Showing posts with label telugu Cinema dialogues satire. Show all posts
Showing posts with label telugu Cinema dialogues satire. Show all posts

Thursday, 29 October 2015

Upcoming dialogues in Telugu Cinema

రాబోయే రోజుల్లో కాబోయే డైలాగులు

1. ప్రేబుత్వ ఆఫీస్ లలోనే కాదు ప్రైవేటు ఆఫీస్ లలో కూడా ఉద్యోగస్తుడు ప్రశాంతం గా నిద్ర పోయిన రోజే మనకు నిజమయిన స్వాతంత్రం వచ్చినట్టు
...
2. వర్షాకాలం వర్షాలని .. ఎండాకాలం ఎండలని .. సలి కాలం లో సలి ని ఎలా ఆప లేమో ..... పోయే కాలం వచ్చినా అలానే ఆపలేము ....
...
3. ఎప్పుడు మగవాడు పగల బడి నవ్వుతాడో .... పక్కన ఆడి పెళ్ళాం లేదని అర్ధం ....
...
4. అడిగిన వెంటనే అప్పుదోరికిన రోజు ఇచ్చిన అప్పు తిరిగి అడగని వారు పెరిగిన రోజే దేశం అభివృద్ధి పదం లొ నడుస్తుంది
...
5. వ్యక్త పరచని ప్రెమ అనెది పేకాట లాంటిది లయిఫు జొకరు పడింది అని సంతిషించె లొపె పక్కొడికి డీల్ షొ పడిపొతుంది
....
6. మనిషి ఆశ అనే పెనం మీద దోసలేస్తూ ఉంటాడు ఒక్క దోస మాడిందని ...పిండి పాడేసు కుంటాడ లేక పెనం పగల గోడతాడ ? రెండు చెయ్యడు పెనం బాగా తుడిఛి మల్లి వేస్తాడు ....... అపజయాలు మాడిన దోస లాంటివి
....
7.  అతిగా అవేస పడిన అమ్మాయి ... అల్లుళ్ళని ఆడి పోసుకున్న మామ బాగుపడ్డట్టు చెరిత్రలో లేదు
....
8.  ప్రియురాలు పువ్వులాంటిది కొట్టినా పెద్ద దెబ్బ తగలదు ....... పెళ్ళాం పెంకు లాంటిది కొడితె బొక్కడిపొద్ది
....
9.  ప్రేమ అనేది బీరకాయ తోక్కలాంటిది ... తెలిసిన వాడు దానితో పచ్చడి చేసుకుంటాడు తెలియని వాడు బయట పడేస్తాడు ... టోటల్ గా చెప్పొచ్చేది ఏందయ్యా అంటే ప్రేమలో పడితే పచ్చడి అయిపోతారు
.....
10. పరుల సొమ్ము ఫినాయిల్ లాంటిది సుడటానికి తెల్లగా ఉన్నా తాగితే పోతాం ......
....
11. బుర్ర లేనొడితొ వాదించటం అంటె ....ప్రెష్ గా తడిసి వచ్చిన బురద పంది తొ బాక్సింగ్ లాంటిది తెగించి దిగితె గెలుస్తావ్ మనకెందుకొచ్చిన బురదలె అనుకుంటె ఓడిపొతావ్
.....
12. అబద్దానికి అయుషు తక్కువ ... బట్టలు తక్కువ వెసె హెరొయిన్ మీద పుకారులెక్కువ

13. పాలల్లొ నీళ్ళు కలపక పొతె పాల వాడికి ఎంత నష్టమొ ... దెశం లొ వెదవలు లేక పొతె దెసానికి అంతె నష్టం
....
14. ఒక సిగరెట్ మరో రెండు సిగరెట్ లని వెలిగించక పోతే అది ఎంత కాస్ట్లీ సిగరెట్టూ అయిన గొప్ప సిగరెట్ అవ్వలేదు .... ఒక యదవ మరో ఇద్దరు యదవలని తయారు చెయ్యక పొతే వాడు ఎంత పెద్ద యదవ అయినా .. గొప్ప యదవ కాలేడు ...
.....
15. కాలం గేలం వేస్తే సముద్రం లోని ఫిష్ కూడా స్టార్ హోటల్ లో డిష్ అవుతుంది
.....

16. ఏడుపులు పలు రకాలు ....

మనం బాగు పడటం లేదు అని ఎడ్చేవాళ్ళు

ఎప్పుడు బాగుపడతాం అని ఎడ్చేవాళ్ళు

పక్కనొడు బాగు పడితే ఏడ్చే వాళ్ళు

పక్కనొడు ఎక్కడ బాగుపడతాడో అని ఎడ్చేవాళ్ళు

మొదటి ఇద్దరిది ఆశ మిగతా ఇద్దరిది అత్యాస ... మనిషికి ఆశ ఉండాలి గాని అత్యాస ఉండకూడదు ....
......

17. భరించేవాడిని భర్త మరియు పీడించే దాన్ని పెళ్ళాం అంటారు ....