Sunday, 5 June 2016

ఫేస్ బుక్ కథ Facebook story

Facebook మహిమ....

ఒకబ్బాయ్ క్లాసు జరుగుతున్నప్పుడు ఎఫ్ బి. open చేసి స్టేటస్ అప్డేట్ చేశాడు..

" క్లాస్ లో ఫేస్ బుక్ యూజ్ చేస్తున్నా.."

వెంటనే లెక్చరర్ కామెంట్ చేశారు.." గెటౌట్ ఫ్రం ద క్లాస్..."

ప్రింసిపల్ లెక్చరర్ కామెంట్ కి లైక్ కొట్టాడు..

ఆ అబ్బాయ్ ఫ్రెండ్ కామెంట్.." అరేయ్ వెంటనే canteen  కి వచ్చెయ్...

వాళ్ళ అమ్మ కామెంట్ " అరేయ్ వెధవా.. క్లాస్ ఎలాగూ వినడం లేదు. కనీసం మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు పట్రా...."

అమ్మ కామెంట్ నాన్న రిప్లై.." చూశావా నీ పుత్ర్ రత్నం ఏం చేస్తున్నాడో...."

గాళ్ఫ్రెండ్ కామెంట్ " మీ నానమ్మ హాస్పిటల్ చాలా సీరియస్ స్టేజ్ లో ఉంది. అందుకే నన్ను కలవడం కుదరదు అని చెప్పావ్.. ఇంత మోసం చేస్తావా నన్ను...."

వాళ్ళ నానమ్మ కామెంట్.." అరేయ్ దరిద్రుడా.... నేనింకా బ్రతికే ఉన్నానురా...ఇంట్లో హాయిగా సీరియళ్ళు చూసుకుంటుంటే, హాస్పిటల్ లో ఉన్నానని అందరికీ చెబుతావా? ఇంటికా రా నీ కాళ్ళు విరగ్గొడతా..."

Why Finland is top in education

ఫిన్లాండ్ దేశం విద్యారంగంలో  ప్రపంచంలోనే నెం.1 స్థాయిలో ఉంది అంత గోప్పేమి?
ఇక్కడి “ప్రతి పాయింటు”లో మన దేశ విద్యా వ్యవస్థ ఎంత అథమ స్థానంలో ఉందో అర్థమౌవుతుంది.
చదవండి మరి.
• 7ఏండ్లు నిండాక పిల్లలు స్కూల్లో చేరుతారు. ఇక్కడిలాగా 2.5 సం.లకే పిల్లలకు టార్చర్ మొదలవదు
• చిన్నప్పటినుండి తన ప్రతి కదలికనుండి పిల్లలు నేర్చుకొంటూనే ఉంటారు
• 7వ సం. నుండి 10వ సం. వరకు 50% స్కూల్లోను 50% సెలవుల్లోను గడుపుతాడు
• స్కూల్ టైమింగ్ తక్కువ. సంగీతం, కళలు & ఆటలకు సమాన ప్రాధాన్యం ఉంటుంది
• స్కూల్లలో, విద్యార్థులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు విశ్రాంతి తీసుకొనేందుకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయబడి ఉంటాయి
• 13 సం. వరకు విద్యార్థులకు గ్రేడింగ్, ప్రోగ్రెస్ రిపోర్ట్ ల గొడవే లేదు. కాబట్టి విద్యార్థుల మీద పోటీ పడాలనే వత్తిడి ఉండదు
• తల్లితండ్రులకు తమ పిల్లల ప్రోగ్రెస్ తెలుసుకోవాలనే కోరిక ఉంటే, దరఖాస్తు చేసుకోవచ్చు
• ఇంటి పని ఇవ్వరు. తమకు నచ్చిన సబ్జెక్టులో ఇంటిపని చేసుకోవచ్చు
• ప్రతి స్కూల్లో ఒక డాక్టర్ నివసిస్తాడు. విద్యార్థుల ఆరోగ్యం గురించి సలహాలు ఇస్తాడు
• ఒక స్కూల్లో 600 మించి విద్యార్థులను అనుమతించరు
• ప్రైవేటు స్కూల్లుండవు. అన్నీ ప్రభుత్వ స్కూల్లే. విద్య విషయంలో నాణ్యతను ఖచ్చితంగా పాటిస్తారు
• ఫిన్లాండ్ లో 99% విద్యార్థులు ప్రాథమిక విద్య తప్పక అభ్యసిస్తారు
• పరీక్షలు నిర్వహించని దేశాలనుండి వచ్చిన విద్యార్థుల్లో పోటీలలో బాగా రాణించే గుణం ఉంటుంది
• ఇది ఎలా సాధ్యం? ఐక్యరాజ్యసమితి ఈ విషయంగా పరిశోధించింది
• ప్రపంచంలోని విద్యార్థులందరిలోకి ఫిన్లాండ్ దేశ విద్యార్థులే చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విషయంగా ఫిన్లాండ్ ప్రథమ స్థానం
• ఫిన్లాండ్ విద్యావ్యవస్థ గురించి తెలుసుకొనేందుకు ప్రపంచంలోని అన్నిదేశాల విద్యావేత్తలు అక్కడకి క్యూ కట్టారు
• 56 దేశాలనుండి 1500 మంది ప్రతి సం. ఫిన్లాండ్ కు వెళుతున్నారు
• అధిక మొత్తం విదేశి మారకం విద్యారంగ పర్యాటకులనుండే వస్తుంది
• ఫిన్లాండ్ లో టీచర్ ఉద్యోగం అంటే ఇక్కడి IAS or IPS తో సమానం
• ఫిన్లాండ్ లో చట్టాలు, విధానాల రూపకల్పనలో ప్రధాన పాత్ర “ఉపాధ్యాయులదే” !!!!!!!
• దేశంలోని ప్రతి మూడో విద్యార్ధి ఉపాధ్యాయుడు కావాలనుకొంటాడు. కానీ అదంత సులభం కాదు
• విద్యలో బాగా రాణించేవారికే ఆ అవకాశం ఉంటుంది
• వారికి 5సం. ఉపాధ్యాయ శిక్షణ, 6నెలలు సైన్యంలోను, ఒక సం. స్కూల్లో ట్రైనింగ్ ఉంటుంది. చట్ట్టాలు, విధానాల రూపకల్పన, స్వయం రక్షణ, ప్రథమ చికిస్థ, అగ్నిమాపక దళంలోను 6నెలలపాటు శిక్షణ. మొత్తం 7సం.ల శిక్షణ

Telugu alphabets history

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ: ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.
తేట తేట తెనుగులా....
మన తెలుగు భాష గొప్పదనం ముందుగా అక్షరమాల అల్లికలోనే ఉంది.
పూర్వం గురువులు పిల్లలతో వర్ణమాలను వల్లె వేయించేవారు. అలా కంఠస్ధం చేయించడంవల్ల కంఠం నుంచి ముఖం వరకు వ్యాయామం తెలియకుండానే జరుగుతుంది
ఏలాఅంటే
=======
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ:
ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.
క ఖ గ ఘ ఙ……..కంఠ భాగం
చ ఛ జ ఝ ఞ……..కంఠంపైన నాలుక మొదటి భాగం
ట ఠ డ ఢ ణ……నాలుక మధ్యభాగం
త థ ద ధ న……నాలుక కొస భాగం
ప ఫ బ భ మ……..పెదవులకు
య ర ల వ శ ష స హ ళ క్ష ఱ……నోరంతా
ఇలా ముఖమంతా హల్లులతో వ్యాయామం జరుగుతుంది.
సుందర సుమధుర సౌమ్యమైన కమ్మని మృదుత్వంతో కూడిన తియ్యని తేనేలాంటిది మన భాష. ఆనందంగా మనసుకు హాయి గొలిపే విధంగా వినసొంపైన మాటలు మనందరి నోటంట వెలువడుతే ఎంత బాగుంటుంది.
తెలుగు భాషను అందంగా వ్రాసే వారికి చిత్రకళ సొంతమవుతుందంట ఎందుకంటే మన వర్ణమాలతో అన్ని మెలికలు ఉన్నాయి.
మనలోని భావాన్ని మాతృభాషలో వర్ణించినంత వివరంగా ఏ భాషలోను వ్రాయలేరు. తెలుగువారింటి ముంగిట ముగ్గును చూస్తే ఎంత ఆహ్లదభరితంగా చూడముచ్చటగా ఉంటుందో తెలుగువారి మనస్సు అంత అందంగా ఉంటుంది.
తెలుగులో మాట్లాడండి. .
తెలుగులో వ్రాయండి. . .
తెలుగు పుస్తకాలు చదవండి..చదివించండి..
తేనెలొలికే తెలుగు భాష తియ్యదనం ఆస్వాదించండి . . .
______________________________

Friday, 3 June 2016

most speechless msg ever

Father and daughter went to a temple. Suddenly, daughter  shouted after seeing the pillars of Lions at the entrance of the temple.    "Run Dad, or those Lions will eat us "

Dad consoled her saying "they are just statues and wont harm us"

Daughter replied " if those lion statues wont harm us then how could statues of God give us blessings"

The father wrote in his diary...
"I am still speechless on my child's answer and have started searching for God in Humans instead of statues. I didn't find God but I found humanity!!
 so do our best to people who are around us.

ఏ ఆహారం ఎప్పుడు తినాలి?

ఏయే ఆహార పదార్థాలను రోజులో ఏ సమయంలో తినాలో తెలుసుకోండి.
బరువు తగ్గాలనుకుంటున్న వారు, చక్కని ఆరోగ్యం కోరుకునే వారు వ్యాయామంతోపాటు ఆహారం విషయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకోవడం సహజం. అయితే వ్యాయామం సంగతి ఎలా ఉన్నా ప్రధానంగా మనం తినే ఆహారం పట్ల మాత్రం నూటికి నూరు శాతం కచ్చితంగా జాగ్రత్త వహించాల్సిందే. సరైన పోషకాలను అందించే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో, ఏ సమయంలో తినాల్సిన ఆహారాన్ని అదే సమయంలో తీసుకోవడం కూడా అంతే అవసరం. లేదంటే పోషకాహారం తీసుకున్నా తగిన ఫలితం ఉండదు. దీనికి తోడు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది.

పెరుగు :-
పెరుగును పగటి పూట మాత్రమే తీసుకోవాలి. రాత్రి పూట తినకూడదు. అలా తింటే శరీరంలో మ్యూకస్ ఎక్కువగా వృద్ధి చెందుతుంది. ఇది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి పెరుగును పగటి పూటే తినాలి. దీని వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది.

అన్నం :-
రాత్రి పూట అన్నం  అస్సలు తినకూడదు. దీని వల్ల శరీరంలో అదనపు కొవ్వు చేరుతుంది. మధ్యాహ్న భోజనంగా అన్నం తినాలి. దీని వల్ల శరీరంలో ఉన్న కార్బొహైడ్రేట్లన్నీ ఎక్కువగా వినియోగమయ్యేందుకు అవకాశం ఉంటుంది.

పాలు :-
పాలను రాత్రి పూట తీసుకుంటే మంచిది. దీని వల్ల చక్కగా నిద్ర పడుతుంది. ఉదయాన్నే పాలను తాగితే జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఉదయం పూట పాలను తీసుకోకూడదు. అయితే వ్యాయామం, శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు ఉదయం పూట పాలను తాగవచ్చు.

యాపిల్స్ :-
యాపిల్ పండ్లను ఉదయాన తినాలి. దీని వల్ల మలబద్దకం సమస్య తొలగిపోతుంది. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అంతేకాదు శరీరంలో ఉన్న విష పదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. రాత్రి పూట యాపిల్స్‌ను తినడం మంచిది కాదు. ఒక వేళ తింటే జీర్ణాశయంలో యాసిడ్స్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి, జీర్ణప్రక్రియకు ఆటంకం కలుగుతుంది.

వాల్‌నట్స్ :-
వాల్‌నట్స్‌ను సాయంత్రం తినాలి. వీటిలోని ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు మనకు సంపూర్ణంగా అందాలంటే సాయంత్రం పూట వాల్‌నట్స్‌ను తింటే సరిపోతుంది. అదే ఉదయం, రాత్రి పూట అయితే వీటిని తినకూడదు. ఎందుకంటే ఆయా సమయాల్లో వీటిని తింటే శరీరానికి సరైన పోషకాలు లభించవు.

పప్పు ధాన్యాలు :-
శనగపప్పు, పల్లీలు, కంది పప్పు, చిక్కుడు తదితర గింజ, పప్పు జాతికి చెందిన ధాన్యాలను మధ్యాహ్నం పూట తీసుకోవాలి. దీని వల్ల మన శరీరానికి కావల్సిన ఫైబర్ (పీచు పదార్థం) అధిక మొత్తంలో అందుతుంది. దీంతో జీర్ణ ప్రక్రియ కూడా మెరుగు పడుతుంది. అంతేకాదు కొలెస్టరాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి. ఉదయం, రాత్రి వేళ్లలో పప్పుల్ని తింటే మనకు కావల్సిన పోషకాలు సరిగా అందవు. దీనికి తోడు ఆకలి పెరుగుతుంది. దీని వల్ల ఇంకా ఎక్కువ ఆహారం తినేందుకు అవకాశం ఉంటుంది.

అరటి పండ్లు :-
అరటిపండ్లను మధ్యాహ్నం తినాలి. ఇది జీర్ణప్రక్రియను మెరుగు పరుస్తుంది. అంతేకాదు జీర్ణాశయ సంబంధ సమస్యలైన అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. రాత్రి పూట అరటి పండ్లను తింటే మ్యూకస్ పొర పెరుగుతుంది. దీని వల్ల జలుబు వంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఉదయాన పరగడుపున కూడా అరటి పండ్లను తినకూడదు. ఎందుకంటే ఇవి కడుపును ఇబ్బంది పెడతాయి.

మాంసం :-
మాంసాన్ని కూడా మధ్యాహ్నమే తినాలి. ఎందుకంటే మాంసం జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి దీన్ని మధ్యాహ్నం తినడమే మంచిది. దీని వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్లు కూడా సరిగ్గా అందుతాయి. రాత్రి పూట మాంసం తినడం మానేయాలి. ఎందుకంటే జీర్ణ వ్యవస్థపై అధికంగా భారం పడుతుంది.

కష్టాలేంటీ.? వరాలేంటీ?

నా జీవితం లోనివి కష్టాలు కాదు, భగవంతుని వరాలు!
నేను శక్తిని అడిగాను - భగవంతుడు నాకు కష్టాన్ని ఇచ్చి శక్తిని పొందమన్నాడు.
నేను సంపదను అడిగాను - భగవంతుడు నాకు మట్టిని ఇచ్చి బంగారం చేసుకోమన్నాడు.
నేను ధైర్యాన్ని అడిగాను - భగవంతుడు నాకు ప్రమాదాలు ఇచ్చి ధైర్యం వహించమన్నాడు.
నేను వరాలు అడిగాను - భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చాడు.
నేను ఆయన ప్రేమను అడిగాను- భగవంతుడు ఆపదల్లో ఉన్నవారి చెంతకు నన్ను పంపించాడు.
నేను జ్ఞానాన్ని అడిగాను - భగవంతుడు నాకు సమస్యల్ని ఇచ్చి పరిష్కరించమన్నాడు.
నేను పురోగతి అడిగాను - భగవంతుడు నాకు అవరోధాలు కల్పించి సాధించమన్నాడు.
నేను లోకానికి మంచి చెయ్యాలని అడిగాను - భగవంతుడు ఇబ్బందులు కల్పించి అధిగమించమన్నాడు.
నేను ఆయన్ను మరువకూడదు అని అడిగాను - భగవంతుడు భాధలు ఇచ్చి ఆయన్ను గుర్తుంచుకోమన్నాడు.
నేను పాపాలు క్షమించమని అడిగాను - భగవంతుడు ధ్యాన సాధన చేసుకోమన్నాడు.
అలా జీవితం లో నేను కోరుకున్నదేదీ పొందలేదు - నాకు కావలసిందే నేను పొందాను.
ఈ విధంగా జీవితంలో జరిగే ప్రతీ సంఘటననుండి నాకు అవసరమైనది పొందటం నేను నేర్చుకున్నాను. చివరకు ఏది జరిగినా నా మంచికే అని అర్ధం చేసుకున్నాను. మీరు కూడా అర్ధం చేసుకోండి. జరిగేది అంతా మన మంచికే.

తొలిసారి ఎవరింటికి వెళ్లినా కుడిపాదమే మోపండి........!!

సొంతిళ్లైనా సరే ఎవరింటికి తొలిసారి వెళ్లినా కుడిపాదమే మోపాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కుడికాలు మోపుతూ ఇంట్లోకి రావడం వలన సకల శుభాలు కలుగుతాయని పండితులు అంటున్నారు. ఈ కారణంగానే వరుడుతో కలిసి నూతన వధువు తన అత్తవారింటిలోకి ముందుగా కుడికాలు పెడుతూ గృహప్రవేశం చేసే ఆచారం తరతరాలుగా వస్తోంది. ఇక కేవలం అత్త వారింటికి కోడలు వచ్చే విషయంలోనే కాదు ... ఎవరి బాగు కోరతామో వారి ఇంటికి కుడిపాదాన్ని మోపుతూ ప్రవేశించాలని అంటారు.
కుడి పాదం మోపకుండా ఎడమ పాదం మోపుతూ ప్రవేశించడం వలన అక్కడ నిరంతరం గొడవలు ... సమస్యలు కలిసి కాపురం చేస్తాయని అంటూ వుంటారు. ఈ కారణంగానే గొడవకి సిద్ధపడి వచ్చేవారు ముందుగా ఎడమపాదం మోపుతూ వస్తారని తెలుస్తోంది.
సీత అన్వేషణలో భాగంగా హనుమంతుడు లంకానగరానికి చేరుకున్నప్పుడు ఈ విషయాన్ని గురించే కాసేపు ఆలోచించాడట. తాను కుడిపాదం మోపుతూ లోపలి ప్రవేశించడం వలన రావణాసురిడికి సకల శుభాలు జరుగుతాయని భావించి, ముందుగా ఎడమ పాదాన్ని మోపుతూ లోపలికి వెళ్లాడట.
కాబట్టి ఎక్కడైతే సఖ్యతను ... సంతోషాన్ని ... సంపదను ఆశిస్తామో, అక్కడికి కుడికాలు ముందుగా మోపుతూ వెళ్లాలని శాస్త్రాలు చెబుతున్నాయి.