పిల్లకు పేరు కావాలి
“మీరే ఎలాగైనా సాయం చెయ్యాలి. ఎంతో మందిని అడిగాను. ఎవరూ నా బాధ అర్థం చేసుకోలేకపోయారు.“
“ఏవిటో నీ కష్టం?”
“పిల్ల పుట్టి మూడేళ్ళైంది. రేపు స్కూల్లో పడేయాలి. ఇంతవరకు పేరు పెట్టలేకపోయాము. నెట్ సెర్చ్ చేశాము. పుస్తకాలు వెతికాము. సరైన పేరు దొరకలేదు. ఎవరో మీ పేరు చెప్పి మీదగ్గరకెళ్ళమన్నారు."
“ఎలాంటి పేరు కావాలి?”
“ఆ పేరు మా పిల్లకు మాత్రమే ఉండాలి. ఇంకెవరూ పెట్టుకోకూడదు."
"సూర్యకాంతం పెట్టు. అదైతే నాకు తెలిసి ఎవడూ పెట్టుకోరు.”
“కానీ పేరు విచిత్రంగా ఉండాలి. మా బావ, కూతుళ్ళిద్దరికీ పండు వెన్నెల, నిండు పున్నమి అని పెట్టాడు. అట్టాంటి పేర్లు ఎవరికీ లేవని పొగరుతో విరగబడుతున్నాడు. వాటిని తలదన్నే పేరు పెట్టాలి.”
“మీ బావగాడి చెంప మీద కొట్టి నట్టుండే పేర్లు చెప్తా రాసుకో! పట్ట పగలు, చిమ్మ చీకటి, మిట్ట మధ్యాహ్నం."
“మా పిల్ల పేరు ఫైనలైజ్ అయ్యే వరకూ ఈ పేర్లు ఎక్కడా లీక్ చెయ్యొద్దు సార్, ప్లీజ్!”
“సర్లే ఎవరికీ చెప్పనులే. అయినా ఎందుకోయ్ అంత టెన్షన్?”
“పిల్లకు పేరు పెట్టే ఉద్దేశమేమైనా ఉందా? అసలేమైనా ప్రయత్నం చేస్తున్నావా? అని రోజూ మా ఆవిడ తిడుతోంది సార్!”
“నీ మాటల్లోనే రెండు పేర్లు దొరికాయి, ఉద్దేశ, ప్రయత్న. ఇంతకూ మీ ఆవిడ ఏమని తిడుతోంది నిన్ను?"
“వేస్టు గాడినంది.”
“వేస్టు అంటే వ్యర్థము. దొరికింది. వ్యర్థ super name!"
“శాన్వి అనీ శ్రాగ్వి అని పెడుతున్నారు కదా, వాటికి అర్థం ఏవిటండీ?”
“మీ ఆవిడ అందని కాదుగానీ, నిజంగానే super వేస్టుగాడివోయ్. పేరుకు అర్థమేంటి. పేరుకు అర్థo ఉండక పోవడమే ఇప్పటి ట్రెండ్. మా బాబాయి మనవరాళ్ళ పేర్లేవిటనుకున్నావు? పెద్దదాని పేరు శ్మశాన, చిన్న దాని పేరు వాటిక. ఎలా ఉన్నాయి?”
“బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. కాదేదీ పేరు కనర్హం, అన్నమాట!”
“మరే.. ఇప్పుడు నువ్వు మాట్లాడిన దాంట్లో కూడా రెండు పేర్లున్నాయి- బ్రహ్మాండ, అనర్హ."
“మీరు శూన్యం లో నుండి కూడా పేర్లు తీస్తున్నారు సార్!”
"శూన్య ఇదేదో బాగుందయ్యా!
“బుర్రలో ఆ తెలివి ఉండాలి. ఏది చూసినా పేరు తట్టాలి. మా తమ్ముడు ఓ రోజొచ్చి, “అన్నయ్యా, పిల్లల పేర్లు పెట్టడం విషమ సమస్యైంది అన్నాడు. అంతే పిల్ల పేరు - విషమ, పిల్లాడి పేరు - సమస్య్, ఎలా ఉన్నాయి?“
“నా శ్రాద్ధంలా ఉన్నాయి.”
“ఆహా, శ్రాద్ధ.. new one, ఉండు బుక్కు లో రాసుకుంటా.”
“మా అమ్మ శివుడి పేరుమీద శివకుమారి అని పెడతానంటుంది.”
“అలా రొటీన్ పేర్లు పెట్టావో, నువ్వూ మీ ఆవిడా కలిపి ఒకే తాడుకు ఉరేసుకోవాలిన పరిస్తితి వొస్తుంది. ముందే చెప్తున్నా, జనాలు నిన్ను కాకులైపొడుస్తారు.”
“కోప్పడకండి సార్!”
“రొటీన్ కు భిన్నంగా ఆలోచించవయ్యా. శివకుమారి కామనే గదా, శవ కుమారి అని పెట్టు.”
“గురువుగారూ, ఇంతకూ మీ పిల్లల పేర్లు ఏవిటండీ?”
“ఎవరికీ లేని పేర్లు పెట్టాలని అమ్మాయి పేరు - సామూహిక, అబ్బాయి పేరు - అత్యాచార్ పెట్టాను. పొద్దున్న లేస్తే పేపర్ నిండా అవే. అవింకెవరైనా పెట్టుకుంటారేమోనని కంటినిండా నిద్రపోయింది లేదు. అంతా నా ఖర్మ.”
“ఖర్మ, గురువుగారూ.. ఎంత బాగుందో. కాపోతే మా వంశానికి నాగదేవత పేరుతో కలిపి పెట్టుకోవాలి. నాగ ఖర్మ అని పెట్టుకోమంటారా?"
“మళ్ళీ ఇదొకటా?”
“అవును సార్. మా కజిన్ల పేర్లు నాగ భీభత్స్ , నాగ ఢిబంక్, నాగ హిడింబ్, మా అన్నయ్య తన పిల్లలకు సర్ప జగదేక్, నాగ అతిలోక్ అని పెట్టాడు. వాడు చిరంజీవి ఫాన్ లెండి.”
“మళ్ళీ ఇదొక దరిద్రమా? one sec.. దరిద్ర.. నాగ దరిద్ర అని పెట్టు”
“కానీ మా ఆవిడ మూడక్షరాలపేరే పెడదామంటోంది!”
"కుబుస అని పెట్టుకో సరికొత్తగా ఉంటుంది.

No comments:
Post a Comment