"బలహీనతే బలం, ఓటమే గెలుపుకు మూలం!!"
వేపుడు చెడిపోతే పులుసు పెట్టుకోవాలి,
అన్నం మిగిలిపోతే వడియాలు పెట్టుకోవాలి,
గోడకున్న సున్నం ఊడిపోతే బొమ్మలు అతికించుకోవాలి,
కట్టుకున్న బట్టలకు కన్నం పడితే కుట్లు, అల్లికలు అల్లుకోవాలి,
మట్టిలో మాణిక్యాలు దొరక్కపోతే మంచి పంటనిచ్చే విత్తనాలు చల్లుకోవాలి,
కత్తి పట్టుకునే ధైర్యం లేకపోతే కావడి పట్టి నీళ్లు మొయ్యాలి,
నాలుగు అక్షరాలు ఒంటబట్టించుకునే తెలివి లేకపోతే నాలుగు రాళ్లు వెనకేసుకునే తెగువ చూపాలి,
నాలుగు రాళ్లు వెనకేసుకునే తెగువ కూడా లేకపోతే నాలుగు వేళ్లూ లోపలి వెళ్లే మార్గం వెదకాలి,
పరిగెత్తే బలం లేకపోతే నడిచే ఓపిక తెచ్చుకోవాలి,
ఎగిరే శక్తి లేకపోతే పడిపోకుండా నిలబెడుతున్న నేలను నమ్ముకొవాలి....
...భూమ్మీద, ప్రతి బలహీనతనూ బలంగా మార్చుకునే ఇంకో చోటు ఉంటుంది. ప్రతి తప్పటడుగునూ ఒక వయ్యారంగా చూపే ఇంకో సమయముంటుంది. ప్రతి మనిషికీ తనదైన ఒక ప్రత్యేకత ఉంటుంది. అన్న ప్రాశన చేసిన రోజే ఆవకాయ తినే శక్తి రాదు, ఈ జీవితంలోనే ఉత్తుంగ శిఖరాలు ఎక్కే సాహసం అందరికీ ఒంటబట్టకపోవచ్చు.., కానీ, ఈ జీవితంలోనే ఈ జీవితాన్ని సంతోషంగా జీవించే అవకాశం, ఆ సంతోషాన్ని పలు రకాలుగా పదిమందికీ పంచే అవకాశం మాత్రం ప్రతి ఒక్కరికీ వారి చేతిలోనే ఉంటుంది.
చేపకు నీళ్లల్లో పట్టు ఉంటుంది, పక్షి గాలితో జట్టుకడుతుంది, తుమ్మెదకు పూలతోటలో స్వర్గం అందుతుంది, పంట చేనుకు ముళ్ల కంచె కాపు అవుతుంది, స్థానం ప్రతి స్వభావానికీ ఇంకో ముఖాన్ని ఇస్తుంది. నువ్వు ఎటువంటి వాడివైనా, నీకు ఎలాంటి శక్తి, యుక్తులున్నా లేకున్నా, నీ స్వభావ్వాన్నీ, దాని ప్రభావాన్నీ చక్కగా సమన్వయం చేసుకుంటే నీ పరిధికీ, నీ పరగణాకీ, నీ పరిజనానికీ నువ్వే సింహానివి!
నీ బలహీనతలనే బలంగా మార్చుకో!
ఓటమినే విజయ సోపానంగా పేర్చుకో!
ఈ ప్రపంచాన్ని ఆనందానికి వేదికగా చేసి'పో'!

No comments:
Post a Comment