Wednesday, 11 May 2016

ఈ మెయిల్ ఉండి ఉంటే..!

ఆ కుర్రాడు ఆఫీస్ బాయ్ ఉద్యోగం కోసం ఒక పెద్ద కంపెనీకి ఇంటర్వ్యూ కి వెళ్లాడు.

ఇంటర్వ్యూ లో సెలక్ట్ అయ్యాడు. "నీ ఈ మెయిల్ ఐడీ ఇవ్వు. నీకో అప్లికేషన్ పంపిస్తాను. దాన్ని నింపిపంపించు." అన్నాడు మేనేజర్.

"నా దగ్గర కంప్యూటర్ లేదండీ. నాకు ఈ మెయిల్ కూడా లేదు. " అన్నాడు ఆ కుర్రాడు.

"ఈ మెయిల్ లేదా... అయితే ఈ ఉద్యోగం క్యాన్సిల్" అన్నాడు మేనేజర్.

ఆ కుర్రాడు బయటకి వచ్చేశాడు. ఏం చేయాలో తోచలేదు. కానీ ఏదో సాధించాలన్న పట్టుదల....

జేబులో వంద రూపాయలున్నాయి. పది కిలోల టమాటాలుకొన్నాడు. వాటిని పధ్నాలుగు రూపాయలకు అమ్మేశాడు.

మరుసటి రోజు పధ్నాలుగు కిలోలు కొన్నాడు. ఇలా నెమ్మదినెమ్మదిగా వ్యాపారం బాగుపడింది. లాభాలు వచ్చాయి.

ఒక చిన్న దుకాణం పెట్టాడు. కూరగాయలు తెచ్చుకునేందుకు మినీ ట్రక్కు కొన్నాడు.

కూరగాయలు తెచ్చాక మిగిలిన సమయంలో మినీ ట్రక్కును అద్దెకు తిప్పాడు. ఆదాయం మరింత పెరిగింది.

ఒక దుకాణం నుంచి రెండు, రెండు నుంచి నాలుగు, నాలుగు నుంచి పధ్నాలుగు ఇలా దుకాణాలు పెరిగాయి. కొన్నాళ్లకు ఆయన దేశంలోనే అతిపెద్ద కూరగాయల వ్యాపారి అయ్యాడు.

ఆయన దుకాణాలకు బీమా చేయించమని ఒక పెద్ద కంపెనీ ఆయన వెంట పడింది.

ఆయన దానికి అంగీకరించాడు. మొత్తం ఒప్పందం పూర్తయిపోయింది.

ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ "సర్... మీ ఈ మెయిల్ ఐడీ ఇవ్వండి" అన్నాడు.

"నాకు ఈ మెయిల్ లేదు." అన్నాడు వ్యాపారి.

"ఈ మెయిల్ లేకుండానే ఇంత సాధించారు. ఈ మెయిల్ ఉంటే మీరు ఏం అయి ఉండేవారో ?" అన్నాడు ఏజెంట్.

"ఆఫీస్ బాయ్ అయి ఉండేవాడిని." అన్నాడా వ్యాపారి నవ్వుతూ !!

No comments:

Post a Comment