Thursday, 19 May 2016

*What is maturity? - by Adi Shankara*

1. Maturity is *when you stop trying to change others, ...instead focus on changing yourself.*

2. Maturity is when you
 *accept people as they are.*

3. Maturity is when you
*understand everyone is right in their own perspective.*

4. Maturity is when you
*learn to "let go".*

5. Maturity is when you are
 able to *drop "expectations" from a relationship and give for the sake of giving.*

6. Maturity is when you
*understand whatever you do, you do for your own peace.*

7. Maturity is when you *stop proving to the world, how intelligent you are.*

8. Maturity is when you *don't seek approval from others.*

9. Maturity is when you *stop comparing with others.*

10. Maturity is when you *are at peace with yourself.*

11. Maturity is when you *are able to differentiate between "need" and "want" and are able to let go of your wants.*

*& last but most meaningful !*

12. You gain Maturity when you *stop attaching "happiness" to material things !!*

యముడికీ ఓ గుడి

మన ప్రాణాలను హరిస్తాడు అని నమ్మే యమధర్మరాజుకి కూడా ఎంతో భక్తితో పూజలు చేసే గుడి ఉంది . అది కూడా  తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణాలో ఉంది. అక్కడ ఎన్నో విశేష పూజలు అందుకుంటాడు యముడు. ఆ ఆలయం విశేషాలు మాత్రం ఆసక్తి కరంగా వుంటాయి.

కరీంనగర్ జిల్లా జగిత్యాల దగ్గర " ధర్మపురి " లో ఉన్న ఉగ్ర నరసింహస్వామి ఆలయంలో ఉంది ఈ గుడి.

తమ జాతకాలు బాలేవని, ఏం చేసిన కలిసి రావట్లేదని, లేదా జాతకం ప్రకారంప్రమాదాలు జరిగే సమయమని, మానసికప్రశాంతత కరువయిందని ఇలా రకరకాల సమస్యలతో బాధపడే వారు ఈ ఆలయం లోని యముని దర్శిస్తే ఆ సమస్యల నుంచి ఊరట లభిస్తుంది అని భక్తుల నమ్మకం.

అలాగే శని గ్రహ దోషాలు, జాతక దోషాలు వున్న వారు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటే ఆ భాధలు నుంచి ఉపశమనం లభిస్తుందిట. ఇక్కడ మండపంలో గల గండ దీపంలో నూనె పోసి యముని విగ్రహానికి దణ్ణం పెట్టుకుంటే గండాలన్ని తొలగిపోతాయి అని కూడా భక్తుల నమ్మకం.

ప్రతి నెల భరణి నక్షత్రం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యి పూజలు నిర్వహిస్తారు ఇక్కడ . అంతేకాదుదీపావళికి రెండు రోజుల తరువాత వచ్చే 'యమ ద్వితీయ' రోజున యముడు తన చెల్లి అయిన యమునాదేవి ఇంటికి భోజనానికి వెళ్లి,తిరిగి యమలోకం వెళ్ళే ముందు ఈ రోజు ఎవరైతే తమ తోబుట్టువుల చేతి భోజనం తింటారో వారికి నరక బాధలు ఉండవని వరమిస్తాడని ప్రతీతి కదా !

ఆ రోజున ఇక్కడ యమునికి విశేష పూజలు నిర్వహిస్తారు . యముని దర్శించే వారు ముందుగా గోదావరీ నదిలో స్నానం చేసి, యమునికి పూజలు నిర్వహిస్తారు. ఇలా పేరు తలచుకోవటానికే భయపడే యముని అనుగ్రహం కోసం పూజలు నిర్వహించటం విశేషం గా చెప్పుకోవచ్చు.

పదిహేను వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గుడికి కార్తికంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

మార్కండేయుడికి,మహా పతివ్రత సావిత్రికే కాదు మనకీ వరాలు ఇవ్వటానికి కొలువుతీరి ఉన్నాడు " ధర్మపురి " లో ఉన్న యముడు !!

Saturday, 14 May 2016

జీవితమే పాఠం - నేర్చుకోవడం ఉత్తమం : సోక్రటీస్

సోక్రటీసుకు మరణశిక్ష విధించారు. తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడని అభియోగం. ఆయన్ని జైల్లో పెట్టారు. ఆ వివేకవంతుడంటే అందరికీ గౌరవం. పేరుకు జైల్లో పెట్టారు కానీ అందరూ వచ్చి ఆయన్ని చూసి వెళుతున్నారు. శిష్య బృందమయితే అక్కడే ఉండి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కానీ ఆ తాత్వికుడు ఇదేమీ పట్టనట్లు నవ్వుతూ అందర్నీ పలకరిస్తూ కబుర్లూ చెబుతూ ఉన్నాడు. అందరూ ఆయన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరణమంటే లక్ష్యపెట్టని ఆ మహానుభావుణ్ణి చూసి విస్తుపోతున్నారు. మరణ శిక్ష అమలు కావడానికి రెండు గంటల సమయముంది. ఆ శిక్ష విషం తాగి మరణించడం. సమయం సమీపించే కొద్దీ అభిమానుల గుండెలు కొట్టుకుంటున్నాయి. సోక్రటీస్‌ ఆ సంగతే పట్టనట్లు అది తనకు సంబంధించిన విషయమే కానట్లు ఉన్నాడు. అందరి ముఖాల్లో ఆందోళన దిగులు, ఆయన ముఖంలో ఆనందం వెలుగు. ఆయన కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూచుని లైర్‌ వాద్యం వాయిస్తున్నాడు. ఆ తీగల్ని మీటుతూ పాడుతున్న పాట సోక్రటీస్‌ మనసుని తాకింది. పరవశంగా కళ్ళు మూసుకున్నాడు. చల్లటి గాలి ఆ పాటను మోసుకొచ్చి పరిమళంలా సోక్రటిస్‌ హృదయాన్ని తాకింది. ఎప్పుడూ ఆనందంగా ఉండే అతను మరింత ఆనందపడ్డాడు.

సోక్రటీస్‌ మెల్లగా కళ్ళు తెరచి జైలర్‌ని పిలిచాడు. జైలర్‌ ఎంతో గౌరవభావంతో దగ్గరికి వచ్చి ఏమికావాలన్నాడు. సోక్రటీస్‌ కిటికీలోంచి చూపించి ”మీకు అభ్యంతరం లేకుంటే ఆ బిచ్చగాణ్ణి తీసుకొస్తారా?” అని అడిగాడు. జైలర్‌ ”అయ్యో!దాందేముంది?” అని వెళ్ళి ఆ బిచ్చగాణ్ణి తీసుకొచ్చాడు. సోక్రటీస్‌ ఆ బిచ్చగాణ్ణి తనకాపాట నేర్పమన్నాడు. అతని దగ్గర నుంచి లైర్‌ వాద్యం తీసుకున్నాడు. ఆ బిచ్చగాడు పాటపాడాడు. సోక్రటీస్‌ ఆ పాట పాడుతూ లైర్‌ వాద్యం వాయించాడు. ఇట్లా అరగంట సాధన తరువాత బిచ్చగాడి సాయం లేకుండానే ఆ పాట పాడాడు. సోక్రటీస్‌ కృతజ్ఞతలు చెప్పి బిచ్చగాణ్ణి పంపేశాడు. ఆయన శిష్యులు, జైలర్‌ ఆశ్చర్యపోయారు. మరణశిక్షకు ఇంకా గంట మాత్రమే ఉంది కానీ సోక్రటీస్‌ ప్రవర్తన వాళ్లకు వింతగా అనిపించింది. శిష్యులు ”గురువుగారూ! ఇక గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది. అది తాగి మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళబోతున్నారు. కానీ ఇప్పుడు మీరు లైర్‌ వాద్యంమీద ప్రాక్టీసు చేసి పాట నేర్చుకున్నారు? ఏమిటిది?” అని కన్నీళ్ళ పర్యంతమయ్యారు. సోక్రటీస్‌ నవ్వి ”జీవితమంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించడం కాదు. నేను నువ్వు ఇక్కడున్న అందరం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం. కానీ జీవించినన్నినాళ్ళు ప్రతిక్షణం విలువైందే. ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందముంది. గంటక్రితం నాకా పాట తెలీదు. ఇప్పుడు నేర్చుకున్నాను. ఇంకా నాజీవితంలో గంట సమయముంది. అంటే ఇప్పటికీ నేర్చుకోవడానికి నాకు అవకాశముంది” అన్నాడు. శిష్యుల నోట్లో మాట రాలేదు.

ఐశ్వర్యానికి కారకుడు ఈశ్వరుడు

ఐశ్వర్యానికి కారుకుడు ఈశ్వరుడు(శివుడు). ఈశ్వరానుగ్రహంతో ఐశ్వరం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహకారం కలిగింది. అందువల్ల దేవతలందరికి మంచి విందు భోజం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు. దేవతలందరిని ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు. శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు,నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు, ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు, అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసం చేరుకున్నాడు.
శివుడు సర్వాంతర్యామి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమంకుంటున్నారో అన్ని తెలుసుకోగలడు. కుబేరుడు అహాన్ని పసిగట్టాడు. పార్వతీదేవి కూడా కుబేరుడి పధకాన్ని అర్దం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు. కుబేరుడు వచ్చి, మహాదేవా! మేరు, పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు. శివుడు తనకు కుదరదన్నాడు, భర్త రాకుండా తానుకూడా రానన్నది పార్వతీ దేవి. ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు. వస్తూనే 'అమ్మా! ఆకాలేస్తోంది, ఏదైనా ఉంటే పెట్టు' అన్నాడు గణపతి. పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి 'కుబేరా! మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు' అనగా, శివుడు 'ఔనౌను, గణపతికి విందు భోజనం అంటే మహాఇష్టం. మా బదులుగా గణపతిని తీసుకెళ్ళూ' అన్నాడు పరమశివుడు.
హా! ఈ ఏనుగు ముఖమున్న పసిపిల్లవాడా, నా ఇంటికి విందుకోచ్చేది. ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకుని అలకాపురిల్ఫ్ ఉన్న తన భవనంలోకి తీసుకెళ్ళి, తన భవనంలో ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపిచసాగాడు. ఇవన్నీ వ్యర్ధం, త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా, కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు.
వెంటనే బంగారు కంచం పెట్టి, రకరకాల తీపి పదార్ధలు, పానీయాలు, కూరలు, పండ్లు..... గణపతికి వడ్డించారు. కుబేరుడు చూస్తుండగానే ఒక్కపెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేశి, ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు. సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా గనపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు. ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు.
వంటవారికి ఆహారం వండడం గణపతికి వడ్డించడమే పనైపోయింది. కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం ఖాళీ అయిపోయింది. విషయం కుబేరుని తెలిసింది. తన సంపద మొత్తం తరిపోతోంది కానీ, గణపతి కడుపు నిండడంలేదు, ఏమి చేయాలో అర్ధంకాలేదు. ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, నీ ఇంటికి విందుకు రమ్మని, నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావ్ అంటూ పలికాడు. కుబేరుడికి విషయం అర్ధమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏ మాత్రం సంతృప్తి పరచలేదని, అన్ని ఇచ్చిన భగవంతుడినే దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహకారం అణచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగుపరుగున కైలాసానికి వెళ్ళాడు.
శివా! శంకరా! నేవే దిక్కు. ధానానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహకారంతో ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్నీ ఖాళీ చేసి, అన్ని ఇచ్చిన భగవంతుడే, అహంకరించినవారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు. మీ బిడ్డడైన గణపతి ఆకాలి తీర్చలేకపోతున్నాను. ఏదైనా మార్గం చూపించండి అన్నాడు. అప్పుడు శివుడు "కుబేరా! నేవు ఇంతసేపు అహకారంతో గణపతికి భోజనం పెట్టావు. అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావల్సినది భక్తి మాత్రమే. నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం, నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మత్రామే గణపతి చూస్తాడు. ఇదిగో ఈ గుప్పేడు బియ్యం తీసుకుని, అహకారం విడిచి, చేసిన తప్పకుని ఒప్పుకుని పరమభక్తితో గణపతికి స్మార్పించు" అన్నాడు.
కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి, గణపతికి భక్తితో సమర్పించాడు. ఆ గుప్పేడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి, త్రేనుపులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు.
మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం. కుబేరుడి అహకారాన్ని అణిచివేసిన గణపతి, మనలోని అహకారాన్ని కుడా పటాపంచలు చేయుగాకా.

హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? ఎందుకోసం

ఆపదలుబాపే హనుమంతుని ప్రసన్నం చేసుకునే స్తోత్రాలలో విశేషమయిన హనుమాన్ చాలీసా ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాము.

వారణాసిలో నివసిస్తూవున్నసంత్ తులసీదాస్ : రామనామగాననిరతుడయిబ్రహ్మానందములోతేలియాడుతుండేవారు. మహాత్ములయిన వారి సన్నిధిలో మహిమలువెల్లువలవుతుండేవి. వారిప్రభావమువలన ప్రభావితులయిన జనం వారిద్వరా రామనామ దీక్ష తీసుకుని రామనామరసోపాసన లో తేలియాడుతుండేవారు. ఎంతోమంది ఇతర మతాలకుచెందిన భక్తులుకూడా రామనామ భజనపరులుకావటం జరుగుతున్నది. ఐతే భగవంతుని పట్ల కాక తమ నమ్మకాలపట్లమాత్రమే మొండి పట్టుదలకల ఆ మతగురువులకు ఇది కంటగింపుగా వున్నది. వారు తులసీదాసు మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మనమతాన్ని కించపరుస్తున్నాడని లేనిపోని అభియోగాలు ఢిల్లీ పాదుషావారికి పంపుతుండేవారు.

ఇదిలాఉండగా వారణాసిలో వున్న ఒక సదాచారవంతుడయిన గృహస్తు తన ఏకైక కుమారునకు కుందనపు బొమ్మలాంటి అమ్మాయితో వివాహం చేసాడు. వారిద్దరూ చిలకా గోరింకలులా వారిద్దరూ అన్యోన్యతతో ఆనంద తీరాలు చవిచూస్తున్నారు. కానీ కాలానికి ఈ సుఖ దు:ఖాల తో పనిలేదు కదా ! విధివక్రించి హఠాత్తుగా ఆయువకుడు కన్ను మూసా డు. ఆ అమ్మాయి గుండెపగిలి ఘోరంగా విలపిస్తున్నది. తలబాదుకుంటూ విలపిస్తున్న ఆతల్లిశోకానికి అందరిగుండెలూ ద్రవించిపోతున్నాయి. ఎవరెంత బాధపడ్డా జరగవలసినవి ఆగవుకనుక బంధువులు శవయాత్రకు సన్నాహాలు చేశారు. శవ్వాన్ని పాడెమీద పనుకోబెట్టి మోసుకుని వెళుతుండగా ఆ అమ్మాయి తన భర్త శవాన్ని తీసుకు వెళ్ళనీయకుండా అడ్డంపడి రోదిస్తుండటంతో స్త్రీలు ఆమెను బలవంతంగా పట్టుకుని వుండగా శవ యాత్రసాగిపోతున్నది. శ్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ గారి ఆశ్రమం మీదుగనే సాగుతుంది. శవవాహకులు ఆశ్రమం దాటే సమాయానికి అక్కడ ఇంటివద్ద పట్టుకున్నవారిని విదిలించుకుని మృతుని భార్య పరుగుపరుగున వస్తూ ఆశ్రమం దగ్గరకు రాగానే మనసుకు కలిగిన ప్రేరణతో ఆశ్రమములోకి పరుగిడి, ధ్యానస్తులైవున్న తులసీదాసుగారి పాదాలపైన వాలివిలపించటం మొదలెట్టింది.

గాజులు , కాలి అందెల శబ్దం విన్న తులసీదాస్ గారు దీర్ఘసుమంగళీభవ అని దీవించాడు. దానితో ఆయువతి మరింత బిగ్గరగా ఏడుస్తుండటం తో కనులుతెరచిన సంత్ , అమ్మా ! నేను దీవించిన దానిలో తప్పేమున్నది తల్లీ ! ఎందుకిలా దు:ఖిస్తున్నావని అడిగారు. అప్పుడామె తండ్రీ ! నాలాంటి నిర్భాగ్యురాలిని దీవించి తమలాంటి మహాత్ముల వాక్కుకూడా వ్యర్ధమయినేదని బాధపడుతున్నాను అని దు:ఖిస్తూ పలికింది. అమ్మా నా నోట రాముడు అసత్యం పలికించడే ! ఏమయినదమ్మా ! అని అనునయించాడు. తండ్రీ ! ఇంకెక్కడి సౌభాగ్యం, అదిగో నాతలరాత నాపసుపుకుంకుమలను మంటలలో కలిపేందుకు వెళుతున్నదని విలపించుట తట్టుకోలేని ఆయన లేచి వెళ్ళీ శవవాహకులతో ఆ శవాన్ని ఆపించాడు. అయ్య కొద్దిగా ఆపండి ,అని ఆపి ఆశవం కట్లు విప్పి రామనామాన్ని జపించి తన కమండల జలాన్ని చల్లాడు.

దానితో శవములో చైతన్యం వచ్చి ప్రాణం పోసుకున్నది. అదిచూసిన జనం జేజేలు పలుకుతూ వారికి భక్తిపూర్వకంగా నమస్కరించారు. దీనితో ఆయనగురించి మరింత ప్రాచుర్యం జరిగి ,తండోపతండాలుగా జనం వారినిదర్శించి రామనామాన్ని స్వీకరించి జపించటం ఎక్కువయినది.

ఇదే అదనుగా భావించిన ఇతరమత గురువులు ఢీల్లీ పాదుషావారికి స్వయముగా వెళ్ళి ,తులసీదాస్ రామ నామము గొప్పదని చెబుతూ మన మతస్తులను ,అమాయకులను మోసంచేస్తున్నాడని, పలుఫిర్యాదులు చేసారు. దానితో ఢిల్లీ పాదుషా విచారణకోసం సంత్ గారిని ఢిల్లీ దర్భారుకు పిలిపించారు.
తులసీదాస్ గారూ మీరు రామనామము అన్నిటికన్నా గొప్పదని ప్రచారము చేస్తున్నారట. నిజమేనా ? అని పాదుషా ప్రశ్న.
అవునుప్రభూ ! సృష్టిలోని సకలానికీ ఆధారమయిన రామనామ మహిమను వర్ణించ నెవరితరము.?
అలాగా? రామనామముతో దేనినయినా సాధించగలమని చెబుతున్నారట నిజమేనా?
అవును ! రామనామము తో సాధించనిదేమున్నది.
మరణాన్ని సహితం జయించకలదని చెప్పారట?
అవును ప్రభూ ! రామనామానికి తిరుగేమున్నది.
సరే ! మేమిప్పుడొక శవాన్ని తెప్పిస్తాము ,దానిని మీ రామనామము ద్వారా బ్రతికించండి ,అప్పుడు నమ్ముతాము.
క్షమించాలి ప్రభూ! జననమరణాలు జగత్ప్రభువు ఇచ్చాను సారంగా జరుగుతాయి . మనకోరికలతో కాదు.
చూడు తులసీదాస్ జీ మీరు మీమాటను నిలుపుకోలేక మీరుచెప్పే అబద్దాలను నిరూపించుకో లేక ఇలాంటి మాటలు చెబుతున్నారు . మీరామనామము ,మీరుచెప్పినవి అబద్దాలని చెప్పండి వదలివేస్తాము అని పాదుషా ఆగ్రహించాడు.
రామనామము దాని మహిమ సత్యమని పలికిన తులసీదాస్ మోసగాడిగా భావించిన పాదు\షా చివరికి తులసీ నీకు చివరి అవకాశం ఇస్తున్నాను .రామనామము మహిమ అబద్దమని చెప్పి ప్రాణాలుదక్కించుకో లేదా శవాన్ని బ్రతికించు అని మొండిగా ఆజ్ఞా పించాడు. అప్పుడు తులసీదాసు ఈ విపత్కర పరిస్తితిని కల్పించిన నువ్వే పరిష్క్రించుకోవాలని మనసులో రామునికి మనవి చేసుకుని ధ్యాన మగ్నుడయ్యాడు. అది తనను ధిక్కరించటమని భావించిన పాదుషా ,తులసీ దాసుని బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు.
అంతే ! ఎక్కడనుండి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీ దాసును బంధించవచ్చే సైనికులవద్ద ,ఇతర సైనికులవద్ద ఆయుధాలు లాక్కుని వారికేగురిపెట్టి, అందరినీ కదలకుండా చేసాయి. సభికులు ,ఏకోతి మీదపడి కరుస్తుందోనని హడలిపోతూ వున్నారు. ఈ కలకలానికి కనులువిప్పిన తులసీదాస్ గారికి ఆశ్చర్యం కలిగింది . దీనికి కారణమేమిటాని చుట్టూ చూడగా , సిమ్హద్వారము మీద ఆసీనులై వున్న హనుమంతుడు దర్శనమిచ్చాడు. దానితో ఒడలు పులకించిన సంత్ ...... జయ హనుమాన జ్ఞాన గుణసాగర............ అంటూ 40 దోహాలతో ఆశువుగా వర్ణించాడు.
దానితో ప్రసన్నుడయిన పవనసుతుడు, తులసీ నీ స్తోత్రంతో మాకు ఆనందమయినది నీకేమ్ కావాలో కోరుకో అని అన్నారు.
అయితే మహాత్ములెప్పుడూ తమస్వార్ధంకోసం కాక లోకక్షేమం కోసము మాత్రమే ఆలోచిస్తారు కనుక , తండ్రీ ! ఈ స్తోత్రంతో నిన్ను స్తుతించిన వారికి తమరు అభయమివ్వాలని విన్నవించుకున్నాడు.
దానితో మరింతప్రియం కలిగిన స్వామి , తులసీ మాకు అత్యంత ప్రీతిపాత్రమయిన ఈస్తోత్రంతో మమ్మెవరు స్తుతించినా వారిరక్షణ భారం మేమే వహిస్తామని వాగ్దానం చేశారు.
అప్పటినుండి ఇప్పటివరకు హనుమంతుని చాలీసా భక్తుల అభీష్టాలను కామధేనువై నెరవేరుస్తూనేవున్నది.

జయ హనుమంత మహా బలవంత

Wednesday, 11 May 2016

WHICH IS STRONGER? BRICK WALL OR A SPIDER'S WEB?

A truly beautiful story :

      During World War II, a soldier was separated from his unit on an island. The fighting had been intense, and in the smoke and the crossfire he had lost touch with his comrades.

      Alone in the jungle, he could hear enemy soldiers coming in his direction. Scrambling for cover, he found his way up a high ridge to several small caves in the rock. Quickly he crawled inside one of the caves.

      Although safe for the moment, he realised that once the enemy soldiers looking for him swept up the ridge, they would quickly search all the caves and would be killed.

      As he waited, he prayed, "Lord, please spare my life. Whatever will happen, I love you and trust you. Amen." After praying, he lay quietly listening to the enemy begin to draw close.

      He thought, "Well, I guess the Lord isn't going to help me out of this one." Then he saw a spider begin to build a web over the front of his cave. "Hah" he thought, "What I need is a brick wall and what the Lord has sent me is a spider web. God does have a sense of humour. "

      As the enemy drew closer he watched from the darkness of his hide out and  could see them searching one cave after another.

      As they came to his, he got ready to make his last stand, but then he heard the leader of the soldiers say, "You may as well ignore looking in this cave....if he had entered here this web would be broken!" So they left and he was delivered!

      To his amazement, however, after glancing in the direction of his cave, they moved on. Suddenly he realised that with the spider web over the entrance, his cave looked as if no one had entered for quite a while.

     "Lord, forgive me," he prayed. "I had forgotten that in you a spider's web is stronger than a brick wall."

God's ways are not our ways, God's thoughts are not our thoughts.. He will neither leave us nor forsake us..
Let's trust in God always!!

(Sometimes a prayer doesn't change the situation.
But it changes our attitudes towards the situation
And gives us hope which changes our entire life.)

In 70s, my memories

Superb stuff for those who grew up during the 70-90s in middle class India , here are some things that you can identify with……

1. Though you may not publicly own to this, at the age of 12-17 years, you were very proud of your first "Bellbottom" or your first "Maxi" .

2. Phantom & Mandrake were your only true heroes.The brainy ones read "Competition Success Review".

3. Your "Camlin" geometry box & Natraj/Flora pencil were your prized possessions.

4. The only "Holidays" you took were to go to your grandparents' or your cousins' houses.

5. Ice-cream meant only - either an orange stick, a vanilla stick – or a Choco Bar if you were better off than most.

6. You gave your neighbour’s phone number to others with a 'PP' written against it because you had booked yours only 7 years ago and were still waiting for your number to come.

7. Your parents were proud owners of HMT watches. You "earned" yours after SSC exams.

8. You have been to "Jumbo Circus"; have held your breath while the pretty young thing in the glittery skirt did acrobatics, quite enjoyed the elephants hitting football, the motorcyclist vrooming in the "Maut - ka - Gola" and it was politically okay to laugh your guts out at dwarfs hitting each others bottoms!

9.. You have at least once heard "Hawa Mahal" and "Binaca Geetmala" on the radio.

10. If you had a TV, it was normal to expect the neighbourhood to gather around to watch the Chitrahaar or the Sunday movie. If you didn't have a TV, you just went to a house that did. It mattered little if you knew the owners or not.

11. Sometimes the owners of these TVs got very creative and got a bi or even a tri-coloured anti-glare screen which they attached with two side clips onto their Weston TVs. That confused the hell out of you!

12. Black & White TVs weren't so bad after all because cricket was played in whites.

13. You thought your Dad rocked because you got your own (the family's; not your own own!) colour TV when the Asian Games started. Everyone else got the same idea as well and ever since, no one came over to your house and you didn't go to anyone else's to watch TV.

14. You dreaded the death of any political leader because of the mourning they would announce on the TV. After all how much " Shashtriya Sangeet " can a kid take?

15. You knew that " Indira Gandhi " was somebody really powerful and terribly important. And that's all you needed to know.

16. The only "Gadgets" in the house were the TV, the Fridge and possibly a mixer.

17. Movies meant Rajesh Khanna or Amitabh Bachchan.Before the start of the movie you always had to watch the obligatory "Newsreel".

18. You thought you were so rocking because you knew almost all the songs of Abba and Boney M.

19. Your hormones went crazy when you heard “ Aap Jaisa Koi Meri Jindagi Mein Aaye ” by Nazia Hassan .

20. Photograph taking was a big thing. You were lucky if your family owned a camera. A reel of 36 exposures was valuable hence it justified the half hour preparation & "setting" & the "posing" for each picture. Therefore, you. have at least one family picture where everyone is holding their breath and standing in attention!

నేర్చుకునే విధానంలో తేడా ఉంది

👉ఇద్దరు అన్నాదమ్ములు....
📕
👉ఒకడు తాగుబోతు. ఒకడు ప్రయోజకుడు.
తాగుబోతును నువ్వెందుకిలా అయ్యావు అని అడిగితే...
"అంతా మా నాన్న వల్లే... ఆయన తాగుబోతు. మమ్మల్ని పట్టించుకోలేదు. ఎప్పుడూ కొట్టేవాడు. ఏదో నేరం చేసి జైలుకి వెళ్లేవాడు.... అందుకే నేనిలా తయారయ్యాను." అన్నాడు.
ప్రయోజకుడిని నువ్వెందుకిలా అయ్యావు అని అడిగితే
"అంతా మా నాన్న వల్లే... ఆయన తాగుబోతు. మమ్మల్ని పట్టించుకోలేదు. ఎప్పుడూ కొట్టేవాడు. ఏదో నేరం చేసి జైలుకి వెళ్లేవాడు.... అమ్మని కొట్టేవాడు... ఆయన్ని చూసి నేనేం చేయకూడదో నేర్చుకున్నాను. అందుకే నేనిలా తయారయ్యాను." అన్నాడు.

ఒకే పరిస్థితి.
ఇద్దరికీ వేర్వేరు పాఠాలను నేర్పించింది.
తేడా పాఠంలో లేదు.
నేర్చుకునేవాడిలో ఉంది.

ఎవరి పని వాళ్లే చేసుకోవాలి

ఆ పరమాత్ముడి తో ఒక సన్నకారు రైతు ఒకసారి బలంగా దెబ్బలాట వేసుకొన్నాడు.

"నీకు పైరు గురించి ఏం తెలుసు? నీకిష్టమైనప్పుడు వానను కురిపిస్తావు. ఆ కాలంలో గాలి వీచేలా చేస్తున్నావు. నీతో పెద్ద గొడవగా ఉంది. మాట్లాడకుండా ఆ పనులన్నీ ఒక రైతుకి  అప్పగించారాదూ!” అన్నాడు.

 భగవంతుడు వెంటనే "అలాగా! అయితే ఈనాటి నుంచి గాలి, వాన, ఎండ అన్నీ నీ అజమాయిషిలోనే  ఉంటాయి”  అంటూ వరమిచ్చి చక్కాపోయాడు.
 ఆ రైతు ఆనందానికి అవధుల్లేవు.

ఋతువులు మారాయి. "వానా! కురవాలి" అన్నాడు  రైతు.
కురిసింది. ఆగమనగానే ఆగింది.

తడినేలను దున్నాడు. కావాల్సిన వేగంతో  గాలిని విసరమన్నాడు. విసిరింది.
విత్తుజల్లాడు. గాలి, వాన, ఎండ అన్నీ ఆ రైతు మాట ప్రకారమే జరిగాయి.
పైరు పచ్చగా ఏపుగా పెరిగింది. ఆ పొలం చూడటానికి ఎంతో రమ్యంగా ఉంది.
కోతల కాలం వచ్చింది.

రైతు ఒక కంకి కోశాడు. గింజ నులిమి చూ శాడు. అదిరిపడ్డాడు.  లోపల ధాన్యం  లేదు. ఉత్తి ఊక, మరొకటి, మరొకటి అంటూ అన్నీ కోసి చూశాడు. ఎందులోనూ ధాన్యం లేదు. అంతా ఉత్తి ఊకమాత్రమే ఉంది.

"హారి దేవుడా!" అంటూ కోపంగా ఎలిగెత్తి పిలిచాడు. "వాన,ఎండ,గాలి అన్ని తగిన మోతాదుల్లోనే వాడాను. కాలానుగుణంగా, ఋతువులకి తగట్టుగా. అయితే పైరు పాడైపోయిందే! ఏం? ఎందుకు?"

భగవంతుడు నవ్వాడు. "నా ఆధీనంలో గాలి బలంగా వీచేది. అప్పుడు అమ్మను కౌగిలించుకొనే పిల్లల్లా నారు వేళ్ళు భూమిలోకి లోతుగా జోచ్చుకొని గట్టిగా  పట్టుకొనేవి. వాన తక్కువైనా నీటికోసం వేళ్లను నాలుగు పక్కలకు పాకించేది. పోరాటం అంటూ ఉంటేనే చెట్లు తమను కాపాడుకోవడం కోసం బలంగా పెరుగుతాయి.

 అన్ని వసతులు నువ్వే కల్పించేసరికి పైరు సోమరిదయ్యింది. నవనవలాడుతూ పెరిగిందే తప్ప ఆరోగ్యవంతమైన ధాన్యాన్ని అందించాలని దానికి తెలీదు.
"నాకు నీ గాలి, వాన,ఎండ వద్దు. నువ్వే ఉంచుకో". అంటూ రైతు దేవుడిచ్చిన వాటిని తిరిగిచ్చేశాడు.

జీవితం లో అన్నీ చక్కగా అమరిపోతే, అంతకన్నా విసుగు, శూన్యం వేరే ఉండదు. కష్టాలు మిమ్మల్ని అదిమేసటప్పుడే మీలో చాకచక్యం మరింత పెరుగుతుంది. సావాళ్ళే మనిషికి పరిపూర్ణతను ఇస్తాయి. 

గుడి కథ

మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా మనలో చాలామంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు.

గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం.

మనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.

భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి.

దేవాలయ గర్భగృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆవిధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది. అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు. కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.

ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే.

ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి.

గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడంవల్ల శక్తి విడుదల అవుతుంది.

మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు, మంత్ర ఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది.

గుడిలో దేవుడికి కొబ్బరికాయ , అరటిపళ్ళు నైవేద్యం పెడతారు. ఈ కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి.

తీర్థంలో పచ్చ కర్పూరం,యాలుకలు, సాంబ్రాణి,తులసి పత్రాలు , లవంగాలు  మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలు అన్నీ ఔషధగుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్ళినవారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయురారోగ్యాలను ఇస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

ఇప్పుడు చాలామంది పాటించడంలేదు కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేప్పుడు పురుషులు చొక్కా (షర్టు) లేకుండా వెళ్ళేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు.

లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆవిధంగా స్త్రీపురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది.

భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది. కర్పూరహారతి వెలిగిస్తారు. గంటలు మోగుతాయి.తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి.

ఉత్సాహం

మనలో చాలామంది 'జీవితం ఎందుకు ఉత్సాహంగా ఉండటం లేదు... విసుగ్గా ఉంటోంది' అని పదేపదే అనుకోవడం చూస్తుంటాం. ఏదో యాంత్రికంగా ఉదయం నిద్రలేవడం, కడుపులో అంత పడేసుకోవడం, పనుల్లో పడటం, ఏదోలా పూర్తయిందనిపించడం... ఉరుకులు పరుగులు... ఈ చక్రం ఇలాగే తిరుగుతుంటుంది. ఏం చేయాలి, ఇంతకంటే వేరే ఏముంటుంది ఎవరికైనా... జీవితం బతకడం కోసమే కదా... ఈ ఆలోచన తప్పు. జీవితానికి ఒక పరమార్థం ఉండాలి. ఉత్సాహం కావాలి... ఆలోచనా పరిధి విస్తృతం కావాలి. కూపస్తమండూకంలా ఉండకూడదు. తిండి-బట్ట-గూడు... వీటికోసం ఓ ఉద్యోగం. ఇవి అవసరాలు. ఆ అవసరాలను మించి ఆలోచించాలి, ఆలోచించగలగాలి. దీనికి విశాలదృక్పథం అలవరచుకోవాలి. ఆ దృష్టి మన లక్ష్యాన్ని నిర్దేశించాలి. దానికి కృషి, పట్టుదల, ఏకాగ్రతల అవసరం ఏర్పడుతుంది. చేసే పనిలో తృప్తి లభిస్తుంది. విశ్రాంతి కూడా తీసుకోవాలనిపించదు. ఆ ధ్యాసకు అంతటి శక్తి ఉంటుంది. బతుకుపట్ల సరైన దృక్పథం ఏర్పరచుకోగలిగితే- పనిలోనే పరమార్థం కనబడుతుంది!

ఎటువంటి ఉన్నతమైన ఆశయాలూ లేనట్లయితే, ఆలోచనలు 'నేను-నాది' అన్నదాని చుట్టే పరిభ్రమిస్తుంటే మొహం మొత్తుతుంది. ఏం తిందాం, ఏం చేద్దాం అన్నచోటే ఆగిపోతే, ఎదుటివ్యక్తి ఒక పోటీదారుడిగా కనిపిస్తాడు. మన శక్తియుక్తులను తక్కువగా అంచనా వేసుకుని అభద్రతా భావానికి గురవుతాం. స్వార్థం జీవం పోసుకుంటుంది. అనవసర భయాలు, ఏవేవో వూహించుకోవడాలు, యథార్థాల నుంచి దూరంగా బతకడంతో మన మీద మనకే జాలి కలగడం, వ్యధ చెందడం... చివరికి మన పతనాన్ని మనమే తెచ్చుకున్నట్లు అవుతుంది.

ఈ ప్రపంచానికి అసాధారణ వ్యక్తులే అవసరం అని ఎక్కడా లేదు. చాకచక్యం కలిగిన మేధాసంపన్నులే కావాలనీ ఏం లేదు. మనకు కావలసింది ప్రేరణ కలిగించే శక్తి కలిగినవారు. మహాత్మాగాంధీ సాధారణ వ్యక్తే. కానీ సత్యం, అహింసా ధర్మాలవైపు జనాన్ని ప్రేరేపించగల శక్తిసంపన్నుడు. రైట్‌ సోదరులు- సామాన్యులే. ఎగరాలనే బలమైన కలగన్నారు. ఇలా ఎందరో...

ఎవరైనా ఉన్నతమైన ఫలితాలు సాధించవచ్చు. ఓ గొప్ప ఆదర్శానికి ప్రభావితమైతేనే అది సాధ్యం. నేటి విద్యాప్రమాణాలు క్రమక్రమంగా దిగజారిపోతున్నాయి. కారణం? ఒక ఉపాధ్యాయుడు సమాచారాన్ని విద్యార్థులకు ప్రసారం మాత్రమే చేయగలుగుతున్నాడు. ఒక ఉన్నతమైన ఆశయసాధనకు మేధాశక్తిని ప్రేరేపించలేకపోతున్నాడు. ఉత్తేజపరచడమన్నది అంత క్లిష్టమైన విషయం ఏమీ కాదు. కొద్దిమందే మనకు అటువంటివాళ్లు కనిపించడంవల్ల అలా అనిపించడం సహజం. జీవితాలను త్యాగం చేసినవాళ్లెందరో ఇప్పటికీ ప్రేరేపించగలుగుతున్నారు. విద్య, సామాజిక న్యాయం, పర్యావరణం... ఇలా ఏ రంగమైనా కావచ్చు. ఎవరైనా ఒక ఆదర్శానికి కట్టుబడి ఉండాలి.

అన్నింటిలో ఉన్నతమైనది- ఆధ్యాత్మిక లక్ష్యసాధన. 'దేవుడు నన్ను పరిగెత్తిస్తున్నాడు... నేను దేవుడికోసం పరిగెత్తుతున్నాను' ఎందరినో ఆకట్టుకున్న వాక్యమిది. ఒకసారి భగవంతుడిచే ప్రేరణ పొందగలిగితే ఆ శక్తి మనలో బలంగా చోటుచేసుకుంటుంది. ఆ ధైర్యంతో ఎటువంటి అడ్డంకులనైనా ఎదుర్కోవచ్చు.

మనలో ఎంతమంది ఉత్తేజంతో నిద్రలేస్తాం, తెల్లారిన తరవాత సేవా దృక్పథం కలిగి ఉంటాం? సమాజానికి ఏదైనా చేయాలనే ఉత్సాహం ఎందరికుంటుంది? సేవాభావం ఉన్నప్పుడు జీవితం వూహాతీతంగా, విసుగు చికాకులతో కాకుండా ఉత్తేజవంతమైన స్థాయికి చేరుకుంటుంది. పనికిరాని పద్ధతుల్ని పునర్‌ నిర్వచించుకుని అసాధారణం అనుకున్నవాటినీ సాధించవచ్చు. అనూహ్యమైన విజయాలను సొంతం చేసుకోవచ్చు. పనిలో ఆనందం కనిపిస్తుంది కానీ, పనిని తప్పించుకోవడంలో కాదు. అన్నింటికంటే ముఖ్యమైనది, ఆధ్యాత్మిక ధోరణిని అలవరచుకుని భగవత్తత్వాన్ని అవగతం చేసుకోవడం.

ప్రేరణ కలిగినప్పుడు సామాన్యుల్లో ధైర్యం, ఆశ చోటుచేసుకుంటాయి. అవి వారి జీవితాలనే కాకుండా భవిష్యత్‌ తరాలను సైతం ప్రభావితం చేస్తాయి.

స్వార్థం vs నిస్వార్థం

సముద్రంలో 🌊 పెద్ద తుఫాన్ 🌪 !

ఓడ ⛴ బద్దలయిపోయింది ...
ఇద్దరే ఇద్దరు 👬 బ్రతికి ఒడ్డుకు చేరారు ...

అదొక దీవి 🏝 ఎడారిలా ఉంది.  ఏమి చెయ్యాలో తోచ లేదు వారి ఇద్దరికీ.  భగవంతుడిని 🕉🛐 ప్రార్ధన చెయ్యడం తప్ప ఏమీ చెయ్యడానికి లేదు అనుకున్నారు ఇద్దరూ.

అయితే వారు ఒక నిర్ణయం తీసుకున్నారు.  ఎవరి ప్రార్ధనలు 🛐 ఫలిస్తాయో తెలుసుకోవాలంటే ఆ దీవిని రెండు భాగాలు చేసి ఒకరు ఒక వైపు రెండో వారు రెండో వైపు ఉండాలని నిర్ణయించుకున్నారు.

మొదటివాడు రాము. రెండో వాడు సోము.

ఆ రోజు రాము భగవంతుడా నాకు ఆహారాన్ని 🌮🍟🌭 ఇయ్యి అని వేడుకున్నాడు.  మర్నాడు ఉదయం అతడు చూస్తే అతడికి ఒక అరటిచెట్టు 🍌 ముగ్గిన పళ్ళతో కనిపించింది.  పాపం సోముకి ఏమీ కనిపించలేదు ...

ఇలా ఒక వారం ⏳🕰⌛ గడిచింది.

రాముకి ఒంటరితనం చికాకు అనిపించి నాకు ఒక భార్యను 💃 ఇవ్వు అని దేముడిని ప్రార్ధించాడు.  మర్నాడు ఒక ఓడ తమ ఓడలాగే బద్దలయ్యి ఒకే ఒక్క అమ్మాయి 💃 ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చింది.  ఇద్దరూ హాయిగా కాపురం చేసుకుంటూ ఉన్నారు.  

పాపం సోము పరిస్థితి అలాగే ఉంది.

రామూ ఒక ఇల్లు 🏡, బట్టలు 👕👖👗, ఇంకా ఆహారం 🍒🍍🍔🌽🍕🍪 ఇమ్మని దేముడిని ప్రార్దిస్తూనే ఉన్నాడు.  దేముడు అడిగిన వన్నీ రామూకు సమకూరుస్తూనే ఉన్నాడు.

పాపం సోముకు ఏమీ లేదు ...

ఆఖరుగా రాము దేముడా నేనూ నా భార్య మా ఊరు వెళ్ళడానికి ఒక ఓడ ⛵ పంపించవా అని ప్రార్ధించాడు.  ఆశ్చర్యం ఓడ మర్నాడు వచ్చింది.  సోమూ ప్రార్ధన ఒక్కటీ దేముడు వినలేదు కనుక సోమూని తీసుకు వెళ్ళడం అనవసరం అనుకున్నాడు రాము.  అవును వాళ్ళిద్దరూ 👫 బయలుదేరారు.  సామాను సర్దుకుని ఓడ ఎక్కుతున్నారు ...

ఆకాశం లోనుండి దేముడు అడిగాడు ...

సోమూని తీసుకు వెళ్ళవా? అతడిని అలాగే వదిలేస్తున్నావేమి?

రాము " నాకు నువ్వు ఇచ్చిన ఆశీస్సులు నావే కదా ! అతడి ప్రార్ధనలు నువ్వు వినలేదు కనుక అతడిని నేను తీసుకు వెళ్ళడం లేదు " అన్నాడు

" అక్కడే నువ్వు తప్పు చేశావు . అతడు ఒకే ఒక్క ప్రార్ధన చేశాడు . అతడి ప్రార్ధన వినే నేను నీకు ఇవన్నీ ఇచ్చాను.

అతడు " నా స్నేహితుని ప్రార్ధనలు ఫలించాలి అలా చెయ్యి దేముడా ! " అని ప్రార్ధించాడు ... అందుకే నీకు ఇవన్నీ సమకూరాయి " అన్నాడు దేముడు.

మనకు లభించేవి అన్నీ మన ప్రార్ధనల వలన మాత్రమె మనకు లభించడం లేదు ... మన స్నేహితుల, సన్నిహితుల,  సహృదయుల ప్రార్ధనల, దీవెనల వలన మనం దేముని దయను పొందుతున్నాం ...

మన ఆత్మీయుల కోసం కూడా మనం ప్రార్ధిద్దాం 

ఈ మెయిల్ ఉండి ఉంటే..!

ఆ కుర్రాడు ఆఫీస్ బాయ్ ఉద్యోగం కోసం ఒక పెద్ద కంపెనీకి ఇంటర్వ్యూ కి వెళ్లాడు.

ఇంటర్వ్యూ లో సెలక్ట్ అయ్యాడు. "నీ ఈ మెయిల్ ఐడీ ఇవ్వు. నీకో అప్లికేషన్ పంపిస్తాను. దాన్ని నింపిపంపించు." అన్నాడు మేనేజర్.

"నా దగ్గర కంప్యూటర్ లేదండీ. నాకు ఈ మెయిల్ కూడా లేదు. " అన్నాడు ఆ కుర్రాడు.

"ఈ మెయిల్ లేదా... అయితే ఈ ఉద్యోగం క్యాన్సిల్" అన్నాడు మేనేజర్.

ఆ కుర్రాడు బయటకి వచ్చేశాడు. ఏం చేయాలో తోచలేదు. కానీ ఏదో సాధించాలన్న పట్టుదల....

జేబులో వంద రూపాయలున్నాయి. పది కిలోల టమాటాలుకొన్నాడు. వాటిని పధ్నాలుగు రూపాయలకు అమ్మేశాడు.

మరుసటి రోజు పధ్నాలుగు కిలోలు కొన్నాడు. ఇలా నెమ్మదినెమ్మదిగా వ్యాపారం బాగుపడింది. లాభాలు వచ్చాయి.

ఒక చిన్న దుకాణం పెట్టాడు. కూరగాయలు తెచ్చుకునేందుకు మినీ ట్రక్కు కొన్నాడు.

కూరగాయలు తెచ్చాక మిగిలిన సమయంలో మినీ ట్రక్కును అద్దెకు తిప్పాడు. ఆదాయం మరింత పెరిగింది.

ఒక దుకాణం నుంచి రెండు, రెండు నుంచి నాలుగు, నాలుగు నుంచి పధ్నాలుగు ఇలా దుకాణాలు పెరిగాయి. కొన్నాళ్లకు ఆయన దేశంలోనే అతిపెద్ద కూరగాయల వ్యాపారి అయ్యాడు.

ఆయన దుకాణాలకు బీమా చేయించమని ఒక పెద్ద కంపెనీ ఆయన వెంట పడింది.

ఆయన దానికి అంగీకరించాడు. మొత్తం ఒప్పందం పూర్తయిపోయింది.

ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ "సర్... మీ ఈ మెయిల్ ఐడీ ఇవ్వండి" అన్నాడు.

"నాకు ఈ మెయిల్ లేదు." అన్నాడు వ్యాపారి.

"ఈ మెయిల్ లేకుండానే ఇంత సాధించారు. ఈ మెయిల్ ఉంటే మీరు ఏం అయి ఉండేవారో ?" అన్నాడు ఏజెంట్.

"ఆఫీస్ బాయ్ అయి ఉండేవాడిని." అన్నాడా వ్యాపారి నవ్వుతూ !!

తిండి తినరా ముందు

శుభ్రంగా కాళ్ళూ, చేతులూ కడుక్కుని భోజనానికి కూర్చుంటాం.
మన అమ్మో, ఇల్లాలో మన కంచములో వేడి వేడి అన్నం వడ్డిస్తుంది.
అందులోకి ముద్దపప్పును వేస్తుంది.
 ఘుమఘుమలాడే నెయ్యిని చెంచాతో పోస్తుంది.
అంచుకు నోరూరించే ఆవకాయ.

మన ఆకలి రెట్టింపవుతుంది.
ఆత్రంగా దండయాత్ర మొదలుపెడతాం.
ఒక్కో ముద్ద లోనికి దిగుతుంటే, జీవుడు సంతోషంగా గంతులేస్తాడు.
 ఆహాహా!...ఏమి మన భాగ్యము!.....

ఇంతలో కఠక్ మని శబ్దం. పంటి కింద రాయి...

అంతకుముందటి దృశ్యం చెల్లాచెదరవుతుంది.
 ముఖం
రంగులు మారుతుంది.
కోపం నషాళానికి అంటుతుంది.

ఈ రాయి ఎక్కడిది?
 బియ్యం లోదా?
 పప్పులోదా?
మిల్లులోదా?
ప్లేటు శుభ్రంగా కడగకనా?
 ఇల్లు సరిగ్గా ఊడవకనా?....
.దాని గురించి జుట్టు పీక్కుంటాం.

తిండి సంగతి మరిచిపోతాం.
 వండినవాళ్ళ శ్రమను మరిచిపోతాం.
 వడ్డించినవాళ్ళ ప్రేమను మరిచిపోతాం.
ఆ ముద్ద మన నోటికి అందేవరకు జరిగిన గొప్ప విషయాలేమీ మనం గుర్తుంచుకోం.

ఆ ఒక్క రాయి మీదే మన దృష్టంతా.

చిన్న కారణానికి మంచి సంబంధం పాడుచేసుకుంటాం.

జీవితం కూడా అన్నం ముద్ద లాంటిదే!

భగవంతుడు మనకు ఈ జీవితమనే అన్నపుముద్దను ప్రసాదించాడు.

అందులో రాయి ఏమిటి?...చిన్న కష్టం.

అది రాగానే ప్లేటును పక్కన పడేసినట్టుగా, జీవితాన్ని పక్కన పెట్టేస్తాం. జీవించడం మానేస్తాం.
 ఎన్ని సంతోషాలున్నాయో, ఎన్ని అనుభూతులున్నాయో అవన్నీ విస్మరిస్తాం.
 రాయిలాంటి కష్టం మీదే మనసు పాడుచేసుకుంటాం.

ఇంత పెద్ద జీవితములో చిన్న కష్టాన్ని మనం ఓర్చుకోలేమా?.......

లుక్ ఎట్ ద లార్జర్ పిక్చర్.
 ఇట్ ఈజ్ ఫుల్ ఆఫ్ జాయ్. ఇట్ ఈజ్ ఫుల్ లైఫ్.

అందుకే కష్టం వచ్చినప్పుడు మనసు రాయి చేసుకోండి.
 ఆ రాయిని పక్కన పెట్టండి. విందును తృప్తిగా ఆరగించండి.

Love your Husband

In a ladies KITTY PARTY MEETING :

The host asked a question !

When did u last say
 I LOVE YOU to ur husbands ??

One said..today..
other said...2 days back.....
someone said...1 week back...

Host :  " Now, all of u send  I LOVE YOU ..
message  to ur husbands.

Who ever gets AWESOME reply will get a SURPRISE GIFT.!

Everyone sent
I LOVE U
msg to their husbands.

After sometime, HUSBAND'S
replies are as below.....

Husband 1 :
SWEETY.... Is ur health condition Ok??? 😝😝😝😝

Husband 2 : Have You Not cooked Food Today Too?😊😊

Husband 3 : Darling,
R u out of balance for the money given for home maintenance?
😅😅😅

Husband 4 :
What's the matter??

Husband 5 :
R u dreaming or am I?
😜😜😜

Husband 6 : Did u like someone's Jewelry in the function u attended today?💍

Husband 7 : I am already tensed in Office n now u r sending msgs like this...
 do u have brain?
😝😜😛

Husband 8 : How many times did I tell you not to watch those serials ?? 😛😛😛

Husband 9 :  O ho..did u have an accident again ....With My Car...? 😳😳😳😳😳

Husband 10 :
Should I pick kids from school today also??
😀😀😀😀

Last - who won SURPRISE GIFT,
And msg is........

Husband 11 :
Who is dis ..sending msg from my wife mobile???
 😕😕😕😕😕😕

నమ్మకాల వెనకున్న రహస్యాలు

చిన్నప్పటి నుంచి మన ఇంట్లో పెద్దవాళ్లు ఎన్నో ఆచారాలు పాటిస్తూ వస్తున్నారు. కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని మిస్టరీగా ఉంటాయి. ఎందుకో కారణం తెలియకుండానే ఇప్పటికీ కొన్ని ఆచారాలు పాటిస్తూ ఉంటారు. అంతేకాదు.. పెద్దవాళ్లు చెప్పిన విషయాలు కావడంతో.. పాటించకపోతే ఏమవుతుందో అన్న భయంతో ఇప్పటికీ కొన్ని అలవాట్లు అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇండియా గొప్పతనాన్ని వివరించే ఆసక్తికర విషయాలుఎన్నో సంత్సరాలుగా పాలో అవుతున్న కొన్ని ఆచారాలు చాలా ఫన్నీగా అనిపిస్తాయి. కానీ మనం పెరిగి పెద్దవాళ్లైయ్యాక అవన్నీ కేవలం మూఢనమ్మకాలే అన్న విషయం అర్థమవుతోంది. ఏ రోజు ఏం చేయకూడదు, ఏ రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని కొన్ని రకాల నమ్మకాలు పాటిస్తూ ఉంటారు. ఇండియన్స్ పాటిస్తున్న భయంకరమైన ఆచారాలు కొన్ని ఆచారాలు కేవలం నమ్మకం, భయంతో పాటిస్తున్నవే చాలా ఉన్నాయి. అవి పాటించకపోతే ఏమవుతుందో అన్న భయంతోనే ఆచార సంప్రదాయలు ఉన్నాయి. అయితే కొన్నింటి వెనక సైంటిఫిక్ రీజన్స్ ఉంటే.. మరికొన్నింటి వెనక భయం ఉంది. అయితే చాలామంది ఆ ఆచారాలు ఎందుకు పాటిస్తున్నామో తెలియకుండానే.. ఇతరులకు కూడా సలహా ఇస్తుంటారు. అలాంటి నమ్మకాల వెనక ఉన్న అసలు రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం.

1. మంగళవారం హెయిర్ కట్ ఇప్పటికీ చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే.. మంగళవారం కటింగ్, షేవింగ్ చేసుకోవడానికి అనుమతించరు. ఎందుకు అంటే మాత్రం చేసుకోకూడదు అని చెబుతారు. కానీ కారణం చెప్పరు. అయితే దీనికి అసలు కారణం వింటే ఆశ్చర్యపోతారు. గతంలో సోమవారాలు సెలవు ఉండేది. దీంతో అందరూ సోమవారం కటింగ్ చేయించుకునేవాళ్లు. దీంతో మంగళవారాలు సెలూన్ షాపులు మూసేసేవాళ్లు. దీంతో ఇదో మూఢనమ్మకంగా ఇప్పటికీ మంగళవారం కటింగ్ చేయించుకోకూడదని మూఢనమ్మకం పెట్టుకున్నారు.

2. ఇంట్లో గొడుగు ఓపెన్ చేయరాదా ? ఇంట్లో గొడుగు ఓపెన్ చేయకూడదు, మంచిది కాదు అని చెబుతూ ఉంటారు. కానీ మంచిది కాదనేది మూఢనమ్మకం. దీని వెనక అసలు కారణం.. గొడుగు ఇంట్లో ఓపెన్ చేస్తే.. చుట్టూ ఉన్న వస్తువులు డ్యామేజ్ అవుతాయని అలా చెప్పేవాళ్లు. ఇది అసలు కారణం. కానీ గొడుగు ఇంట్లో ఓపెన్ చేస్తే ఏ అనర్థం జరుగుతుందో అని చాలా మంది భయపడుతుంటారు.

3. నిమ్మకాయ, పచ్చిమిర్చి వాహనాలు లేదా ఇంటి గుమ్మం దగ్గర చాలామంది నిమ్మకాయ, పచ్చిమిర్చి, పండు మిర్చి కలిపి ఒక దండలా వేలాడదీసి ఉంటారు. ఇలా కట్టడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి రావని, వాహనాలలో ప్రయాణం సాఫీగా జరుగుతుందని నమ్ముతారు. కానీ.. దీనివెనక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఇలా దారానికి కట్టి ఇంటి ముందు కట్టుకోవడం వల్ల ఇంట్లోకి క్రిమీకీటకాలు, దుర్వాసన, దోమలు రాకుండా అరికడతాయని ఇలా కట్టేవాళ్లు. కానీ.. దీన్ని మూఢనమ్మకంగా పాటిస్తున్నారు.

4. అద్దం పగలడం ఇంట్లో అద్దం పగిలితే.. బ్యాడ్ లక్ అని చాలామంది ఇప్పటికీ హెచ్చరిస్తూ ఉంటారు. కానీ.. అలాంటిదేమీ లేదు. పూర్వం అద్దం కొనాలంటే.. చాలా ఖర్చుతో కూడిన పని. అందులోనూ.. తక్కువ క్యాలిటీవి దొరికేవి. దీంతో.. నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అద్దంతో జాగ్రత్త పగలకూడదనే సింపుల్ ట్రిక్ ప్లే చేశారు. దీన్ని ఏదో చెడు జరుగుతుందనే భయం క్రియేట్ అయింది.

5. సాయంత్రం గోళ్లు కట్ చేసుకోకూడదా ? సూర్యాస్తమయం తర్వాత గోళ్లు, జుట్టు కట్ చేయించుకోరాదని ఒక నమ్మకం ఇండియాలో బలంగా ఉంది. కానీ సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కట్ చేసుకుంటే.. చీకట్లో చిగుళ్లకు తగులుతుందేమో అన్న భయంతో.. ఈ నమ్మకాన్ని క్రియేట్ చేశారు. దీన్ని మూఢనమ్మకంగా ఫాలో అవుతూ వస్తున్నారు.

6. గ్రహణం సమయంలో గర్భిణీలు గ్రహణం సమయంలో గర్భిణీలకు చాలా నిబంధనలు ఉంటాయి. గ్రహణం సమయంలో గర్భిణీలు వెజిటబుల్స్ కట్ చేయరాదు, బయటకు కూడా వెళ్లకూడదని చెబుతుంటారు. అయితే గ్రహణం సమయంలో యూవీ కిరణాలు పొట్టలోని బిడ్డకు హాని కలిగిస్తాయని.. బయటకు వెళ్లకూడదనే నిబంధన పెట్టారు.

7. సాయంత్రం ఇల్లు ఊడవకూడదు సాయంత్రం పూట ఇల్లు ఊడవడం చాలా పెద్ద తప్పుగా భావిస్తారు. ఇప్పటికీ చీకటి పడిందంటే.. చీపురు పట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తారు. కానీ.. దీనికి అసలు కారణం ఏంటో తెలుసా ? అప్పట్లో చీకటి పడిందంటే.. పవర్ లేక వెలుతురు చాలా తక్కువగా ఉండేది. దీంతో తెలియకుండా కిందపడిన ఏదైన నగలు, వస్తువులు చెత్తతో పాటు డస్ట్ బిన్ లోకి వేసేస్తారేమో అన్న భయంతో.. ఈ నిబంధన పెట్టారు. కానీ సాయంత్రం ఇల్లు ఊడిస్తే.. చెడు జరుగుతుందేమో అని ఆ నిబంధనను అలా ఫాలో అవుతూ వస్తున్నారు.

Let children face difficulties - కష్టాలూ ఎదుర్కోనీ..

One young man went to apply for a managerial position in a big company.

He passed the initial interview, and now would meet the director for the final interview.

The director discovered from his CV that the youth's academic achievements were excellent.

He asked, Did you obtain any scholarships in school...?
the youth answered "NO".

Who paid for your school fees...?
" Parents ", he replied.

"Where did they work......?"

"They worked as clothes cleaner.”

The director requested the youth to show his hands.
The youth showed a pair of hands that were smooth and perfect.

"Have you ever helped your parents wash the clothes ?"

"Never, my parents always wanted me to study and read more books.
Besides, my parents can wash clothes faster than me.

The director said, "I have a request.

When you go home today, go and clean your parents hands, and then see me tomorrow morning.

The youth felt dejected.
When he went back home, he asked his parents to let him clean their hands.
His parents felt strange, happy but with mixed feelings,
They showed their hands to their son.

The youth cleaned their hands slowly.
His tear fell as he did that.
It was the first time he noticed that his parents hands were so wrinkled, and there were so many bruises in their hands.

Some bruises were so painful that they winced when he touched it.

This was the first time the youth realized that it was this pair of hands that washed the clothes everyday to enable him to pay the school fees.

The bruises in the hands were the price that the parents had to pay for his education, his school activities and his future.

After cleaning his parents hands, the youth quietly washed all the remaining clothes for  them.

That night, parents and son talked for a very long time.

Next morning, the youth went to the director's office.

The Director noticed the tears in the youth's eyes, when he asked:

"Can you tell me what have you done and learned yesterday in your house....?"

The youth answered,
I cleaned my parents hand, and also finished cleaning all the remaining clothes'

“I now know what appreciation is.
Without my parents, I would not be who I am today...

By helping my parents, only now do I realize how difficult and tough it is to get something done on your own And I have come to appreciate the importance and value of helping one’s family.

The director said,
"This is what I am looking for in a manager.
I want to recruit a person who can appreciate the help of others, a person who knows the sufferings of others to get things done, and a person who would not put money as his only goal in life.”

“You are hired.”

A child, who has been protected and habitually given whatever he wanted, would develop an "entitlement mentality" and would always put himself first.

He would be ignorant of his parent's efforts.

If we are this kind of protective parents, are we really showing love or are we destroying our children instead...?

You can let your child live in a big house, eat a good meal, learn piano, watch on a big screen TV.

But when you are cutting grass, please let them experience it.

After a meal, let them wash their plates and bowls together with their brothers and sisters.

It is not  because you do not have money to hire a maid, but it is because you want to love them in a right way.

You want them to understand, no matter how rich their parents are, one day their hair will grow grey, same as the parent of that young person.

The most important thing is your child learns how to appreciate the effort and experience the difficulty and learns the ability to work with others to get things done

ఓ అమ్మ కథ

మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది. మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది. ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్ కి వచ్చింది. ఇంక అప్పట్నించి చూడండి. ”మీ అమ్మ ఒంటి కన్నుది” అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు.అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే. అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది. ఒక్కోసారి నాకు.అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుణ్ణు.“అమ్మానీరెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన అయిపోయాను. నువ్వు చచ్చిపో!” కోపంగా అరిచేసే వాణ్ణి. ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేదికాదు.నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది. అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది. ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా భాధ పెట్టానో నాకు తెలియదు.ఒక రోజు రాత్రి యధాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను. మద్యలో దాహం వేసి మెలుకువ వచ్చింది. నీళ్ళు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను. అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది. మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్ళు. నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది? మొహంతిప్పుకుని వెళ్ళిపోయాను.ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణవ్వాలనీ, బాగా పేరు సంపాదించాలనీ కలలుగంటూ నిద్రపోయాను.ఆ తరువాత నేను చాలాకష్టపడి చదివాను. పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను. మంచి విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను. బాగా డబ్బు సంపాదించాను. మంచి ఇల్లు కొనుక్కున్నాను.మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాను. నాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది. ఎందుకంటేఇక్కడ మా ఒంటికన్ను అమ్మ లేదుకదా!అలా ఎడతెరిపిలేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి. ఇంకెవరు? మా అమ్మ. ఆమె ఒంటి కన్ను చూసి రెండేళ్ళ నా కూతురు భయంతో జడుసుకుంది. “ఎవరు నువ్వు? ఎందుకొచ్చావిక్కడికి? నువ్వెవరో నాకు తెలియదు. నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా?ముందునువ్వెళ్ళిపో ఇక్కడ్నుంచి!!!”సాధ్యమైనంతవరకు తెలియనట్లే నటించాను.“క్షమించండి బాబూ! తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను” ఆమె అదృశ్యమైపోయింది. “హమ్మయ్య ఆమె నన్ను గుర్తు పట్టలేదు”. భారంగా ఊపిరి పీల్చుకున్నాను.ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించుకోనవసరంలేదు అనుకున్నాను.కానీ కొద్దిరోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు. వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికి అబద్ధం చెప్పి అక్కడికి బయలు దేరాను. స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను. ఎంత వద్దకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించాయి. మా అమ్మ ఒంటరిగా కటిక నేలపై పడి ఉంది. ఆమె చేతిలో ఒక లేఖ. నా కోసమే రాసిపెట్టి ఉంది. దాని సారాంశం.ప్రియమైన కుమారునికి,ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను. నేనింక నీవుండే దగ్గరికి రాను. కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా! ఏం చేయమంటావు? నిన్ను చూడకుండా ఉండలేకున్నాను. కన్నపేగురా. తట్టుకోలేక పోతోంది. నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసిన నా ఆనందానికి పట్టపగాలు లేవు. కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే. వస్తే నీకు మళ్ళీ అవమానం చేసినదాన్నవుతాను. ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు. చిన్నా! నీవు చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒక ప్రమాదంలో నీకు ఒకకన్నుపోయింది. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాన్రా కన్నా! అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను. నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా? నువ్వు చేసినపనులన్నింటికీ నేను ఎప్పుడూ బాధపడలేదు. ఒక్క రెండు సార్లు మాత్రం ” వాడు నా మీద కోప్పడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనా కదా!” అని సరిపెట్టుకున్నాను. చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగానిలిచిపోయే మధురానుభూతులు.ఉత్తరం తడిసి ముద్దయింది. నాకు ప్రపంచం కనిపించడం లేదు.నవనాడులూ కుంగిపోయాయి. భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను. తన జీవితమంతా నాకోసం ధారబోసిన మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్ళు కారిస్తే సరిపోతాయి? ఎన్ని జన్మలెత్తి ఆమె ఋణం తీర్చుకోను......?
గుర్తు పెట్టుకో మిత్రమా.....!!
ఈ సమస్తంలో చెడిన ఆడది ఉంటుందేమో,కానీ..
చెడ్డ అమ్మ మాత్రం ఉండదు....

Famous English rhymes in Telugu meaning and Telangana slang


 Twinkle Twinke little star
how I wonder what you are
up above the world so high
like a diamond in the sky
--
మెరిసే మెరిసే ఓ చిన్న సుక్క
నాకు సమఝ్ ఐతలే నువ్వు ఏందో ఏమో
భూమి కెళ్ళి అంత మీదికి
ఆకాసంల వజ్రం లెక్క ఉన్నావ్ లే

---------------------------------------

🚕🚗
Jack and Jill went up a hill
to fetch a pail of water
Jack fell down and broke his crown
And Jill came tumbling after Jack
--
జక్కు గాడు జిల్లు గాడు కొండ మీదికి పాయిండ్రు
కుండల నీళ్ళు తెనీకి
జాక్ గాడు కిందవడి బొక్కలు చూరు చూరు చేస్కుండు
జిల్లు గాడు గూడ ఆని ఎంకనే పది దొర్లుకుంట సచిండు

---------------------------------------

🌹🌹🌹

Ringa Ringa roses
Pocket full of posses
Asha Busha all fell down
--

గోలు గోలు తిరిగే గులాబీ పూలు
జేబు నిండా పోస్సులు
అర్రే! అర్రే! అందరు కింద వడ్డారు
---------------------------------------

😎😎😎

Johny Johny....yes papa
Eating sugar......no papa
telling lies.....no papa
open ur mouth...ha ha ha !!!
--
జాని గ  జాని గా ....... ఏందీ నాయన
శెక్కరి కాని బొక్కినవ .... ఎహ్ లేద నాయన
అబధాలు చెప్తున్నవ్లె .... అమ్మ తోడు నాయన
ఏది జరా నోరు తెరువు... ఇగ సూడు ..... ఆ ఆ హా అహ్హ 

చాణుక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో చెప్పిన అద్భుతమైన నీతి కధ

ఒక అడవి లో ఒక లేడి భారంగా అడుగులు వేస్తూ వెడుతోంది . అది నిండు గర్భిణి....దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి .అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతోంది .ఒక దట్టమైన గడ్డి భూమి కనబడింది . దానికి అటుపక్క నది ప్రవహిస్తోంది . అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది . నొప్పులు మొదలయ్యాయి . నిట్టూర్పులు విడుస్తూ అటూ ఇటూ తిరుగుతోంది.....అప్పుడే దట్టమైన మబ్బులు కమ్మాయి . ఉరుములు , పిడుగులు . పిడుగు పడి కొద్ది దూరం లోనే గడ్డి అంటుకుంది. దూరంగా తన ఉనికిని గమనించి కుడి వైపు నుండి ఒక సింహం వస్తోంది . ఎడమవైపు నుండి ఒక వేటగాడు బాణం సరి చూసుకుంటున్నాడు. ఇంకో వైపు నది వెళ్ళనివ్వదు ...!
భగవాన్ ! ఆ లేడి ఇప్పుడు ఏమి చెయ్యాలి ?.
ఏమి జరగబోతోంది ?
లేడి బిడ్డకు జన్మ ఇస్తుందా ? బిడ్డ బతుకుతుందా?
సింహం లేడిని తినేస్తుందా ?

వేటగాడు లేడిని చంపెస్తాడా ?
నిప్పు లేడి వరకూ వచ్చి లేడి కూనను చంపేస్తుందా?
ఒక వైపు నిప్పు ,
రెండో వైపు నది , మిగిలిన రెండు వైపులా మృత్యువు రూపం లో వేటగాడు, సింహం. కానీ లేడి మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు.
అది తన బిడ్డను కనడం మీదే దృష్టి పెట్టింది..... అప్పుడు పరిణామాలు ఇలా జరిగాయి.......పిడుగు కాంతికి వేటగాడి కళ్ళు చెదిరాయి. గురి తప్పి బాణం సింహానికి తగిలింది. వర్షం పడి సమీపిస్తున్న మంటలు ఆరిపోయాయి. లేడి పిల్ల తల్లి గర్భం లో నుండిబయటకు వచ్చింది. అది ఆరోగ్యం గా ఉంది.......ఏదైతే జరగనీ , నేను బిడ్డకు జన్మనివ్వడం మీదనే దృష్టి పెడతాను అని అదిఅనుకోకుండా ప్రాణం గురించి ఆలోచించి తప్పటడుగు వేసి ఉండి వుంటే ..... ఏమి జరిగేది????....మన జీవితాలలో కూడా అన్ని వైపులా సమస్యలు చుట్టూ ముడుతూనే ఉంటాయి . నెగటివ్ ఆలోచనలతో సతమవుతూనే ఉంటాము . మన తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాము .భగవంతుడిపై భారం వేసి మన పని మనం చెయ్యడమే మనం చెయ్యవలసినది.

Thursday, 5 May 2016

విద్యార్థులకు ఏ సెలబస్ మంచిది? CBSE ? ICSE ?

CBSE/CISCE/STATE... ఏ సిలబస్ లో ఏముంది...?:

తమ పిల్లల్ని ఏ సిలబస్ స్కూల్లో చదివిస్తే ప్రయోజనం అనే విషయాన్ని తేల్చుకోవాల్సి వస్తే తల్లిదండ్రులు ఎంతో మథన పడుతుంటారు.ఏది సులభంగా ఉంటుంది? ఏది ప్రయోజనం, మంచి స్టాండర్డ్స్ ఏ సిలబస్ లో ఉంటాయి? ఇలా ఎన్నో సందేహాలతో సతమతం అవుతుంటారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ రకాల సిలబస్ లు,వాటి మధ్య ఉన్న తేడాలు,ఇతర సమాచారం తెలుసుకుందాం.

CBSE (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్):
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్ సీఈఆర్ టీ) గుర్తింపు ఉంది.ప్రభుత్వ, ప్రైవేటు రంగ స్కూళ్లకు విద్యా విధానం,పాఠ్య ప్రణాళిక రూపొందించి  అమలు చేయడం కోసం ఈ బోర్డ్ ను ఏర్పాటు చేశారు.దేశవ్యాప్తంగా ఎక్కువ శాతం స్కూళ్లు ఈ సిలబస్ ను ఫాలో అవుతున్నాయి.నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యా బోధన సీబీఎస్ఈ పరిధిలో ఉంటుంది.అది కూడా ఇంగ్లిష్ లేదా హిందీ విధానంలోనే.జవహర్ నవోదయ గురుకుల విద్యాలయాలు, ేంద్రీయ విద్యాలయాలు,సర్వోదయ విద్యాలయాలు సీబీఎస్ఈ పరిధిలోకే వస్తాయి.దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీ, ట్రిపుల్ఐటీ, ఎన్ఐటీ, ఎయిమ్స్ తదితర వాటిల్లో ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఈఈ, ఎన్ఈఈటీ పరీక్షలను సీబీఎస్ఈ నిర్వహిస్తుంటుంది.

పాఠ్యాంశాలు, పాఠ్య ప్రణాళిక:
సీబీఎస్ఈ సిలబస్ లో మ్యాథ్స్, సైన్స్ అంశాలపై ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఎక్కువ శాతం కాంపిటీటివ్ పరీక్షల్లో సీబీఎస్ఈ సిలబస్ పైనే ప్రశ్నలు ఉంటాయి.దాంతో మంచి ఫలితాల సాధనకు వీలుగా ఈ సబ్జెక్టులపై ఫోకస్ పెడతారు.విద్యార్థుల్లో మేథస్సు, సామాజిక స్ఫూర్తి, సమస్యలు పరిష్కరించేందుకు వీలుగా సీబీఎస్ఈ పాఠ్య ప్రణాళిక రూపొందిస్తుంటుంది.సిలబస్ మొత్తాన్ని యూనిట్లుగా విభజించి ఒక్కో యూనిట్ కు ఒక పీరియడ్ చొప్పున కేటాయిస్తారు.దాంతో ప్రతీ విభాగాన్ని నిర్ణీత కాలంలో పూర్తి చేయడంతోపాటు ప్రిపరేషన్ కు అనువుగా ఉంటుంది.
ఒక కాన్సెప్ట్ గురించి విద్యార్థులకు బోధించిన తర్వాత భిన్న విధానాల్లో విద్యార్థి నాలెడ్జ్ ను పరీక్షిస్తారు. దీంతో నేర్చుకున్న అంశాన్ని భిన్న సందర్భాల్లో ఎలా ఆచరించాలనే విషయాన్ని విద్యార్థులు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.సీబీఎస్ఈ సిలబస్ స్టేట్ సిలబస్ కంటే కొంచెం కఠినంగా(ఉన్నత ప్రమాణాలతో) ఉంటుంది.6 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ తోపాటు సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వెజ్ 9, 10 తగరతుల వారు మేథమేటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్ట్ లను చదవాల్సి ఉంటుంది.
సీబీఎస్ఈని విదేశాల్లోని పలు యూనివర్సిటీలు సైతం గుర్తిస్తున్నాయి.ఈ సిలబస్ లో చదివిన వారికి విదేశాల్లో ఉన్నత విద్యకు పెద్దగా ఇబ్బందులు ఉండవు.ముఖ్యంగా ఇక్కడ చూడవలసిన మరో విషయం ఏమిటంటే సీబీఎస్ఈ సిలబస్ లో చదివిస్తున్నట్టయితే సబ్జెక్టుల వారీ ట్యూషన్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా? లేదా? అన్నది. అందులోనూ ఎక్కువ శాతం పట్టణాల్లోని స్కూళ్లే ఈ సిలబస్ ను అమలు చేస్తున్నాయి. సీబీఎస్ఈ స్కూళ్లు ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాయి.దేశవ్యాప్తంగా వివిధ వర్సిటీల్లో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు పలు ఎంట్రన్స్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది.అందులో JEE, NEET పరీక్షలు సీబీఎస్ఈ కరిక్యులమ్ ఆధారంగానే ఉంటాయి కనుక ఈ సిలబస్ లో చదివిన వారు ఎక్కువ స్కోరు చేయడానికి అవకాశం ఉంటుంది.అయితే, సీబీఎస్ఈ స్కూళ్లలో ఫీజులు ఎక్కువగా ఉంటాయి.

సీబీఎస్ఈ ‘పది’లో సబ్జెక్టులు:
పదో తరగతిలో మేథమేటిక్స్, సోషల్, సైన్స్, ఇంగ్లిష్, ఒక భాష సబ్జెక్టుతోపాటు ఒక అదనపు సబ్జెక్ట్ ను విద్యార్థులు ఎంచుకోవాలి.

లాంగ్వేజ్ ఆప్షన్లు:
హిందీ, సంస్కృతం, ఫ్రెంచ్, కంప్యూటర్,జర్మన్, బెంగాలీ, గుజరాతి, కన్నడ, కశ్మీరీ, మరాఠి, మలయాళం, మణిపురి, ఒరియా, పంజాబి, సింది, తమిళ్, తెలుగు, ఉర్దు, లింబు, భూటియా, అరబిక్, పర్షియన్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్, నేపాలి, టిబెటన్, మిజో, బోడో, తాంగ్ కుల్

అదనపు సబ్జెక్టులు:
ఇన్ఫర్మేషన్  ఎడ్యుకేషన్, హోమ్ సైన్స్ లేదా ఫిజికల్ ఎడ్యుకేషన్ లో ఒకటి ఎంచుకోవాలి.

సీబీఎస్ఈ ఇంటర్ లో సబ్జెక్టులు: 
మెడికల్ గ్రూప్:ఇంగ్లిష్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఒకటి ఆప్షనల్ సబ్జెక్ట్
నాన్ మెడికల్ గ్రూప్:ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఒక ఆప్షనల్ సబ్జెక్ట్
కామర్స్ గ్రూప్: ఇంగ్లిష్, అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్, ఎకనమిక్స్, థియరీ అండ్ ప్రాక్టీస్ మేనేజ్ మెంట్, ఒక ఆప్షనల్ సబ్జెక్ట్
ఆర్ట్స్ గ్రూప్: ఇంగ్లిష్, పొలిటికల్ సైన్స్ / సైకాలజీ, హిస్టరీ/ఎకనమిక్స్, జియోగ్రఫీ/మ్యాథ్స్/హోమ్ సైన్స్/ సోషియాలజీ/కంప్యూటర్ అప్లికేషన్స్/హిందీ/ సంస్కృతం
ఆప్షనల్ సబ్జెక్టులు:ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ వోకల్ లేదా ఇన్ స్ట్రుమెంటల్, క్లాసిక్ లేదా డ్యాన్స్

అనుకూలతలు:
దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ సిలబస్ అందుబాటులో ఉంటున్నందున బదిలీ లేదా ఏదేనీ ఇతర అవసరం ఏర్పడి వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి వచ్చినా ఇబ్బంది ఉండదు.పాఠ్యాంశాల నాణ్యత ఎక్కువ. కరిక్యులర్, ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆధారంగా ఆరు నుంచి పదో తరగతి వరకు మార్కులకు బదులు గ్రేడ్ విధానం అమల్లో ఉంటుంది.దీంతో మార్కుల పరంగా ఒత్తిడి తగ్గడానికి అవకాశం ఉంది.భారత్ లో అన్ని కళాశాలలు సీబీఎస్ఈ కోర్సులను గుర్తిస్తున్నాయి.అయితే, రాష్ట్రాల్లోని కళాశాలలు స్టేట్ బోర్డ్ సిలబస్ విద్యార్థులకు మరిన్ని సీట్లు కేటాయించడం ప్రతికూలమని చెప్పుకోవచ్చు.అలాగే సీబీఎస్ఈ సిలబస్ లో ఆర్ట్స్,లిటరేచర్ కు అంత ప్రాధాన్యం ఉండదు.

కేరళలో సీబీఎస్ఈలో పది వరకు చదివిన వారు ఇంటర్ కు వచ్చే సరికి సగం మంది స్టేట్ సిలబస్ ఎంచుకుంటున్నారు.దీనికి కారణం స్టేట్ సిలబస్ లో అయితే ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశంతోపాటు వృత్తి విద్యా కళాశాలల్లో ప్రవేశానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే భావన.రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల్లోనే చదవాలనుకుని,రాష్ట్ర స్థాయిలోనే ఉద్యోగ అవకాశాలు వెతుక్కునే వారికి స్టేట్ బోర్డు సిలబస్ అనువుగా ఉంటుందని చెప్పవచ్చు.



కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్ సిఈ):
ఇది ప్రైవేటు రంగ బోర్డు.దీన్నే ఐసీఎస్ఈ అని కూడా అంటారు. ఈ బోర్డు పదో తరగతి విద్యార్థులకు ఇండియన్ సర్టిఫికెట్ సెకండరీ ఎడ్యుకేషన్(ఐసీఎస్ఈ), ఇంటర్ విద్యార్థులకు ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్(ఐఎస్ సీ) పరీక్షలను నిర్వహిస్తుంది.సీబీఎస్ఈ వలే నర్సరీ నుంచి ఇంటర్ వరకు కరిక్యులమ్,సిలబస్ రూపకల్పన, పరీక్షల నిర్వహణ చూస్తుంటుంది. కంటెంట్ పరంగా సీబీఎస్ఈ పాఠ్యాంశాలు,పాఠ్య ప్రణాళికకు భిన్నంగా ఉంటుంది.అదే సమయంలో సీబీఎస్ఈ కంటే సీఐసీఎస్ఈ సిలబస్ మరింత కఠిన ప్రమాణాలతో, అదనపు సిలబస్ తో ఉంటుంది.విద్యార్థి బహుముఖంగా రాణించేలా, ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరిగే విధంగా ఈ బోర్డ్ విద్యా విధానం ఉంటుంది.ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో యూనివర్సిటీలు, ఎన్నో దేశాలు దీన్ని గుర్తిస్తున్నాయి.
దీని కరిక్యులమ్ విదేశీ కళాశాలల్లోని కోర్సుల కరిక్యులమ్ ను పోలి ఉంటుంది.కనుక విదేశాల్లో ఉన్నత విద్య కాంక్ష ఉన్నవారు ఈ సిలబస్ లో చదవడం ఉపయుక్తంగా ఉంటుందనుకోవచ్చు.పాఠ్యాంశాల్లో సైన్స్, ఆర్ట్స్, లాంగ్వేజ్, మ్యాథ్స్ తదితర అంశాలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది.ఇంటర్ లో భిన్నమైన అంశాలు, నచ్చిన సబ్జెక్టుల ఎంపికకు అవకాశం ఉంటుంది. కోర్సు మధ్యలో వేరే బోర్డ్ కు మారడానికి అవకాశం లేదు. ఫీజులు ఎక్కువ.కాగా, ఐసీఎస్ఈ, ఐఎస్ సీ విద్యార్థులు 2018 నుంచి నూతన సిలబస్ లో చదవాల్సి ఉంటుంది.హిస్టరీ, సివిక్స్, జియోగ్రఫీ, మేథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో పాఠ్యాంశాలు మార్చాలని నిర్ణయం జరిగింది.9, 10వ తరగతుల్లో సిలబస్ తగ్గించడం ద్వారా విద్యార్థులపై పడుతున్న భారాన్ని తగ్గించనున్నారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,157 ఐసీఎస్ఈ స్కూళ్లు ఉన్నాయి.1958లో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ దీన్నిఏర్పాటు చేసింది.

సబ్జెక్టుల వివరాలు:
పదో తరగతిలో తప్పనిసరి సబ్జెక్టులు ఐదు:ఇంగ్లిష్, హిస్టరీ, సివిక్స్, జియోగ్రఫీ, ఏదేనీ భారతీయ భాష
అడిషినల్ సబ్జెక్ట్స్:మేథమేటిక్స్, సైన్స్, ఎన్విరాన్ మెంటల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, అగ్రికల్చరల్ సైన్స్, కమర్షియల్ స్టడీస్, టెక్నికల్ డ్రాయింగ్, ఫారీన్ లాంగ్వేజ్, క్లాసికల్ లాంగ్వేజ్, ఎకనమిక్స్ లో రెండింటిని ఎంచుకోవాల్సి ఉంటుంది.అలాగే, మూడో అడిషనల్ సబ్జెక్ట్ విషయానికొస్తే కంప్యూటర్ అప్లికేషన్స్,ఎకనమిక్ అప్లికేషన్స్, కమర్షియల్ అప్లికేషన్స్, ఆర్ట్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, హోమ్ సైన్స్, కుకరీ, ఫ్యాషన్ డిజైనింగ్, ఫిజికల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ డ్రాయింగ్ అప్లికేషన్స్, యోగా, ఎన్విరాన్ మెంటల్ అప్లికేషన్స్ ఉన్నాయి.

ఇంటర్ లో సబ్జెక్టులు:
ఇంగ్లిష్ తోపాటు ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్లీ యూజ్ ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ సబ్జెక్టులు తప్పనిసరి. అలాగే మూడు నుంచి ఐదు వరకు వేరే సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చు.వాటిలో భారతీయ భాష, మోడ్రన్ ఫారిన్ లాంగ్వేజ్, క్లాసికల్ లాంగ్వేజ్, ఇంగ్లిష్ లిటరేచర్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫీ, సోషియాలజీ, సైకాలజీ, ఎకనమిక్స్, కామర్స్, అకౌంట్స్, బిజినెస్ స్టడీస్, మేథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హోమ్ సైన్స్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, జియోమెట్రికల్ అండ్ మెకానికల్ డ్రాయింగ్, జియోమెట్రికల్ అండ్ బిల్డింగ్ డ్రాయింగ్, ఆర్ట్, మ్యూజిక్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎన్విరాన్ మెంటల్ సైన్స్ అండ్ బయోటెక్నాలజీ.


సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ మధ్య తేడాలు:
>సీబీఎస్ఈ ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో బోధనను అనుమతిస్తుంది. కానీ, ఐసీఎస్ఈ మాత్రం కేవలం ఇంగ్లిష్ బోధనకే పరిమితం.
>సీబీఎస్ఈ దేశవ్యాప్తంగా తన గుర్తింపు పొందిన స్కూళ్లలో చదివిన విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తుంది.అలాగే, తన గుర్తింపు లేని స్కూళ్లలో చదివిన విద్యార్థులను కూడా పరీక్షలకు రాయడానికి అవకాశం ఇస్తుంది.అదే, ఐసీఎస్ఈ మాత్రం తన గుర్తింపు లేని స్కూళ్లలో చదివిన విద్యార్థులను పరీక్షలకు అనుమతించదు.
>సీబీఎస్ఈ బోర్డుకు కేంద్ర ప్రబుత్వ అనుమతి ఉంది.కానీ ఐసీఎస్ఈకి లేదు. అయితే, ఈ రెండు బోర్డులు అందించే సర్టిఫికెట్లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.సీబీఎస్ఈని దేశవ్యాప్తంగా అన్ని కళాశాలలు,యూనివర్సిటీలే ఎలా అయితే అదే విధంగా  సీఐఎస్ సీఈకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని కళాశాలల నుంచి గుర్తింపు ఉంది.
>సీబీఎస్ఈ  సిలబస్ ఇంజనీరింగ్, మెడికల్ తదితర కోర్సుల్లో ప్రవేశ పరీక్షలతోపాటు పోటీ పరీక్షల్లోనూ నెగ్గేందుకు ఉపకరిస్తుంది.పైగా ఐసీఎస్ఈ కంటే సిలబస్ తేలిగ్గా ఉంటుంది.సీబీఎస్ఈ సైన్స్, మ్యాథ్స్ పై ఎక్కువ ఫోకస్ పెడుతుంది. సీఐఎస్ సీఈ మాత్రం అన్ని అంశాలపై సమానంగా ఫోకస్ పెడుతుంది.
>ఎన్ సీఈఆర్ టీ పరిశోధన ఫలితాల ప్రకారం ప్రస్తుతం దేశంలో పాఠశాల విద్యా విధానం అంతా పరీక్ష ఆధారితంగానే నడుస్తోంది. కరిక్యులర్ యాక్టివిటీపైనే ఎక్కువగా దృష్టి ఉందని, అది కూడా నేర్చుకుని గుర్తు పెట్టుకునే విధానంలోనే ఉందని పేర్కొంది. కానీ విద్యార్థి సంపూర్ణ అభివృద్ధికి కో కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివ్ అబిలిటీ వంటివి కూడా అవసరమని స్పష్టం చేసింది. ఐసీఎస్ఈ లో నైపుణ్య వృద్ధికి, స్వతంత్ర పరిశోధన, క్రియేటివిటీకి అవకాశం ఉందని నిపుణుల విశ్లేషణ.



స్టేట్ బోర్డ్:
ప్రతీ రాష్ట్రంలోనూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బోధనకు వీలుగా తగిన పాఠ్య ప్రణాళికలను రూపొందించి అమలు చేయడానికి, ప్రమాణాలను పర్యవేక్షించడానికి, పరీక్షల నిర్వహణకు స్టేట్ బోర్డులు ఉన్నాయి. ఈ బోర్డులు ప్రభుత్వ రంగంలోనివి. వీటికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆమోదం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి కోసం ఎస్ఎస్ సీ బోర్డు, ఇంటర్ కోసం ఇంటర్ బోర్డు ఉన్నాయి.  స్టేట్ సిలబస్ లో ఎక్కువగా ప్రాంతీయత కనిపిస్తుంటుంది. స్టేట్ సిలబస్ స్కూళ్లలో ఫీజులు సీబీఎస్ఈ స్కూళ్లతో పోల్చి చూసినప్పుడు తక్కువగా ఉంటాయి. స్థానిక అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది కనుక రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలు రాసే విద్యార్థులకు అనువుగా ఉంటుంది.అదే సమయంలో స్థానిక భాషలోనే విద్యా బోధనకు ప్రాధాన్యం ఉంటుంది.