Thursday, 18 February 2016

Compare with Japan - ఇండియా జపాన్ లా మారాలంటే..?

మన దేశానికి చెందిన ఒక ధనికుడు జపానుకు వెళ్ళాడు. మన అలవాట్ల ప్రభావం అతనిలో అలాగే ఉన్నాయి. అలవాటుగా ఒకరోజు రైలులో ప్రయాణిస్తూ.......
ఎదుటి సీటుపై కాళ్ళను విలాసంగా ఉంచి ఆనందంగా ఓ పాటను పాడుకుంటూ రైలులో
ప్రయాణిస్తున్నాడు.......అప్పుడు ఒక పెద్ద మనిషి అతని దగ్గరికి వచ్చి అతని కాళ్ళని తన ఒడిలోకి తీసుకుని ఆ సీటులో కూర్చున్నాడు. అతని చర్యకు మనవాడు ఉలిక్కి పడి అతన్ని ఇలా అడిగాడు.......
" సార్! మీరు ఎందుకు నా కాళ్ళను తీసి మీ ఒడిలో పెట్టుకుని కూర్చున్నారు? మీ సీటును ఎందుకు వదిలి వచ్చి నేను కాళ్ళు పెట్టుకున్న సీటులోకి ఎందుకు మారారు?" అని.
దానికి ఆ జపానుదేశస్థుడు ఇలా అన్నాడు :
" సార్! మీరు మా దేశ ఆస్తిని అవమానిస్తున్నారని నాకు చాలా కోపం వచ్చింది, కానీ మీరు మా దేశానికి అతిధులు. మిమ్మల్ని నేను ప్రశ్నించకూడదు. మీరు చిన్నబుచ్చుకోవడం, బాధపడటం నాకు ఇష్టం లేక మీ కాళ్ళను నా ఒడిలో పెట్టుకుని మీకు అసౌకర్యం కలగకుండా ఉండటానికి ఇలా చేశాను " అని అన్నాడు.
మనవాడు షాక్ తగిలినట్టుగా ఉలిక్కిపడి తన తప్పును తెలుసుకుని అతన్ని క్షమించమని
అడిగాడు. దానికి అతను నవ్వుతూ............
" ఈ దేశంలో ప్రజల ధనంతో కల్పించే వసతులపై గౌరవంతో పాటు అది మా సొంత ఆస్తిగానే
భావిస్తాము. మీరుకూడా మీ దేశంలోని ప్రజలధనంతో నడిపే రైళ్ళు కానీ, బస్సులు కానీ మీ సొత్తుగా భావించండి, ఇలా కాళ్ళు పెట్టి అవమానించకండి. అలాంటి భావనమీలో కలిగినప్పుడు ఖచ్చితంగా ఇతరదేశాలకు మీరు వచ్చినప్పుడు మీరు ఇలా ప్రవర్తించరు. దయచేసి మీరు అర్థం చేసుకోగలరు కదా! " అని
అన్నాడు.  ఆ జపాను దేశస్థుడు
మెత్తగా చెప్పినా, బుద్ధివచ్చేలా చెప్పిన అతని మాటలకు మనవాడు తలదించుకోక తప్పలేదు........
ఇప్పుడు అర్థం అయిందా ఇండియా ఎందుకు అభివృద్ధి చెందలేదో! ఎన్నో కారణాలు..... అందులో ఇదికూడా ఒకటి.  ఏ గొడవలు జరిగినా ప్రభుత్వ
ఆస్తులను తగలబెడుతున్న మనం ఖచ్చితంగా మనం తగలబెట్టేది మన ఆస్తి అని తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది కదా!..

ఆర్థిక పాఠాలు - తప్పనిసరిగా చదవాల్సిన పాఠం - must read - economic lessons

1.సoపాదన వేరు సంపద వేరు. వచ్చేది సంపాదన అయితే నిలిచేది సంపద. ఇదే ఆర్థిక ప్రగతికి తొలి సూత్రం

2.సంపాదనని సంపదగా మార్చడం ప్రణాలికతో మొదలౌతుంది. ఇప్పటి ఖర్చులను తెలుసుకోని, రాబోయే ఖర్చులను అంచనా వేసుకోని ఆ ఖర్చుల ఆధారంగా డబ్బు దాచుకునేందుకు ఒక ప్రణాలిక వేసుకోవాలి.

3.ఆర్థిక సలహాలు ఇచ్చే వారిలో కమిషన్ల కోసం ఆశపడే ఏజంట్లు, నిరుత్సాహపరిచే నిరాశావాదులు, చేతకాక చేతులు కాల్చుకున్నవారు వుంటారు. వారి మాయలో పడకూడదంటే స్వంతంగా ఆర్థిక అక్షరాస్యత పెంచుకోవాలి

4.ధరల పెరుగదలనే ద్రవ్యోల్బణం అంటారు. ధరలు పెరిగే వేగం కన్నా ఎక్కువ వేగంతో పెరిగితేనే డబ్బు నిజంగా వృద్ధి చెందినట్లు. అలాంటి పథకాలలో తప్పకుండా డబ్బు దాచుకోవాలి.

5.సంపద కూడబెట్టాలనుకున్న ప్రతి ఒక్కరూ చక్రవడ్డీ మహత్యాన్ని తెలుసుకొని, అలాంటి వడ్డీలు ఇచ్చే పథకాలలో తప్పకుండా ముదుపు చేయాలి.

6.ఒక వ్యక్తి అనుకోకుండా చనిపోతే అతని స్థానాన్ని తీసుకోని, అతని అర్థిక ప్రణాలికలన్నీ అమలయ్యేలా చూసే బాధ్యత ఇన్సూరెన్స్ తీసుకుంటుంది. అందుకే ఆర్థిక ప్రణాలికలో మొదటి మెట్టు బీమా పథకం.

7.ఆర్థిక ప్రణాలిక అమలు కావాలంటే మొదట వున్న అప్పులు తీర్చుకోవాలి. ఎక్కువ వడ్డీ కట్టాల్సిన అప్పులను, మరో చోట తక్కువ వడ్డీకి తెచ్చైయినా సరే త్వరగా తీర్చుకోని అలా మిగిలిన డబ్బుని ఆదా చేయాలి.

8.అనుకోని ఆర్థిక అవసరాల కోసం అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి.  వైద్య అవసరాలకు ఆరోగ్య, ప్రమాద బీమాలు తీసుకోవాలి. మిగిలిన ఖర్చుల కోసం డబ్బు అందుబాటులో వుండేలా చూసుకోవాలి.

9.రాబోయే ఆర్థిక అవసరాలను దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలుగా విభజించుకోని, రిస్క్, ఆదాయం, లిక్విడిటీ ఆయా విభాగాలకు సరిపోయేలా పొదుపు చేయాలి. ఏ అవసరానికి ఆ విభాగంలో డబ్బులే వాడుకోవాలి.

10.డబ్బులు ఎంత ఎక్కువ కాలం పొదుపు చేస్తే అంత ఎక్కువగా లాభాలు వస్తాయి. ఎక్కువ కాలం పొదుపు చేయాలంటే చిన్న వయసులోనే ఆదా చేయడం మొదలుపెట్టాలి.

11.డబ్బు మూడు రకాలు - వచ్చే డబ్బు, పోయే డబ్బు, దాచే డాబ్బు. వచ్చే డబ్బుని పెంచుకోవాలి, దాచే డబ్బుని పెంచుకోవాలి, పోయే డబ్బుని తగ్గించుకోవాలి. దాచే డబ్బుని దాచగా మిగిలిన డబ్బునే ఖర్చులు పెట్టాలి.



🅾ఖర్చుల గురించి:

12.ఆదాయం పెరిగేకొద్దీ జీవనశైలి మెరుగౌతూ వుంటుంది. మెరుగౌతున్న జీవన శైలి వల్ల ఖర్చులు కూడా పెరుగుతూ వుంటాయి. ఈ జీవనశైలిని పెంచే ఖర్చుల (Lifestyle expenses) విషయంలో నియంత్రణ అవసరం.

13.అప్పు అంటే రాబోయే సంపాదనను ఖర్చుపెట్టడమే. అప్పు తీర్చడానికి కట్టే అసలు వడ్డీలు కలుపుకోని, నెల జీతంలో నలభైశాతానికి మించకూడదన్న సూత్రాన్ని పాటిస్తే అప్పులు అదుపులోకి రావచ్చు.

14.ఖర్చులు తగ్గించుకుంటూ ఆర్థికంగా ఎదగాలి. పెద్ద ఖర్చుల కన్నా చిన్న ఖర్చులను నియంత్రించడం సులభం. అలా ఆదాచేసిన చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా దాచుకోగలిగితే అవే సంపదగా మారుతాయి.

15.వ్యాపారులు ఎప్పుడూ మన చేత ఎలా ఖర్చుపెట్టించాలా అని ఆలోచిస్తారు. వారిని అధిగమించి, అవసరమైన వస్తువులను మాత్రమే కొనడం అలవాటు చేసుకుంటే చాలా డబ్బును ఖర్చు కాకుండా కాపాడుకోవచ్చు.

16.“ఇంపల్స్” ఖర్చులను గుర్తించి నియంత్రించాలి. కొనాలని ప్రేరేపణ కలిగినప్పుడు ఆ వస్తువు అవసరం నిజంగా వుందా లేదా అని గమనించుకోవాలి. వీలైతే ఆ కొనుగోలును ఓ నెల రోజులు వాయదా వేయాలి.

17.మనం అవసరాలు అనుకున్నవన్నీ నిజమైన అవసరాలు కాకపోవచ్చు. అదంతా మార్కెటింగ్ మాయాజాలం కావచ్చు. అది తెలుసుకుని, ఆ మాయలో పడకుండా చూసుకోగలిగితే, చాలా ఖర్చులు అదుపులోకి వస్తాయి.

18.మనం చేసే ప్రతి అనవసరపు ఖర్చు కుటుంబంలో మరొకరికి భారం అయ్యే అవకాశం వుంటుంది. క్షణికానందాన్ని ఇచ్చే ఖర్చులు తరువాత రాబోయే ముఖ్యమైన ఖర్చులకు డబ్బులేకుండా చేస్తాయి.

19.కొనాలనిపించగానే కొనకపోతే అసహనం కలుగుతుంది. కొన్న తరువాత ఎందుకు కొన్నానా అని అసహనం కలుగుతుంది. మొదటి అసహనాన్ని కొద్దిసేపు భరిస్తే, మరో అసహనమూ వుందదు, ఖర్చూ వుండదు.

20.ఖర్చు పెట్టడంలో ఆనందం వుంటుందన్నది భ్రమ. చాలా సార్లు ఖర్చులో ఆనందానికి కారణం ఆప్తులు కానీ ఖర్చు కాదు. అందుకే ఖర్చు పెట్టేటప్పుడు ఆ ఖర్చు ఆనందాన్ని ఇస్తోందా లేదా అని ప్రశ్నించుకోవాలి.

21.డబ్బు వచ్చినా నిలవదు. నిలిచినా సంతోషాన్ని ఇవ్వదు. ఖర్చు పెట్టినా ఆనందాన్ని ఇవ్వదు. కేవలం ఇతరుల సంతోషం కోసం పెట్టిన ఖర్చే ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి వ్యక్తి తన సంపాదనలో కొంత భాగాన్ని మరొకరి సంతోషానికి వాడాలి.



🅾ఆదాయం గురించి:

22.దురాశ లేకుండా చట్టరీత్యాకానీ, నైతికంగా కానీ తప్పు చేయకుండా ఎంత సంపాదించినా తప్పు లేదు. అందువల్ల డబ్బుని సంపాదించేటప్పుడు సమాజం ఏమనుకుంటుందో అన్న భయాన్ని, అనుమానాన్ని పక్కన పెట్టాలి.

23.సంపాదన వేరు ఆదాయం వేరు. శారీరక లేదా మేధోశ్రమ ద్వారా వచ్చే డబ్బు సంపాదన. డబ్బు పెట్టుబడిపెట్టడం ద్వారా వచ్చే వడ్డీ, లాభం ఆదాయం కిందకు వస్తుంది. ఇలాంటి ఆదాయాన్ని పెంచుకొవాలి.

24.పన్నులు మనకి లాభాన్ని ఇవ్వకపోగా, సంపద వైపుకెళ్ళే నడకను నెమ్మది చేస్తాయి. వీటి తెలివిగా ఉపయోగించుకుంటే అవే వేగాన్ని పెంచి, సంపద లక్ష్యాలను త్వరగా చేరేందుకు దోహదపడతాయి.

25.ముందుచూపుతో సరైన చదువులుతో, కొత్త అవకాశాలను అందుకుంటూ సంపాదనను సుస్థిరం చేసుకోవాలి. వ్యాపకంగానో, కళగానో వున్నవాటిని అదనపు సంపాదనకు ఉపయోగించుకోవాలి.

26.సంపాదన స్థిరం కాదు. సంపాదన లేనప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ప్రత్యమ్నాయాలని ఏర్పాటు చేసుకోవాలి. వస్తున్న ఆదాయంలోనే కొంత తీసిపెట్టాలి. వేరే ఆదాయమార్గాలను సిద్ధం చేసుకుంటూ ఉండాలి.



🅾పొదుపు, ముదుపు గురించి:

27.డబ్బు తిరిగి రాకుండా వాడుకుంటే అది ఖర్చనీ, రాబోయే ఖర్చు కోసం దాచుకుంటే పొదుపు అనీ, లాభాలు ఆశించి లావాదేవీలు జరిపితే అది పెట్టుబడి అనీ గుర్తించాలి. ఏ రకంగా ఎంత డబ్బు వాడాలో నిర్ణయించుకోవాలి.

28.రిస్క్, రివార్డ్ రెండూ ఒకదానికొకటి అనుబంధంగా నడుస్తాయి. ఆర్థిక ఒడిదొడుకులు తట్టుకునే సామర్థ్యం (రిస్క్ ఎపిటైట్) వయసుతో పాటు తగ్గుతూ వెస్తుంది. అందువల్ల వయసులో వున్నప్పుడు రిస్క్ ఎక్కువ వున్న పథకాలలో, వయసు మీదపడ్డ తరువాత తక్కువ రిస్క్ వుండే పథకాలలో ముదుపు చెయ్యాలి

29.రాబోయే అవసరాల కాల వ్యవధి, రిస్కు తీసుకునే సామర్థ్యం, వయస్సు, ఆయా పథకాల లిక్విడిటీ వంటివి పరిగణన చేసుకుంటూ అన్ని రకాల ఆర్థిక పథకాలతో ఒక పోర్ట్ ఫోలియో నిర్మించుకోని, దానిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ అవసరమైన మార్పులు చేసుకుంటూ పోర్ట్ ఫోలియే ఎదిగేలా చూసుకోవాలి..

30.ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ముందు ముందు అతని సంపాదన ఎలా వుండబోతోందో ఊహించి, దానిలో నుంచి సంపాదించిన ఆస్థుల విలువ తగ్గించి, అప్పుల విలువ జోడించి తన ఆజీవిత ఆర్థిక విలువ (Human Life Value) లెక్క వేసుకోవాలి. దాని ఆధారంగా ఇన్సూరెన్స్ కవర్ ఎంతుండాలో నిర్ణయించుకోవాలి.

31.ఇన్సూరెన్స్ పథకాలలో అన్నింటికన్నా ఉత్తమమైనది, చౌకైనది టర్మ్ పాలసీ. మనిషి జీవితకాలపు ఆర్థిక విలువకు సరిపడేలా టర్మ్ పాలసీ తీసుకోని మిగిలిన డబ్బుని వేరే ఏవైనా పథకాలలో పెట్టవచ్చు

32.సంపద సాధించడంలో అత్యంత కీలకమైనది, అత్యంత లాభదాయకమైనది – పెట్టుబడి. ఏదైనా ఒక కంపెనీలో డబ్బులు పెట్టుబడిగా పెట్టడం అంటే ఆ కంపెనీ ఆర్థిక ప్రగతికి మన ఆర్థిక ప్రగతిని ముడెయ్యడమే. అయితే అందులో నష్టం వచ్చే అవకాశం కూడా వుంది అని గుర్తెరిగి వుండాలి.

33.నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి, అవగాహన లేకుండా, అత్యాశతో వ్యవహరించడం మంచిది కాదు. ఇలాంటి పెట్టుబడులలో తక్కువకాలంలో ఎక్కువలాభాలు సంపాదించాలనుకోవడం అవివేకం.

34.ఒక కంపెనీ గురించి, ఆ కంపెనీ చేసే వ్యాపారం గురించి, ఆ వ్యాపారాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి సమగ్రంగా విశ్లేషించగలిగితేనే షేర్ మార్కెట్ లో లాభాలు పొందవచ్చు.

35.స్టాక్ మార్కెట్ పనితీరుని తెలుసుకోడానికి సెన్సెక్స్ ఉపయోగపడుతుంది. షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టి, మార్కెట్ ఎగుడుదిగుడులను చూసి భయపడకుండా స్థిరంగా వుంటే నష్టపోయే అవకాశాలు చాలా తక్కువ అని సెన్సెక్స్ నిరూపిస్తుంది.

36.ఈక్వీటీలో డబ్బు పెట్టాలంటే అందుకు స్టాక్ మార్కెట్ కాకుండా, మ్యూచువల్ ఫండ్ మార్గంలో వెళ్ళడం మంచిది. రిస్క్ తక్కువ తీసుకుంటూనే మంచి లాభాలను పొందవచ్చు. అలాంటి ఫండ్స్ లో కూడా డైవర్సిఫైడ్ ఫండ్స్ లో, టాక్స్ ఆదా చేసే ఫండ్స్ లో ముదుపు చేయడం లాభదాయకం.

37.షేర్ పెట్టుబడిలో నష్టం మన పొరపాటు వల్ల రావచ్చు, ఆ సంస్థ లోపాల వల్ల రావచ్చు, వీటికి బాహ్య ప్రపంచంలోని ఊహించలేని ప్రభావాల వల్ల కూడా రావచ్చు. వీటిని సంసిద్ధంగా వుండాలి. విశ్లేషించుకునే సమర్థత వుండాలి.

38.చిన్న వయసులోనే రిటైర్మెంట్ కోసం ప్రణాలిక వేసుకోవాలి. ఎంత త్వరగా పొదుపు మొదలుపెడితే అంత త్వరగా సంపద సాధించవచ్చు.

39.ఇల్లు కొనుక్కోవాలంటే-ఆర్థిక స్థితిని అంచనా వేసుకోని, డౌన్ పేమెంట్ నుంచి ఫోర్ క్లోజర్ దాకా పూర్తి ప్రణాలిక వేసుకోని ముందుకి అడుగెయ్యాలి. ఏ ఆలోచన లేకుండా ఇంటి రుణం తీసుకుంటే దీర్ఘ కాలం పాటు అప్పుల ఊబిలో ఉండిపోవాల్సి వస్తుంది.

40.సంపాదనని సంపదగా మార్చుకోవాలంటే ఆ డబ్బులో రిటైర్మెంట్ కోసం సుమారుగా 20%, నిత్య అవసరాల కోసం 40%, పొదుపు ముదుపులకోసం 15%, లైఫ్ స్టైల్ ఖర్చులకోసం 20% ఖర్చుపెడితే మంచిది.

41.సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. ఆరోగ్యం, అనుబంధం, జ్ఞానం వంటివి కూడా సంపదే. ఆర్థిక విషయాలలోనే కాక మిగిలిన విషయాలలో కూడా సంపద సాధిస్తేనే నిజమైన సoపద సాధించినట్లు.
ఆలస్యం అమ్రుతం విషం. 

రుపాయితో జర జాగ్రత్త

ఇద్దరు మిత్రులు ఒక రోజు ఉదయం ఒక నిర్జనారణ్యం గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. అకస్మాత్తుగా వారి సమీపంలోని ఒక పొద వైపు నుంచి ఓ సన్యాసి ఆదుర్దాగా, ఆయాసంతో రొప్పుతూ వస్తూ కనిపించాడు.  వాళ్ళిద్దరూ ఆయన్ను ఆపి "ఏం జరిగింది? ఎందుకలా భయపడుతున్నారు?"  అని అడిగారు.  అందుకాయన... "అదిగో అక్కడ కనిపిస్తున్న పొదలో మనుషుల్ని చంపేది ఉంది." వాళ్ళిద్దరూ భయంతో… "అంటే అక్కడ పులి ఉందా?" అని అడిగారు.


"కాదు. కానీ దానికన్నా ప్రమాదకరమైనది. నేను కొన్ని మూలికల కోసం తవ్వుతుండగా అది బయటపడింది." అన్నాడాయన.  "ఇంతకీ ఏమిటది?" అని అడిగారు వాళ్ళిద్దరూ కంగారుగా. "బంగారు నాణేల గుట్ట" అన్నాడు సన్యాసి.  వాళ్ళిద్దరూ సంతోషంగా "ఎక్కడ?" అని అడిగారు.


"అదిగో ఆ పొదల్లోనే" అని వేలు చూపించి తన దారిన పోయాడా సన్యాసి. వాళ్ళిద్దరూ ఆ పొదవైపు పరుగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ బంగారు నాణేలు కనిపించాయి.  "ఈ సన్యాసి ఎంత మూర్ఖుడు? బంగారు నిక్షేపాన్ని పట్టుకుని మనుషుల్ని చంపేది అంటాడేమిటి?"  అన్నాడొక మిత్రుడు.


"అతడి సంగతి వదిలేయ్. ముందుగా ఇప్పుడేం చేయాలో  ఆలోచిద్దాం. పట్టపగలే బహిరంగంగా దీన్ని మోసుకుపోతే ఊర్లో జనాలు అనుమానపడే అవకాశం ఉంది. మనలో ఒకరం దీనికి కాపలాగా ఉందాం. మరొకరు ఊర్లోకి వెళ్ళి భోజనం తీసుకు వద్దాం." అన్నాడు మరో మిత్రుడు.


అనుకున్నట్టే ఒక మిత్రుడు బంగారానికి కాపలాగా ఉన్నాడు. రెండోవాడు ఊర్లోకి వెళ్లాడు. ఈలోగా మొదటి వాడు ఇలా అనుకున్నాడు. "ఛ… ఈ రోజు నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చుంటే ఎంత బాగుండేది? ఇప్పుడు అనవసరంగా నేను అతనికి సగం బంగారం ఇవ్వాల్సి వస్తుంది. బంగారం కూడా మరీ ఎక్కువగా లేదు. నా కుటుంబం చాలా పెద్దది. దాన్ని పోషించడానికి ఈ బంగారం అంతా నాకే దక్కితే బాగుంటుంది కదా! వాడు వచ్చీ రాగానే కత్తితో పొడిచి చంపేస్తాను. ఎవరికీ అనుమానం రాదు. బంగారం అంతా నేనే తీసుకోవచ్చు." అలా అనుకుని కత్తిని నూరి సిద్ధంగా ఉంచుకున్నాడు.


ఇదిలా ఉండగా ఊర్లోకి వెళ్ళిన రెండో వాడి ఆలోచన ఇలాఉంది… "వాడికి సగం భాగం ఎందుకివ్వాలి? మొత్తం బంగారం నేనే తీసుకుంటే పోలా! అసలే నాకు చాలా అప్పులున్నాయి. నా జీవితంలో నేను ఏదీ వెనుకేసుకోలేదు. వాడికేమో అప్పులు లేవు. ఉన్నవాళ్ళు స్నేహితులుగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బంగారమంతా నాకే దక్కాలి. కాబట్టి నేను తీసుకెళ్ళే భోజనంలో విషం కలుపుతాను. అది తిని వాడు చనిపోతాడు. ఎవరికీ తెలియకుండా బంగారమంతా నేనే తీసుకోవచ్చు" అనుకున్నాడు. అలా అతడు భోజనంలో విషం కలిపి మిత్రుడి కోసం నిధి దగ్గరకు తీసుకెళ్ళాడు.

అతను దగ్గరికి వెళ్ళగానే అక్కడే కత్తితో పొంచి ఉన్న రెండోవాడు ఒక్క ఉదుటున మీదకు దూకి కత్తితో పొడిచి చంపేశాడు.

"పిచ్చివాడు. సగం బంగారం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంక నేను భోంచేస్తాను." అనుకుని

ఏ మాత్రం అనుమానం లేకుండా తెచ్చిన అన్నాన్ని తిన్నాడు. అరగంట తర్వాత అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. "సన్యాసి మాటలు ఎంత నిజమో కదా"  అనుకున్నాడు చివరి క్షణాల్లో.

రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే… తోబుట్టువుల మధ్యం వైరం పెంచుతాను. తల్లీ బిడ్డల మధ్య చిచ్చుబెడతాను, ఇవరికి స్నేహితులను కూడా దూరం చేస్తాను అంటుంది ఆ రూపాయి…. అని  పెద్దల నానుడి. కాబట్టి ఆ రూపాయి విషయంలో జాగ్రత…

బలహీనతే బలం, ఓటమే గెలుపుకు మూలం

"బలహీనతే బలం, ఓటమే గెలుపుకు మూలం!!"
వేపుడు చెడిపోతే పులుసు పెట్టుకోవాలి,
అన్నం మిగిలిపోతే వడియాలు పెట్టుకోవాలి,
గోడకున్న సున్నం ఊడిపోతే బొమ్మలు అతికించుకోవాలి,
కట్టుకున్న బట్టలకు కన్నం పడితే కుట్లు, అల్లికలు అల్లుకోవాలి,
మట్టిలో మాణిక్యాలు దొరక్కపోతే మంచి పంటనిచ్చే విత్తనాలు చల్లుకోవాలి,
కత్తి పట్టుకునే ధైర్యం లేకపోతే కావడి పట్టి నీళ్లు మొయ్యాలి,
నాలుగు అక్షరాలు ఒంటబట్టించుకునే తెలివి లేకపోతే నాలుగు రాళ్లు వెనకేసుకునే తెగువ చూపాలి,
నాలుగు రాళ్లు వెనకేసుకునే తెగువ కూడా లేకపోతే నాలుగు వేళ్లూ లోపలి వెళ్లే మార్గం వెదకాలి,
పరిగెత్తే బలం లేకపోతే నడిచే ఓపిక తెచ్చుకోవాలి,
ఎగిరే శక్తి లేకపోతే పడిపోకుండా నిలబెడుతున్న నేలను నమ్ముకొవాలి....
...భూమ్మీద, ప్రతి బలహీనతనూ బలంగా మార్చుకునే ఇంకో చోటు ఉంటుంది. ప్రతి తప్పటడుగునూ ఒక వయ్యారంగా చూపే ఇంకో సమయముంటుంది. ప్రతి మనిషికీ తనదైన ఒక ప్రత్యేకత ఉంటుంది. అన్న ప్రాశన చేసిన రోజే ఆవకాయ తినే శక్తి రాదు, ఈ జీవితంలోనే ఉత్తుంగ శిఖరాలు ఎక్కే సాహసం అందరికీ ఒంటబట్టకపోవచ్చు.., కానీ, ఈ జీవితంలోనే ఈ జీవితాన్ని సంతోషంగా జీవించే అవకాశం, ఆ సంతోషాన్ని పలు రకాలుగా పదిమందికీ పంచే అవకాశం మాత్రం ప్రతి ఒక్కరికీ వారి చేతిలోనే ఉంటుంది.
చేపకు నీళ్లల్లో పట్టు ఉంటుంది, పక్షి గాలితో జట్టుకడుతుంది, తుమ్మెదకు పూలతోటలో స్వర్గం అందుతుంది, పంట చేనుకు ముళ్ల కంచె కాపు అవుతుంది, స్థానం ప్రతి స్వభావానికీ ఇంకో ముఖాన్ని ఇస్తుంది. నువ్వు ఎటువంటి వాడివైనా, నీకు ఎలాంటి శక్తి, యుక్తులున్నా లేకున్నా, నీ స్వభావ్వాన్నీ, దాని ప్రభావాన్నీ చక్కగా సమన్వయం చేసుకుంటే నీ పరిధికీ, నీ పరగణాకీ, నీ పరిజనానికీ నువ్వే సింహానివి!
నీ బలహీనతలనే బలంగా మార్చుకో!
ఓటమినే విజయ సోపానంగా పేర్చుకో!
ఈ ప్రపంచాన్ని ఆనందానికి వేదికగా చేసి'పో'!

ఓ తెలివి తక్కువ కథ - జాగ్రత్త వహించి మరీ చదవండి

రాజ్యంలో, రాజుగారు తన మహామంత్రిని పిలిపించాడు.

రాజు:
 " మన రాజ్యంలో
మహా తెలివైనవారు వున్నట్లే,
మహా తెలివితక్కువ వాళ్లూ వుంటారు కదా ?"

మంత్రి (సంశయిస్తూనే):
"అవును వుంటారు ప్రభూ!"

రాజు:
 " ఐతే, మన రాజ్యం అంతా గాలించి, అందరిలోకీ  అతి  తెలివితక్కువ వాళ్లను ఐదుగురిని వెదికి పట్టుకొని, ఇక్కడ సభలో హాజరు పరచండి" అని ఆదేశించాడు.

మంత్రి "చిత్తం ప్రభూ" అని సభనుండి నిస్క్రమించాడే కానీ మనసంతా ఎలా అన్న ఆలోచనలతోనే మస్తిష్కమంతా నిండి పోయింది.

ఎవడికయినా కొన్ని పరీక్షలు పెట్టో, ప్రశ్నలు అడిగో
వాడు తెలివయిన వాడో, కాదో తెలుసుకోవచ్చు.
మరి, తెలివితక్కువ వాడినెలా గుర్తించాలి?
ఈ సందిగ్దావస్త నుండి బయటపడటమెలాగో అర్ధం కావటంలేదు మంత్రిగార్కి. ఒప్పుకున్నాక తప్పదుగా!
రాజాజ్ణ మరి.
ఒక నెల రోజులపాటు రాజ్యమంతా తిరిగి ఇద్దరిని పట్టుకుని సభలో హాజరు పరిచాడు.

రాజుగారు:
 " మహామంత్రీ! మీరు పొరబడినట్లున్నారా లేక లెక్క తప్పారా?
మేము ఐదుగురిని ప్రవేశపెట్టమన్నాము. కానీ తమరు ఇద్దరిని మాత్రమే వెంట తీసుకొనివచ్చారు"?

మహామంత్రి:
 " మహా ప్రభూ! తమరు నేను చెప్పేది కొంచెం ఆలకించండి"

రాజు: " సరే! సెలవియ్యండి"

మంత్రి:
" నేను రాజ్యమంతా తిరిగాడుచుండగా...
 ఇతను ఒక ఎడ్లబండి మీద కూర్చొని తలపై ఒక పెద్దమూటను పెట్టుకొని వెళుతూ కనిపించాడు. అలా ఎందుకు అని అడుగగా, తలపైనున్న మూట, బండి మీద పెడితే ఎడ్లకు భారమవుతుంది అని సమాదానమిచ్చాడు. అందుకే అతను అయిదవ తెలివితక్కువ వాడిగా తీసుకొచ్చాను".

రాజు:
 " భేష్! తరువాత..."

మంత్రి:
" ఈ రెండో అతను తన ఇంటి పైకప్పు మీద పెరిగిన గడ్డిని తినిపించడానికి, తన  గేదెను ఇంటి పైకప్పు మీదకు లాగుతూ కనిపించాడు.
" కావున ఇతన్ని నాల్గవ తెలివితక్కువ వాడిగా ప్రవేశపెట్టాను".

రాజు:
 " బహు బేషుగ్గా వుంది. తరువాత"

మంత్రి : " రాజ్యంలో చాలా సమష్యలుండగా,  వాటినన్నింటినీ ప్రక్కనపెట్టి,  తెలివితక్కువ వాళ్లను వెదకటంలో నెల రోజుల పాటు సమయం వృధాచేసాను.  కాబట్టి నేను..... మూడవ తెలివితక్కువ వాడిని."

రాజు ( గట్టిగా నవ్వుతూ ) " తరువాత...

మంత్రి :
" పరిష్కరించాల్సిన సమస్యలుండగా, బాద్యతలన్నీ విస్మరించి, తెలివితక్కువ వాళ్ల కోసం వెదుకులాడుతున్న తమరు రెండో వారు".

అది విన్న సభలొని వారంతా నిశ్చేష్టులై భయభ్రాంతులై  చూస్తుండిపొయారు.
నిశ్శబ్దం ఆవరించింది సభలో.

రాజుగారు తేరుకుని కుతూహలం తో  " మంత్రి గారు సందేహం లేదు. మీరు సెలవిచ్చినదాంట్లో వాస్తవానికి దగ్గరగానూ నిశ్సందేహంగా నిజాయితో కూడిన నిజముంది.
మరి,
 మీరు మెదటి తెలివితక్కువ వారెవరో  తెలియచెప్పండి"

మంత్రి:
చిత్తం మహా ప్రభో!
చెయ్యవలసిన పనులన్నీ మానేసి,
Net ఆన్ చేసుకుని What's App లో ఈ Msg ని చదువుతున్నవాడే...
"ఆ మొదటివాడు." 😜

😄😄😄😄😄😄😄

15 Types of doctors:

1. Dermatologist = skin specialist (చర్మ నిపుణుడు)

2. Cardiologist = heart specialist ( హృద్రోగ నిపుణుడు)

3. Gynecologist/Gynaecologist = female disease specialist (स्त्री వ్యాధి నిపుణుడు)

4. Dentist = doctor of teeth & jaw bones (పళ్ళు మరియు దవడ ఎముకలు డాక్టర్)

5. Ophthalmologist = eye specialist (కంటి నిపుణుడు)

6. Orthopedist = Muscle and bones expert (కండరాల మరియు ఎముకల నిపుణుడు)

7. Anesthesiologist = a specialist who administers an anesthetic to a patient before he is treated

(చికిత్సకు ముందు రోగికి మత్తు మందు ఇచ్చే నిపుణుడు)

8. Endocrinologist (అంతస్స్రావ నిపుణుడు) =  diagnoses and treats diabetes, hormone imbalances, thyroid disease and other disorders of the endocrine system.

9. गैस्ट्रोएंट्रोलॉजिस्ट (జీర్ణ వ్యవస్థ నిపుణుడు) =  specializes in diseases of the digestive system.

10. Hematologist (రక్త రోగ వైద్య నిపుణుడు) = a hematologist specializes in diseases of the blood and bone marrow.

11. हेपटोलॉजिस्ट (కాలేయ వ్యాధుల వైద్య నిపుణుడు) = specializes in diseases of the liver.

12. नेओनाटोलॉजिस्ट (పసికందుల నిపుణుడు)  = cares for premature and critically ill newborns.

13. न्यूरोलॉजिस्ट (నాడీ వ్యవస్థ (నరాల) వైద్యుడు) = a neurologist specializes in the diagnosis and treatment of all types of disease and functions of the brain, spine, peripheral nerves, muscles and nervous systems

14. Pediatrician (శిశువైద్యుడు) = a child's physician

15. Oncologist (క్యాన్సర్ వైద్య నిపుణుడు) = A doctor who treats cancer

Thursday, 4 February 2016

Heart attack - how to know - గుండెపోటుకు మొదటి లక్షణమేది?

గుండెపోటుకు మొదటి లక్షణమేది?

అకస్మాత్తుగా గుండెలో ఏదో మంటలా అనిపిస్తుంది. క్షణాల్లో అది ఎడమ ఛాతీకి వ్యాపిస్తుంది. చెమటలు పడతాయి. కళ్లు తిరిగి పడిపోవచ్చు. మొత్తానికి తనకు ఏదో జరుగుతోందని, తాను బతకకపోవచ్చని రోగికి అనుమానం వస్తుంది. ఇవన్నీ గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలు. వీటిని గుర్తించి, వెంటనే చికిత్స ప్రారంభిస్తే గుండెపోటువల్ల సంభవించే మరణాన్ని వీలైనంత మేరకూ తగ్గించవచ్చు.

గుండెకు రక్తాన్ని సరఫరాచేసే క్రమంలో అకస్మా త్తుగా రక్తం గడ్డకట్టినప్పుడు ఒక ప్రాంతానికి రక్తం ఆగిపోతుంది. అప్పుడు అందులో ఉండే కణాలు దెబ్బ తింటాయి. దీన్నే గుండెపోటు అంటాం. రక్తం గడ్డ కట్టడానికి కారణం రక్తనాళాల గోడల్లో నిక్షిప్తమైన కొలెస్ట్రాల్‌. వయసు పెరిగే కొద్దీ ఇది సాధారణంగా వస్తుంది. మధుమేహం, ధూమపానం, రక్తపోటు, ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, లేదా వంశపారం పర్యంగా కొందరికి ఇలాంటివి ఉన్నవాళ్లకు రక్తనాళాల గోడ లోపల కొలెస్ట్రాల్‌ అధిక మోతాదులో నిక్షిప్తమై ఉంటుంది. ఇది అకస్మాత్తుగా చిట్లుతుంది. దీన్ని ప్లేక్‌ రప్చర్‌ అంటారు. చిట్లినప్పుడు కొలెస్ట్రాల్‌ రక్తంలో కలిసి, రక్తం గడ్డకడుతుంది. కానీ రక్తంలో ఉండే ప్లేట్‌లెట్స్‌కు ఒకదానికి ఒకటి అతుక్కునే గుణం ఉంటుంది. రక్తనాళం చిట్లినచోట ప్లేట్‌లెట్స్‌ వచ్చి, అతుక్కుంటాయి. క్షణాల్లో వందలాది, వేలాది ప్లేట్‌లెట్స్‌ ఒకదానిపై ఒకటి అతుక్కొని రక్తనాళం మొత్తాన్ని బ్లాక్‌ చేస్తాయి. ప్లేట్‌లేట్‌లు అతుక్కోవడమేగాక మధ్యలో ఫైబ్రీన్‌ అనే పదార్థం ఉంటుంది. ఇది మధ్యలో ఒక వలలాగా ఏర్పడుతుంది. మధ్యలో కణాలు జారిపోకుండా రక్తం గడ్డలాగా తయారవుతుంది. రక్త ప్రవాహం ఆ గడ్డ వరకే వస్తుంది. దాన్ని దాటి ముందుకు పోలేదు.

లక్షణాలు

ఉన్నట్లుండి వెంటనే గుండెనొప్పి వస్తుంది. ఏదో బండరాయి మోపినట్లుగా, మంటలాగా వస్తుంది. కొద్దిక్షణాల్లో ఎడమ ఛాతీకి వ్యాపిస్తుంది. తర్వాత విపరీతమైన చెమటలు రావడం, కళ్లు తిరిగి పడిపోవడంగానీ, ఆయాసంగానీ వస్తుంది. ఏదో జరుగుతోందనే విషయం వారికి అర్థమవుతుంది. బతకకపోవచ్చని భావిస్తారు. గుండెపోటులో ఇది మొదటి లక్షణం. వయసు పెరిగిన వారిలో, మధుమేహ రోగుల్లో నొప్పి లేకుండా కూడా గుండెపోటు సంభవించవచ్చు. దీనిని 'సైలెంట్‌ హార్ట్‌ అటాక్‌' అంటాం.

తేడా ఎలా గుర్తించడం?

గుండెనొప్పికి, గ్యాస్‌ట్రబుల్‌కు తేడా గుర్తించడం కాస్త కష్టంగానే ఉంటుంది. గ్యాస్‌ట్రబుల్‌కు సంబంధించి భోజనం చేసిన తర్వాత మంట ఎక్కువగా అవడం లేదా భోజనం చేశాక తగ్గుతుంది. మిగతా సమయాల్లో అంతగా అనిపించదు. గుండెలో నొప్పి పనిచేసినప్పుడు మంట వస్తుంది. చమటలు బాగా వస్తాయి. ఇసిజి తీస్తే కచ్చితంగా గుండెనొప్పిని తెలుసుకోవచ్చు.

ఆలస్యం చేయకూడదు

గుండెపోటు వచ్చినప్పుడు ఎంత తొందరగా హాస్పిటల్‌కెళితే అంత మంచిది. ఎందుకంటే వెంటనే చికిత్స చేయాలి. ఆలస్యం చేస్తే రక్తం గడ్డకడుతుంది. గడ్డమీద కొత్త ప్లేట్‌లెట్స్‌ అతుక్కోకుండా ఆస్ప్రిన్‌ టాబ్లెట్‌ ఇవ్వాలి. గుండెపోటు వచ్చిన తొలి గంటను గోల్డెన్‌ అవర్‌ అంటారు. ఈ సమయంలో ఆలస్యం చేయడం వల్ల 50 శాతం మంది చనిపోయే అవకాశముంది.

ప్రథమ చికిత్స

గుండెపోటు వచ్చిన రోగి మెట్లెక్కడం గానీ, డ్రైవింగ్‌గానీ, కదలడంగానీ చేయకూడదు. డిస్ప్రిన్‌ పేరుతో ఆస్ప్రిన్‌ టాబ్లెట్‌ దొరుకుతుంది. ఇది చాలామంది తలనొప్పికి వాడే మాత్ర. సర్వ సాధారణంగా ఇంట్లో అందరికీ తెలిసే ఉంటుంది. దీన్ని వెంటనే ఇవ్వాలి. తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

నిర్ధారణ

గుండెపోటును నిర్ధారించ డానికి చేసే మొదటి పరీక్ష ఇసిజి. తర్వాత కొన్ని రక్తపరీక్షలు చేస్తారు. ఆ తర్వాత యాంజియో గ్రాం చేస్తే ఎక్కడ బ్లాక్‌ ఉందో తెలుస్తుంది. రక్తంలోని గడ్డను కరిగించడానికి ఒక ఇంజక్షన్‌ ఇస్తారు. యాంజియోగ్రాం తర్వాత వెంటనే స్టెంట్‌ చికిత్స చేస్తారు.

జాగ్రత్తలు

గుండెపోటుకు చికిత్స తర్వాత జీవితాంతం మందులు వాడాలి. బిపి, షుగర్‌, కొలెస్ట్రాల్‌ను కంట్రోల్లో పెట్టుకోవాలి. భోజన విషయంలో చాలా జాగ్రత్తలు తీసు కోవాలి. మందులు టైమ్‌ ప్రకారం వాడాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ముందు 15 రోజులకు, తర్వాత నెలకు, తర్వాత 3 నెలలకు, 6 నెలలకు, ఏడాదికి గుండె పరీక్ష చేయించుకోవాలి. ఆతర్వాత ప్రతిఏడాదీకి ఒకసారి చెక్‌ చేయించుకోవాలి. నాలుగైదేళ్ల వరకు యాంజియోగ్రామ్‌ అవసరం ఉండదు. కానీ స్టెంట్‌ వేసిన తర్వాత ఐదేళ్లకు మళ్లీ ఎంజియోగ్రామ్‌ చేయించుకోవడం మంచిది. కొత్త సమస్య ఏర్పడితే ముందే గుర్తించ వచ్చు. కొవ్వు పదార్థాలు మానాలి. ఎక్కువగా కూరగాయాలు, ఆకు కూరలు, చేపలు తీసుకోవాలి.