Friday, 3 June 2016

Gabbar Singh - The Management Guru

Gabbar Singh was a MANAGEMENT GURU as is reflected in some of the timeless management lessons he delivered thru the movie Sholay.

Read On...They are awesome..!

1. Jo Darr Gaya - Samjho Mar Gaya!
Courage and enterprise are important factors for laying the successful foundation of a growth oriented business.

2. Kitne Admi The..??
It's important to know the competition and its size. He understood that even a small team can make a difference.

3. Arey O Sambha, Kitna Inaam Rakhe Hai Sarkar Hum Par?
Know your market value. Promoting one's own brand is very important and to be reiterated always.

4.  Goli 6 Aur Aadmi 3!
Create an illusion where his insurbodinates had a chance of survival but kills them in the next scene.
Moral - Perform or perish.

5. Le Ab Goli Kha
Sometimes in the interest of the organisation you have to take hard and unpopular decisions....
So sometimes a leader has to 'fire' some employees.

6. Yeh Ramgarh Waale Apni Betiyon Ko Kaunsi Chakki Ka Aata Khilate Hai Re.
Market research is important to understand value propositions !!

7. Yeh Haath Mujhey Dedey Thakur.
Identify elements of threats in the market and take measures to minimise them.

8. Holi Kab Hai, Kab Hai Holi ?
Conduct advance mapping of key events within the industry and devise penetration strategy to have a competitive edge over your rivals.

Some global opinions on marriages..

After marriage, husband and wife become two sides of a coin; they just can’t face each other, but still they stay together.
– Al Gore 😛😛

By all means marry. If you get a good wife, you’ll be happy. If you get a bad one, you’ll become a philosopher.
– Socrates 😝😝

Woman inspires us to great things, and prevents us from achieving them.
– Mike Tyson 😝😝

I had some words with my wife, and she had some paragraphs 📄with me.
– Bill Clinton 😉😉

“Some people ask the secret of our long marriage. We take time to go to a restaurant two times a week. A little candlelight, dinner, soft music and dancing. She goes Tuesdays, I go Fridays.”
– George W. Bush 👻

“I don’t worry about terrorism. I was married for two years.”
– Rudy Giuliani 💣

“There’s a way of transferring funds that is even faster than electronic banking. It’s called marriage.”
– Michael Jordan 😜😜

Two secrets to keep your marriage brimming:
1. Whenever you’re wrong, admit it.
2. Whenever you’re right, shut up.
– Shaquille O’Neal 😘😘

The most effective way to remember your wife’s birthday is to forget it once..
– Kobe Bryant😡😡

You know what I did before I married?? Anything I wanted to.
– David Hasselhoff😞😞

My wife and I were happy for twenty years. Then we met.
– Alec Baldwin 😥😥

A good wife always forgives her husband when she’s wrong.
– Barack Obama😳😳

When you are in love,
Wonders happen.
But once you get married,
You wonder, what happened.
😜😁😂
👌😃😂👍

🍁An Excellent Line…

“Marriage is a beautiful forest where Brave Lions are killed by beautiful Deer’s”.

సింహంతో ఇంజినీరింగ్ స్టూడెంట్లు గేమ్స్ ఆడొచ్చు

Rajesh ఇంజనీరింగ్ Complete చేశాడు. తాను కంప్లీట్ చేసిన కోర్స్ కి తగిన ఉద్యోగం కోసం ఎన్నో Interviews కి Attend అయ్యాడు ఐనా కూడా ఏ ఒక్క జాబ్ లో కూడా Select అవ్వలేదు.
.
.
.
.
.
ఇలా కాదని ఏదైనా పని చేస్తు తనకు అవసరమైన నిత్యవసరాలకు, భోజనానికి సరిపడా ఖర్చుల కోసం ఏ పనినైనా చేయాలని నిశ్ఛయించుకున్నాడు.
.
.
.
.
ఒక సర్కస్ కంపెనీని చూశాడు. అందులోకి వెళ్ళి నాకు ఏదైన ఉద్యోగం కావాలి అని అడిగాడు.. అతని పరిస్థితి చూసి జాలిపడి.. కాని ఇక్కడ పనిచేయాలంటే తగిన అనుభవం ఉండాలి అంటే దానికి అతను ఒక కోతిలా హావా భావాలు పలికించి వారిని Impress చేశాడు. శభాష్.. చాలా బాగా చేశావ్ ఇదిగో ఈ చింపాజి డ్రెస్ వేసుకో.. ఇక రేపటి నుండి చింపాజి డ్రెస్ వేసుకుని నువ్వొక నిజమైన చింపాంజిలానే నటిస్తు ప్రేక్షకులందరిని నవ్వించాలి'చెప్పాడు.
.
.
.
.
.
ఇక ప్రతిరోజు చింపాంజిలా డ్రస్ వేసుకొని ఆ చేష్టలతో ప్రేక్షకులను నవ్వించడం మొదలు పెట్టారు. కాని ఒకరోజు ప్రమాదవశాత్తు సింహం ఉన్న పెద్ద బోనులో పడిపోయాడు.. అక్కడున్న ప్రేక్షకులందరు ఆశ్ఛర్యానికి లోనయి ఉత్కంఠగా గమనిస్తున్నారు. అక్కడున్న ఎవ్వరికి తెలియదు చింపాంజి వేషంలో ఒక మనిషి ఉన్నాడు అని.. సురేష్ కి చచ్చేంత భయం పట్టుకుంది సరైన ఉద్యోగం దొరకక పోవడం వల్ల ఇలా ఈరోజు నా ప్రాణాలు పోతున్నాయనమాట అని ఆ సింహం ముందు వణుకుతు, ఏడుస్తు కూర్చున్నాడు.
.
.
.
.
.
ఆ సింహం నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చింది కాని ఇంకా దాడి చేయలేదు.. కళ్ళు మూసుకొని భయంతో చెమటలు కక్కుతూ ఉండగా ఆ సింహం అతనికి చాలా దగ్గరికి వచ్చి…
.
.
..
.
అరే సురేష్ గా భయపడకు నేను Mahesh  గాడ్ని 2012 మెకానికల్ బాచ్…

డాక్టర్ చెప్పిందే వినాలి మరీ..!

"లావు తగ్గాలని డైటీషియన్‌ని కలిసాడు సంజీవ్. ఆ డాక్టర్ అదో టైపు.
.
సంజీవ్ :- సన్నబడాలంటే మాంసం తగ్గించి, ఆకు కూరలు, ధాన్యాలు బాగా తినాలంటారు .. నిజమేనా?
.
డాక్టర్:- ఏమక్కరలేదు, మేకలు, గొర్రెలు తినేదేమిటి. ఆకులు, గడ్డే కదా. కోళ్ళకు దాణానే కదా వేస్తున్నాం. మాంసం తింటున్నామంటే పరోక్షంగా ఆకుకూరలు, ధాన్యాలు తింటున్నట్లే !!
.
సంజీవ్:- వేపుళ్ళు మంచివి కావంటుంటారు..
.
డాక్టర్:- ఎందుక్కావు? నూనె ఎక్కడినుండి వచ్చింది?
.
సంజీవ్:- వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు.
.
డాక్టర్:- అంటే ధాన్యాల నుంచే కదా, మరి నీ ఒంటికి అవి ఎందుకు మంచివి కావో చెప్పు?
సంజీవ్:- పోనీ మద్యం మానేయాలంటారా?
డాక్టర్:- ఎవరయ్యా నీ బుర్ర పాడు చేసింది? వైన్ వచ్చేది పళ్ళ నుంచి కాదా ? బీరు బార్లీ నుంచే కదా! దర్జాగా తాగు. పళ్ళు తిన్నంత ఆరోగ్యం.
సంజీవ్:- మరి ఐస్‌క్రీమ్‌స్, చాక్‌లెట్లు..
డాక్టర్:- లాభం లేదయ్యా! నేను చెప్పేది నీకు అర్ధం కావట్ళేదు. అవీ పాలు, కూరగాయల బై ప్రోడక్ట్సే కదా!
సంజీవ్:- వ్యాయామం చేస్తే ఎక్కువకాలం బ్రతుకుతారంటారు. నిజమేనా?
డాక్టర్:-ఎవరు నీకు చెప్పింది? కసరత్తు చేస్తే గుండె వేగం పెరుగుతుంది. వేగం పెరిగితే ఆయుస్షు ఎలాపెరుగుతుందయ్యా.ఇదెలా ఉందంటే, వేగంగా నడిపితే కారు మన్నిక ఎక్కువ కాలం ఉంటుందన్నట్లుంది !!
సంజీవ్:- అది కాదు. సిట్ అప్స్ చేస్తే, పొట్ట తగ్గుతుందంటారు ..
డాక్టర్:- చూడు.. వ్యాయామం చేయిస్తే చేతికండరాలు పెరుగుతాయి కదా. అలాంటాప్పుడు సిట్ అప్స్ చేస్తే పొట్ట పెరగదా? కోరి కోరి లావు అవుతానంటావేమయ్యా!
సంజీవ్:- పోనీ మంచి ఫిగర్ కోసం ఈత కొట్టొచ్చా?
.
డాక్టర్:- ఈత కొడితే నాజూగ్గా అవుతారనేది తప్పుడు ప్రచారం. అదే నిజమైతే తిమింగలాలు ఎందుకు అంత సైజున్నాయో చెప్పు?
.
సంజీవ్:- మరి బాడీకి ఓ షేప్ ఎలా వస్తుందో చెప్పండి?
.
డాక్టర్:- రౌండుగా ఉండడం మాత్రం షేపు కాదా? ఎవరా మాట అన్నది?
.
సంజీవ్:- ???????

పని-ఫలితం

ఈ భువిపై అసాధ్యమైనది ఏదీ లేదు. మనిషి సాధించలేనిదంటూ ఉండదు.సాధనమున ధరణిలో పనులన్నీ సమకూరతాయని ఉపదేశించాడు వేమన.ఒక పని చేయడానికి ముందు, మంచి ఆలోచన కావాలి. తరవాత దాన్ని పూర్తిచేయాలనే పట్టుదల ఉండాలి. పనిలో దీక్ష, శ్రద్ధ కనబరచాలి. అప్పుడే సత్ఫలితాలు పొందగలుగుతాం.చేసే పనిని బట్టి ఫలితం ఉంటుందని ‘యోగవాసిష్ఠం’ చెబుతోంది. ఎప్పుడు ఏ పని చేస్తే బాగుంటుందో ఆలోచించి, అప్పుడు ఆ పని ప్రారంభించాలి. అలాగని అనువైన కాలాన్ని వృథాగా గడపకూడదు. ఆలోచనా రహితంగా ఏ పనీ చేయకూడదు. సకాలంలో సక్రమంగా విధులను నిర్వర్తించని రాజు, తన రాజ్యాన్ని సైతం నిలబెట్టుకోలేడని రామాయణం అరణ్యకాండలో హెచ్చరిస్తాడు వాల్మీకి. అందుకే మంచి ఆలోచనైనా మంచి సమయంలో చేస్తేనే ఫలిస్తుందని పెద్దలంటారు.ఏ పనినైనా ఇష్టపడి చేయాలి. చేసే పనిలో ఆసక్తి, ఉత్సాహం, సంతోషం ఇమిడి ఉండాలి. అప్పుడే దక్కాల్సిన ఫలితం, దానంతటదే వచ్చి చేరుతుంది. నీతిశాలి, కార్యదక్షుడు, ప్రణాళికాబద్ధుడైన శ్రీరామచంద్రుడి కార్యాన్ని వానరాలే నిర్వహించాయి. సముద్రానికి సేతువు కట్టి, రాక్షస సేనను ఓడించి, సీతను రాముడికి అప్పగించాయి.యజమాని కార్యసాధకుడైతే, నేర్పరితనంతో ముందడుగు వేస్తే, సేవకులు అతడినే అనుసరిస్తారు. కార్యాన్ని విజయతీరం వైపునడిపిస్తారు.ఏ మనిషికైనా, తనకు నచ్చిన పని చేయడం వల్లనే సంపూర్ణ ఆనందం కలుగుతుంది. ఇతరులను అనుకరించడం వల్ల ఆత్మానందం దొరకదు. ఉన్నతమైన ఆలోచనల్ని అమలుచేయాలంటే పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ఇది నియమాలు, నిగ్రహశక్తి వల్ల సాధ్యపడుతుంది. దీక్షగా పని చేసేవారు ఎక్కువగా మాట్లాడరు. ఎందుకంటే- మాటలు, పనులు ఏకకాలంలో సాగవు.ప్రకృతిని పరిశీలించండి, అది ఎప్పుడూ మౌనంగా, నిర్విరామంగా తన పని తాను చేస్తుంటుంది. నిత్యం పువ్వులు, ఫలాలు అందిస్తూ తన ఉనికి చాటుకుంటుంది. ఏ రుతువులో ఆ ధర్మాన్ని పాటిస్తుంది. మనమూ వ్యర్థమైన మాటల్ని కట్టిపెట్టి, జీవితం సార్థకమయ్యే పనుల వైపు దృష్టి కేంద్రీకరించాలి.పనిచేస్తేనే మనిషి ఉక్కులా దృఢంగా ఉంటాడు. పని లేకపోతే సోమరిగా మారతాడు. ఏ పనీ లేని మనిషిలో చెడు ఆలోచనలు ప్రవేశిస్తాయి. అశాంతి కారణంగా అతడు అనారోగ్యం పాలవుతాడు. మనిషి ఎంత ధనవంతుడైనా, ఏదో ఒక పనిమీద దృష్టిపెట్టాలి. భగవంతుడికి ప్రీతికరమైన సేవాకార్యక్రమాల్లోనైనా పాలుపంచుకోవాలి.ఒక పని సాధించాలనుకున్నప్పుడు ఎన్నో భయాలు, సందేహాలు కలగడం సహజం. అర్థం లేని భయాలు, అనుమానాలతో వెనకడుగు వేయడం కంటే ఆశావాదంతో అడుగు ముందుకు వేయడం మంచిది.విజేతలను వారి గెలుపు రహస్యం అడిగితే ‘కష్టపడి పనిచేయడం’ అని జవాబిస్తారు. థామస్‌ ఆల్వా ఎడిసన్‌ బల్బు కనిపెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ప్రయత్నించిన వెంటనే ఆశించిన ఫలితం రాలేదని నిరాశ చెందలేదు. ఆశించిన ఫలితం వచ్చేవరకు ప్రయోగాలు చేసి, చివరకు ఆయన విజయం సాధించారు.మనిషి ప్రతి వైఫల్యం నుంచీ ఒక పాఠం నేర్చుకోవాలి. ఆ తప్పు మళ్లీ చేయకుండా సాధన సాగిస్తే, తప్పకుండా విజేత కాగలడు.లక్ష్య సాధన నిర్దిష్టంగా ఉండాలి. దృఢమైన సంకల్పం జతపడాలి.ఏ పనినైనా, నూటికి నూరుపాళ్లూ మనసుకు సంతృప్తి కలిగేలా చేయాలి. పనిలో పూర్తిగా మమేకం కావాలి. గంగను భువికి రప్పించిన భగీరథుడిలా, కార్యసాధకుడైన ఆంజనేయుడిలా ప్రతిమనిషీ తన సంకల్పాన్ని సఫలీకృతం చేసుకోవాలి. అప్పుడే అతడుఆశించినదానికన్నా మరింత ఎత్తుకు ఎదుగుతాడు!

Thursday, 19 May 2016

*What is maturity? - by Adi Shankara*

1. Maturity is *when you stop trying to change others, ...instead focus on changing yourself.*

2. Maturity is when you
 *accept people as they are.*

3. Maturity is when you
*understand everyone is right in their own perspective.*

4. Maturity is when you
*learn to "let go".*

5. Maturity is when you are
 able to *drop "expectations" from a relationship and give for the sake of giving.*

6. Maturity is when you
*understand whatever you do, you do for your own peace.*

7. Maturity is when you *stop proving to the world, how intelligent you are.*

8. Maturity is when you *don't seek approval from others.*

9. Maturity is when you *stop comparing with others.*

10. Maturity is when you *are at peace with yourself.*

11. Maturity is when you *are able to differentiate between "need" and "want" and are able to let go of your wants.*

*& last but most meaningful !*

12. You gain Maturity when you *stop attaching "happiness" to material things !!*

యముడికీ ఓ గుడి

మన ప్రాణాలను హరిస్తాడు అని నమ్మే యమధర్మరాజుకి కూడా ఎంతో భక్తితో పూజలు చేసే గుడి ఉంది . అది కూడా  తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణాలో ఉంది. అక్కడ ఎన్నో విశేష పూజలు అందుకుంటాడు యముడు. ఆ ఆలయం విశేషాలు మాత్రం ఆసక్తి కరంగా వుంటాయి.

కరీంనగర్ జిల్లా జగిత్యాల దగ్గర " ధర్మపురి " లో ఉన్న ఉగ్ర నరసింహస్వామి ఆలయంలో ఉంది ఈ గుడి.

తమ జాతకాలు బాలేవని, ఏం చేసిన కలిసి రావట్లేదని, లేదా జాతకం ప్రకారంప్రమాదాలు జరిగే సమయమని, మానసికప్రశాంతత కరువయిందని ఇలా రకరకాల సమస్యలతో బాధపడే వారు ఈ ఆలయం లోని యముని దర్శిస్తే ఆ సమస్యల నుంచి ఊరట లభిస్తుంది అని భక్తుల నమ్మకం.

అలాగే శని గ్రహ దోషాలు, జాతక దోషాలు వున్న వారు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటే ఆ భాధలు నుంచి ఉపశమనం లభిస్తుందిట. ఇక్కడ మండపంలో గల గండ దీపంలో నూనె పోసి యముని విగ్రహానికి దణ్ణం పెట్టుకుంటే గండాలన్ని తొలగిపోతాయి అని కూడా భక్తుల నమ్మకం.

ప్రతి నెల భరణి నక్షత్రం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యి పూజలు నిర్వహిస్తారు ఇక్కడ . అంతేకాదుదీపావళికి రెండు రోజుల తరువాత వచ్చే 'యమ ద్వితీయ' రోజున యముడు తన చెల్లి అయిన యమునాదేవి ఇంటికి భోజనానికి వెళ్లి,తిరిగి యమలోకం వెళ్ళే ముందు ఈ రోజు ఎవరైతే తమ తోబుట్టువుల చేతి భోజనం తింటారో వారికి నరక బాధలు ఉండవని వరమిస్తాడని ప్రతీతి కదా !

ఆ రోజున ఇక్కడ యమునికి విశేష పూజలు నిర్వహిస్తారు . యముని దర్శించే వారు ముందుగా గోదావరీ నదిలో స్నానం చేసి, యమునికి పూజలు నిర్వహిస్తారు. ఇలా పేరు తలచుకోవటానికే భయపడే యముని అనుగ్రహం కోసం పూజలు నిర్వహించటం విశేషం గా చెప్పుకోవచ్చు.

పదిహేను వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గుడికి కార్తికంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

మార్కండేయుడికి,మహా పతివ్రత సావిత్రికే కాదు మనకీ వరాలు ఇవ్వటానికి కొలువుతీరి ఉన్నాడు " ధర్మపురి " లో ఉన్న యముడు !!