» ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సర్వ అరిష్టాలు లండన్‌లోనే ఉద్భవిస్తాయి - నెపోలియన్
» చైనా నిద్రావస్థలో ఉన్న పెనుభూతం. దానికి మెలకువ వచ్చిన రోజు ప్రపంచంపై పాశ్చాత్య దేశాలు పెత్తనం అంతమవుతుంది - నెపోలియన్
» సంగీత విద్వాంసుడు ఫిడేలును ప్రేమించినట్లు నేను అధికారాన్ని ప్రేమిస్తాను - నెపోలియన్
» పవిత్ర రోమన్ సామ్రాజ్యం పవిత్రం కాదు, అసలది పవిత్ర రోమన్ సామ్రాజ్యమే కాదు - నెపోలియన్
» గివ్ మి స్పేస్ టు స్టాండ్ అవే ఫ్రమ్ ద ఎర్త్ అండ్ ఐ షల్ లిఫ్ట్ దిస్ ఎర్త్ - ఆర్కిమెడిస్
» భారతదేశ వ్యాపారమే ప్రపంచ వ్యాపారమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఆ దేశాన్ని తమ ఆధిప్యతంలో ఉంచుకోగలరో వారే ఐరోపాను నిరంకుశంగా పరిపాలించగలరు - రష్యా పీటర్ చక్రవర్తి
» ఆహారం కంటే ఫిరంగులే ముఖ్యం - గోరింగ్
(హిట్లర్ అనుచరుడు)
» కంటికి కన్ను పంటికి పన్ను - బాబిలోనియా నాగరికత
» రాజు భగవంతుని వారసుడు, చట్టం రాజు నుంచి ఆవిర్భవిస్తుంది - జేమ్స్ I
» యుద్ధం ప్రష్యా దేశంలో ఒక జాతీయ పరిశ్రమ - మిరాబో
» ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ముందు ఈజిప్టు పిరమిడ్లు వెలవెలబోతాయి - వోల్టెర్
» సంతృప్తి చెందిన మూర్ఖుని కంటే అసంతృప్తితో ఉన్న సోక్రటీస్ నయం - జె.ఎల్. మిల్
» ఈ సెబాస్టపోల్ బురద నుంచి నూతన ఇటలీ ఉత్పన్నమవుతుంది - కౌంట్ కవూర్
» నేను ఉపన్యాసాన్ని ఇవ్వలేను కానీ ఇటలీని సమైక్యపరచగలను - కౌంట్ కవూర్
» ప్రాచీన చరిత్ర రచనకు ఉపయోగపడే మానవ అస్థిపంజరాలు, పుర్రెలు, శిలాజాలు అనే ఆధార వస్తువుల్ని ప్రాచీన కాలం మనుషులుగా వర్ణించవచ్చు - మార్టిమర్ వీలర్
» ప్రపంచ ఆధిపత్యమో లేదా పతనమో - రెండో కైజర్ విలియం
» నేను న్యాయాన్ని ప్రేమించాను, అన్యాయాన్ని నిరసించను. అందువల్లే ఈ విధంగా ప్రవాసంలో మరణిస్తున్నాను - గ్రేగరి VII
» విప్లవం రోగం వంటిది, అగ్ని పర్వతంలాంటిది, పుట్టుకురుపు వంటిది - ఎటర్నిక్
» మానవ పరిణామ క్రమాన్ని ఒక గంట సినిమాగా తీస్తే అందులో 59 నిమిషాలు శిలాయుగానికే సరిపోతుంది

Monday, 25 April 2016

విగ్రహాలముందు నేరుగా నిలబడి ప్రార్థించకూడదట

సాధారణంగా ప్రతిఒక్కరు ఉదయాన్నే లేవగానే ముందుగా తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుని, ఇంట్లో పూజా కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. మరికొందరు ఉదయాన్నే లేవగానే శుభ్రంగా స్నానం చేసుకుని, దేవాలయాలకు వెళుతుంటారు. కానీ చాలామంది ఇలా నేరుగా దేవాలయాలకు వెళ్లి దేవతలను ప్రార్థించుకోవడం ద్వారా మానసిక శాంతి లభిస్తుందని ప్రతిఒక్కరు విశ్వసిస్తారు. పైగా దేవుడిని ఏవైనా కోరికలు కోరినా, అవి వెంటనే నెరవేరుతాయనే నమ్మకంతో భక్తులు ఎక్కువగా దేవాలయాలకు వెళ్లడానికి మక్కువ చూపిస్తారు.

అయితే దేవాలయాలకు వెళ్లినప్పుడు అక్కడ కొన్ని నియమనిబంధనలు, శాస్త్రాలప్రకారం కొన్ని ఆచారాలను పాటించాల్సిందేనని జ్యోతిష్య నిపుణులు, పండితులు బల్లగుద్దిమరీ చెబుతున్నారు. ఎందుకంటే.. సహజంగా ప్రతిఒక్కరు దేవుడిని ప్రార్థించుకోవడానికి విగ్రహానికి నేరుగా నిలబడతారు. కోరిన కోరికలు త్వరగా తీరాలనే కాంక్షతో విగ్రహానికి ముందుగా నిటారుగా నిలబడిపోతారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు పండితులు.

దేవతా విగ్రహానికి సూటిగా కాకుండా.. కాస్త ఎడమ లేదా కుడివైపున నిలబడి దేవుడిని ప్రార్థించుకోవడం ద్వారా దేవానుగ్రహం లభిస్తుంది. అదెలా అంటే.. దేవతావిగ్రహాల నుంచి వెలువడే ‘‘దైవకృపా శక్తి’’ తరంగాల రూపంలో ప్రవహిస్తూ, భక్తుని దగ్గరకు చేరుకుంటాయి. అటువంటి సమయంలో మానవదేహం సూటిగా విగ్రహానికి నిలబడితే.. ఆ దివ్యకిరణాలను తట్టుకోవడం అసాధ్యం. కొన్ని సందర్భాలలో అది హానికరంగా మారవచ్చు. కాబట్టి విగ్రహాలకు సూటిగా కాకుండా.. ఎడమ లేదా కుడివైపున నిలబడి ప్రార్థిస్తే.. దైవానుగ్రహం లభిస్తుంది.

అదేవిధంగా దేవుడిని ప్రార్థించే సమయంలో రెండు చేతులను జోడించి, భక్తిశ్రద్ధలతో స్మరించుకోవాలి. ఇలా జోడించడం వల్ల మెదడుకు ప్రాణశక్తి లభిస్తుంది. దాంతో శారీరకబలం, బుద్ధిబలం, ఆత్మవిశ్వాసంతోపాటు ఎంతో ఆరోగ్యకరంగా కూడా వుంటారని పండితులు సలహాలు ఇస్తున్నారు.

కొండగట్టు ఆంజనేయస్వామి



దాదాపు ఐదు వందల ఏళ్ల క్రితం కొడిమ్యాల పరగణాలో నివసించే సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు గుట్టల్లో తన పశువులను మేపుతుండగా ఓ ఆవు తప్పిపోయింది. వెతికి వేసారిన సంజీవుడు చెట్టుకింద సేదతీరుతూ నిద్రలోకి జారుకోగా అంజన్న కలలోకి వచ్చి కోరంద పొదల్లో వెలసిన తనకు ఎండ, వాననుంచి రక్షణ కల్పించాలని సూచించి ఆవు జాడ చెప్పాడట. కళ్లు తెరిచి చూడగా ఆవు కనిపించడంతో సంజీవుని ఆనందానికి అవధుల్లేవు. భక్తిభావంతో కోరంద ముళ్లపొదలను తొలగించి స్వామివారికి చిన్న ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. నారసింహ వక్త్రంతో వెలసిన కొండగట్టు అంజన్న ఆలయానికి ఈశాన్యభాగంలోని గుహల్లో మునులు తపస్సు ఆచరించినట్లు ఆనవాళ్లున్నాయి.

శ్రీరాముడు సీతకోసం లంకకు వెళ్లే సమయంలో లక్ష్మణుడు మూర్చిల్లిపోగా ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకొని వస్తుండగా అందులోంచి ఓ ముక్కరాలిపడి కొండగట్టుగా ప్రసిద్ధి పొందిందని మరికొందరు పురాణగాథను చెబుతుంటారు. ఆలయానికి వెళ్లే దారిపక్కన సీతాదేవి ఏడ్చినట్లు చెప్పే కన్నీటి గుంతలు భక్తులకు దర్శనమిస్తాయి. ప్రకృతి సిద్ధంగా వెలసిన పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. రోగగ్రస్థులు, సంతానహీనులు అంజన్న సన్నిధిలో 41రోజులు గడిపితే బాగవుతారని భక్తుల విశ్వాసం.

ఆలయంలో నిర్వహించే ప్రధాన పర్వదినాలు :-
* ఏటా చైత్ర పౌర్ణమిరోజు హన్మాన్‌ చిన్నజయంతి, వైశాఖ బహుళదశమినాడు వచ్చే పెద్ద హన్మాన్‌ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా లక్షలాది దీక్షాపరులు అంజన్నను దర్శించుకొని ముడుపులు కట్టివెళ్తుంటారు. పెద్ద హన్మాన్‌జయంతి సందర్భంగా మూడురోజుల పాటు హోమం నిర్వహిస్తారు.
*ఉగాది పండుగ రోజు స్వామివారి సన్నిధిలో పంచాంగ శ్రవణం జరుగుతుంది.
*,ఐత్ర శుద్ధనవమి రోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరుగుతుంది.
* శ్రావణ మాసంలో సప్తాహ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
* ఏటా ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నెల రోజులపాటు తిరుప్పావై, గోదా రంగనాయకుల కళ్యాణం జరుగుతుంది.
* వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తరద్వారం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం గావిస్తారు.
* దీపావళి పర్వదినం సందర్భంగా సహస్ర దీపాలంకరణతో ఆలయాన్ని తీర్చిదిద్దుతారు.
* ఆలయ పవిత్రతతో పాటు లోకకళ్యాణం నిమిత్తం ఏటా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
* ప్రపంచ శాంతికోసం జగత్‌కళ్యాణ సిద్ధికి ఏటా మూడు రోజులపాటు శ్రీసుదర్శన మహాయాగం జరుపుతారు.

Interesting notice boards



Forest Dept:
"Shoot the bird with camera not with Gun..."

Traffic Dept:
"Donate blood, But not on Roads..."

Petrol Pump:
"No smoking" " Your life may be worthless but our petrol is Costly"

And Finally!!

Hospital Board:-
"If you still want to continue looking @ girls, even after your Death "DONATE YOUR EYES" 😜

నీటి కరువు గురించి అబ్దుల్ కలాం గారి ప్రెజంటేషన్

ఈ రోజు ప్రపంచం ఎదురుకుంటున్న అనేక సమస్యల్లో ఒకటి నీటిఎద్దడి. అబ్దుల్ కలాం గారు నీటి కరువు గురించి ఒక ప్రెజంటేషన్ ఇచ్చారు. అది 2002 లో ఓ విదేశి మేగజైన్‌లో ప్రచురితమైంది. వారు భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుందో ఊహించి, ఒక వ్యక్తి 2070 లో లేఖ రాస్తున్నట్టుగా చిత్రీకరించారు.

'ఇది 2070. నేను ఇప్పుడే 50 ఏళ్ళు దాటాను. కానీ నా రూపం చూడటనికి 85 ఏళ్ళుగా అనిపిస్తుంది. నేను తీవ్రమైన మూత్రపిండ సమస్యలను ఎదురుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎక్కువగా నీరు త్రాగను..... త్రాగలేను, అంత నీరు ఇప్పుడు అంబాటులో లేదు.

నేను ఇక ఎక్కువ కాలం బ్రతకను, అదే నాకున్న పెద్ద భయం. ఇప్పుడున సమాజంలో అతి ఎక్కువ వయసున్న వ్యక్తులలో నేను కూడా ఒకడిని.

నాకు గుర్తుంది, అప్పుడు నాకు 5 ఏళ్ళు, అప్పడంతా పరిస్థితి వేరుగా ఉండేది. ఉద్యానవనాల్లో ఎన్నో చెట్లు ఉండేవి, ఇళ్ళలో చక్కని తోటలు ఉండేవి, దాదాపు అరగంట పాటు షవర్ స్నానం చేసి ఆనందించేవాడిని. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడు అంత నీరెక్కడుంది కనుక. అందుకే మేమిప్పుడు రసాయనపూత పూసిన టవల్స్‌తో శరీరాన్ని శుభ్రపరుచుకుంటున్నాము. స్నానం చేయడమనేది అసలు లేనేలేదు. రసాయనాలతో శరీరం తుడుచుకోవడమే అందరూ చేస్తున్నారు.

ఇంతకముందు ఆడవాళ్ళకు అందమైన జుట్టు ఉండేది. కానీ ఇప్పుడు నీటి వాడకం తగ్గించడనికి అందరూ రోజు తల మొత్తం నున్నగా షేవ్ చేసుకుంటున్నారు. అప్పట్లో మా నాన్నగారు కారుని పైప్‌తో కడిగేవారు. ఇప్పుడా విషయం మా అబ్బాయికి చెప్తే, అంత నీరెలా వృధా చేస్తారంటూ నమ్మడంలేదు.

నాకు గుర్తుంది, నీటిని కాపాడండి, సేవ్ వాటర్ అంటూ హెచ్చరికలు, వాల్ పోస్టర్లు ఉండేవి, రేడియో, టి.వీ.ల్లో కూడా ప్రచారం చేసేవారు. కానీ అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. నీరనేది ఎప్పటి తరగని వనరని మాకు భావన ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే, నదులు, చెరువులు, బోర్లు, డ్యాములన్నీ పూర్తిగా ఎండిపోయాయి, లేదా పూర్తిగా కలుషితమయ్యాయి.

పరిశ్రమలు కూడా నిలిచిపోయాయి, నిరుద్యోగం దారుణంగా పెరిగిపోయింది. నీటి నుంచి ఉప్పును వేరు చేసే ప్లాంట్లు మాత్రమే అధికశాతం ఉద్యోగ అవసరాలు తీరుస్తున్నాయి. వాటిలో పని చేసే కార్మీకులు డబ్బులకు బదులుగా నీటిని జీతం రూపంలో తీసుకుంటున్నారు. నీరు కొనుక్కోవడమే గగనం అయ్యింది.

రోడ్డు మీద నీటి బాటిళ్ళు తీసుకువెళ్ళేవారిని చంపి, ఆ నీటిని దోచుకోవడం కోసం చేసే నేరాలు పెరిగిపోయాయి. నీటిబాటిల్ కోసం అగంతకులు గన్‌తో భయపెడుతున్నారు. 80% ఆహారం అంతా కృతిమమే. నీరు లేకపోతే ఏం పండుతుంది?

గత రోజులలో కాస్త వయసున్న వ్యక్తి రోజుకి కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని సిపార్సు చేసేవారు. ఇప్పుడు కేవలం అరగ్లాసు నీరు త్రాగే 'అవకాశం' మాత్రమే ఇస్తున్నారు. అంతకంటే ఎక్కువ నీరు త్రాగనివ్వరు.

ఇప్పుడు మేము వాడి పడేసే బట్టలు ఉపయోగిస్తున్నాము. ఇంతకముందు వలే నేసిన బట్టలు వాడే రోజులు ఎప్పుడో పోయాయి. అటువంటి బట్టలు ధరించినా, వాటిని శుభ్రపరచడానికి నీరుంటే కదా.

ఇప్పుడు మేము డ్రైనేజి వ్యవస్థకు బదులుగా సెప్టిక్ ట్యాంకు వాడుతున్నాము. ఎందుకంటే డ్రైనేజి వ్యవస్థకు కూడా నీరు అవసరం.

జనాల యొక్క బాహ్యరూపం చాలా భయంకరంగా ఉంది. ముడతలు పడి, డిహైడ్రేషన్ కారణంగా కృశించి, అతినీలలోహిత కిరణాల కారణంగా శరీరం మొత్తం కురుపులు పడి, ఓజోన్ పొర లేని కారణంగా చాలా దారుణమైన చర్మవ్యాధులతో జనం తారసపడుతున్నారు. చర్మక్యాన్సర్, వాతప్రకోపిత రోగాలు, మూత్రపిండ సంబంధిత వ్యాధులే మరణాలకు ముఖ్యకారణాలు.

చర్మం అధికంగా పొడిబారడం వలన 20 ఏళ్ళ యువకులు 40 ఏళ్ళ వారిలా కనిపిస్తున్నారు. శాస్త్రవేత్తలు పరిశోధించినా, ఎటువంటి మార్గం కనుగొనలేకపోతున్నారు. నీటిని ఉత్పత్తి చేయలేము, చెట్లు, పచ్చదనం తగ్గిన కారణంగా ప్రాణవాయువు నాణ్యత తగ్గిపోయింది. ఆధునికతరాల వారి మేధాశక్తి దారుణంగా క్షీణించిపోయింది.
పురుషుల వీర్యకణాల్లో కూడా తేడాలు సంక్రమించాయి. ఆ కారణంగా కొత్తగా పుట్టే పిల్లలు అనేక అవయవ లోపాలతో, రోగాలతో పుడుతున్నారు.

గాలి పీలుస్తున్నందుకు గానూ ప్రభుత్వం ఇప్పుడు మా దగ్గరి నుంచి డబ్బులు వసూల్ చేస్తోంది. 137 కూబిక్ మీటర్ల గాలి మాత్రమే తీసుకునే అవకాశం ఇస్తోంది. ప్రజల ఊపిరి తిత్తులు ఎప్పుడో చెడిపోయాయి, అందుకే ఇప్పుడు సౌరశక్తితో నడిచే యాంత్రికమైన ఊపిరి తిత్తులు కనుగొన్నారు, వాటిని వెంటిలేటేడ్ జోన్స్ అనే ప్రత్యేక స్థలాల్లో అమరుస్తారు. డబ్బులు కట్టలేని వాళ్ళని వెంటిలేటేడ్ జోన్స్ నుండి వెళ్ళగొడతారు. అక్కడ కూడా ప్రజలు పీల్చే గాలి మంచిదేమీ కాదు, కానీ ఏదో పూటగడుస్తుందంతే.

కొన్ని దేశాల్లో ఇప్పటికి నదుల పక్కన పచ్చని మైదానాలు ఉన్నాయి. కానీ వాటిని రక్షించడం కోసం దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యం అక్కడ ఉంది. నీరు ఎంతో ప్రియమైనదిగా మారిపోయింది, బంగారం, వజ్రాలకంటే విలువైనదిగా అయిపోయింది.

నేనుడే చోట వృక్షాలు అసలే లేవు, ఎందుకంటే అక్కడ వర్షాలు అస్సలుకే పడవు. ఎప్పుడైన వర్షం పడినా, అది యాసిడ్ వర్షమే అవుతుంది. 20 వ శత్బాదంలో పరిశ్రమలు చేసిన కాలుష్యం, అణు ప్రయోగాల కారణంగా ఋతువుల క్రమం దెబ్బతిన్నది. అప్పట్లో ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడమని ఎందరో మొత్తుకున్నారు, కానీ ఎవరూ వినలేదు, విన్నా పట్టించుకోలేదు.

నా కొడుకు, నా యవ్వనం గురించి మాట్లాడమన్నప్పుడు పచ్చని బైళ్ళ గురించి, అందమైన పువ్వుల గురించి, వానల గురించి, నదులు, డ్యాముల్లో ఈత కొట్టడం గురించి, చేపలు పట్టడం గురించి, కడుపు నిండుగా నీరు త్రాగడం గురించి, ప్రజల ఆరోగ్యం గురించే మాట్లాడుతాను.

అప్పుడు వాడు 'నాన్నా! ఇప్పుడు నీళ్ళెందుకు లేవు?' అని అడగ్గానే నా గొంతులో వెలక్కాయ పడినట్టు అవుతుంది. నాకు కలిగే అపరాధభావం నుంచి బయటపడలేను. ఎందుకంటే నా తరమే పర్యావరణవినాశనానికి దోహదపడింది, ఎన్ని హెచ్చరికలు చేసిన బేఖాతరు చేసింది. ఇప్పుడు నా పిల్లలు దానికి భారీ మూల్యం చెల్లిస్తున్నారు. నిజాయతీగా చెప్పాలంటే ఈ భూమి మీద జీవం ఇక ఎంతో కాలం ఉండదు. పర్యావరణ విధ్వంసం దారుణమైన స్థితికి చేరుకుంది, ఇప్పుడేమి చేసినా ఫలితం ఉండదు.

కాలంలో వెనక్కు వెళ్ళి మానవాళికి ఎలా చెప్పాలని ఉంది. ఈ భూమాతను కాపాడటానికి ఇంకా మనకు సమయం మిగిలే ఉందని. కానీ అదెలా సాధ్యం.

మీ అబ్దుల్ కలాం
ఇంకా సమయం మిగిలే ఉంది, భూమాతను, ప్రకృతిని కాపాడటానికి. రండి చేయి, చేయి కలుపుదాం

Saturday, 23 April 2016

19000 HINDI SONGS

19000 HINDI SONGS with video. IT IS CREDITABLE WHO MADE THIS POSSIBLE, AND WHAT TECHNOLOGY CAN PLACE IN YOUR PALM .

*I'm sending you thousands of Hindi songs and Ghazals. Just click on the> singer of your choice, then click on the song you want to listen, and enjoy.

*Lata Mangeshkar (3206) <http://www.hindigeetmala.net/singer/lata_mangeshkar.php>

*Mohammad Rafi (2019) <http://www.hindigeetmala.net/singer/mohammad_rafi.php>

*Asha Bhosle (1624) <http://www.hindigeetmala.net/singer/asha_bhosle.php>

*Kishore Kumar (1431) <http://www.hindigeetmala.net/singer/kishore_kumar.php>

*Alka Yagnik (1228) <http://www.hindigeetmala.net/singer/alka_yagnik.php>

*Udit Narayan (947) <http://www.hindigeetmala.net/singer/udit_narayan.php>

*Mukesh (880) <http://www.hindigeetmala.net/singer/mukesh.php>

*Kumar Sanu (800) <http://www.hindigeetmala.net/singer/kumar_sanu.php>

*Sonu Nigam (714) <http://www.hindigeetmala.net/singer/sonu_nigam.php>

*Sunidhi Chauhan (524) <http://www.hindigeetmala.net/singer/sunidhi_chauhan.php>

*Anuradha Paudwal (480) <http://www.hindigeetmala.net/singer/anuradha_paudwal.php>

*Talat Mahmood (451) <http://www.hindigeetmala.net/singer/talat_mahmood.php>

*Shaan (352) <http://www.hindigeetmala.net/singer/shaan.php>

*Kavita Krishnamurthy (304) <http://www.hindigeetmala.net/singer/kavita_krishnamurthy.php>

*Abhijeet (295) <http://www.hindigeetmala.net/singer/abhijeet.php>

*Manna De (269) <http://www.hindigeetmala.net/singer/manna_de.php>

*Shreya Ghoshal (235) <http://www.hindigeetmala.net/singer/shreya_ghoshal.php>

*Suraiya (226) <http://www.hindigeetmala.net/singer/suraiya.php>

*Sadhana Sargam (220) <http://www.hindigeetmala.net/singer/sadhana_sargam.php>

*Ghulam Ali (209) <http://www.hindigeetmala.net/singer/ghulam_ali.php>

*Sukhwinder Singh (204) <http://www.hindigeetmala.net/singer/sukhwinder_singh.php>

*Geeta Dutt (203) <http://www.hindigeetmala.net/singer/geeta_dutt.php>

*Hemant Kumar (199) <http://www.hindigeetmala.net/singer/hemant_kumar.php>

*Mahendra Kapoor (179) <http://www.hindigeetmala.net/singer/mahendra_kapoor.php>

*Shankar Mahadevan (164) <http://www.hindigeetmala.net/singer/shankar_mahadevan.php>

*Shamshad Begum (163) <http://www.hindigeetmala.net/singer/shamshad_begum.php>

*Suresh Wadkar (158) <http://www.hindigeetmala.net/singer/suresh_wadkar.php>

*Amit Kumar (155) <http://www.hindigeetmala.net/singer/amit_kumar.php>

*Hariharan (148) <http://www.hindigeetmala.net/singer/hariharan.php>

*Kunal Ganjawala (144) <http://www.hindigeetmala.net/singer/kunal_ganjawala.php>

*Pankaj Udhas (144) <http://www.hindigeetmala.net/singer/pankaj_udhas.php>

*Jagjit Singh (141) <http://www.hindigeetmala.net/singer/jagjit_singh.php>

*K. K. (129) <http://www.hindigeetmala.net/singer/k_k.php>

*Vinod Rathod (129) <http://www.hindigeetmala.net/singer/vinod_rathod.php>

*S P Balasubramaniam(119) <http://www.hindigeetmala.net/singer/s_p_balasubramaniam.php>

*Suman Kalyanpur (104) <http://www.hindigeetmala.net/singer/suman_kalyanpur.php>

*Adnan Sami (98) <http://www.hindigeetmala.net/singer/adnan_sami.php>

*Mohammed Aziz (91) <http://www.hindigeetmala.net/singer/mohammed_aziz.php>

*Himesh Reshammiya (86) <http://www.hindigeetmala.net/singer/himesh_reshammiya.php>

*Alisha Chinai (83) <http://www.hindigeetmala.net/singer/alisha_chinai.php>

** Pl forward to all those who love or like listening to Hindi songs...🎵🎵🎵  Enjoy...🎵🎵🎵

దేవుని గది ఎలా ఉండాలంటే..?



ఇంటిలో దేవుడి పటాలకు, ప్రతిమలకు మనం పూజలు చేసుకుంటాం. గృహంలో దేవుడి గది ప్రత్యేకం. అయితే ఎవరి ఆర్ధిక స్ధోమతను బట్టి వారు దేవుడికి అలమరాలలో ఒక అరగాని, ప్రత్యేకించి ఒక మందిరంగాని లేదా ప్రత్యేకంగా ఒక గదినిగాని ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇంటిలో ఎక్కడ వీలు దొరికితే అక్కడ దేవుడి గదిని ఏర్పాటు చేసుకోకూడదు. దేవుడి గది కోసం కూడా వాస్తును పాటించాల్సిందే.

దేవుడికి ప్రత్యేకించి ఒక గదిని ఏర్పాటు చేయలనుకుంటే, ఈశాన్యం గదిని అందుకు వాడుకోవటం మంచిది. అయితే ఈశాన్యం గదిలో ఎత్తుగా అరుగుగాని మందిరం మాదిరి కట్టడంగాని నిర్మించుకూడదు. దేవుడి పటాలను ఈశాన్యం గదిలో దక్షణ, పశ్చిమ నైరుతిలలో పీట వేసిగాని, ఏదైనా మంచి వస్ర్తము వేసి దానిపై పటాలు, ప్రతిమలు వుంచి పూజించుకొనవచ్చును.

ఈశాన్యం గదిని దేవుడి గదిగా ఏర్పాటు చేయడం వీలుకాని పక్షంలో తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, వాయవ్యాలలో దేవుడిగదిని ఏర్పాటు చేసుకోవచ్చు. నైరుతి ఆగ్నేయ గదులు మాత్రం దేవుడి గదులుగా చేయకండి. ప్రత్యేకించి దేవుడిగదిని ఏర్పాటు చేయటం అనుకూలం కాని పక్షంలో గృహములో ఏ గదిలోనైనా సరే (నైరుతి, ఆగ్నేయ, గదులలో అయిన సరే) అలమారలలోగాని, పీటమీదగాని దేవుడి పటాలు, ప్రతిమలు వుంచుకొని పూజించవచ్చు.

అయితే దేవుడి పటాలు, ప్రతిమలు ఎటువైపు(ఏ దిక్కుకు) అభిముఖంగా వుండాలి? అనేది అనేకమంది ప్రశ్న కొందరు తూర్పు, ఉత్తరాలకు దేవుడు అభిముఖంగా వుండాలని, మరికొందరు పూజించేవారి ముఖము తూర్పు, ఉత్తరాలకు అభిముఖంగా వుండాలని చెబుతున్నారు. మీరు ఏ వైపుకు అభిముఖంగా వున్నా ఇందు వాస్తుకు సంబంధం లేదని, అది మనలోని భక్తికి సంబంధించినదని చెప్పవచ్చు. అయితే ధ్యానం చేసే అలవాటు వుంటే తూర్పుకు అభిముఖంగా వుండి ధ్యానం చేయటం ఉత్తమం. ఉత్తరాభిముఖము కావటం రెండవ పక్షంపై అంతస్తుల్లో కూడా పూజగదిని ఏర్పాటు చేసుకొనవచ్చును.

దేవుని గది నిర్మాణంలో జాగ్రత్తలు :-

గృహ నిర్మాణంలో మిగతా వాటిలాగే పూజ గదికి కూడా వాస్తు ప్రాముఖ్యత వుంది. నిజానికి ఈశాన్యంలో పూజ గది ఉండాలని, ఈశాన్యం గదిని పూజ గదిగా ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇది సరైన పద్ధతి కాదు. ఈశాన్యం గదిలో నుంచి రాకపోకలు వుండే విధంగా రెండు ద్వారాలు వుంచి బరువులు వుంచకుండా, పరిశుభ్రంగా వుంచుతూ వాడుకోవడం మంచిది.

తూర్పు, ఉత్తర దిక్కులలో పూజా గదిని ఏర్పాటు చేసుకోవడంలో ఏ మాత్రం దోషం లేదని గ్రహించండి. దక్షిణ, పశ్చిమాల వైపు పూజ గదిని ఏర్పాటు చేయడం వల్ల ఇతర అవసరాల కోసం ఇంటిలో ఎక్కువగా తూర్పు, ఉత్తర భాగాలను వాడడం జరుగుతుంది. ఇది ఒక రకంగా శుభకరం అని గ్రహించండి.

మరో ముఖ్య విషయం ఏమిటంటే.. పూజ గదికి ఎటువైపు కూడా అనుకుని బాత్ రూమ్ లేదా టాయిలెట్సు ఉండకూడదు. ఇదే విధంగా పూజ గది పైనగాని, కింద గాని టాయిలెట్సు, వుండకూడదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి పొరపాటు చేయకూడదు. వీటి విషయంలో అపార్ట్ మెంట్ లో ఉండే వారు జాగ్రత్తగా ఉండాలి. చాలా వరకు అపార్ట్ మెంట్స్ లో ఒకరి పూజ గది పైన ఇతరుల టాయిలెట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదు.

అలాగే పూజ గది మీద 'లో-రూఫ్' వేసి అనవసరమైన సామాను వేయడం చాలా మంది చేస్తుంటారు. ఇలా చేయకూడదు. పూజ గదిలో అరుగులు నిర్మించి దానిపై దేవుని పటాలను వుంచి పూజ చేసుకోవడం చాలా ఇళ్లల్లో అలవాటుగా వుంది. పూజ పటాలను అరుగులపై వుంచే కన్నా, కొయ్యపీట, మండపములో వుంచుకోవడం మంచిది. అరుగు మీద లేదా నేల మీద పూజ పటాలు వుంచినప్పుడు నేలపై కొత్త వస్త్రాన్ని ఏర్పాటు చేసి దానిపై పూజ పటాలను ఏర్పాటు చేయాలి. వట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు. చాపగాని, వస్త్రముగాని వేసుకొని దానిపై కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించాలి. పూజా గృహంలో నిత్య దీపారాధన ఎంతో శుభకరం.

ఇక చాలా మంది తమ పెద్దల ఫోటోలను దేవుని ఫోటోల పక్కన వుంచి పూజించడం అలవాటుగా వుంది. పెద్దల విషయంలో మనకున్న గౌరవానికి గాను వారి ఫోటోలకు ప్రత్యేకంగా వుండాలేగాని, పూజ గదిలో దేవుడి ఫోటోలతో సమంగా వుంచడం శుభకరమైన విధానం కాదు.

కష్టమంటే ఏంటీ?

అప్పట్లో కష్టం అంటే ! తినడానికి సరైన తిండి దొరక్క, చదివినా ఉద్యోగం దొరక్కపోవడం, భార్యకి భర్తపోరు, అత్తపోరు, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు, ఆరుగాలం కష్టపడిన రైతుకి పంట చేతికి అందకపోవడం, ఇంటిల్లపాది ఒక్కరి సంపాదనతో బ్రతకడం, చాలిచాలని జీతాలు ఇలా ఒకస్థాయిలో ఉండేవి. మిగిలిన వాటికి చాలావరకు సర్దుకుపోయేవారు. సరిపెట్టుకునేవారు.

ఇప్పుడు కష్టం రూపురేఖలు మారిపోయాయి..
పరీక్ష తప్పితే కష్టం, అమ్మ తిడితే కష్టం, నాన్న కొడితే కష్టం, పాఠాలు నేర్పే గురువు అరిస్తే కష్టం, సరైన చీర కొనకపోతే కష్టం, ఎవరైనా ఎదురొస్తే కష్టం, పొద్దున్నే లేచి ఎవడి ముఖం చూసినా కష్టమే, సినిమాకో షికారుకో ఇంట్లోవారో, బయటివారో తీసుకెళ్ళకపోతే కష్టం, నచ్చింది దొరక్కపోతే కష్టం, తనకి నచ్చింది ఎవరైనా తీసుకుంటే కష్టం, పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తానో లేదో అనే కష్టం, నచ్చినవాళ్ళు దొరక్కపోతే కష్టం, ఎదురు చెప్పడం కష్టం, తన మాట నేగ్గకపోవడం కష్టం, ప్రతి చిన్నవిషయం కూడా నేటివారికి కష్టంగానే కనిపిస్తుంది.  ఇప్పటివారి కష్టాలకి లక్ష్యమైన కారణం ఒక్కటే..

అనుకున్నది దొరకాలి. అప్పుడు కష్టం లేనట్లు. పిన్నీసు దొరక్కపోయినా ప్రాణం పోయేంత కష్టం వచ్చినట్లు బాధలు పడిపోతున్నారు. ఇవి నాటికీ నేటికి కష్టాల్లో వచ్చిన మార్పులు.
 అప్పట్లో చదువులు లేవు కదా మనస్సు చాలా బలంగా ఉండేది. ఎందుకంటే చిన్ననాటి నుండి కష్టాలు చూసి పెరిగారు. ఇప్పుడు కష్టం అంటే ఏంటో తెలియకుండా తల తాకట్టు పెట్టయిన కోరిందల్లా కాళ్ళ ముందు పెడుతున్నారు దీంతో ప్రతీది కష్టమే! చదువులు ఎక్కువయ్యాయి కదా! మానసిక బలం తగ్గిపోయింది. నేనేదో చదువులు మీద యుద్ధం చేస్తున్నాను అనుకోకండి.

పిల్లలకి ఇప్పటి కొత్తతరం పెద్దలకి చెప్పేది ఏంటంటే! చదవండి చదివించండి. దాంతోపాటే కష్టపడడం నేర్పండి. మీరు ఎంత కష్టపడుతున్నారో తెలియజేస్తూ పెంచండి. మేము పడుతున్న కష్టం చాలు పిల్లలు ఎందుకు పడాలి అనుకోవడం అంత పెద్దపోరబాటు  ఇంకోటి లేదు. 

Tuesday, 19 April 2016

ఎమ్మెల్యే అయినా సైకిళ్లు రిపేర్ చేసుకుంటూ బతికాడు

ఎమ్మెల్యే అయినా సైకిళ్లు రిపేర్ చేసుకుంటూ బతికాడు.. డబ్బుల్లేక రెండోసారి టికెట్ వద్దన్నాడు!

ఇదేదో బీసీ కాలం నాటిదో.. సెవెన్టీస్ టైమ్ లోని స్టోరీయో కాదు.. ఇప్పటిదే! ఆ మహనీయుడు మనతో బతుకుతున్నాడు. రాజకీయాల్లో అవినీతి గురించి మాట్లాడే ముందు ఈ నాయకుడి గురించి తెలుసుకోవాలి. అవినీతి చేయకుండా రాజకీయంలో బతికుతున్న అతి కొద్ది మంది నాయకుల్లో ఇతనొకరు.. పేరు నల్లతంబి.. ఊరు మద్రాస్.. పార్టీ డిఎండికె.

మామూలుగా ఎన్నికల్లో టికెట్ కోసం కోట్లు ఖర్చు పెడతారు. గెలుపు కోసం ఇంకొన్ని కోట్లు ఖర్చు పెడతారు. ఓ వైపు కోటీశ్వరులు టికెట్ల కోసం నానా తిప్పలూ పడుతుంటే పెద్ద పార్టీ టికెట్ నే వద్దనేశాడు నల్లతంబి. పోనీ రాజకీయాలకు కొత్తా అంటే కాదు.. ఐదేళ్ల పాటూ ఎమ్మెల్యేగా పనిచేశాడు. పార్టీ అధిష్టానం టికెట్ ప్రకటించే ముందే ఈయనే డైరెక్టుగా అధిష్టానాన్ని కలిశాడు. విజయ్ కాంత్ దగ్గరకు వెళ్లి ఈసారి తనకు టికెట్ వద్దనీ.. ఎన్నికల్లో ఖర్చుకు సరిపడా డబ్బులు లేవని చెప్పేశాడు. ఇంకొకడైతే టికెట్ తనకే ఇవ్వమని అడిగి ఎక్కడో అక్కడ డబ్బు తెచ్చే వాడు. ఆ డబ్బు తిరిగి తీర్చడానికి అవినీతి చేసేవాడు. కానీ మన తంబికి అవినీతి రోగం అంటలేదు. అందుకే ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఏం సంపాయించకుండా అలానే ఉన్నాడు. పైగా తమిళ ఎమ్మెల్యేలకు మన దగ్గర ఉన్నన్ని జీతాలు కూడా లేవు. దీంతో నల్లతండి డెసిషన్ మిగిలిన తంబీలకు షాకే.

చెన్నపట్నంలోని పురసైవాక్కంలో సైకిల్ రిపేర్ షాపు ఒకటుంది. దాని ఓనరే ఈ నల్లతంబి.. విజయకాంత్ స్థాపించిన డిఎండికె పార్టీలో చురుకుగా పనిచేసేవాడు. సామాన్య కార్యకర్త నుంచి పార్టీ యువజన విభాగం ఉప కార్యదర్శి వరకూ ఎదిగాడు.. నల్లతంబి సిన్సియారిటీ, కమిట్మెంటు నచ్చి స్వయంగా విజయకాంత్ పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్మూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. బలమైన డిఎంకె అభ్యర్థిని తక్కువ తేడాతో ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అప్పుడే అందరి ఫోకస్ నల్లతంబిపై పడింది. ఏ హంగూ లేకుండా సాదా సీదాగా బతికేవాడు నల్లతండి.

నల్లతంబి జీవితం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే.. ఎమ్మెల్యే అయ్యాక సైకిల్ రిపేర్ షాపులో కూర్చోవడం కష్టం. కష్టం అంటే నామోషీ కాదు.. నిత్యం జనాలతో కలవాల్సిన, తిరగాల్సిన పనులు ఎమ్మెల్యేకి చాలా ఉంటాయి. దీంతో ఎమ్మెల్యేగా వచ్చే జీతమే ఆధారం. జీతమంటే మన ఆంధ్ర-తెలంగాణల్లో ఇస్తున్నట్టు అక్కడ 2-3 లక్షలు ఇవ్వరు. తమిళనాడులో ఇప్పుడు ఎమ్మెల్యే జీతం నెలకు 55 వేలు. దీంతోనే నెలంతా నెట్టుకొచ్చేవాడు నల్లతంబి. అందులోనే పీఏ జీతం, ఆఫీసు మెయింటినెన్సు, ట్రాన్స్పోర్టు.. అన్నిటికీ మించి నెల నెలా కుటుంబం గడవడానికి కూడా ఆ జీతమే ఆధారం. తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండానే ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు. (మామూలుగా ఎమ్మెల్యేల జీతాలు పెరిగితే కోపం వస్తుంది కానీ.. ఇలాంటోళ్లను చూసినప్పుడు ఎమ్మెల్యేకి 5 లక్షల జీతం ఇచ్చినా తప్పులేదనిపిస్తుంది!). కుటుంబం ఇంత భారంగా నడుస్తున్నా ఎక్కడా కక్కుర్తి పడలేదు. ఎమ్మెల్యే హోదాలో.. అది కూడా చెన్నై నగరంలో ముఖ్యమైన ప్రాంతమైన ఎగ్మూరు ప్రాంతానికి ఎమ్మెల్యే అంటే మాటలు కాదు.. ఎవరినీ నోరు తెరిచి అడగకపోయినా నెల నెలా లక్షల రూపాయలు వచ్చి పడతాయి. కానీ నల్లతంబి అలా చేయలేదు. నల్లతంబి నిజాయితీకి ఎన్నో ఉదాహరణలున్నాయి.

అసెంబ్లీలో వివాదాలు నడుస్తూనే ఉంటాయి. ఒక రోజు సభలో నల్లతంబి సహా చాలా మంది డిఎండికె ఎమ్మెల్యేల మీద వేటు పడింది. ఆరు నెలలు సస్పెండ్ చేశారు. మిగిలన వాళ్లకి అది పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ నల్ల తంబికి సమస్యే. ఎందుకంటే సస్పెండ్ చేసిన సమయానికి జీతం రాదు. అలాగని పని చేసుకోలేడు.. ఎందుకంటే ఆ సమయంలో ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి. దీంతో మనోడి పరిస్థితి అర్థం చేసుకుని సస్పెన్షన్ లో ఉన్నన్నాళ్లూ నెలకు 10 వేల రూపాయల చొప్పున ఖర్చులకు పంపించాడు విజయకాంత్.. వాటితోనే బొటా బొటీగా సర్దుకుని బతికాడు.

మనోడి నిజాయితీని పట్టి చూపే మరో ఉదాహరణ ఉంటుంది. ఇప్పుడు మన రెండు రాష్ట్రాల ఎమ్మెల్యేలను ఓసారి గుర్తు చేసుకోండి. నియోజకవర్గం అభివృద్ధి అని పట్ట పగలు పచ్చి అబద్ధాలు చెప్పి సిగ్గులేకుండా పార్టీలు మారుతున్నారు మనోళ్లు. కానీ నల్లతంబిని తమ పార్టీలోకి తీసుకోవాడానికి ఎంత మంది ప్రయత్నించినా లాభం లేకపోయింది. పార్టీ మారితే 15 కోట్ల రూపాయల డబ్బు ఇస్తామని చెప్పినా నల్లతంబి వినలేదు. తను జీవితాంతం సైకిల్ షాపు నడిపినా సంపాయించలేనంత డబ్బు అది. కానీ తంబి లొంగలేదు. తనకు టికెట్ ఇచ్చిన పార్టీకి ద్రోహం చేయబోనని ఎదుటి పార్టీ వాళ్లకు తెగేసి చెప్పేశాడు.

5 సంవత్సరాలు గిర్రున తిరిగాయి. మళ్లీ ఎన్నికలు వచ్చాయి. నల్లతంబి టికెట్ కి ఢోకా లేదు. విజయకాంత్, ఆయన భార్య ప్రేమలత టికెట్ల లిస్టుపై కూర్చున్నారు. అందులో ముందు ఓకే చేసిన పేరు నల్లతంబిదే. అలా జరుగుతుందన్న విషయం నల్లతంబికీ తెలుసు. కానీ ప్రకటన కంటే ముందే విజయకాంత్ ని కలిశాడు. టికెట్ వద్దని సున్నితంగా చెప్పాడు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల్లో నెగ్గడానికి కోట్లు కావాలనీ.. తనకు అంత స్తోమత లేదని చెప్పేశాడు. అయితే పార్టీ విజయం కోసం పనిచేస్తానని మాటిచ్చాడు. టికెట్ తప్ప ఏ పనైనా అప్పజెప్పండని చెప్పడంతో.. విజయకాంత్ భార్య ప్రేమలతకు తోడుగా ఎన్నికల ప్రచారానికి పంపుతున్నారు నల్లతంబిని.

ఈ విషయంలో విజయకాంత్ తప్పు కూడా ఉంది. అటువంటి నిజాయితీ పరులను వదులకోవడం పిచ్చి పని. అతని దగ్గర డబ్బు లేకపోతే పార్టీ ఫండ్ నుంచైనా ఖర్చు చేసి, అతన్ని ఒప్పించి టికెట్ ఇచ్చుండాల్సింది. బాగా డబ్బున్న వాళ్లు, టికెట్ల కోసం ఎదురు పెట్ట గలిగే వాళ్లు చాలా మందే పోటీ చేసి ఉంటారు కదా. వారి దగ్గర నుంచైనా వసూలు చేసి నల్లతంబిని గెలిపించుకుని ఉంటే బావుండేది. కానీ ప్రస్తుతానికి ఆ ఛాన్స్ లేదు.

ఒకటి నిజం… తమిళనాడు అసెంబ్లీలోని నిఖార్సయిన నాయకుడిని వచ్చే సభలో చూడలేకపోవచ్చు.. కానీ ఈ అసెంబ్లీ ఎన్నికలే సర్వస్వం కాదు.. సభ మొత్తం నల్లతంబి లాంటి నాయకులే నిండిపోయే రోజు రావాలని కోరుకుందాం. అందుకోసం ప్రయత్నిద్దాం. కంగారుపడకండి. ప్రయత్నించడం అంటే మీరేమీ రోడ్డు మీదకి రావక్కర్లేదు. ఐదేళ్లకోసారి పోలింగ్ బూత్ కి వెళ్లి పది నిమిషాలు స్పెండ్ చేయండి చాలు! జై నల్లతంబి!

ఒకప్పటి గోవా సీఎం కథ

గోవా తెలియని వారూండరు.
గోవా నగరం లో ఒక ట్రాఫిక్ సిగ్నల్ పడింది ఆది చూసి స్కూటెర్ నడుపుతున్న వ్యక్తి బండి ఆపేసాడు.
.
వెనుకగా ఒక కార్ వచ్చింది ఒకటే హార్న్ కొడుతూ దారి ఇవ్వమని అడిగాడు.  స్కూటర్ పైన ఉన్న వ్యక్తి రెడ్ లైట్ చూపాడు.
.
నాకు తెలుసులే నువ్ తప్పుకో నేను గోవా పోలీస్ ఆఫీసర్ కొడుకుని అన్నాడు.
.
స్కూటర్ మీదున్న వ్యక్తి  చిన్నగా నవ్వి నేను గోవా ముఖ్యమంత్రిని అన్నాడు.
.
ఒక సామాన్య ముఖ్య మంత్రి.
అసెంబ్లీ కి స్కూటర్ మీద వెళతారు.
ప్రోటోకాల్ ఉండదు.
పోలీస్ కేస్ లలో జోక్యం ఉండదు
ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి ని కేంద్ర ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చి రమ్మంది.
.
ఒక ముఖ్య మంత్రి తమ రాష్ట్రం నుండి కేంద్ర మంత్రిగా వెళుతున్నారంటే సంతోషించే వారే కదా ప్రజలు.
.
ఆయన్ని గోవా ముఖ్యమంతి పదవికి రాజీనామా చేసి కేంద్ర రక్షణ మంత్రి బాధ్యతలు స్వీకరించామని కొరినపుడు యావత్ గోవా కంట తడి పెట్టింది
.
రాజకీయ నాయకులు అంటేనే అసహ్యం జుగుప్సు ఉన్న ఈ రోజుల్లో తమ నాయకుడు తమని వదిలి కేంద్రానికి వెళుతున్నారంటే ప్రజలు  కన్నీరు పెట్టారంటే ఆయన ఎంత పెద్ద నాయకుడో ఇట్టే చెప్పొచ్చు.
.
ట్రాఫిక్ జాం ఐతే కార్ దిగేసి స్కూటెర్ పై ఉన్న వాడిని లిఫ్ట్ అడిగెస్తాడు. బడ్డీ కొట్టు లో టీ తాగేస్తాడు. ఫుట్ పాత్ పై ఉన్న బజ్జీలు తింటాడు. అదేమిటి అని అడిగితే మన పాలన గురించి బడ్డీ కొట్టు లో తెలిసినంత మరెక్కడా తెలీదు అని చిరునవ్వుతో సమాధానం ఇస్తాడు.
.
గోవా ముఖ్య మంత్రిగా ఒక కాన్ఫరెన్స్ కి హాజరు కావాల్సి ఉంది కార్ ఆగింది ఒక వ్యక్తి దిగి ఒక చేత్తో బాగ్ మరో చేత్తో ఫైల్స్ మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెనక సెక్యూరిటీ వచ్చారు ఎక్కడ గోవా ముఖ్య మంత్రి అని వారిని అడిగితే అదిగో ఫైల్స్ మోసుకెళుతున్న వ్యక్తే మా ముఖ్యమంత్రి అని చెప్పరాట సెక్యూరిటీ.
.
తీరా లోపలికెళ్లాక ఆ స్టార్ హోటెల్ గేట్ వద్ద ఉన్న వ్యక్తి ఎవరు మీరు లోపలికి వెళుతున్నారు అని ఆపేశారట వెనక నుండి సెక్యూరిటీ వచ్చి మా ముఖ్య మంత్రి అని చెబితే అవాక్కయ్యడట
.
అంతటి మంచి వ్యక్తి తమ రాష్ట్రం నుండి వెళుతుంటే బాధ తో కన్నీరు పెట్టారంటే నమ్మలేము  ఆ వ్యక్తి ఎంతటి ధనికుడో మీరే చెప్పాలి.
.
అవును నేను చెప్పేది మన రక్షణ మంత్రి మనోహర్ పరికర్ గారి గురించి.
.
అత్యంత పేద కుటుంబం నుండి వచ్చి IIT పట్టా పొందిన పరికర్.

Friday, 15 April 2016

కళ్యాణ రాముని అవతార కథ

కళ్యాణ రాముని అవతార కథ :-
        తత శ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ
           నక్షత్రే  దితి దైవత్యే స్వోచ్ఛ సంస్థేషు పంచసు
   శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. శ్రీ రామ నవమి పండుగను స్వామి జన్మదినంగాను, సీతా మాతతో కళ్యాణ మహోత్సవంగాను జరుపుకుంటారు. భగవంతుడు ధరించిన మానవ అవతారములలో యీ శ్రీరామచంద్రమూర్తి అవతారము సంపూర్ణ మానవావతారమని రామాయణ కావ్యము తెల్పుతున్నది. శ్రీరామునిగా మానవావతారమెత్తిన భగవంతుడు మానవుడు ఎలా వుండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏఏ ధర్మాలను పాటించాలి అనే విషయాలను తను ఆచరించి మానవులకు చూపి, ఆదర్శమూర్తి అయి, ఇప్పటికిని అనగా త్రేతాయుగములో అవతరించి, ద్వాపరము అయి కలియుగము నడుస్తున్న ఈ నాటికి కూడా దేవునిగా కొనియాడబడుతూ శ్రీ రామ నవమి అను పేరున నవరాత్రములు, కళ్యాణ మహోత్సవములు జరిపించుకొనుచున్నాడు.
   ( ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు క్రీ.పూ 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు. )
     భగవంతుడు తన భక్తుల కోర్కెలను తీర్చుటకును, దుష్టుల సంహరించుటకును, సజ్జనుల కష్టముల నుండి కడతేర్చుటకును ఆయా సందర్భాను సారముగ అవతారముల నెత్తును. భారత ఇతి హాసముల ద్వారా పురాణముల ద్వారా కావ్యముల ద్వారా మనకు భగవంతుని అవతారముల గురించి తెలియుచున్నది.
పూర్వము వాల్మీకి యను మహర్షి శ్రీ మద్రామాయణము అను మహా కావ్యము వ్రాసెను. భారతీయులకు వాల్మీకి మొదటి కావ్యరచయిత; శ్రీ మద్రామాయణమే మొదటి కావ్యము . ఈ కావ్యము నుండి భగవంతుని దశావతారములు లోని రామావతారము గురించి మనకు తెలియుచున్నది.
జన్మ వృత్తాంతం : - త్రేతా యుగమున రావణాసురుడు యను రాక్షసుడు భూలోకమున లంకాధీశుడై పరమశివుడు, బ్రహ్మలగురించి తపస్సు చేసి వారిచే అనుగ్రహింపబడిన వర గర్వితుడై ఎవ్వరిని లెక్క చేయక దేవతలను, ఋషులను, హరి (విష్టువు) భక్తులను వేధించుచుండెను. అప్పుడు వారందరు హరిని ప్రార్ధించి తమ కష్టములను మొర పెట్టుకొనగా, ఆ మహా విష్ణువు రామునిగా అవతరించి రావణుని కడతేర్చెద నని వారికి చెప్పి, వారిని శాంతపరచి పంపెను.
భూలోకమున అయోధ్యా నగర చక్రవర్తి దశరధుడు పుత్రుల కొరకై పుత్ర కామేష్టి యను యఙ్ఞమును చేయుచుండెను. ఆ యఙ్ఞమునకు సంతసించిన దేవతలు అగ్ని దేవుని ద్వారా దశరధునికి పాయసము ను పంపిరి. ఆ పాయసమును దశరధుడు తన మువ్వురు భార్యలకు అనగా కౌసల్య, సుమిత్ర,కైకేయి లకు పంచెను. కొన్నాళ్లకు యీ మువ్వురు భార్యలు గర్భవతులై నలుగురు మగబిడ్డలను ప్రసవించారు. ఆ మహా విష్ణువే తన ఆది శేషువు, శంఖ చక్రములు, గదలతో సహా యీ నలుగురు పుత్రులుగా అవతిరించెను. రావణ సంహారము కొరకు అవతరించిన ఆనలుగురు పుత్రులే శ్రీరామ చంద్రమూర్తి, లక్ష్మణుడు, భరతుడు మరియు శతృఘ్నుడు.
చైత్ర మాసమున, శుద్ధ నవమీ తిధినాడు, పునర్వసు నక్షత్రమున ఐదు గ్రహములు ఉచ్ఛంలో నుండగ కర్కాటక లగ్నమున గురుడు చంద్రునితో కలసి వుండగా, జగన్నాధుడు, సర్వలోకారాధ్యుడు , సర్వ లక్షణ సంయుతుడును అగు ఆ మహా విష్ణువు కౌసల్యాదేవి గర్భమున శ్రీరామ చంద్రమూర్తిగా జనియించెను. శ్రీరాముడు పూర్ణ మానవుడుగా జీవించెను.
రామ నవమి : -   శ్రీ రాముని జననమైన నవమి తిధి నాడే ఆయన వివాహము సీతా మహాదేవి తో అయినదట. అట్లే రాజ్య పట్టాభిషేకము కూడ నవమి నాడేనట. అందుకనే శ్రీరామ నవమి అని చైత్ర శుద్ధ నవమి నాడే మనము పండుగ జరుపుకుంటాము.
విది విదానం : - ఆ రోజు మానవులందరూ తల స్నానము చేసి శుభ్రమైన లేక క్రొత్త బట్టలను ధరించి సీతారాముల పూజించి, కళ్యాణ మహోత్సవను జరిపించి, వసంత ఋతువు - ఎండాకాలము అగుటవలన పానకము, వడపప్పు ఆరగింపు చేసి ప్రసాదము పంచుదురు. దశమి నాడు పట్టాభిషేక ఘట్టము జరుపుదురు. కొందరు చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు రామనవరాత్రోత్సవము జరుపుదురు. ఈ తొమ్మిది దినములందు రామాయణ పారాయణము, రాత్రులందు రామకధా కాలక్షేపము జరుపుదురు.
శ్రీ రామనవమి నుండి రామకోటి వ్రాయుట నారంభించి, మరుసటి శ్రీ రామనవమికి ఆ వ్రతము ముగించు ఆచారము కూడ కలదు. శ్రీ రామ నామము లక్ష, కోటి వ్రాసిన ఒక్కోక్క అక్షరమే మహా పాతకములను నశింపజేయునని శంకరుడు పార్వతికి చెప్పునట్లు భవిష్య ఉత్తర పురాణమున ఉమామహేశ్వర సంవాదమున వివరింపబడినది.
దేవుడైనను, మానవ రూపమున నున్న కారణమున ఆ శ్రీ సీతారాముడు, మానవుడు తన దుఃఖ ములలో , కష్ట నష్టములలో ఏ విధంగా స్పందించునో ఆ విధముగనే ప్రవర్తించి చూపుటయే గాకపితృవాక్య పరిపాలనము, సత్యసంధత, భ్రాతృప్రీతి, స్నేహ బంధము, ఏక పత్నీ వ్రతము, ఒకే మాట - ఒకే బాణము , మొదలగు కష్టతరమైన ధర్మాలను ఆచరించి చూపి తన శీల సంపదతో మానవ జాతికే కనువిప్పు కలిగించెను.
   అందుకనే "శ్రీ సీతారాముల గుడి లేని గ్రామముండదు... శ్రీ రామ అని మొట్ట మొదట వ్రాయక, యే వ్రాతయూ వ్రాయబడదు" అను నానుడి వచ్చినది. ఆ విధంగా శ్రీ రామ నవమి మానవాళికి పర్వదినమైనది.

How a Password Changed my Life

How a Password Changed my Life ... A true story from the Reader’s Digest ...

I was having a great morning until I sat down in front of my office computer. “your password has expired”, a server message flashed on my screen, with instructions for changing it...In my company we have to change password monthly..
I was deeply depressed after my recent divorce. Disbelief over what she had done to me was what I thought all day.
 I remembered a tip I’d heard from my former boss. He’d said, “I’m going to use a password that is going to change my life”. I couldn’t focus on getting things done in my current mood.. My password reminded me that I shouldn’t let myself be a victim of my recent breakup and that I was strong enough to do something about it.

I made my password – Forgive@her. I had to type this password several times every day, each time my computer would lock. Each time I came back from lunch I wrote forgive her.
The simple action changed the way I looked at my ex-wife.. That constant reminder of reconciliation led me to accept the way things happened and helped me deal with my depression.. By the time the server prompted me to change my password following month, I felt free.

The next time I had to change my password I thought about the next thing that I had to get done. My password became Quit@smoking4ever .
It motivated me to follow my goal and I was able to quit smoking.

One month later, my password became Save4trip@europe, and in three months I was able to visit Europe.

Reminders helped me materialize my goals kept me motivated and excited.
. it's sometimes difficult to come up with your next goal, keeping at it brings great results.

After a few months my password was
lifeis#beauTful  !!!

Life is going to change again 👌👌

నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం

🌻🌹🌻నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం.🌻🌹🌻

1.శుద్ధబ్రహ్మ పరాత్పర రామ
2.కాలాత్మక పరమేశ్వర రామ
3.శేషతల్ప సుఖనిద్రిత రామ
4.బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ
5.చందకిరణ కులమండన రామ
6.శ్రీమద్దశరధనందన రామ
7.కౌసల్యాసుఖవర్ధన రామ
8.విశ్వామిత్రప్రియధన రామ
9.ఘోరతాటకఘాతక రామ
10.మారీచాదినిపాతక రామ
11.కౌశిక మఖసంరక్షక రామ
12.శ్రీ మదహల్యో ద్దారక రామ
13.గౌతమమునిసంపూజిత రామ
14.సురమునివరగణసంస్తుత రామ
15.నవికధావితమృదుపద రామ
16.మిధిలాపురజనమోదక రామ
17.విదేహమానసరంజక రామ
18.త్రయంబకకార్ముకభంజక రామ
19.సితార్పితవరమాలిక రామ
20.కృతవైవాహిక కౌతుక రామ
21.భార్గవదర్పవినాశక రామ
22.శ్రీ మాధయోద్యా పాలక రామ
23.ఆగణితగుణగణభూషిత రామ
24.అవనితనయాకామిత రామ
25.రాకాచంద్రసమానన రామ
26.పితృవాక్యాశ్రితకానన రామ
27.ప్రియగుహావినివేధితపద రామ
28.తత్ క్షాళితనిజమృదుపద రామ
29.భరద్వాజముఖానందక రామ
౩౦.చిత్రకూటాద్రినికేతన రామ
31.దశరధసంతతచింతిత రామ
32.కైకేయీతనయార్థిత రామ
౩౩.విరచితనిజపాదుక రామ
34.భారతార్పిత నిజపాదుక రామ
35.దండకవనజనపావన రామ
36.దుష్టవిరాధవినాశాన రామ
37.శరభoగసుతీక్షార్చిత రామ
38.అగస్త్యానుగ్రహవర్ధిత రామ
39.గృద్రాధిపగతిదాయక రామ
40.పంచవటీతటసుస్థిత రామ
41.శూర్పణఖార్తి విధాయక రామ
42.ఖరదూషణముఖసూదక రామ
43.సీతాప్రియహరిణానుగ రామ
44.మరిచార్తికృదాశుగా రామ
45.వినష్ట సేతాన్వేషక రామ
46. గృధ్రాధిపగతిదాయక రామ
47.శబరిదత్తఫలాశన రామ
48.కబంధభాహుచ్చేధన రామ
49.హనుమత్సేవితనిజపద రామ
50.నతసుగ్రివభిష్టద రామ
51.గర్వితవాలివిమోచక రామ
52. వానరదుతప్రేషక రామ
53.హితకరలక్ష్మణసంయుత రామ
54.కపివరసంతతసంస్మృత రామ
55.తద్గతి విఘ్నద్వంసక రామ
56.సీతాప్రాణాదారక రామ
57.దుష్టదశాన ధూషిత రామ
58. శిష్టహనూమద్భూషిత రామ
59.సీతూధితకాకావన రామ
60.కృతచూడామణిదర్శన రామ
61. కపివరవహనశ్వాసిత రామ
62.రావణధనప్రస్థిత రామ
63.వనరసైన్యసమావృత రామ
64.శొశితసరిధీశార్థిత రామ
65.విభిషణాభయదాయక రామ
66. సర్వతసేతునిభందక రామ
67.కుంబకర్ణ శిరశ్చెదక రామ
68.రాక్షససంఘవిమర్ధక రామ
69.ఆహిమహిరావణ ధారణ రామ
70.సంహ్రృతదశముఖరావణ రామ
71.విభావముఖసురసంస్తుత రామ
72.ఖస్థితధశరధవీక్షిత రామ
73.సీతాదర్శనమోదిత రామ
74.అభిషిక్త విభీషణ రామ
75.పుష్పకయానారోహణ రామ
76.భరధ్వజాభినిషేవణ రామ
77.భరతప్రాణప్రియకర రామ
78.సాకేత పురీభుషన రామ
79.సకలస్వీయసమానత రామ
80.రత్నలసత్పీఠాస్థిత రామ
81.పట్టాభిషేకాలంకృత రామ
82.పార్థివకులసమ్మానిత రామ
83.విభీషణార్పితరంగక రామ
84.కీశకులానుగ్రహకర రామ
85.సకలజీవసంరక్షక రామ
86.సమస్తలోకోద్ధారక రామ
87.అగణితమునిగాణసంస్తుత రామ
88.విశ్రుత రాక్షసఖండన రామ
89.సితాలింగననిర్వృత రామ
90.నీతిసురక్షితజనపద రామ
91.విపినత్యాజితజనకజ రామ
92.కారితలవణాసురవధ రామ
93.స్వర్గతశంబుక సంస్తుత రామ
94.స్వతనయకుశలవనందిత రామ
95.అశ్వమేధక్రతుదీక్షిత రామ
96.కాలావేదితసురపద రామ
97.ఆయోధ్యజనముక్తిద రామ
98.విధిముఖవిభుదానందక రామ
99.తేజోమయనిజరూపక రామ
100.సంసృతిబన్ధవిమోచక రామ
101.ధర్మస్థాపనతత్పర రామ
102.భక్తిపరాయణముక్తిద రామ
103.సర్వచరాచరపాలక రామ
104.సర్వభవామయవారక రామ
105.వైకుంఠలయసంస్ఠీత రామ
106.నిత్యనందపదస్ఠిత రామ
107.కరుణా నిధి జయ సీతా రామ
108.రామరామ జయరాజా రామ

రామ రామ జయసీతా రామ.....